Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలోని టాప్ 10 కోటలను సందర్శించండి !!

ఇండియాలోని టాప్ 10 కోటలను సందర్శించండి !!

భారతదేశం కోటలకు మరియు స్మారకాలకు పెట్టింది పేరు. ఈ కోటలు అలనాటి చక్రవర్తుల, రాజుల రాజ్యానికి చిహ్నాలు. రాజులు, రాజ్యాలు, రాజ వంశాలు కాల గర్భంలో కలిసిపోయినా వారు వారు నిర్మించిన కట్టడాలు, కోటలు వారి జ్ఞాపకార్థం అవి ఇంకా నిలిచే వున్నాయి. అవి ఆనాటి చరిత్రను, నాగరికతను, అనాటి జనజీవనాన్ని, ఆర్థిక సామజిక పరిస్థితులకు సాక్ష్యాలుగా ఇంకా మిగిలే వున్నాయి. వీటిలో కొన్ని పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. యునెస్కో సంస్థ చేత మన దేశంలో కూడా కొన్ని కోటలు గుర్తించబడ్డాయి. వాటిలో ఆగ్రా కోట మరొకటి ఎర్ర కోట ప్రధానమైనవి. ఈ కోటలు పరిరక్షించడం, రాబోయే తరాలవారికి అందించడం మనకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఈ కోటలలో ఆనాటి రాజులు, చక్రవర్తులు దాచిపెట్టిన నిధులు ఇంకా ఉన్నాయనే నమ్మకంతో వాటిని శిధిలపరుస్తున్నారు. ఏదైతేనేం మనదేశం కోటల దేశం, ప్రపంచంలో ఎక్కడా లేనన్ని కోటలు మన దేశంలో చూడవచ్చు.

ఇది కూడా చదవండి : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని చారిత్రక కట్టడాలు !

ఇక విషయానికొస్తే, మనదేశంలో వివిధ ప్రాంతాలలో వేర్వేరు చోట్ల కోటలు ఉన్నాయి. అందుకే దేశంలోని మొదటి 10 స్థానాలను ఆక్రమించుకున్న కోటలను ఒకసారి సందర్శిద్దాం ...

ఫ్రీ కూపన్లు : థామస్ కుక్ ట్రావెల్ కూపన్లనన్నింటిని సాధించండి

మేహ్రాన్ ఘర్ కోట, జోధ్పూర్

మేహ్రాన్ ఘర్ కోట, జోధ్పూర్

జోధ్పూర్ మేహ్రాన్ ఘర్ 150 మీటర్ల ఎత్తులో ఒక పెద్ద కొండపై నెలకొని వుంది. ఈ అద్భుతమైన కోట ను 1459 లో రావ్ జోదా నిర్మించాడు. ఈ కోటను రోడ్డు మార్గం ద్వారా జోధ్పూర్ నుంచి చేరుకోవచ్చు. ఈ కోటకు దారి తీసే ఏడు ద్వారాలు వున్నాయి - వాటిలోని రెండో ద్వారంలో ఇక్కడ జరిగిన యుద్ధాల్లో ఫిరంగి గుళ్ళు తగిలి దెబ్బ తిన్న గోడల మీద మచ్చలు కూడా చూడవచ్చు. ఈ కోటలోని ఒక భాగం రాచరిక పల్లకీల భారీ సేకరణతో ఒక మ్యూజియంగా మార్చబడింది. 14 ప్రదర్శన గదులు కలిగిన ఈ మ్యూజియం ఆయుధాలతో, ఆభరణాలతో, వస్త్రాలతో అలంకరించబడి ఉంది. అంతేకాకుండా, సందర్శకులు మోతీ మహల్, ఫూల్ మహల్, శీశ మహల్, ఝాన్కి మహల్ వంటి నాలుగు గదులను చూడవచ్చు. ఇక్కడ పర్యాటకులు జోధ్పూర్ రాచరిక సింహాసనం ‘శ్రింగర్ చౌకీ' ని చూడవచ్చు.

