• Follow NativePlanet
Share
» »టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

మనలందరినీ రోజువారీ జీవితంలో ఆనందపరుస్తూ, ఆకర్షిస్తూ తమకంటూ చలన చిత్రరంగంలో ఒక గుర్తింపు తెచుకున్న వారు గర్వపడే ఈ ప్రసిద్ధ జన్మస్థల వివరాలను, ఎలా ఈ రంగంలో వచ్చి పాతుకపోయారో కొన్నింటిని పరిశీలిద్దాం!!

సినిమా అంటేనే హీరో, హీరోయిన్ ఇద్దరూ ఉండాల్సిందే!! హీరోల కంటే కూడా హీరోయిన్లు తమ అందచందాలతో, అభినయనాలతో సినిమాని రక్తికెక్కిస్తారు. తెలుగు సినిమా చరిత్రలో కూడా తమ అందచందాలతో అందరినీ అబ్బుర పరుస్తున్న సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో??. మరి వీరు ఎక్కడ పుట్టరో, ఎక్కడి నుంచి వచ్చి ఈ సినిమారంగంలో స్థిరపడ్డారో బహుశా కొద్దిమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. వీరి జన్మ స్థలాలు ఇండియాలోని వివిధ సంస్కృతులు కల ప్రసిద్ధ ప్రదేశాలు.

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

సమంత

సమంత చెన్నైకి 17 కి. మీ. దూరంలో ఉన్న పల్లవరం అనే ఒక మండల కేంద్రంలో 28 ఏప్రిల్ 1987 వ సంవత్సరంలో జన్మించినది. తమిళనాడులో పుట్టిన ఈమె నేడు తెలుగు చలనచిత్ర సీమలో అగ్ర కథానాయకురాలిగా వెలుగొందుతున్నది. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

Photo Courtesy: telugunativeplanet

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

ఆపై తను నటించిన బృందావనం, దూకుడు , ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , అత్తారింటికి దారేది చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది. 2013లో రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధి గాంచింది.

PC:youtube

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19 న మహానగరమైన ముంబైలో జన్మించి, తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది. ఈమె శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా వచ్చిన చందమామ సినిమాలో కథానాయికగా నటించింది. ఈమె ఆ టైమ్ అప్పుడు అందరి కళ్ళల్లో పడింది. తరువాత సినిమాలు చేసినా కూడా ప్రముఖ హీరో, రాజకీయనాయకుడు చిరంజీవి తనయుడైన రామ చరణ్ తేజతో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది.

Photo Courtesy: telugunativeplanet

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

కాజల్ అగర్వాల్

ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే. తర్వాత వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్ గా మెప్పించింది. కాజల్ అగర్వాల్ ఎన్.టి.ఆర్ తో బృందావనంలో సమంతతో పాటుగా స్టెప్పులేసింది. తరువాత ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించి అలరించింది. ఈమె ప్రముఖ తమిళ హీరో కార్తీ సరసన నా పేరు శివ చిత్రంలో నటించి తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మాన్ సినిమాలో నటించింది. ఆ తరువాత నాయక్, బాద్ షా, ఎవడు, గోవిందుడు అందరివాడేలే చివరగా టెంపర్ లో నటించి అలరించింది.

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

తమన్నా

తమన్నా పూర్తి పేరు తమన్నా భాటియా. ఈమె డిసెంబర్ 21, 1989 వ సంవత్సరంలో ముంబై మహా నగరంలో పుట్టింది. ఈమెకు మిల్కీ బ్యూటీ అనే పేరు కూడా ఉన్నది. డ్యాన్స్ విషయానికొస్తే ఇప్పుడున్న కొత్త హీరోయిన్లలో ఈమె డ్యాన్స్ కు ఎవ్వరూ సాటిలేరనే చెప్పాలి. తమన్నా, చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో హిందీలో, శ్రీ సినిమాతో తెలుగులో, కేడీతో తమిళంలోకి అడుగుపెట్టింది. మూడూ విఫలమైనా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా హ్యాపీ డేస్, బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా కళ్ళూరి తమన్నాకి సరైన గుర్తింపును ఇచ్చాయి.

