Search
  • Follow NativePlanet
Share
» »డియోఘర్ నగరంలో ఉన్న ఈ జలపాతాల అందాలు మీకోసం..

డియోఘర్ నగరంలో ఉన్న ఈ జలపాతాల అందాలు మీకోసం..

డియోఘర్ నగరంలో ఉన్న ఈ జలపాతాల అందాలు మీకోసం..

జార్ఖండ్ రాష్ట్రంలోని డియోఘర్ నగరం శివుడి నగరంగా భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర నగరాన్ని బాబాదామ్ నగరం అని కూడా అంటారు. డియోఘర్‌లో పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన‌ పవిత్రమైన వైద్యనాథ్ శివలింగం ఇక్క‌డ ఉంది. ఈ నగరం జార్ఖండ్‌లోని ఇతర నగరాల నుండి అన్నివైపులా ప్ర‌వేశ‌మార్గంగా ఉంటుంది. ప్ర‌తి సంవ‌త్స‌రం శ్రావ‌ణ‌మాసంలో జ్యోతిర్లింగాలను సంద‌ర్శించేందుకు కోట్లాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.

అయితే, ఈ పవిత్ర స్థలాన్ని ప్రతిరోజూ వేలాది మంది భక్తులు లేదా పర్యాటకులు సందర్శించడానికి వ‌స్తూ ఉంటారు. ఇక్క‌డి కొన్ని ప్ర‌దేశాలు ప్ర‌కృతి ఒడిలో సేద‌దీరేందుకు అనువుగా ఉంటాయి. అవును, ఈ అందమైన నగరం చుట్టూ కొన్ని అద్భుతమైన సరస్సులు ఉన్నాయి. వీటిని చూడటానికి పర్యాటకులు కుటుంబ స‌మేతంగా వ‌స్తూ ఉంటారు. డియోఘర్‌ను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, ఖచ్చితంగా ఈ సరస్సులను మీ ప్రయాణపు జాబితాలో చేర్చుకోండి.

ఉస్రి జలపాతం

ఉస్రి జలపాతం

గిరిడిహ్‌లో ఉన్న‌ ఉస్రి జలపాతం డియోఘర్‌తో పాటు మొత్తం జార్ఖండ్‌కు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఈ జలపాతపు నీరు మూడు పాయలుగా విడిపోతుంది. ఎత్త‌యిన పర్వతాల మీదుగా ఉదృతంగా ప్రవహించే ఈ జలపాతం నీరు కింద పడిన తర్వాత దట్టమైన అడవుల గుండా ఉర‌క‌లు వేస్తూ ప్రవహిస్తుంది. ఆ దృశ్యాన్ని చూసేందుకు సంద‌ర్శ‌కులు ఎక్కువ‌గా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. ఈ ఒక్క దృశ్యంతో మనసు తృప్తి చెందుతుందంటే న‌మ్మండి. ఇక్కడి మైదానాలు, రాళ్ల ఆకృతిని చూసిన తర్వాత ప్రకృతి ఈ నగరాన్ని త‌న చేత్తో చెక్కినట్లు అనిపిస్తుందని చెబుతారు. చాలా మంది పర్యాటకులు వర్షాకాలంలో ఇక్కడికి వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపిస్తారు.

ఔషధ జలపాతం..

ఔషధ జలపాతం..

ఔషధ జలపాతాన్ని త్రికూట పర్వత జలపాతం అని కూడా పిలుస్తారు. ఈ జలపాతం గురించి అనేక పురాణాలు ఉన్నాయి. ఇక్క‌డి ఊట నీరు అనేక వ్యాధులకు నివార‌ణ‌గా ఉపయోగపడుతుందని స్థానికులు విశ్వసిస్తున్నారు. ఈ ఊట నీటిని తీసుకెళ్లేందుకు ప్రజలు సుదూర ప్రాంతాల నుండి కూడా వ‌స్తూ ఉంటారు. మీరు డియోఘర్ వెళుతున్నట్లయితే ఔషధ జలపాతాన్ని కుటుంబ‌స‌మేతంగా సందర్శించడానికి ఖచ్చితంగా చేరుకోవాల్సిందే.

మారిచో జలపాతం

మారిచో జలపాతం

మారిచో జలపాతం డియోఘర్ నుండి గంట ప్ర‌యాణ‌ దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ అద్భుతమైన జలపాతం యొక్క విశాల దృశ్యం సంద‌ర్శ‌కుల మ‌న‌సు దోచేస్తుంది. ఇక్క‌డి ప్ర‌కృతి అందాలు ఎవ్వ‌రైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రత్యేకించి, వర్షాకాలంలో, చాలా మంది పర్యాటకులు సందర్శించడానికి ఇక్కడికి చేరుకుంటారు. డియోఘర్ ను సందర్శించడానికి ఎవరు వెళ్లినా ఖచ్చితంగా ఇక్కడికి చేరుకుంటారని స్థానికులు చెబుతుంటారు. అయితే, వర్షాకాలంలో నీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్క‌డ వేసే ప్ర‌తి అడుగులో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సి ఉంటుంది.

ఘఘ్రి జలపాతం

ఘఘ్రి జలపాతం

మీరు దట్టమైన అడవులలో పర్వతాలు మరియు అద్భుతమైన జలపాతాలను ఆస్వాదించాలనుకుంటే, ఘఘ్రి జలపాతాన్ని తప్పక సందర్శించాలి. శ్రావ‌ణ‌మాసంలో డియోఘర్ చేరుకునే ఎవరైనా ఖచ్చితంగా ఇక్కడి ప్ర‌దేశాను సందర్శించడానికి ఒకటి నుండి రెండు రోజులు పడుతుంది. ఈ ప్రదేశం స్థానిక ప్రజలతోపాటు ఇత‌ర ప్రాంతాల వారికీ పిక్నిక్ స్పాట్‌గా ప్రసిద్ధి చెందింది. బాబాదాంకి వెళుతున్నట్లయితే, ఖచ్చితంగా ఇక్కడకు వెళ్లాల్సిందే.

Read more about: deoghar usri falls
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X