Photo Courtesy: Pavan Gupta

ఎర్ర కోట , ఢిల్లీ

ఎర్ర కోట , ఢిల్లీ

నేడు ఎర్రకోట లేదా "లాల్ కిలా" గా పిలువబడే కోటను గతంలో కిలా ఎ మొహాల్ల అని పిలిచేవారు. ఈ కోటను సుమారుగా 17 వ శతాబ్దపు మధ్య భాగం లో నిర్మించారు. ఎర్ర రాతితో నిర్మించిన ఈ కోట ప్రపంచంలోనే సుందరమైనది. ఇది సుమారు 2.41 కి. మీ. ల విస్తీర్ణం కలిగి వుంది. ఎర్ర కోట ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో సంస్థచే ప్రకటించబడింది. అందమైన ఈ నిర్మాణం ఎన్నో అద్భుత కట్టడాలను కలిగి వుంటుంది. ఈ అద్భుతాలలో దివాన్ యి ఆం ఒకటి. ఈ ప్రదేశం లో రాజు ప్రజల సమస్యలను విని పరిష్కరించే వాడు. ప్రైవేటు మీటింగులకు కాన్ఫరెన్స్ లకు దివాన్ యి ఖాస్ అనే భవనం కలదు. చట్టా చౌక్ ప్రదేశం ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ లో ఒక షాపింగ్ ప్రదేశం. ఎర్ర కోటలోని ముంతాజ్ మహల్ మహిళల ప్రైవేటు ప్రదేశం. ఇపుడు దీనిని ఒక మ్యూజియం గా చేసారు. ఎర్ర కోటలో నక్కర్ ఖాన రాచ కుటుంబ సభ్యుల సంగీత వాయిద్యాలకు ఉపయోగించేవారు. ఇపుడు, ప్రతి సంవత్సరం, భారత దేశ ప్రధాన మంత్రి స్వాతంత్ర దినోత్సవం నాడు, దేశ స్వాతంత్రానికి గుర్తుగా జాతీయ పతాకాన్ని ఎగుర వేస్తారు. సాయంకాలంలో సౌండ్ మరియు లైట్ ప్రదర్శనలు నిర్వహిస్తారు.

సందర్శన సమయం : సోమవారాలు తప్ప, వారం లోని మిగిలిన రోజులలో ఉదయం 8 గం. నుండి సాయంకాలం 6 గం. వరకు ఈ కోట తెరిచే వుంటుంది. ఈ కోట సందర్శనకుగాను అవసరమైన సౌకర్యాలుగా గైడ్ లు, ఒక చిన్న కేంటీన్, టాయ్ లెట్లు, వీల్ చైర్ లు , పార్కింగ్ స్థలాలు కలవు.

Photo Courtesy: Rockoprem

గ్వాలియర్ ఫోర్ట్ , గ్వాలియర్

గ్వాలియర్ ఫోర్ట్ , గ్వాలియర్

ఇండియా లోనే అతి పెద్ద చారిత్రక స్మారకం అయిన గ్వాలియర్ ఫోర్ట్ నగరం మధ్య లో ఒక కొండపై వుంది. పూర్తి నగరాన్ని పై నుండి చక్కగా చూపుతుంది. దీని మార్గంలో రాళ్ళ తో చెక్కబడిన జైన తీర్థంకరుల విగ్రహాలుంటాయి. ప్రస్తుత ఈ గ్వాలియర్ కోటను తోమార్ వంశానికి చెందినా రాజా మాన్ సింగ్ తోమార్ నిర్మించాడు. కోట నిర్మాణంలో చైనీయుల శిల్ప తీరు కనపడుతుంది. కోట స్తంభాలపై కల డ్రాగన్లు ఆనాటి చైనా...భారత సంబంధాలను సూచిస్తాయి. గ్వాలియర్ కోటను 'జిబ్రాల్టార్ అఫ్ ఇండియా' అని కూడా అంటారు. ఈ కోట వందల ఏళ్ల పాటు అనేక రాజ వంశాలను చూసింది. ఈ కోట వద్దే రాణి ఝాన్సి, తాంతియా తోపే లు బ్రిటిష్ వారితో భయంకర యుద్ధాలు చేసారు.

Photo Courtesy: Udit Sharma

గోల్కొండ ఫోర్ట్, హైదరాబాద్

గోల్కొండ ఫోర్ట్, హైదరాబాద్

హైదరాబాద్ నగరానికి 11 కిలో మీటర్ల దూరంలో ఉన్న గొల్కండ ఫోర్ట్ లేదా గొల్ల కొండ ఫోర్ట్, గొర్రెల కాపరుల పర్వతాన్ని తెలుపుతుంది. 15 వ శతాబ్దంలో గోల్కొండ ఎంతో కళకళ లాడేది, కానీ ఇప్పుడు శిధిలమవుతున్న పురాతణ వైభవం మాత్రమే కనిపిస్తుంది. 1512 నుండి నగరాన్ని పాలించిన ఖుతుబ్ షా వంశీకుల చేత గోల్కొండ ఫోర్ట్ నిర్మించబడినది. ఉత్తరం నుండి మొఘలుల దాడి నుండి నగరానికి రక్షణ కోసం ఈ ఫోర్ట్ ని నిర్మించారు. ఈ ఫోర్ట్ కున్న ముఖ్యమైన లక్షణం శబ్ద లక్షణ శాస్త్రం. ఈ ఫోర్ట్ వరండాలో నిలుచుని మీరు చప్పట్లు కొడితే ఆ శబ్దం ప్రధాన రహదారి నుండి 91 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశానికి స్పష్టంగా వినబడుతుంది. ఒక రహస్య సొరంగ మార్గం ఈ గోల్కొండ ఫోర్ట్ ని చార్మినార్ తో కలుపుతుందని నమ్ముతారు.

Photo Courtesy: Bgag

జైసల్మేర్ కోట, జైసల్మేర్

జైసల్మేర్ కోట, జైసల్మేర్

నగరం నడిబొడ్డున వుండే జైసల్మేర్ కోటను జైసల్మేర్ కు గర్వ కారణంగా భావిస్తారు. పసుపు రంగు ఇసుకరాయి తో నిర్మించిన ఈ కోట సూర్యాస్తమయం లో బంగారంలా మెరిసిపోవడంతో దీన్ని సోనార్ ఖిల్లా లేదా బంగారు కోట అని కూడా అంటారు. త్రికురా కొండ మీద 1156లో భాటి రాజపుత్ర రాజు జైసల్ దీన్ని నిర్మించాడు. జైసల్మేర్ కోటలో చాల అందమైన భవంతులు, దేవాలయాలు, సైనికులు, వ్యాపారుల నివాస భవనాల సముదాయాలు వున్నాయి. ఈ కోట చుట్టూ 30అడుగుల ఎత్తైన గోడ వుంది. 99 బురుజులు వున్న పెద్ద కోట ఇది. అన్ని ద్వారాల్లోకీ అఖాయి పోల్ తన అధ్బుత నిర్మాణ శైలికి ప్రసిద్ది పొందింది. 1156 లో నిర్మించిన ఈ ద్వార౦ రాజ కుటుంబీకులు, ప్రత్యెక సందర్శకులకు ప్రత్యేకంగా వాడేవారు.ఈ కోటను చేరుకోవడానికి జైసల్మేర్ నుంచి ఆటో లేదా రిక్షా లో వెళ్ళవచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా సందర్శన వేళలు.

Photo Courtesy: Koshy Koshy

ఆగ్రా కోట, ఆగ్రా

ఆగ్రా కోట, ఆగ్రా

కొన్నిసార్లు ఎర్ర కోటగా పిలిచే ఆగ్రా కోట నిర్మాణ శైలి, రూపకల్పన, ఎరుపురంగు వంటి విషయాలలో ఢిల్లీ దిగ్గజ౦, చిహ్నమైన ఎర్ర కోటకు అగ్రగామిగా నిలిచింది. ఈ రెండు కట్టడాలను ఎరుపు ఇసుక రాయితో నిర్మించారు. ఆగ్రాలోని మొదటి ప్రపంచ వారసత్వ ప్రదేశం తాజ్ మహల్ కాగా ఇది రెండవది. దీనిని మొఘల్ చక్రవర్తి అక్బర్ 1565 లో నిర్మించాడు. ఆసక్తికరమైన అంశం, ఈ కోట ద్వారం వద్ద ఉన్న ఒక ఫలకం వాస్తవానికి ఈ కోట క్రీ.శ. 1000 కంటే ముందు నిర్మించారని తెలియచేస్తుంది, అక్బర్ చక్రవర్తి దీనిని కేవలం పునరుద్ధరించాడు. షాజహాన్ దీని పై తిరిగి పాలరాతి, దానిపై చిత్రాల నిర్మాణం చేయించి మరింత మెరుగు పరిచాడు. నెలవంక ఆకారంలో ఉన్న ఈ కోట యమునా నదికి ఎదురుగా ఉంది. ఇది ప్రాకారం, బురుజులు కోవలో రక్షణ గోడ లాంటి నిర్మాణాలను కల్గి ఉంది.

Photo Courtesy: Man Bartlett

రీస్ మేగోస్ కోట, గోవా

రీస్ మేగోస్ కోట, గోవా

ఈ కోటను 1551 లో నిర్మించారు. ప్రస్తుతం కొంత భాగం శిధిలమై ఉన్నప్పటికి పర్యాటకలు దాని ఆకర్షణకు ముగ్ధులవుతారు. పర్యాటకులు అధిక సంఖ్యలో రీస్ మేగోస్ కోటను దర్శిస్తారు. మండోవి నది ఒడ్డున కల ఈ కోట ఎంతో వైభవంగా ఉంటుంది. నదికి ఉత్తరంగా దీనిని సుల్తాన్ అదిల్ షా నిర్మించాడు. ఈ కోటకు వివిధ భధ్రతా గోపురాలు కలవు అవి శత్రువుల కదలికలను కనిపెట్టేందుకు వారికి అప్పట్లో ఉపయోగ పడ్డాయి. అయితే అవి నేడు చక్కటి మండోవి నది పనాజిం నగరం అక్కడి వివిధ నావలు, ఓడలు వంటివి పర్యాటకులకు చూపుతున్నాయి. ఈ కోట నిర్మాణంలో పూర్తిగా లేటరైట్ రాతిని ఉపయోగించారు. ఎరుపు మరియు సాధారణ రాయి రంగులు కలిగి ఉంటుంది. పోర్చుగీసు పాలనలో, రీస్ మేగోస్ కోటను గోవాపై మరాఠా రాజులు దండెత్తకుండా నిలువరించేందుకు వారి ఆచూకీ కనిపెట్టేందుకు ఉపయోగించేవారు. పోర్చుగీసు పాలన అంతం అయిన తర్వాత ఈ కోట కొంత కాలంఒక చెరసాలగా కూడా ఉపయోగించారు.

Photo Courtesy: Rajib Ghosh

చిత్తోర్ ఘడ్ కోట, చిత్తోర్ ఘడ్

చిత్తోర్ ఘడ్ కోట, చిత్తోర్ ఘడ్

శక్తివంతమైన, అద్భుతమైన చిత్తోర్ ఘడ్ కోట చిత్తోర్ ఘడ్ గత వైభవాన్ని వర్ణిస్తుంది. ఇది పట్టణానికి ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఒక జానపథ కథ ప్రకారం మౌర్యులు ఈ కోటను 7 వ శతాబ్దం లో నిర్మించారు. 700 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ నిర్మాణం 180 మీ. ల ఎత్తులో ఒక మిట్టపై ఉంది. ఈ కోటకు వచ్చే మార్గం అంత సులభమైనది కాదు, నిటారైన, మెలికలు తిరిగిన రాచ బాట వెంబడి ఒక మైలు నడవవలసి ఉంటుంది. అనేక అందమైన దేవాలయాలతో బాటుగా బ్రహ్మాండమైన రాణి పద్మిని భవనం, మహారాణ కుంభ భవనం ఉన్నాయి.

Photo Courtesy: Abbysingh

ఫోర్ట్ ఆఫ్ ఝాన్సీ, ఝాన్సీ

ఫోర్ట్ ఆఫ్ ఝాన్సీ, ఝాన్సీ

1613 లో రాతి కొండలపై ఓర్చ్చ కి చెందిన రాజా బీర్ సింగ్ డియో చేత ఈ కోట నిర్మించబడినది. 16 నుండి 20 అడుగుల దట్టమైన గ్రానైట్ గోడ ఈ కోట చుట్టూ కనిపిస్తుంది. ఈ గోడకి ఉన్న పది ద్వారాలకి పరిపాలకుడి లేదా రాజ్యం కి సంబంధించిన పేర్లు పెట్టారు. చాంద్ గేటు, దతియా దర్వాజా, ఝార్నా గేటు, లక్ష్మి గేటు, ఓర్చ గేటు, సాగర్ గేటు, ఖందేరావు గేటు మరియు సైన్యార్ గేటు లు వీటి పేర్లు. 1857 లో స్వాతంత్ర్య సమర పోరాటంలో ఝాన్సీ ఫోర్ట్ ప్రముఖ మైన పాత్ర పోషించింది. ఈ కోట గోడలపై బ్రిటిష్ సైన్యం పై రాణీ పోరాడిన చిత్రాలను గమనించవచ్చు. ఈ కోట లో ఉన్న మ్యూజియం ప్రదర్శితమయిన వాటిలో బ్రిటిష్ సైన్యాన్ని వణికించిన కరక్ బిజ్లీ అనే ఫిరంగి ఉంది.

Photo Courtesy: srkblogs

శ్రీరంగపట్నం కోట, శ్రీరంగపట్నం

శ్రీరంగపట్నం కోట, శ్రీరంగపట్నం

శ్రీరంగపట్నం వచ్చే పర్యాటకులు శ్రీరంగపట్నం కోటను తప్పక సందర్శించాలి. ఈ కోట కావేరీ నది మధ్యన ఒక ద్వీపంలో నిర్మించబడింది. దీనినే టిప్పు సుల్తాన్ ఫోర్ట్ అని అంటారు. దీనిలో భారతీయ ముస్లిం శిల్ప శైలి కనపడుతుంది. దీనికి నాలుగు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. వీటికి ఢిల్లీ, బెంగుళూర్, మైసూర్ మరియు నీరు మరియు ఏనుగు అని పేర్లు. కోటకు ప్రత్యేక ఆకర్షణ అంటే అది ప్రవేశ ద్వారం. దీనిపై పర్షియా భాషలో స్ధాపన తేదీని వ్రాశారు. బ్రిటీష్ పాలకుడు సర్ రాబర్ట్ కెర్ శ్రీరంగపట్నంపై దాడి చేస్తున్న సంఘటనలను అందమైన పెయింటింగ్ లు గా కోట గోడలపై చిత్రీకరించారు. ఈ నిర్మాణంపై శ్రీ మహా విష్ణువు 24 వివిధ అవతారాలను కూడా చెక్కారు. కోట కింది భాగాలను బ్రిటీష్ అధికార్లు జైళ్ళుగా వాడేవారు. కోట లోపల శ్రీరంగనాధ స్వామి దేవాలయం మరియు ఒక మసీదు కూడా ఉంటాయి.

Photo Courtesy: Sivakumar Annamalai R

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X