Search
  • Follow NativePlanet
Share
» » పంచమహాపాతకాలను తొలగించే చోట ఆత్మలు కూడా పూజలు చేస్తాయి

పంచమహాపాతకాలను తొలగించే చోట ఆత్మలు కూడా పూజలు చేస్తాయి

తిరుపతికి దగ్గర్లో ఉన్న వేంపజరి లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం గురించి కథనం.

హిందూ పురాణాల ప్రకాణం దేవాలయ దర్శనం వల్ల తెలిసీ, తెలియక చేసిన తప్పులు సమసిపోతాయాని చెబుతారు. అయితే కొన్ని పనులు వల్ల మానవుడు పాపాలను మూటగట్టుకొంటాడు. అటువంటి పాలపాలను పోగొట్టుకోవడానికి మాత్రం కొన్ని ప్రత్యేక ఆలయాల దర్శనంచేసుకోవాల్సి ఉంటుంది.

అటువంటి కోవకు చెందిన దేవాలయం తిరుపతికి అతి సమీపంలో ఉంది. ఇక్కడ మూల విరాట్టు రూపంలో దేశంలో మనం మరెక్కడా చూడలేము. అంతేకాకుండా ఇక్కడ అతి పురాతన పాపవినాశన వృక్షం ఉంది. ఇక్కడకు ఆత్మలు కూడా వచ్చి పూజలు చేస్తాయని చెబుతారు. ఇక్కడ ధన్వంతరి ఆలయం కూడా చాలా ప్రాచూర్యం చెందినది. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆ దేవాలయం గురించిన పూర్తి కథనం మీ కోసం

మొదట్లో వేం పంచ హరి

మొదట్లో వేం పంచ హరి

P.C: You Tube

వేంపజరి ని మొదట్లో వేం పంచ హరి పిలిచేవారు. వేం అంటే పాపమని, పంచ అనగా ఐదు, హరి అంటే హరించమని అర్థం. మొత్తంగా తాము చేసే పంచమహాపాపాలను హరించమని ఆ హరిని వేడుకునే క్షేత్రం అని అర్థం.

పేరు అలా మారి పోయింది

పేరు అలా మారి పోయింది

P.C: You Tube

కాలక్రమంలో వేం పంచ హరి కాస్త వేంపజరిగా మారి పోయింది. స్థలపురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని క్రీస్తుశకం 12వ శతాబ్దంలో చోళవంశానికి చెందిన మూడవ కుళోత్తుంగ రాజుపరిపాలించేవాడు.

ఓ పుట్టలో

ఓ పుట్టలో

P.C: You Tube

ఆ సమయంలో ఈ ప్రాంతానికి చెందిన ఓ భక్తుడికి స్వామివారు కలలో కనిపించి తాను ఇక్కడికి సమీపంలోని ఓ చిట్టడివిలోని పుట్టలో వెలిసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని సదరు భక్తుడు రాజుకు తెలియజేస్తాడు.

 శిలా ప్రతిమ రూపంలో

శిలా ప్రతిమ రూపంలో

P.C: You Tube

రాజు తన పరివారంతో అక్కడకు చేరుకొని అడవి మొత్తం గాలిస్తాడు. చివరికి ఓ పుట్ట నుంచి వింత కాంతి వెలువడటం కనిపిస్తుంది. ఆ పుట్టను తవ్వగా అక్కడ విష్ణువు లక్ష్మీనారాయణ రూపంలో వారికి ఓ శిలా ప్రతిమ రూపంలో దర్శనమిస్తాడు.

కుళోత్తుంగుడు

కుళోత్తుంగుడు

P.C: You Tube

ఇక్కడ స్వామివారి తొడపైన లక్ష్మీ దేవి కొర్చొని ఉంటారు. ఇటువంటి విగ్రహం చాలా అరుదు. ఇదిలా ఉండగా మూడో కుళోత్తుంగుడు విగ్రహను ప్రతిష్టింపజేసి అక్కడ ఆలయాన్ని నిర్మించాడు.

అనేక ఎకరాల భూమిని

అనేక ఎకరాల భూమిని

P.C: You Tube

అంతేకాకుండా నిత్య ధూప, దీప నైవేద్యం కోసం అనేక ఎకరాల భూమిని ఆ దేవాలయానికి కానుకగా సమర్పించారు. ఇలా ఉండగా అక్కడ ఉన్న ప్రజలు ఈ స్వామి పై విశ్వాసం లేకుండా కొన్నేళ్లపాటు ఆలయంలో ఎటువంటి పూజలు చేయలేదని చెబుతారు.

 ఉదయం నుంచి సాయంత్రం వరకూ

ఉదయం నుంచి సాయంత్రం వరకూ

P.C: You Tube

దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర కరువు కాటకాలతో బాధింపబడింది. చివరికి తమ తప్పును తెలుసుకొన్న ప్రజలు ఆలయాన్ని పునరుద్ధరించి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

అమ్మవారితో కలిసి

అమ్మవారితో కలిసి

P.C: You Tube

ఈ దేవాలయంలోని స్వామివారు స్వయంభువు కాగా, అమ్మవారు స్వామి ఎడమ తొడపై కూర్చొని ఉంటారు. అంతేకాకుండా స్వామివారు అమ్మవారితో కలిసి భక్తుల కోరికలు తీరుస్తుంటారని చెబుతారు.

