Search
  • Follow NativePlanet
Share
» »కోట్లు ఖర్చుచేస్తేనే మీ పెళ్లి

కోట్లు ఖర్చుచేస్తేనే మీ పెళ్లి

అత్యంత ఖరీదైన వివాహ వేదికలకు సంబంధించిన కథనం.

వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొంతమంది వివాహాన్ని చాలా సింపుల్ గా చేసుకొంటారు. మరికొంతమంది దేవాలయాల్లో చేసుకొంటారు. అయితే కొంతమంది మాత్రం తమ వివాహం జీవితాంతం గుర్తుండేలా అత్యంత వైభవంగా జరుపుకోవాలని భావిస్తారు. అందుకు అనువైన స్థలాల కోసం ఎంతైన ఖర్చుచేస్తారు. ఇలా అత్యంత
వైభవంగా రాజుల కాలంలో వలే వివాహాలు జరిగే కొన్ని ప్రాంతాలకు సంబంధించిన వివరాలు మీ కోసం....

లలిత్ మహాల్ ప్యాలెస్

లలిత్ మహాల్ ప్యాలెస్

లలిత్ మహల్ ప్యాలెస్ మైసూరులోని కర్నాటకలో ఉంది. దీనిని వైట్ హౌస్ అని కూడా అంటారు. గతంలో మైసూరు మహారాజులు తమ అతిథులకు ఈ లలిత్ మహల్ ను కేటాయించేవారు. కర్నాటకలో అత్యంత ఖరీదైన వివాహ వేదిక ఇదే.

ఈ దసరాకు మైసూరు వెలితే వీటిని చూడటం మరిచిపోకండిఈ దసరాకు మైసూరు వెలితే వీటిని చూడటం మరిచిపోకండి

నిర్మారాణా కోట

నిర్మారాణా కోట

ఈ ప్యాలెస్ జైపూర్, ఢిల్లీ మార్గమధ్యలో ఉంది. నిర్మారాణా కోట అత్యంత సుందరమైన ప్యాలెస్. సంపన్న వ్యాపార కుటుంబాలకు చెందిన వారు ఎక్కువగా ఈ ప్యాలెస్ లో వివాహం చేసుకొంటూ ఉంటారు. ఇక్కడ వివాహం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

దేవి గ్రా ప్యాలెస్

దేవి గ్రా ప్యాలెస్

రాజస్థాన్ లోని రాజప్రసాదాల్లో దేవిగ్రా ప్యాలెస్ ఒకటి. ఈ ప్యాలెస్ ను 18 వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ రెండు రోజుల వివాహానికి రూ.15 కోట్లకు పైగా వసూలు చేస్తారు. అయినా కనీసం మూడు నెలల ముందుగా వివాహం కోసం ఈ కోటను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఏ నక్షత్రమైనా చింతలేదు. శనిదోష నివారణ ఇక్కడ తథ్యంఏ నక్షత్రమైనా చింతలేదు. శనిదోష నివారణ ఇక్కడ తథ్యం

సిటీ ప్యాలెస్

సిటీ ప్యాలెస్

ఇది కూడా రాజస్థాన్ లోనే ఉంది. దీనిని 17వ శతాబ్దంలో నిర్మించారు. ఒకేసారి 1000 మందికి ఈ ప్యాలెస్ లో ఆతిథ్యం ఇవ్వొచ్చు. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు తమ సంతానం వివాహాన్ని ఎక్కువగా ఇక్కడ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు.

ఒబెరాయ్ ఉదయ్ విలాస్

ఒబెరాయ్ ఉదయ్ విలాస్

ఉదయ్ పూర్ లో ఈ ఒబెరాయ్ ఉదయ్ విలాస్ ఉంది. అత్యంత ఖరీదైన ప్యాలెస్ లలో ఇది కూడా ఒకటి. భారత దేశంలో వివాహాలు జరిగే అత్యంత ఖరీదైన ప్యాలెస్ లలో ఇది కూడా ఒకటి.

ఉమాయిద్ భవన్ ప్యాలెస్

ఉమాయిద్ భవన్ ప్యాలెస్

ఈ ఉమాయిద్ భవన్ ప్యాలెస్ సుమారు 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. భారత దేశంలో అత్యంత ఖరీదైన వివాహాలు జరిగే ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ గార్డెన్ చాలా అందంగా ఉంటుంది.

అజిత్ భవన్ ప్యాలెస్

అజిత్ భవన్ ప్యాలెస్

ఈ ప్యాలెస్ ను అజిత్ సింగ్ రాజ్ కోసం నిర్మించినది. ప్రస్తుతం హోటల్ గా మార్పు చెందింది. ఇక్కడ అత్యంత ఖరీదైన వివాహాలు తరుచుగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ రెండు రోజుల పాటు జరిగే వివాహానికి కనీసం రూ.25 నుంచి రూ.30 కోట్లు ఖర్చవుతుందని చెబుతారు.

తాజ్ హరి మహల్ ప్యాలెస్

తాజ్ హరి మహల్ ప్యాలెస్

తాజ్ హరి మహల్ ప్యాలెస్ దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులోని ఉద్యానవనాలే దాదాపు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. ఇక్కడ వివాహ సమయంలో వధువరులకు కావాల్సిన గుర్రాలు, ఏనుగులు, గుర్రబగ్గీలు ప్యాలెస్ వాళ్లే అందుబాటులోకి తీసుకువస్తారు.

లీలా ప్యాలెస్

లీలా ప్యాలెస్

ఉదయ్ పూర్ లో ఉన్న మరొక ఖరీదైన ప్యాలెస్ పేరు లీలా ప్యాలెస్. ఈ ప్యాలెస్ అద్భుతమైన వాస్తు శైలికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ వివాహ ఖర్చు అక్షరాల రూ.50 కోట్లకు పై మాట అని చెబుతారు. అయితే ఇక్కడ వివాహం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని మాత్రం చెప్పవచ్చు.

నగ్నత్వాన్నీ ఆరాధించేవారున్నారునగ్నత్వాన్నీ ఆరాధించేవారున్నారు

తాజ్ లేక్ ప్యాలెస్

తాజ్ లేక్ ప్యాలెస్

ప్రపంచంలో అత్యంత అందమైన ప్యాలెస్ లలో ఇది కూడా ఒకటి. చుట్టూ నీటి మధ్యన ఉన్న ఈ ప్యాలెస్ లో వివాహం చేసుకోవాలన్నది సంపన్న వర్గాల కల. ఎంత ఖర్చుఅయినా వెనకాడకుండా ఈ ప్యాలెస్ లో వివాహం చేసుకొని వారు మురిసిపోతూ ఉంటారు.

ఉప్పుతో ఆరోగ్యం చీరతో విద్య ఇక్కడ మీకు తథ్యంఉప్పుతో ఆరోగ్యం చీరతో విద్య ఇక్కడ మీకు తథ్యం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X