• Follow NativePlanet
Share
» »శవ భస్మంతో అర్చన జరిగే దేవాలయం గురించి మీకు తెలుసా

శవ భస్మంతో అర్చన జరిగే దేవాలయం గురించి మీకు తెలుసా

Written By: Beldaru Sajjendrakishore

భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. ఇక్కడ శైవం, వైష్ణవం తో పాటు జైనం, భౌద్ధం కూడా విరాజిల్లింది. ఈ క్రమంలో నిర్మించిన దేవాలయాలు, స్వయంభుగా చెప్పుకునే విగ్రహాల గురించి అక్కడ జరిగే కొన్ని పూజల అశ్చర్యాన్ని కలిగిస్తాయి. అటువంటి కోవకు చెందినదే లక్షల ఏళ్ల చరిత్ర కలిగిన ఉజ్జయిని. ఇక్కడ పూజ మొదలుకుని ప్రసాదం వరకూ అనేక ధర్మిక కార్యక్రమాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక్కడ శివుడు శత్రువులతో కాళేశ్వర రూపం నేరుగా యుద్ధం చేశారని ప్రతీతి. ఈ వివరాలతో పాటు ఇక్కడికి ఎలా చేరుకోవాలి, అక్కడ చూడదగిన ప్రదేశాలు తదితర వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం.

1. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి

1. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి

Image source

దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగంతో పాటు ఆ దేవాలయం ప్రాంగణంలో ఉన్నశివలింగాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి పూజా విధానాలు మిగిలిన దేవాలయాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటాయి.

2. కొన్ని లక్షల ఏళ్ల నుంచి పూజలు

2. కొన్ని లక్షల ఏళ్ల నుంచి పూజలు

Image source

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిలో ఉన్న మహాకాళేశ్వర లింగం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటోందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలోని పరమేశ్వరుడు స్వయం భువుగా వెలిశాడని పురాణ కథనం.

3. దక్షిణం వైపు ముఖం

3. దక్షిణం వైపు ముఖం

Image source

అయితే చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారన్నది ఒక అంతుచిక్కని రహస్యం. ఈ ఆలయంలోని ప్రధాన దేవాలయాన్ని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. ఈ శివలింగం యొక్క ముఖం దక్షిణం వైపు ఉండటమే ఇందుకు కారణం. ఇటువంటి విలక్షణ లక్షణం మరే ఇతర దేవాలయంలో కనిపించదు.

4. మూడు అంతస్తుల్లో మూడు లింగాలు

4. మూడు అంతస్తుల్లో మూడు లింగాలు

Image source

ఈ గర్భగుడిలోని తూర్పు, పశ్చిమ, ఉత్తర గోడల పై పార్వతీదేవి, గణపతి, షణ్ముఖుడి విగ్రహాలు అమర్చబడి ఉంటాయి. ఇక దక్షిణం వైపు మాత్రం నంది కొలువై ఉంటాడు. ఉజ్జయినిలో దీనితో పాటు రెండు శివలింగాలు ముఖ్యంగా దర్శనమిస్తాయి. ఆలయంలో మూడు అంతస్తుల్లో ఈ శివలింగాలు ప్రతిష్టించబడి ఉన్నాయి.

5. నాగుల పంచమి రోజు మాత్రమే దర్శనం

5. నాగుల పంచమి రోజు మాత్రమే దర్శనం

Image source

మొదటి అంతస్తులో మహాకాళ లింగం ఉండగా రెండో అంతస్తులో ఓంకార లింగం ఉంటుంది. ఇక మూడో అంతస్తులో నాగ చంద్రేశ్వర లింగం కొలువై ఉంది. వీటిలో నాగచంద్రేశ్వర లింగం కేవలం నాగుల పంచమి రోజు మాత్రమే భక్తులు దర్శించుకోవడానికి వీలవుతుంది.

6. ప్రసాదం...నైవేద్యంగా

6. ప్రసాదం...నైవేద్యంగా

Image source

ఇక్కడ ఉన్న మరో విశేషం ప్రసాదం. సాధారణంగా ఒక దేవాలయంలో భక్తులకు పూజ తర్వాత ఇచ్చిన ప్రసాదాన్ని మరే ఇతర దేవాలయంలో నైవేద్యంగా వాడరు. అయితే ఇక్కడ భక్తులకు అందజేసిన ప్రసాదాన్ని మరే ఇతర దేవాలయంలోనైనా నైవేద్యంగా వాడవచ్చు. ఈ విధానం చాలా ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతూనే ఉంది.

7. అలా ఎందుకు జరుగుతోంది

7. అలా ఎందుకు జరుగుతోంది

Image source

అదే విధంగా ప్రతి ఏడాది ఈ దేవాలయంలో వర్షాకాలానికి ముందు ప్రర్జన్యానుష్టానం అనే ఒక ప్రత్యేక యాగం చేస్తారు. అయితే కార్యక్రమం పూర్తి కాగానే ఆకాశంలో మబ్బులు పట్టి భారీ వర్షం కురుస్తుంది. ఇది ఎందుకు ఎలా జరుగుతుందనేది ఇప్పటికీ జవాబులేని ప్రశ్నే.

