» »తెలుగు జానపద సినిమాల రహస్య కోట ఇక్కడ ఉంది.

తెలుగు జానపద సినిమాల రహస్య కోట ఇక్కడ ఉంది.

Written By: Beldaru Sajjendrakishore

భారత దేశంలో తెలుగు చిత్రసీమకు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. ముఖ్యంగా జానపద తెలుగు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. ప్రతి జానపద తెలుగు సినిమాతో పాటు మిగిలిన దక్షిణాది భాషలకు చెందిన సినిమాల్లో కోటల ప్రస్తవన వచ్చినప్పుడు ప్రధానంగా వినిపించే పేరు గండికోట. ఈ కోట మన ఆంధ్రప్రదేశ్ లో నిజంగానే ఉంది. ఇక అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన భారత దేశంలో శత్రు దుర్భేద్యమైన కోటలకు నిలవు. ఇందులో గిరి దుర్గాలుగా పిలువబడే కోటల నిర్మాణశైలి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కడప జిల్లా జమ్మలమడుగుకు దగ్గర్లోని పెన్నానది తీరంలో ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్జానం అంతగా అందుబాటులో లేని సమయంలోనే పునాదులే లేకుండా ఏర్పాటు చేసిన ఈ కోట నిర్మాణశైలి ఎప్పటికీ నిఘూడ రహస్యమే. అంతే కాకుండా ఈ కోట చుట్టూ ఉన్న పచ్చటి కొండలు, ఆ కొండల నడుమన ఉన్న పెన్నానది ప్రకతి ఆరాధకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. దీంతీ ఈ గండికోటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం కోట్ల రుపాయలు ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో గండికోటకు సంబంధించిన కథనం..

1.పెన్నానది తీరంలో

1.పెన్నానది తీరంలో

Image source

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ జిల్లా జమ్ముల మడుగు తాలూకా గుండా ప్రవహించే పెన్నానది తీరంలో ఎర్రని రంగుతో ప్రకాశించే పర్వతశ్రేణి ఉంది. దీనినే గండి కొండ అని కూడా పిలుస్తారు.

2. పర్వత పంక్తుల మధ్య

2. పర్వత పంక్తుల మధ్య

Image source

పర్వత పంక్తుల మధ్య ప్రవహించే పెన్నానది ఒడ్డున ఈ రాజ్యం ఏర్పాటు కావడం వల్ల దీనిని గండి కోట అని పిలుస్తారు. పర్వతాల నడుమ నది 300 మీటర్ల పొడవు మేర ప్రవహిస్తూ ఉంటుంది.

3. ఐదు మైళ్ల చుట్టుకొలత

3. ఐదు మైళ్ల చుట్టుకొలత

Image source

వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుప రేకుతో తాపడం చేయబడి ఉన్నాయి. తలుపులపై ఇనుప సూది మేకులున్నాయి.

4. పునాదులు లేకుండానే

4. పునాదులు లేకుండానే

Image source

కోట ప్రాకారం ఎర్రటి నున్నని శాణపు రాళ్ళతో నిర్మించారు. కొండ రాతి పై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తున్నాయి.

5. 40 బురుజులు

5. 40 బురుజులు

Image source

చతురస్రాకారంలోను, దీర్ఘ చతురస్రాకారంలోను 40 బురుజులున్నాయి. గోడపై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మీనార్లు ముఖ్యమైన కట్టడాలు.

6. భూగర్భంలో నీటి వసతి

6. భూగర్భంలో నీటి వసతి

Image source

ఇంతే గాక జైలు, రంగ్ మహల్ ఉన్నాయి. నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు, ఇంకా చాలా చెరువులు, బావులున్నాయి. భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరచిన నీటి సదుపాయం ఇక్కడి ప్రత్యేకత.

7. శత్రు దేర్భేద్యంగా

7. శత్రు దేర్భేద్యంగా

Image source

మధ్య నది, చుట్టూ కొండల మధ్య నిర్మింతమైన ఈ రాజ్యం శత్రుదుర్బేద్యంగా ఉండేది. అందువల్లే ఈ గండి కోట పై అప్పట్లో దండయాత్ర చేయాడానికి ఎవరూ సాహసించేవారు కాదు.

8. పశ్చిమ చాళుక్యరాజు నిర్మించాడు

8. పశ్చిమ చాళుక్యరాజు నిర్మించాడు

Image source

గండికోటను పశ్చిమచాళుక్యరాజు అహావ మల్ల నిర్మించాడని చెబుతారు. ఈ విషయంలో చరిత్రకారులకు, పురావస్తు శాస్ర్తవేత్తలకు మధ్య ఇప్పటికీ కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల ఈ గండికోట చరిత్ర పై ఖచ్చితమైన నిర్థారణ రాలేకపోతున్నారు.

9. రాజధాని మార్పు

9. రాజధాని మార్పు

Image source

గండికోటకు దగ్గర్లో దొరికిన ఒక శాసనంలో అంబదేవ అనే రాజు తన రాజధానిని వల్లూరు నుంచి గండి కోటకు మార్చాడని తెలుస్తోంది. అయితే ఇందుకు బలం చేకూర్చే మరే ఆధారాలు ఇక్కడ లభ్యం కాలేదు.