Photo Courtesy: telugunativeplanet

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

ఆపై అయన్ , కండేన్ కాదలై, పయ్యా , సిరుతై , వీరం వంటి సినిమాల ద్వారా తమిళ్ సినీ పరిశ్రమలో మరియు కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్ సినిమాల ద్వారా తెలుగులో గుర్తింపు సాధించి ఆపై ఊసరవెల్లి , రచ్చ, కెమెరామెన్ గంగతో రాంబాబు , తడాఖా వంటి చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తెలుగులో తీసిన చివరి సినిమా ఆగడు. ఇందులో మహేష్‌బాబు సరసన నటించి మెప్పించింది.

PC:youtube

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

త్రిష

త్రిష మే 4, 1983 వ సంవత్సరంలో చెన్నై మహానగరంలో పుట్టింది. త్రిష 1999 లో జోడీ అనే తమిళ సినిమా ద్వారా రంగప్రవేశం చేసింది. తదుపరి తెలుగులో నీ మనసు నాకు తెలుసు ద్వారా పరిచయమయినా, వర్షం సినిమా బ్రేక్ ఈక్చింది. ఈ సినిమాకు గాను బెస్ట్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కింది. ఆ తరువాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా, అతడు, పౌర్ణమి, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే, స్టాలిన్, కృష్ణ, నమో వెంకటేశా, చివరి సినిమా దమ్ము లో తన నటనతో అలరించింది.

Photo Courtesy: telugunativeplanet

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

నయనతార

నయనతార 18 నవంబర్ 1984 వ సంవత్సరంలో బెంగళూరులో పుట్టింది. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసే నయనను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ 'మనస్సినక్కరే' అనే సినిమాలో హీరోయిన్‌గా ఆమెకు తొలి ఛాన్స్ ఇచ్చాడు. తర్వాత 'విస్మయతుంబట్టు', 'తస్కర వీరన్', 'రాప్పకల్' వంటి సినిమాల్లో మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి పెద్ద హీరోలతో చేసింది. తర్వాత తమిళంలో 'అయ్య', 'చంద్రముఖి', 'గజిని' వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో చేసిన 'లక్ష్మీ', 'బాస్' చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి.

Photo Courtesy: telugunativeplanet

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

'ఈ', 'వల్లభ' సినిమాలు,అజిత్‌తో కలిసి చేసిన 'బిల్లా' ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది నయన.. బాపు చిత్రం 'శ్రీరామరాజ్యం'లో సీతగా నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాకు గాను 'ఫిల్మ్‌ఫేర్', 'నంది' అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఈమె తెలుగులో చేసిన ఆఖరి సినిమా అనామిక.

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

అనుష్క

ఈమె పూర్తి పేరు అనుష్క శెట్టి. 1981 నవంబర్ 7 వ తేదీన మంగళూరు పట్టణంలో జన్మించినది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది. తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది. ఈమె యోగా శిక్షణ కూడా ఇస్తుంది. ఈమె గురువు ఇటీవల భూమికా చావ్లాను పెళ్ళి చేసుకున్న ప్రఖ్యాత యోగా నిపుణుడు భరత్ ఠాకూర్.

Photo Courtesy: telugunativeplanet

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి మరియు జేజమ్మ పాత్రలను పోషించింది. సినిమాలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. బిల్లా,వేదం, ఖలేజా చిత్రాలలో నటించి మెప్పించింది. ఈమె తెలుగులో చేసిన చివరి సినిమా మిర్చి. చార్మి కౌర్ ఛార్మి 1987 మే 17 వ తేదీన ముంబై సమీపంలోని వసై దగ్గర జన్మించినది. ఛార్మి సినీ రంగ ప్రవేశం నీ తోడు కావాలి అనే తెలుగు సినిమా ద్వారా జరిగింది. అప్పటికి ఛార్మి వయసు 14 సంవత్సరాలు మాత్రమే.