8. అంతులేని శక్తి

8. అంతులేని శక్తి

Image source

మహాకాళేశ్వర లింగం కింద శంకు యంత్రం ఉందని చెబుతుంటారు. ఆ యంత్రంలో అంతులేని శక్తి దాగి ఉందని అక్కడి వారు అంటారు. అందుకే రోజులో మొదటి శివార్చన జరిగే సమయంలో శంఖం ఊదుతారు. ఆ సమయంలో స్వామి వారిని దర్శించుకుంటే సకల విజయాలు కలుగుతాయని చెబుతారు.

9. భస్మ మందిరంలో

9. భస్మ మందిరంలో

Image source

ఈ ఆలయంలో భస్మ మందిరం అని ఒకటి ఉంది. అందులోనే భస్మార్చన జరుగుతుంది. స్మశాన వాసి అయిన పరమశివుడిని భస్మంతో అభిషేకిస్తారు. ప్రతి రోజు ఉదయం నాలుగు గంటలకు ఈ భస్మాభిషేకం చేస్తారు.

10. అప్పుడే కాల్చిన శవం నుంచి వచ్చిన భస్మంతో

10. అప్పుడే కాల్చిన శవం నుంచి వచ్చిన భస్మంతో

Image source

కొన్ని శరత్తులకు లోబడి 10 మంది నాగసాధువుల ఆధ్వర్యంలో ఈ తంతు జరుగుతుంది. ఇందు కోసం అప్పుడే కాల్చిన శవం నుంచి వచ్చిన భస్మాన్ని వాడుతారు. ఈ పూజ జరిగే సమయంలో మహిళలకు ఇక్కడ ప్రవేశం నిషిద్ధం. ఇలా పరమేశ్వరుడికి శవ భస్మంతో అర్చన చేసే పుణ్యక్షేత్రం దేశంలో మరెక్కడా లేదని చెబుతారు.

11. అందుకే ఆ పేరు..

11. అందుకే ఆ పేరు..

Image source

పూర్వం చంద్రసేనుడనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆయన పరమ శివభక్తుడు. ఒక రోజు ఆలయంలో చంద్రసేనుడు అర్చనలో ఉండగా శత్రువులు రాజును చుట్టుముట్టి చంపడానికి ప్రయత్నించారు.

12. శివుడే నేరుగా యుద్ధం

12. శివుడే నేరుగా యుద్ధం

Image source

ఈ సమయంలో పరమశివుడే నేరుగా శత్రురాజులతో మహాకాళుడి రూపంలో యుద్దం చేసి తన భక్తుడి కాపాడుతాడు. భక్తుడి కోరిక మేరకు అప్పటి నుంచి ఈ దేవాలయంలోని లింగం మహాకాళేశ్వరుడిగా భక్తులతో కొలువ బడుతోందని స్థల పురాణం.

13. ఎక్కడ ఉంది, ఎలా వెళ్లాలి

13. ఎక్కడ ఉంది, ఎలా వెళ్లాలి

Image source

మధ్యప్రదేశ్ లోని ప్రధాన నగరాల్లో ఉజ్జయిని కూడా ఒకటి. యుజ్జయినికి దగ్గరగా ఐడీఆర్ ఎయిర్ పోర్టు ఉంది. దేశంలోని వివిధ చోట్ల నుంచి ఇక్కడికి విమానసర్వీసులు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఉజ్జయిని కేవలం 55 కిలోమీటర్లు మాత్రమే.

14.రైలు, బస్సు సర్వీసులు కూడా

14.రైలు, బస్సు సర్వీసులు కూడా

Image source

ఇక ఉజ్జయినిలోనే రైల్వేస్టేషన్ ఉంది. దేశంలోని వివిధ చోట్ల నుంచి ఇక్కడకు రైలు సదుపాయం ఉంది. ఇక ఇండోర్, గ్వాలియర్, భోపాల్ నుంచి ఉజ్జయినికి నేరుగా బస్సు సర్వీసులు ఉన్నాయి.

15. మరిన్ని పర్యాటక ప్రాంతాలు

15. మరిన్ని పర్యాటక ప్రాంతాలు

Image source

ఉజ్జయినికి లక్షల ఏళ్ల చరిత్ర ఉండటమే కాకుండా ఈ నగరం మొత్తం దేవాలయాల మయం. ముఖ్యంగా కాళభైరవ దేవాలయం, హరిసిద్ధి దేవాలయం, మంగళ్ నాథ్ దేవాలయం, గణేష్ దేవాలయం తదితర ఆధ్యాత్మిక ప్రదేశాలు ఇక్కడ చూడదగిన ప్రదేశాలు

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి