Search
  • Follow NativePlanet
Share
» »సూర్యలంక బీచ్, బాపట్ల, గుంటూరు జిల్లా !

సూర్యలంక బీచ్, బాపట్ల, గుంటూరు జిల్లా !

సూర్యలంక బీచ్ బాపట్ల సమీపంలో 9 కి. మీ ల దూరంలో ఉన్నది. సముద్రతీరంలో ఉన్న ఈ పల్లె ఒక ఓడరేవు మరియు ఇక్కడ చేపల ఎగుమతి జోరుగా సాగుతుంది. ఇది గుంటూరు జిల్లాలో ఉన్న ఒకేఒక బీచ్.

By Mohammad

ఆంధ్ర ప్రదేశ్ లో బీచ్ అంటే ఒక్క వైజాగ్ తప్ప మిగితా ఏ బీచ్ గుర్తుకురాదు. వాస్తవానికి చెప్పాలంటే మనకు సముద్ర తీరాల కంటే నదీ తీరాలే ఎక్కువ. ముఖ్యంగా కోనసీమ లో గోదావరి నది, కృష్ణా జిల్లా లో కృష్ణా నది పరివాహ ప్రాంతాలే బీచ్ లుగా పర్యాటకులను అలరిస్తున్నాయి. ఉత్తర కోస్తా లో వైజాగ్ బీచ్ ఎంత ఫెమాసో, దక్షిణా కోస్తా లో సూర్యలంక బీచ్ అంత ఫెమస్. ఇది గుంటూరు జిల్లాలో ఉన్న ఒకేఒక బీచ్. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ దృష్టి ఇపుడు దీనిపై పడింది.

సూర్యలంక బీచ్ ను కూడా వైజాగ్ బీచ్ వలె మార్చాలన్నది పర్యాటక శాఖ పెట్టుకున్న మొదటి టార్గెట్. ఈ టార్గెట్ ను అందుకోవటం కోసం ఇప్పటికే ఎపిటిడిసి వారు కాటేజీలను, రిసార్ట్ లను నెలకొల్పారు. బీచ్ తీరం వెంబడి స్టాల్స్ లను ఏర్పాటుచేశారు.

బీచ్ వద్ద ఎపిటిడిసి కాటేజీలు

బీచ్ వద్ద ఎపిటిడిసి కాటేజీలు

చిత్రకృప : Mdhar m

సూర్యలంక బీచ్ బాపట్ల సమీపంలో 9 కి. మీ ల దూరంలో ఉన్నది. సముద్రతీరంలో ఉన్న ఈ పల్లె ఒక ఓడరేవు మరియు ఇక్కడ చేపల ఎగుమతి జోరుగా సాగుతుంది. బ్రిటీష్ పాలనలో ఈ ఊరు ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు. ఇండోనేషియాలోని సుమత్రా, జావా ద్వీపాలకు నేరుగా ఇక్కడి నుంచే సరకు రవాణా చేసేవారట.

సూర్యలంక బీచ్ కు మరియు బాపట్ల కు మధ్య భారత వాయుసేన కేంద్రం (ఎయిర్ బేస్) మరియు నివసించటానికి కాలనీ లు ఉన్నాయి.

విజయవాడ కు 100KM లోపు పర్యాటక ప్రదేశాలు !

నవంబర్‌ నెలలో తీరం వెంబడి డాల్ఫిన్‌లు కూడా చూడవచ్చు. సూర్యలంక బీచ్‌ వారాంతాల్లోనూ, పండగ రోజుల్లోనూ, ఇతర సెలవు రోజుల్లోనూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూవుంటుంది. అప్పుడప్పుడు సైకత శిల్పాలు, బైక్ రేస్ లు అలరిస్తాయి.

సూర్యలంక బీచ్ వద్ద పర్యాటకులు

సూర్యలంక బీచ్ వద్ద పర్యాటకులు

చిత్రకృప : RC SRIKANTH

సూర్యలంక బీచ్ పరిసర ప్రాంతంలోని ప్రజలకు విహార కేంద్రంగా ఉంది. ఇక్కడ కొన్నిరోజులు గడిపేందుకు వీలుగా ప్రభుత్వ వసతి గృహము మరియు కాటేజీలు ఉన్నాయి. ఇక్కడే ఇండియన్ టుబాకో కంపెనీ (ఐటీసీ) వారిది ఓ అతిథి గృహం కూడా ఉంది. అందులో ఓ ప్రైవేటు బీచ్ కూడా ఉంది. అందులో విదేశాలను తలపించే సౌకర్యాలు ఉన్నాయి.

సూర్యలంకకి దాదాపు 16 కి.మీ దూరంలో వాడరేవు బీచ్‌ ఉంది. సూర్యలంక వద్ద నున్న బీచ్ సముద్ర స్నానాలకు అనుకూలంగా ఉండి, పరిసర ప్రాంతంలోని ప్రజలకు విహార కేంద్రంగా ఉంది. ఇక్కడ కొన్నిరోజులు గడిపేందుకు వీలుగా ప్రభుత్వ వసతి గృహం కూడా ఉంది.

భావనారాయణ స్వామి దేవాలయం

భావనారాయణ స్వామి దేవాలయం

చిత్రకృప : Anu Sri‎

బీచ్ వద్ద ఆలయం

బీచ్ కి సమీపంలో భావనారాయణ స్వామి దేవాలయం ఉన్నది. ఈ ఆలయానికి దగ్గరలో రెండు ఎత్తైన లోహ స్తంబాలు ఉన్నాయి.

తెనాలి : 'ఆంధ్రా పారిస్' నగరం !

బాపట్లలో చూడదగ్గవి

బాపట్లలో క్రీ.శ. 10 వ శతాబ్దంలో నిర్మించిన భావనారాయణ స్వామి సోదరుని ఆలయం, టౌన్ హాల్, శాస్త్రలింగేశ్వర స్వామి ఆలయం చూడదగ్గవి.

పర్యాటకుల తాకిడి

నవ్యంధ్ర రాజధానికి చేరువలో ఉన్న సూర్యలంక బీచ్ కు ప్రస్తుతం వారాంతంలో 50 వేల మంది, విశేష రోజుల్లో దాదాపు మూడు లక్షల పైగా పర్యాటకులు వస్తుంటారు. బీచ్ వద్ద ఘుమఘమలాడే గుంటూరు కారం తో చేసిన చేపలు తప్పక రుచిచూడాల్సిందే !

బాపట్ల రైల్వే స్టేషన్

బాపట్ల రైల్వే స్టేషన్

చిత్రకృప : indianrailinfo

ఎక్కడి నుండి ఎంత దూరం ?

సూర్యలంక చేరుకోవటానికి బాపట్ల అనువైనది. ఇక్కడి నుండి ప్రవేట్ జీపులు, ప్రభుత్వ బస్సులు అందుబాటిలో ఉంటాయి. బాపట్ల లో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ కలదు. విజయవాడ, గుంటూరు, నరసారావుపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాల ఇక్కడికి నుంచి బస్సులు వస్తుంటాయి.

బాపట్ల అమరావతి నుండి 90 కి.మీ ల దూరంలో, నరసరావుపేట నుండి 72 కి.మీ ల దూరంలో, గుంటూరు నుండి 43 కి.మీ ల దూరంలో, విజయవాడ నుండి 71 కి.మీ ల దూరంలో ఉన్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X