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

ఛార్మి 1987 మే 17 వ తేదీన ముంబై సమీపంలోని వసై దగ్గర జన్మించినది. ఛార్మి సినీ రంగ ప్రవేశం నీ తోడు కావాలి అనే తెలుగు సినిమా ద్వారా జరిగింది. అప్పటికి ఛార్మి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. ఛార్మికి వెంటనే కాదల్ కిసు కిసు అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం విజయవంతమవ్వటంతో ఆమెకు వెంటనే కాదల్ అళివతిల్లై, ఆహా, ఎత్న అళగు తమిళ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. కృష్ణవంశీ తన శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా ఛార్మిని తెలుగు తెరకు తిరిగి పరిచయం చేశాడు. 2007 లో విడుదలయిన మంత్ర ఊహించని విజయం సాధించి తెలుగు కథానాయికలలో ఛార్మికి ప్రత్యేక స్థానం కట్టబెట్టింది. సస్పెన్స్, హారర్ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఛార్మి నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు దక్కాయి.మంగళ చిత్రానికి గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ వచ్చింది. చార్మి తెలుగులో తీసిన చివరి చిత్రం ప్రేమ ఒక మైకం.

Photo Courtesy: telugunativeplanet

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

స్నేహ

అక్టోబర్ 12, 1981 వ సంవత్సరంలో ముంబై పుట్టిన స్నేహ తెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. ఈమె మొదటగా మళయాళి సినిమా ఎంగెనా ఒరు నీల పక్షి ద్వారా పరిచయమైనది. తెలుగులో మొదటి సినిమా ప్రియమైన నీకు. దీనిలో తరుణ్ సరసన నటించినది. ఆ తరువాత తొలివలపు, హనుమాన్ జంక్షన్, రవితేజ సరసన వెంకీ , విక్టరీ వెంకటేష్ సరసన సంక్రాంతి, రాధా గోపాలం, భక్తి చిత్రం శ్రీ రామదాసు, మాస్ సినిమా మహారథి, మరలా మరో భక్తి చిత్రం పాండురంగడు, తెలంగాణ పోరాటాల నడుమ నడిచే రాజన్న చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను పొందినది. ఈమె తెలుగులో నటించిన చివరి చిత్రం ఉలవచారు బిర్యానీ.

Photo Courtesy: telugunativeplanet

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

రకుల్ ప్రీత్ సింగ్

అక్టోబర్ 10, 1990 వ సంవత్సరంలో ఢిల్లీలో పుట్టిన రకుల్ కెరటం సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర సీమకు పరిచయమైనది. అయినా దాని తరువాత వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, కరెంటు తీగ, లౌక్యం సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనది. ఈమె మొట్టమొదట కన్నడ సినిమా గిల్లి ద్వారా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టినది. ఈమె చివరి తెలుగు సినిమా పండగ చేస్కో. ప్రస్తుతం కిక్2 సినిమాలో మాస్ రాజ రవితేజ సరసన నటిస్తున్నది.

Photo Courtesy: telugunativeplanet

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

టాప్ హీరోయిన్లు పుట్టిన ప్రదేశాలు !!

శ్రియ శరన్

సెప్టెంబర్ 11, 1982 వ సంవత్సరంలో డెహ్రాడూన్ లో పుట్టినది. ఈమె తెలుగు చలన చిత్ర సీమకి 2001లో రిలీజైన ఇష్టం సినిమా ద్వారా పరిచయమైనది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగులో అగ్ర కథానాయకుల సరసన నటించి మెప్పించింది. నాగార్జున సరసన సంతోషం, బాలకృష్ణ సరసన చెన్నకేశవరెడ్డి వంటి చిత్రాలలో, అప్పటి కుర్ర హీరో తరుణ్ సరసన నువ్వే నువ్వే చిత్రంలో నటించి తన స్థానాన్ని పదిలపరుచుకుంది. .ఠాగూర్ , ఎలా చెప్పాను, నేనున్నాను, అర్జున్, ఛత్రపతి, చివరగా మనంలో, గోపాల గోపాల చిత్రంలో నటించింది.

Photo Courtesy: telugunativeplanet

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి