• Follow NativePlanet
Share
» »ఇక్కడ శివుడికి పాలు అంటే ఇష్టం లేదు? సందర్శిస్తే మీ శత్రువును జయించే ఆయుధం మీ సొంతం

ఇక్కడ శివుడికి పాలు అంటే ఇష్టం లేదు? సందర్శిస్తే మీ శత్రువును జయించే ఆయుధం మీ సొంతం

Written By: Kishore

విష్ణువు దశావతారాల్లో పరుశరామావతారం కూడా ఒకటి. ఇది ఆరవది. పరమశివుడి గురించి తపస్సు చేసి ఆయన్ను మెప్పించిన పరుశం (గండ్ర గొడ్డలి) ను ఆయుధంగా పొందడం వల్లే పరుశ రాముడికి ఆ పేరు సార్థకం అయిందనేది పురాణ కథనం. జమదాగ్ని, రేణుకాదేవి పుత్రుడే పరుశరాముడు. ఇతనికి తెలియని అస్త్ర, శస్త్ర విద్య అంటూ ఏదీ లేదు. ఇతనికే ద్రోణుడు, భీష్ముడు, కర్డుడికి కూడా అస్త్ర, శస్త్ర విద్యలు నేర్పించాడు. అటు వంటి పరుశరాముడు నిర్మించిన దేవాలయం ఈ ప్రపంచంలో ఒకటే ఒకటి ఉంది. ఆ దేవాలయాన్ని దర్శిస్తే శత్రువు బలహీనతలు తెలిసి వారిని జయించే ఆయుదం సొంతమవుతుందని భక్తులు లక్షల మంది నమ్మకం. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం

ఇక్కడ కన్నెపిల్లల ఈ 'శరీర భాగాలు' లేకుంటే వీరికి 'ముద్ధ' కూడా దిగదు?

1. ఆరావళి పర్వత పంక్తుల్లో

1. ఆరావళి పర్వత పంక్తుల్లో

Image Source:

రాజస్థాన్ లోని ఆరావళి పర్వత పంక్తుల్లో పరుశరామ మహాదేవ మందిరం ఉంది. దీనిని హిందువలు పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. తల్లిని చంపిన పాపం నుంచి ఉపశమనం కోసం తీర్థయాత్రలకు బయలు దేరిన పరుశరాముడు ప్రస్తుతం పరుశరామ మహాదేవ్ ఆలయం ఉన్న కొండ ప్రాంతానికి చేరుకుంటాడు.

2. రెండుగా

2. రెండుగా

Image Source:

ఈ గుట్ట పరమ పవిత్రమైనదిగా భావించి తన గొడ్డలితో పర్వతాన్ని రెండుగా చేసి గుహ వంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తాడు. అటు పై పరుశరాముడు ఇక్కడ ఒక శివలింగం ను ఏర్పాటు చేసి శివుడి గురించి ధ్యానం చేస్తూ ఉండిపోతాడు.

3. గోవు ముఖం నుంచి

3. గోవు ముఖం నుంచి

Image Source:

అదే ఇప్పుడు పరుశరామ మహాదేవ ఆలయంగా ప్రాచుర్యం పొందింది. ఈ శివలింగం పై భాగాన గోవు మొహం వలే ఇక శిల ఉంటుంది. ఈ గోవు ముఖం నుంచి నీరు ఈ శివలింగం పై పడుతూ ఉంటాయి.

4. 2,600 అడుగుల ఎత్తులో

4. 2,600 అడుగుల ఎత్తులో

Image Source:

ఈ దేవాలయం సముద్ర మట్టం నుంచి 2600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ దేవాలయంలోకి వెళ్లడానికి 500 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అంత ఎత్తులో ఉన్న ఈ దేవాలయం పరిసర ప్రాంతాలు ఎప్పుడూ చల్లగా ఉంటాయి.

5. ఎప్పటికీ ఎండని తొమ్మది కుండాలు

5. ఎప్పటికీ ఎండని తొమ్మది కుండాలు

Image Source:

ఈ దేవాలయానికి సమీపంలో ఎప్పటికీ ఎండిపోని తొమ్మిది జల కుండాలు ఉన్నాయి. వీటిని నవ కుండాలు అని అంటారు. ఇందులో ఒకదాని పేరు మాత`కుండం. ఈ కుండంలో స్నానం చేసిన తర్వాతనే పరుశరాముడికి మాత`హత్య పాపం నుంచి ముక్తి లభించిందని చెబుతారు.

6. శత్రువును జయించే శక్తి

6. శత్రువును జయించే శక్తి

Image Source:

పరుశరాముడు శివుడి గురించి తపస్సు చేసి పరుశువునే కాక అనేక ఆయుధాలను పొందిన ప్రదేశం ఈ పరుశరామమహాదేవ్ మందిరం. అంతే కాకుండా తల్లిని చంపడం వల్ల తనకు అంటిన పాపాన్ని పోగొట్టుకున్న ప్రదేశం కూడా ఇదే. అందువల్ల ఇక్కడ దేవుడిని సందర్శించుకోవడం వల్ల తమకు శత్రువును జయించే శక్తి లభిస్తుందని నమ్ముతారు.

7. తొమ్మిది లక్షల మంది

7. తొమ్మిది లక్షల మంది

Image Source:

అదే విధంగా ఆ కుండంలో నీటిని తాకడం వల్ల సర్వ పాపాలు తొలిగి పోతాయని భక్తులు నమ్ముతారు. అందువల్లే ప్రతి ఏడాది దాదాపు 9 లక్షల మంది హిందూ భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.

8. నీళ్లు మాత్రమే

8. నీళ్లు మాత్రమే

Image Source:

ఇక్కడ శివలింగం కింద ఒక రంధ్రం ఉంటుంది. శివ లింగానికి నీటితో అభిషకం చేసిన తర్వాత నీళ్లన్ని ఈ రంధ్రం గుండా లోపలికి వెళ్లిపోతాయి. ఎన్ని నీళ్లతో అభిషేకం చేసినా ఒక్క చుక్క నీరు కూడా బయట ఉండదు.

9. పాలు తీసుకోడు

9. పాలు తీసుకోడు

Image Source:

అయితే పాలాభిషేకం తర్వతా ఒక్క చుక్క కూడా నీరు ఆ రంద్రం గుండా లోపలికి పోదు. ఇందుకు గల కారణాలు ఇప్పటి వరకూ ఎవరూ కనుగొనలేకపోయారు.

10. ఎలా చేరుకోవాలి?

10. ఎలా చేరుకోవాలి?

Image Source:

ఈ దేవాలయం కుంబల్ ఘడ్ కోట నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కోట నుంచి సాద్రి, రాజ్ పూర మీదుగా ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు. అదేవిధంగా ఉదయ్ పూర్ నుంచి 98 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తే పరుశరామ మహాదేవ్ మందిర్ వస్తుంది. ఉదయ్ పూర్ లో విమానాశ్రయం కూడా ఉంది.

Read more about: temple tour travel rajasthan

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి