Search
  • Follow NativePlanet
Share
» »మంత్రముగ్దులను చేసే ఫలక్‌నుమా ప్యాలెస్ అందాలు !!

మంత్రముగ్దులను చేసే ఫలక్‌నుమా ప్యాలెస్ అందాలు !!

ఫలకునుమా ప్యాలెస్ దక్షిణ భారతదేశ ప్యాలెస్ లో అత్యంత ప్రజాదరణ, ప్రజా ఆకర్షణ పొందిన చారిత్రక కట్టడం. ఉర్దూ లో ఫలక్ నుమా అంటే ఆకాశ దర్పణం (mirror of the sky) అని అర్థం.

By Mohammad

తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న ఫలక్‌నుమా ప్యాలెస్ ఉత్తమమైన భవనాల్లో ఒకటి. ఇది హైదరాబాద్ రాష్ట్రపు పైగా కుటుంబానికి చెందినది, తరువాత నిజాముల సొంతమైంది. ఇది ఫలక్‌నుమాలో 32 ఎకరాల (13 హెక్టార్లు) ప్రదేశంలో చార్మినార్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని హైదరాబాద్ ప్రధానమంత్రి మరియు ఆరవ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ బహదూర్ యొక్క మామయ్య మరియు బావ అయిన నవాబ్ వికారుల్ ఉమ్రా నిర్మించారు. ఉర్దూలో ఫలక్‌నుమా అంటే 'ఆకాశ దర్పణం' అని అర్థం.

ఫలక్‌నుమా ప్యాలెస్ విశేషాలు

నేడు ప్యాలెస్ లోని ఒక అద్దం విలువ రూ. 35 కోట్లకు పైగా ఉంది. ఈ భవనాన్ని 32 ఎకరాల్లో నిర్మించారు ఫలక్‌నుమా అంటే 'ఆకాశ దర్పణం' అని అర్థం. దీన్ని 'పైగా' వంశానికి చెందిన హైదరాబాద్‌ ప్రధాని సర్‌ వికారుల్‌ ఉమ్రా ఇక్బాల్‌ దౌలా బహదూర్‌ నిర్మించారు. చిన్న కొండపై నిర్మించిన ఈ భవనం మీద నుంచి తిలకిస్తే కనుచూపు మేర నగర అందాలు కనువిందు చేస్తాయి.

ప్యాలెస్ లో డిన్నర్ కాస్ట్ ఇద్దరికీ కలిపి (నార్త్ ఇండియన్, ఇటాలియన్) : రూ. పదిహేను వేలు
ప్యాలెస్ లో గదుల ధరలు : రూ. 28 వేల పైమాటే
జడే టెర్రస్ పై బ్రేక్ ఫాస్ట్ + టీ కాస్ట్ (ఇద్దరికి కలిపి) : రూ. 12 వేలు + అదనపు టాక్స్

40 లక్షల ఖర్చు

40 లక్షల ఖర్చు

ఈ భవనానికి 1884 మార్చి 3వ తేదీన పునాది వేస్తే, 1892-93 లో పూర్తి అయినది. అప్పట్లో ఈ ప్యాలెస్‌ నిర్మాణానికి రూ. 40 లక్షలు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఆరో నిజాం మహబూబ్‌ అలీ పాషాకు ఈ భవనమంటే ఎంతో మక్కువ.

చిత్రకృప : Ronakshah1990

విడిది

విడిది

1895లో నిర్మాణం ఖర్చులు చెల్లించి వికార్‌ నుంచి దీనిని కొనుగోలు చేశాడు. కింగ్‌ ఎడ్వర్డ్స్‌, వైస్రాయ్‌ లార్డ్‌ వేవెల్‌, తొలి భారతీయ గవర్నర్‌ జనరల్‌ సి.రాజగోపాలాచారి, భారత తొలి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ గతంలో ఈ ప్యాలెస్‌లో విడిది చేశారు.

చిత్రకృప : Bernard Gagnon

ఎంతో ప్రత్యేకత

ఎంతో ప్రత్యేకత

భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ సంస్థానం లోని ఫైగా వంశస్థులకు చెందినది. ఆతర్వాత దీనిని నిజాం రాజులు సొంతం చేసుకున్నారు.