10. కాకతీయుల ప్రస్థావన

10. కాకతీయుల ప్రస్థావన

Image source

గండి కోటకు సమీపంలోని ఉప్పర పల్లెలో దొరికిన మరో శాసనంలో కాకతీయ రాజైన ప్రతాప రుద్రుడు ఈ గండి కోటకు తన ప్రతినిధిగా రాజరెడ్డిని నియమించనట్లు చెక్కబడి ఉంది.

11. విజయనగర రాజులకు సామంతులు

11. విజయనగర రాజులకు సామంతులు

Image source

విజయనగర సామ్రాజ్య చరిత్రలో కూడా గండి కోట ప్రస్తావన ఉంది. ఉదగిరి మండలానికి వెళ్లాలంటే ఈ గండి కోట మీదుగానే అప్పటి రాజులు వెళ్లేవారని తెలుస్తోంది.ఇక 16వ శాతాబ్దంలో గండికోటను తిమ్మానాయుడు, రామలింగనాయుడు విజయనర రాజ్యానికి సామంతులుగా ఉంటూ ఈ గండికోటను పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది.

12. విజయనగర సామ్రాజ్యం విచ్చిన్న సమయంలో

12. విజయనగర సామ్రాజ్యం విచ్చిన్న సమయంలో

Image source

విజయనగర సామ్రాజ్యం విచ్చిన్నమైనప్పుడు కుతుబ్ షాహీలు ఈ గండికోటను కుట్రపన్ని వశం చేసుకున్నట్లు చెబుతారు. ఇలా గండి కోట పలు రాజ్యాల ఏలుబడిలో ఉందని చెప్పబడింది కాని దీని నిర్మాణం ఎప్పుడు జరిగిందనడానిక సరైన సాక్షాలు దొరకడం లేదు.

13. పౌరుషాలకు నిలయం

13. పౌరుషాలకు నిలయం

Image source

ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ కోట అప్పటి రాజుల పౌరుషాలకు, యుద్ద తంత్రాలకు నిలయంగా చెబుతారు. ఇక కోట నిర్మాణం సమయంలో స్థలం ఎంపిక అప్పటి పాలకుల ముందుచూపునకు నిదర్శనమని చరిత్ర కారులు చెబుతున్నారు.

14. శిక్షలు చాలా కఠింనం

14. శిక్షలు చాలా కఠింనం

Image source

ఎలాంటి నేరాలకైనా కృరమైన శిక్షలు ఉండేవి. చిన్న దొంగతనానికి కాలు, చేయి తొలగించేవారు. రాజద్రోహానికి పాల్పడితే కళ్ళు పీకేసి సూదులు చెక్కిన కర్రతో చంపేసేవారు. పెద్ద దొంగతనాలకు గడ్డం కింద కొక్కెం గుచ్చి వేలాడదీసి చంపేసేవారు.

15. పదుల సంఖ్యలో ఆలయం

15. పదుల సంఖ్యలో ఆలయం

Image source

ఈ గండి కోట చుట్టు పక్కల పదుల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం అవన్ని శితాలావస్థలో ఉన్నయి. ఇక్కడి దేవాలయాల్లో శిల్పకళ ఉట్టి పడుతూ ఉంటుంది. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది రంగనాథ ఆలయం, మాధవరాయ ఆలయం.

16. రంగనాథాలయం:

16. రంగనాథాలయం:

Image source

ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన శా.1479 (క్రీ.శ.1557) నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఆ శాసనం గండికోట లోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఈ ఆలయనిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథాలయం నూటికి నూరు పాళ్ళూ విజయనగర రాజుల నిర్మాణం అని స్పష్టమౌతుంది.

17. మాధవరాయ ఆలయం

17. మాధవరాయ ఆలయం

Image source

ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన క్రీ.శ.పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది. ఆలయంలో మనకు కనిపించే శిల్ప కళా లక్షణాలు, ఆలయనిర్మాణశైలిని బట్టి చూసినా ఆలయ నిర్మాణం అదే కాలంలో జరిగినట్లు తెలుస్తుంది.

18. కోట్లు ఖర్చుపెడుతున్న ప్రభుత్వం

18. కోట్లు ఖర్చుపెడుతున్న ప్రభుత్వం

Image source

చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో పెన్నానది గలల మధ్య ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా కూడా విరాజిల్లుతోంది. అక్కడి ప్రభుత్వం కూడా గండికోటను పర్యాటక కేంద్రంగా అభివ`ద్ధి చేయడం కోసం ఎన్నో కోట్లు ఖర్చుపెడుతోంది.

19. ఎలా చేరుకోవాలి

19. ఎలా చేరుకోవాలి

Image source:
కడప నుంచి గండికోటకు 85 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణ సమయం దాదాపు 2 గంటలు. బస్సు సౌకర్యం ఉంది.

20. మరికొన్ని చూడదగిన ప్రదేశాలు

20. మరికొన్ని చూడదగిన ప్రదేశాలు

Image source

గండికోటతో పాటు కడప జిల్లాలలో చూడదగిన మరొకొన్ని పర్యటాక కేంద్రాలు ఇవే. కడప దర్గ, బెలూం గుహలు, వెంకటేశ్వర అభయారణ్యం, పుష్పగిరి తదితరాలు.