» »సకల దేవుళ్ళు ఒకే చోట కొలువైన క్షేత్రం ఎక్కడుందో మీకు తెలుసా ?

సకల దేవుళ్ళు ఒకే చోట కొలువైన క్షేత్రం ఎక్కడుందో మీకు తెలుసా ?

Posted By: Venkata Karunasri Nalluru

సంపూర్ణ భారతదేశ యాత్ర చేయలేనివారు సురేంద్ర పురిని ఒక్కసారి దర్శిస్తే వారికి ఆ లోటు తీరిపోతుంది. సురేంద్రపురి క్షేత్రం నల్లగొండ జిల్లాలో యాదగిరిగుట్టకు దగ్గరలో వున్నది. ఇక్కడ ప్రముఖంగా చూడదగినవి సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం మరియునగర శివార్లలో ఉన్న సురేంద్రపురి ఒక అద్బుతమైన మ్యుజియం. ఈ మ్యూజియంకు గల మరొక పేరు పౌరాణిక అవగాహన కేంద్రం. భారత పురాణాల గురించి అందరికీ అవగాహన కల్పించాలనే వుద్దేశ్యంతో సురేంద్రపురి మ్యుజియంని ఏర్పాటు చేసారు. కుందా సత్యనారాయణ కుమారుడు సురేంద్ర పేరుతో ఈ సురేంద్రపురి మ్యుజియం పేరు పెట్టారు.

ఇక్కడ సందర్శకులను అమితంగా ఆకర్షించే అంశాలలో ప్రముఖమైనవి భారతదేశంలో ఉన్నప్రఖ్యాతమైన ఆలయాల ప్రతిరూపాలు. ఆ ఆలయాల పైన ఉండే శిల్పకళలూ నిర్మాణ శైలి మొదలైన అన్ని విషయాలు పరిశీలించి ఇక్కడ మినీయెచర్ ఆలయాలని అద్భుతంగా తయారు చేసారు. హిందువుల దేవుళ్ళని, దేవతలని వర్ణించే శిలావిగ్రహాలు, చిత్రలేఖనాలు ఈ మ్యూజియంలో గమనించవచ్చు. ఈ మ్యూజియాన్ని ఒక్క సారి సందర్శిస్తే భారత దేశ పురాణాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

కళకు పెద్దపీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ విగ్రహం వెనుకనుండి చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తాడు. దేవాలయ ముఖద్వారం త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా నవ గ్రహాలకు సతీ సమేతంగా, వాహన సమేతంగా, అధి దేవత, ప్రత్యధి దేవతల సమేతంగా విడివిడిగా 9 గుడులు కట్టినారు. పంచముఖ హనుమంతుడు, శివుడు, వెంకటేశ్వరస్వామి దేవాలయంలో కొలువుతీరి ఉన్నారు.

సంపూర్ణ భారతదేశ యాత్ర చేయాలనుందా? అయితే ఇక్కడకు వెళ్ళిరండి !

1. దేవాలయం లోపల హుండీలు

1. దేవాలయం లోపల హుండీలు

దేవాలయంలోపల హుండీలను చాలా కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఇవి కలశాలను పోలి ఉంటుంది. ఒక కలశం మీద అష్టలక్ష్ములను చెక్కితే మరో కలశంమీద వినాయకుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి బొమ్మలను చెక్కారు.

చిత్రకృప :Arkrishna

2. పుట్టమన్ను

2. పుట్టమన్ను

ఇక్కడ పుట్టమన్నుతో చేసిన శివలింగాలను అర్చించిన గ్రహదోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. అక్టోబర్ 2008 లో ఈ ప్రాగణానికి సందర్శకులను అనుమతించినప్పటికినీ, జనవరి 2009 వరకు మెరుగులుదిద్దుతూనే ఉన్నారు. ఫిబ్రవరి 8, 2009 న దీనిని ప్రారంభించారు.

చిత్రకృప :Pranayraj1985

3. వేపచెట్టు

3. వేపచెట్టు

వేపచెట్టు లక్ష్మీస్వరూపం, రావి చెట్టు విష్ణు స్వరూపం. కనుక ఈ రెండు వృక్షాలకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అంతేకాక వేప, రావి చెట్లకు వివాహం చేస్తారు. వేపచెట్టు రాత్రింబవళ్లు ప్రాణవాయువును ఇస్తుంది. కాబట్టి ఈ వృక్షానికి దగ్గరగా నివాసం ఏర్పాటు చేసుకుంటే మంచిది.

చిత్రకృప:Arkrishna

4. ఆంజనేయస్వామి

4. ఆంజనేయస్వామి

ఆంజనేయస్వామిని కొలిచిన వారికి మానసిక దౌర్భల్యం నశించి, మనోధైర్యం సిద్ధిస్తుంది. బుద్ధి, బలం, శక్తి, యశస్సు, ఆయురారోగ్యాలు చేకూరతాయి. వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. అవివాహితులకు కళ్యాణం ప్రాప్తి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం.

చిత్రకృప:Strike Eagle

5. కళాధామం

5. కళాధామం

ఇక్కడి కళాధామం చూడవలసినదేగాని, చెప్పనలవికాదు. ఈ కళాధామం దర్శించుటకు రెండుగంటల సమయం పడుతుంది. లోపలకు కెమేరాలను అనుమతించరు. అమ్మవారి వాహనం సింహం నోటినుండి కళాధామంకు ప్రవేశమార్గం ఏర్పాటు ఉంటుంది.

చిత్రకృప:Strike Eagle

6. దేవాలయాల సూక్ష్మ రూపాలు

6. దేవాలయాల సూక్ష్మ రూపాలు

ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నప్రధాన దేవాలయాల సూక్ష్మ రూపాలు ఉన్నాయి. విజయవాడ కనకదుర్గ ఆలయం, షిర్డి సాయిబాబా గుడి, తిరుమల వెంకటేశ్వర ఆలయం.

చిత్రకృప :wikimedia.org

7. మ్యూజియమ్‌లో ప్రదర్శిస్తున్నవి

7. మ్యూజియమ్‌లో ప్రదర్శిస్తున్నవి

లక్ష్మీనారాయణులతో మహాశివుడు, కాళీయమర్ధనము,సింహారూఢ అయిన భరతమాత, తమిళనాడులోని రామేశ్వరుడు, తమిళనాడులోని వివేకానంద రాక్

చిత్రకృప :Arkrishna

8. గజేంద్ర మోక్ష సన్నివేశం

8. గజేంద్ర మోక్ష సన్నివేశం

గజేంద్ర మోక్ష సన్నివేశం గరుత్మంతున మీద మహావిష్ణువు ఆయనను వెన్నంటి ప్రియసతి లక్ష్మి, వారిని వెన్నంటి వస్తున్న ఆయుధాలు ముసలి చేత పీడింపబడుతున్న గజేంద్రుడు.

చిత్రకృప :Arkrishna

9. ఇంద్రలోకము

9. ఇంద్రలోకము

స్వర్గంలో సభతీరిన సచీదేవితో మహేంద్రుడు. దేవగురువు బృహస్పతి, నారదుడు, తుంబురుడు, అప్సరసలైన రంభ, ఊర్వశి, తిల్లోత్తమ, మేనక. అష్టదిక్పాలకులు. తమిళనాడులోని కన్యాకుమారి, సోమకాస్రుడి నుండి వేదములను రక్షించడానికి మత్స్యావతారము ఎత్తిన మహావిష్ణువు, కర్నాటకలోని శృంగేరిలోని శారదాంబతో జగత్గురు శంకరాచార్యుడు.

చిత్రకృప :Arkrishna

10.అలంపురంలోని జోగులాంబ

10.అలంపురంలోని జోగులాంబ

అలంపురంలోని జోగులాంబ, మధ్యప్రదేశ్ లోని ఖజూరహా లోని చిత్రగుప్తుడు, కర్నాటకలోని ధర్మస్థలలోని శ్రీ మంజునాధుడు, చిటికిన వ్రేలితో గోవర్ధన గిరిని ఎత్తిన శ్రీకృష్ణుడు, గోపికా వస్త్రాపహరణము, వశిష్టాశ్రమము, స్వర్ణసీతతో శ్రీరాముడు చేసిన అశ్వమేధయాగము, శ్రీకృఇష్ణ రాసలీలలు,వేదపురుషులైన ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద వారి వారి భార్యలతో.

చిత్రకృప :T.sujatha

11. తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుడు

11. తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుడు

తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుడు, అలివేలు మంగాపురంలోని శ్రీ పద్మావతి అమ్మవారు, సింహాచలంలోని శ్రీ వరాహ నరశింహస్వామి, శ్రీ కాళహస్థిలోని శ్రీ కాళహస్తీశ్వరుడు, కర్నాటకలోని హోరనాడులోని అన్నపూర్ణేశ్వరీ దేవి, కాణిపాకము వరసిద్ధి వినాయకుడు, హరిద్వార్, కాశి, కేదార్‌నాధ్, అమర్నాధ్.

చిత్రకృప :Arkrishna

12. వెండి కొండ వద్ద దశకంఠుడు

12. వెండి కొండ వద్ద దశకంఠుడు

వెండి కొండ వద్ద దశకంఠుడు, భద్రాచలంలోని సీతారాములు, ఒర్రిస్సా లోని పూరి జగన్నాధ స్వామి, తమిళనాడు లోని ఆండాళ్ అమ్మవారు, తొమ్మిది రూపాలలో నరసింహస్వామి, పార్వతి, నందీశ్వరుడు, భాగీరధులతో గంగావతణ సమయంలో ఈశ్వరుడు.

చిత్రకృప :T.sujatha

13. శ్రీ కృష్ణుడు

13. శ్రీ కృష్ణుడు

అఘాసురుని నోటి నుండి తన స్నేహితులను పిలుస్తున్న శ్రీ కృష్ణుడు, శ్రీకృష్ణుడి చేతిలోహతులైన రాక్షసులు, సందర్శకులు ప్రవేశించకలిగినంతగా తెరచిన నోటితో బకాసురుడు, మహిషాశుర మర్ధిని.

చిత్రకృప :Pranayraj1985

14. మహాలక్ష్మి

14. మహాలక్ష్మి

మహారాష్ట్రా ముంబైలోని మహాలక్ష్మి, మహాశక్తి, మహా సరస్వతి, పశ్చిమబెంగాలులోని కొలకత్తాలోని మహాకాళి, మహారాష్ట్రలోని తుల్జాపూర్ లో ఉన్న భవానీమాత, మహారాష్ట్రలో ఉన్న షిరిడీలోని సాయిబాబా, గుజరాత్ లోని సోమనాధీశ్వరాలయంలోని సోమనాధుడు.

చిత్రకృప: Strike Eagle

15. పండరీపురంలోని పండరినాధుడు

15. పండరీపురంలోని పండరినాధుడు

మహారాష్ట్రలోని పండరీపురంలోని పండరినాధుడు, తమిళనాడులోని మధురై లోని మీనాక్షి అమ్మవారు, కర్నాటక లోని మేంగుళూరు లోని మూకాంబికై, కర్నాటకలోని శ్రావణ బెల్గొళ లోని గోమటీశ్వరుడు, ఏనుగు నోటిలో నుండి ప్రవేశించిన తరువాత అష్టలక్ష్ముల దర్శనం.

చిత్రకృప :Dr Murali Mohan Gurram

16. మాయాదేవి స్వప్నంలో ఐరావతము

16. మాయాదేవి స్వప్నంలో ఐరావతము

ఆంధ్రప్రదేశ్ లోని మంత్రాలయములో ఉన్న శ్రీరాఘవేంద్రుడు, కురుక్షేత్రం, గీతోపదేశం, విశ్వరూపము, క్షీరసాగర మధనం, పంజాబు లోని అమృతసర్ లోని స్వర్ణదేవాలయము, ఉత్తరప్రదేశ్ లోని అలహాబాదు లోని త్రివేణి సంగమము, సతీదేవి శరీరాన్ని మోస్తూ.దక్షయజ్ఞాన్ని భగ్నంచేసిన శివుడు, మాయాదేవి స్వప్నంలో ఐరావతము.

చిత్రకృప :Dr Murali Mohan Gurram

17. అష్టదిక్పాలకులు

17. అష్టదిక్పాలకులు

జ్యోతిర్లింగాలు, గణేశుడికి భారహం చెప్తున్న వేదవ్యాసుడు, ఉగ్రసేనుడు, అష్టదిక్పాలకులు తమతమ వాహనాల మీద భార్యలతో, అద్భుత ఉద్యానవనంలో జంటగా విహరిస్తున్న ప్రణయ దేవతలు, కేరళలోని శబరి మలైలోని అయ్యప్పస్వామి.

చిత్రకృప :Dr Murali Mohan Gurram

18. రామాయణము

18. రామాయణము

నాగలోకము, ఉత్తర ప్రదేశంలోని అయోధ్యలో ఉన్న శ్రీ రామ దేవాలయము, మేడారంలోని సమ్మక్క సారక్క, కుబ్జికా దేవి, నవదుర్గలు, పద్మద్వీపంలోని సప్త మాతృకలు, పదకొండు శిరసులతో ఆంజనేయుడు, శిల్పాలతో రామాయణము, శిల్పరూపములో హనుమ చరిత్ర, పద్మవ్యూహము.

చిత్రకృప :Arkrishna

19. కుందా సత్యనారాయణ కళాధామము

19. కుందా సత్యనారాయణ కళాధామము

కుందా సత్యనారాయణ కళాధామము ఒక హిందూధర్మ శిల్పకళాప్రదర్శన ఆలయము. సందర్శకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళగలిగిన హిందూధర్మ ప్రదర్శన శాల అని నిర్వాహకుల మాటలలో వర్ణించబడింది. ఇక్కడ భారతదేశంలోని పురాణ ప్రాముఖ్యం కలిగిన సన్నివేశాలు, అలాగే పురాణ ప్రాముఖ్యం కల దేవాలయాల నమూనాలను చక్కని శిల్పాలుగా మలిచి వర్ణరంజింతంగా అలంకరించి చూపరులకు కను విందు చేస్తున్నారు.

చిత్రకృప : T.sujatha

20. పురాణేతిహాసాలు

20. పురాణేతిహాసాలు

ఇక్కడ బ్రహ్మ లోకము, విష్ణు లోకము, కైలాసము, స్వర్గ లోకము, నరక లోకము, పద్మద్వీపము, పద్మలోకము దృశ్యరూపంలో చూడవచ్చు. పద్మవ్యూహము అనేక దేవతా రూపాలు చూడవచ్చు. రామాయణము, మహాభారతము, భాగవతము వంటి పురాణేతిహాసాలలో చోటు చేసుకున్న దృశ్యాలను కళ్ళకు కట్టినట్లుగా మలచిన శిల్పాలతో దృశ్యాలుగా దర్శించవచ్చు.

చిత్రకృప :Arkrishna

21. కూర్మావతారము

21. కూర్మావతారము

మంధర పర్వత సాయంతో క్షీరసాగర మధనము చేస్తున్న దేవతలను రాక్షసులను కూర్మావతారములో ఉన్న విష్ణు మూర్తిని చూడవచ్చు. అలాగే గజేంద్ర మోక్ష సన్నివేశాలను తడ్రూపంగా మలచిన దృశ్యాలను చూడవచ్చు.

చిత్రకృప :Arkrishna

22. కృష్ణుడి విశ్వరూపదర్శనం

22. కృష్ణుడి విశ్వరూపదర్శనం

యుద్ధానికి సిద్ధంగా ఉన్న సేనల మధ్యలో 36 అడుగుల కృష్ణుడి విశ్వరూపదర్శనమును అతడికి భయభక్తులతో నమస్కరిస్తున్న అర్జునుడిని చూడవచ్చు. కాళీయుని పడగల మీద నాట్యమాడుతున్న శ్రీకృష్ణుడిని చూడవచ్చు.

చిత్రకృప:Arkrishna

23.గోవర్ధనోద్ధరణ

23.గోవర్ధనోద్ధరణ


గోవర్ధనోద్ధరణ, గోపికా వస్త్రాపహరణ, రాక్షసంహారము, రాసలీలా దృశ్యాలను చూడవచ్చు. భవిష్య బ్రహ్మ అయిన హనుమ బాల్య సన్నివేశాలను అతడు రామునుతో చేరిన పిదప జరిగిన సన్నివేశాలను చూడవచ్చు.

చిత్రకృప :Arkrishna

24. లంకాదహనం

24. లంకాదహనం

హనుమ సువర్చల కల్యాణం, లంకాదహనం, అక్షయకుమారులను సంహరించడం, రామలక్ష్మణులను భుజము మీదకు ఎత్తుకుని యుద్ధ భూమిలో వారికి సహకరించడం, బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం వాటిలో కొన్ని.

చిత్రకృప :Arkrishna

25. అపురూప దృశ్యాలు

25. అపురూప దృశ్యాలు

హనుమ చేతి ప్రసాదాన్ని అతడి స్వహస్తాలతో తీసుకోవచ్చు. ఆవు నుండి పడుతున్న పాలతో చేసిన కాఫీని త్రాగవచ్చు. ఇలాంటి అపురూప దృశ్యాలను అనేకము చూసి సందర్శకులు అద్భుత అధ్యాత్మిక ఆనందానుభూతిని పొందవచ్చు.

చిత్రకృప :Arkrishna