చిత్రకృప : Rachna 13

ఆకాశ అద్దంTijl Vercaemer

ఆకాశ అద్దంTijl Vercaemer

చార్మినార్ కు 5 కిలోమీటర్ల దూరంలో 32 ఎకరాల (13 హెక్టార్లు) సువిశాల ప్రదేశంలో ఫలక్ నుమా ఫ్యాలెస్ నిర్మించారు. దీనిని అప్పటి హైదరాబాద్ రాజ్య ప్రధాన మంత్రి (నాలుగవ నిజాం రాజైన మీర్ మహబూబ్ అలీఖాన్ బహద్దూర్ బావమరిది) నవాబ్ వికార్-ఉల్-ఉమ్రా నిర్మించారు. ఫలక్ నుమా అంటే ఉర్దులో "ఆకాశాన్ని ఇష్టపడటం" లేదా "ఆకాశ అద్దం" అని అర్థం.

చిత్రకృప : Tijl Vercaemer

నిర్మాణాకృతి

నిర్మాణాకృతి

ఫలక్ నూమా ప్యాలెస్ కు ఆంగ్లేయ ఆర్కిటెక్టర్ నిర్మాణాకృతినిచ్చారు. మార్చి3, 1884లో ఈ నిర్మాణానికి సర్ వికార్ శంకు స్థాపన చేయగా అన్ని హంగులతో నిర్మాణం పూర్తి కావడానికి తొమ్మిదేళ్లు పట్టింది. ఫలక్ నుమా ప్యాలెస్ లోని 93,971 చదరపు మీటర్ల విస్తీర్ణం గల మర్దనా భాగాన్ని ఇటలీ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన పాలరాళ్లతో పరిచారు.

చిత్రకృప : Tijl Vercaemer

ప్రత్యేక ఆకర్షణ

ప్రత్యేక ఆకర్షణ

తేలు ఆకృతిలో నిర్మించిన ఈ ప్యాలెస్ మధ్య భాగంలో ప్రధాన భవనం, వంటగది, గోల్ బంగ్లా, జెన్నా మహల్ తో పాటు దక్షిణ భాగంలో పట్టపు రాణులు, చెలికత్తెల కోసం క్వార్టర్లను నిర్మించారు. ఫలక్ నుమా ప్యాలెస్ మొత్తం అరుదైన ఇటాలియన్, టుడూర్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇందులోని కిటికీలకు ఉపయోగించిన రంగు రంగుల అద్దాల పట్టకాల నుంచి వచ్చే కాంతి గదులకు ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తాయి.

చిత్రకృప : Bernard Gagnon

చరిత్ర

చరిత్ర

1897-98 వరకు సర్ వికార్ తన వ్యక్తిగత నివాసంగా ఫలక్ నుమా ప్యాలెస్ ను ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత దీని యాజమాన్య బాధ్యతలను హైదరాబాద్ రాజైన 6వ నిజాంకు అప్పగించారు. ఫలక్ నుమా ప్యాలెస్ చాలా ఖరీదైన కట్టడం. దీని కోసం చేసిన అప్పులు తీర్చేందుకు వికార్ కు చాలా కాలం పట్టిందట.

చరిత్ర

చరిత్ర

ఆయన భార్య వికారుల్ ఉమ్రా ఇచ్చిన సలహా మేరకు మహబూబ్ అలీ పాషా నిజాంను ఈ ప్యాలెస్ కు ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన మహెబూబ్ అలీ పాషా.. ప్యాలెస్ ను చూసి మంత్రముగ్దులయ్యారు. ప్యాలెస్ నిర్మాణంతో వికార్ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుసుకుని కావాల్సిన ఆర్థిక సహాయం అందించారు.

చిత్రకృప : Tijl Vercaemer

చరిత్ర

చరిత్ర

1950లో ఇక్కడి నుంచి 6 వ నిజాం వెళ్లిపోయిన తర్వాత ఫలక్ నుమా ప్యాలెస్ మొత్తం నిశ్శబ్ధం ఆవరించింది. చివరి అతిథిగా అప్పటి భారత రాష్ట్ర పతి బాబూ రాజేంద్ర ప్రసాద్ 1951లో ఇక్కడ విడిది చేశారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఈ ప్యాలెస్ ను మూసివేశారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఈ ప్యాలెస్ ను తాజ్ గ్రూప్ సంస్థకు 30 సంవత్సరాల పాటు అద్దెకు ఇచ్చారు.