పంచమహాపాతకాలు

పంచమహాపాతకాలు

P.C: You Tube

ముఖ్యంగా ఈ స్వామివారిని దర్శించుకొంటే పంచ మహాపాతకాలు తొలిగిపోవడమే కాకుండా కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయని చెబుతారు. అందువల్లే నిత్యం ఇక్కడకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక ఈ దేవాలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి.

అష్ట లక్ష్ముల ఆలయాలు

అష్ట లక్ష్ముల ఆలయాలు

P.C: You Tube

ముఖ్యంగా అష్టలక్ష్ముల ఆయాలు చూడదగినవి. ఈ ఆలయంలో దశావతార పుష్కరిణి ప్రత్యేకం. ఒక్కొక్క యుగంలో స్వామివారు ఒక్కొక్క అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. సాధారణంగా ఏ ఆలయంలోనైనా దశావతారాలు వేర్వేరు విగ్రహ రూరంలో కనిపిస్తాయి.

21 అడుగుల విగ్రహం

21 అడుగుల విగ్రహం

P.C: You Tube

అయితే ఈ ఆలయంలోని ఈ పుష్కరిణిలో మాత్రం దశావతారాలు అన్ని ఒకే విగ్రహంలో ఉంటాయి. 21 అడుగులు ఉన్న ఈ విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది. ఇదే పుష్కరిణిలో మనకు శ్రీ క`ష్ణుడి కాళీయమర్థన విగ్రహం కూడా ఆకట్టుకొంటుంది.

త్రిమూర్తులు ఒకే విగ్రహంలో

త్రిమూర్తులు ఒకే విగ్రహంలో

P.C: You Tube

అదే విధంగా ఇక్కడ స్వామివారి నాభి భాగంలో బ్రహ్మదేవుడు కొలువై ఉండగా వక్షస్థలంలో శివుడి రూపం కనిపిస్తుంది. అదే విధంగా ఈ ఆలయానికి దగ్గర్లో దేవ వైద్యుడైన ధన్వంతరీ ఆలయాన్ని చూడవచ్చు. ఇక్కడ ధన్వంతరీ జపం పఠిస్తే దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయని చెబుతారు.

పాపవినాశన వృక్షం

పాపవినాశన వృక్షం

P.C: You Tube

దశావతార పుష్కరిణికి వెళ్లే మార్గంలోనే అతి ప్రాచీన మర్రిచెట్టు ఉంది. దీనిని శాపవిమోచన వ`క్షమని పేరు. ఈ చెట్టు కింద బ్రహ్మదేవుడికి పూజలు జరుగుతాయి. చనిపోయిన వారి ఆత్మలు ఇక్కడికి వచ్చి మోక్షం పొందుతాయాని చెబుతారు. అందుకే ఈ చెట్లకు శాపవిమోచన వ`క్షమని పేరు.

108 సార్లు ప్రదక్షణ

108 సార్లు ప్రదక్షణ

P.C: You Tube

ఈ ఆలయంలోని ఉన్న యోగమందిరం పై భాగంలో సుదర్శన చక్రం, కింది భాగంలో యోగ నరసింహస్వామి ఉంటారు. ఈ విగ్రహం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తూ సుదర్శన మంత్రాన్ని జపించడం వల్ల సమస్త పాపాలు పోతాయని చెబుతారు.

27 నక్షత్రాలకు సంకేతంగా

27 నక్షత్రాలకు సంకేతంగా

P.C: You Tube

ఇక్కడ ఉన్న నక్షత్రవనంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు తమ దేవేరులతో కొలువై ఉంటారు. వారి చుట్టూ నవగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. అంతేకాకుండా 27 నక్షత్రాలకు సంకేతంగా 27 వృక్షాలున్నాయి. అదే విధంగా 33 అడుగుల ఎత్తైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి విగ్రహం కూడా ఆకట్టుకుంటోంది.

వార్షిక బ్రహోత్సవాలు

వార్షిక బ్రహోత్సవాలు

P.C: You Tube

ఈ ఆలయంలో ఉదయం ఐదుగంటలకే మొదలయ్యే పూజా కార్యక్రమాలు రాత్రి ఎనిమిది గంటల వరకూ నిరంతరాయంగా కొనసాగుతాయి. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలో దసరా సయంలో లక్ష్మీనారాయణుడికి వైభవోపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

ఎలా వెళ్లాలి

ఎలా వెళ్లాలి

P.C: You Tube

చిత్తూరుకు 15 కిలోమీటర్లు, తిరుపతికి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయానికి రాష్ర్టంలోని ప్రధాన నగరాల నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. తిరుపతికి వెళ్లినవారిలో చాలా మంది ఇక్కడికి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకొంటూ ఉంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X