చిత్రకృప : Tijl Vercaemer

ప్యాలెస్

ప్యాలెస్

ప్యాలెస్ లోని అద్భుతాల్లో... ప్రధాన రిసెప్షన్ గది ఒకటి. ఈ గదిలోని సీలింగ్ కు ఇసుక, సున్నం, నీటితో కలిపిన డెకరేషన్ అచ్చంగా బంగారు తాపడం చేసిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్యాలెస్ లో 60 విలాసవంతమైన గదులు మరియు 22 విశాలమైన హాళ్లు ఉన్నాయి.

చిత్రకృప : Tijl Vercaemer

డైనింగ్ టేబుల్

డైనింగ్ టేబుల్

ఈ ప్యాలెస్ లోని భోజనశాలలో ఉన్న డైనింగ్ టేబుల్ పై ఒకేసారి 100 మంది అతిథులు ఒకేసారి కూర్చుని భోజనం చేయవచ్చు. 108 అడుగుల పొడవు, 5.7 అడుగుల వెడల్పు, 2.7 అడుగుల ఎత్తున్న డైనింగ్ టేబుల్ ను బంగారం, క్రిస్టల్ తో తయారు చేశారు.

చిత్రకృప : Tijl Vercaemer

గ్రంథాలయం

గ్రంథాలయం

ప్యాలెస్ లోని గ్రంథాలయంలో భారత్ దేశంలోని అతి అరుదైన ఖురాన్ గ్రంథాలున్నాయి. ఇక్కడ బిలియర్డ్స్ టేబుల్స్ చాలా అరుదైనవి. ఇలాంటి టేబుల్స్ రెండు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ఇంగ్లండ్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్ లో ఉంటే మరొకటి ఫలక్ నుమా ప్యాలెస్ లో మాత్రమే ఉంది.

చిత్రకృప : Bernard Gagnon

పెయింటింగ్

పెయింటింగ్

ప్యాలెస్ గోడలపై ఆయిల్ పెయింటింగ్ తో వేసిన ప్రముఖుల ఫోటోలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇలాంటి విశేషాలెన్నో ఫలక్ నుమా ప్యాలెస్ సొంతం. 1883లోనే ఈ భవనములో విద్యుత్, టెలిఫోన్ ఉపయోగించారు. కరెంట్ ఉపయోగించారనడానికి భారతదేశంలోనే అతి పెద్ద స్విచ్ బోర్డు ఇక్కడ చూడవచ్చు.

చిత్రకృప : Tijl Vercaemer

విద్యుత్తు

విద్యుత్తు

ఈ భవనానికి ఆరోజుల్లో విద్యుత్తును అందించడానికి బొగ్గు ఆదారిత యంత్రాలను ఉపయోగించేవారు. ఆ ప్రాంతంపేరు ఇంజన్ బౌలి అని అంటారు. ఆ ప్రాంతాన్ని ఈ నాటికి అదే పేరుతో పిలుస్తున్నారు.

చిత్రకృప : Tijl Vercaemer

విలాసవంతమైన హోటల్ గా ఆధునీకరణ

విలాసవంతమైన హోటల్ గా ఆధునీకరణ

2000 సంవత్సరం ముందు వరకు సాధారణ ప్రజలను ఈ ప్యాలెస్ లోకి రానిచ్చేవారు కాదు. కానీ.. తాజ్ గ్రూప్ దీనిని అద్దెకు తీసుకున్న తర్వాత.. దీనిని మరింత ఆధునీకరించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఈ హోటల్ నవంబరు 2010లో ప్రారంభమైంది. ఫ్రాన్స్ నుంచి తెప్పించిన అందమైన ఫర్నీచర్, హస్తకళా వస్తువులతో ఈ హోటల్ ను అందంగా అలంకరించారు.

చిత్రకృప : Bernard Gagnon

ఫలక్‌నుమా ప్యాలెస్ ఎలా చేరుకోవాలి ?

ఫలక్‌నుమా ప్యాలెస్ ఎలా చేరుకోవాలి ?

ఫలక్‌నుమా ప్యాలెస్ చూడాలంటే 'తెలంగాణ టూరిజం - నిజాం ప్యాలెస్ టూర్' సంయుక్తంగా అందిస్తున్న వీకెండ్ హాఫ్ డే టూర్ లో (కేవలం శని, ఆదివారాలు మాత్రమే) మీ పేరు, చిరునామా ఎంట్రీ చేసుకోవాలి. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

చిత్రకృప : Tijl Vercaemer

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X