» »భారతదేశంలోని పది అద్భుత ప్రదేశాలు !!

భారతదేశంలోని పది అద్భుత ప్రదేశాలు !!

Written By: Venkatakarunasri

ప్రపంచంలోని 7 అద్భుతాలంటే మనకి గుర్తుకొచ్చేది చిచేన్ ఇట్జా (మెక్సికో) , క్రైస్ట్‌ ద రిడీమర్ (బ్రెజిల్), కలోసియం (ఇటలీ), గ్రేట్ వాల్ ఆఫ్ (చైనా) , మాచుపిచ్చు (పెరూ) , పెట్రా (జోర్డాన్) మరియు తాజ్ మహల్ (ఇండియా).

ఇది సాధారణంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులు ఎవ్వరైనా చెప్పగలరు. కానీ మనదేశంలో కూడా కొన్ని ప్రపంచంలో మాదిరిగానే కొన్ని అద్భుతాలు ఉన్నాయి.

ఈ ప్రదేశాలు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక నిర్వహించిన ఓటింగ్ లో భారతదేశ పది వింతలుగా ఎంపికయ్యాయి. వారంతపు విహారాలకు అనువైన ఆంధ్రప్రదేశ్ లోని బీచ్ లు అయితే, భారతదేశంలోని పది అత్యద్భుతాలను ఎంపిక చేయడం గొప్ప సాహసంతో కూడిన పనే .

అయినా కూడా దీని కోసం మొదటిసారిగా టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రిక ఒక యస్ యం యస్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించింది, ఇందుకోసం పురాతన లేదా మధ్యయుగ కాలం నాటి సుమారుగా 30 ప్రదేశాలను ఒక జాబితాగా రూపొందించిన ఈ వార్తా పత్రిక, అందులో నుంచి పది అద్భుతాలను ఎన్నుకోవలసిందిగా కోరింది.

ఆవిధంగా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న భారతదేశ పది అద్భుతాలు (అందులో నాలుగు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్) భారత ప్రజల చేత ఎన్నిక కాబడినవే. అద్భుతాలుగా పేర్కొంటూ , ఎంపిక చేసిన జాబితాలో ఘనకీర్తి కలిగిన ఏకశిలా విగ్రహం మొదలుకొని ప్రార్థనా మందిరం, ఒక సమాధి మరియు ఒక విశ్వవిద్యాలయం వరకు చోటు చేసుకున్నాయి. ఇక ఈ అద్భుతాలెంటి ?? అవేక్కాడున్నాయి అనే విషయానికొస్తే ...

భారతదేశంలోని పది అద్భుత ప్రదేశాలు

గోమఠేశ్వర విగ్రహం

గోమఠేశ్వర విగ్రహం

గోమఠేశ్వర విగ్రహం శ్రావణబెళగొళ గా పిలవబడే ఈ ప్రదేశం కర్ణాటక రాష్ట్రంలోని హస్సాన్ జిల్లాలో ఉంది. శ్రావణబెళగొళ పట్టణంలోకి ప్రవేశించకుండానే 17.5 మీటర్ల ఎత్తుగల గోమఠేశ్వర విగ్రహం అలియాస్ బహుబలి విగ్రహం దూరం నుండే కనపడుతుంది. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద ఏక శిలా విగ్రహాలలో ఒకటి.

హర్మందీర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం)

హర్మందీర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం)

పంజాబ్‌లోని అమృతసర్ నగరంలో కొలువైన గోల్డెన్ టెంపుల్ ను శ్రీ హరమందిర్ సాహిబ్ అని కూడా అంటారు. సంవత్సరం పొడవునా లక్షలాది భక్తులు దీనిని సందర్శిస్తారు. అమృతసర్ లో కల ఈ ప్రదేశం 16 వ శతాబ్దంలో అయిదవ సిక్కు గురు గురు అర్జన్ దేవ్ జి నిర్మించారు. 19 వ శతాబ్దపు మొదటి భాగంలో మహారాజ రంజిత్ సింగ్ గురుద్వారా యొక్క పై అంతస్తులను 400 కే జి ల బంగారుతో పూత వేశారు కనుక దీనిని ఇంగ్లీష్ లో గోల్డెన్ టెంపుల్ అంటారు. రెండు అంతస్తులు కల మార్బుల్ నిర్మాణం గురుద్వారా చుట్టూ అమృత సరోవర్ అనబడే కొలను వుంటుంది. పగటి పూట సిక్కుల పవిత్ర గ్రంధమైన ఆదిగ్రంథను ఈ పవిత్రప్రదేశంలో ఉంచుతారు. గోల్డెన్ టెంపుల్ కు నాలుగు ద్వారాలు వుంటాయి. ఇవి మానవ సౌభ్రాతృత్వం మరియు సమానతలు చాటుతాయి. సిక్కులు పవిత్రంగా భావించే ఈ ప్రదేశం జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు తప్పక చూడదగినది.

తాజ్ మహల్

తాజ్ మహల్

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రపంచపు ఏడు వింతలలో ఒకటి అయిన తాజ్ మహల్ ను, మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన అందమైన భార్య ముంతాజ్ మహల్ పైన ఉన్నప్రేమకు గుర్తుగా, ఆమె సమాధిని ఆగ్రా లో నిర్మించారు. భారతీయ, పెర్షియన్ మరియు ఇస్లాం భవన నిర్మాణ శైలుల అత్యుత్తమ లక్షణాలకు ఇది ఒక గొప్ప ఉదాహరణ. దీని నిర్మాణాన్నివేలకొద్ది సేవకులు, కళాకారులు మరియు రాళ్ళతో 1632 లో ప్రారంభించి, 21 సంవత్సరాలలో, 1653 లో పూర్తీ చేశారు. ఈ గొప్ప భవనంలో ముఖ్యమైన ఆకర్షణ అతని భార్య సమాధే. ఒక చదరపు వేదిక పై నిలబెట్టిన, తెల్ల పాలరాయితో సమాధి ఉన్నది ఇది ఒక వంపు తిరిగిన గోపురం కింద ఉంది. తాజ్ మహల్ కూడా సాధారణ మసీదుల రూపకల్పన లాగానే 40 మీటర్ల ఎత్తు సిమ్మెట్రికల్ మినార్లలాగా అలంకరింపబడి ఉన్నది. ఒక్కో మినారెట్ మూడు భాగాలను కలిగి ఉన్నది మరియు రెండు బాల్కనీలు ఉన్నాయి.ఒక కళాత్మకమైన, రమణీయ దృశ్యాలు కలిగిన 300 మీటర్ స్క్వేర్ చార్బాగ్ లేదా తోట ఉన్నది. దీనిలో 16 పూలపరుపులవంటి కాలినదకదారులు ఉన్నాయి.

హంపి

హంపి

ఉత్తర కర్ణాటకలోని ఒక గ్రామంగా ఉన్న హంపి పేరు వింటే చాలు వెంటనే మీకు విజయనగర పట్టణ అందచందాలు, వాటిని చుట్టుముట్టిన ప్రఖ్యాత శిధిలాలు గుర్తుకు వచ్చేస్తాయి. హంపి పట్టణం విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. ఈ పట్టణంలో హోయసలులనాటి శిల్ప సంపద కనపడుతూంటుంది. రాతి శిల్పాలైనప్పటికి సందర్శకులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. హంపి గురించిన కొన్ని వాస్తవాల గురించి రామాయణంలో కూడా చెప్పబడింది. దీనిని ఆనాటి కాలంలో కిష్కింధ అనేవారని చరిత్ర చెపుతోంది. 13 నుండి 16 శతాబ్దాలవరకు విజయనగర రాజుల పాలనలో ఎంతో ఔన్నత్య స్దితిలో రాణించింది. కర్నాటకలోని ప్రధాన నదులలో ఒకటైన తుంగభద్ర ఈ పట్టణం గుండా ప్రవహిస్తుంది. ఎంతో ఆనందింపజేస్తుంది. హంపి పట్టణంలోని దేవాలయాల నిర్మాణానికి గాను విజయనగర రాజులు అక్కడి సమీప కొండల రాళ్ళను చక్కగా చెక్కించి నిర్మించారు. ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అంతర్జాతీయ సంస్ధ యునెస్కో గుర్తించింది. ప్రతి సంవత్సరం వేలాదిమంది పర్యాటకులు దీనిని దర్శిస్తారు. హంపి శిధిలాలు చూడాలంటే, స్ధానికంగా ఒక సైకిల్ అద్దెకు తీసుకొని దనిపై తిరుగుతూ చూస్తే పూర్తిగా వాటిని ఆనందించినవారవుతారు.

కోణార్క్

కోణార్క్

ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోణార్క్ స్మారక కట్టడాలు కలిగిన అందమైన పట్టణం. మనోహరమైన బే ఆఫ్ బెంగాల్ సముద్రతీరంకి ఎదురుగా ఉన్న ఈ చిన్న పట్టణంలో భారత దేశం యొక్క అత్యధ్బుతమైన నిర్మాణ సౌందర్యాలను గమనించవచ్చు. కోణార్క్ ఓడిశా ఆలయం యొక్క నిర్మాణ సౌందర్యాన్ని ప్రదర్శిస్తుంది. కోణార్క్ నగరం యొక్క అందం రాతి పై చెక్కబడినది. అంతేకాకుండా, ఈ ప్రాంతాన్ని మానవుడి భాషని ఓడించే రాతి భాష గా అభివర్ణిస్తారు. ఈ పట్టణం అద్భుతమైన నిర్మాణం కలిగిన సన్ టెంపుల్ కి ప్రసిద్ది. నిజానికి కోణార్క్ అనే పేరు కోణ అనబడే సంస్కృత పదం నుండి వచ్చింది. కోణ అంటే కోణము అర్క అంటే సూర్యుడు. సూర్యుడికి అంకితమివ్వబడిన ఆలయం అందమైన ఆలయం తో ఈ పేరు వచ్చింది. ఈ సన్ టెంపుల్ సముదాయం లో మాయాదేవి మరియు వైష్ణవ టెంపుల్ మందిరాలు కలవు. కోణార్క్ ప్రధాన దైవం కి అంకితమివ్వబడిన ఆలయం రామచండి టెంపుల్.

నలంద

నలంద

నలంద అనేది ప్రస్తుతం బీహార్‌లోని పాట్నాలో ఉన్న విశ్వవిద్యాలయం . ఈ విద్యాలయం ప్రపంచంలో ఉన్న అతి ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి. నలంద అంటే మీకు తెలుసా? సంస్కృతంలో నలంద అంటే జ్ఞానాన్ని ఇవ్వడం అర్థం. క్రీస్తుశకం 427 నుండే నలంద బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా వెలుగొందింది. ఇది లిఖిత చరిత్రలో ప్రపంచంలోనే తొట్ట తొలి విశ్వవిదాలయాలలో ఒకటి. టిబెట్, చైనా, టర్కీ, గ్రీసు మరియు పర్షియా మొదలైన సుదూర ప్రాంతాల నుండి విద్యార్థులు, పండితులు జ్ఞానం కోరకు ఇక్కడకు వస్తారు. ఇది ప్రపంచంలో మొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయంగా ఉన్నది. బుద్ధుడు చాలాసార్లు నలంద చుట్టు పక్కల ప్రాంతంలో తిరిగాడని, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడని అంటారు. బుద్ధుడు అనేక పర్యాయములు నలందలో ఉన్నాడని చరిత్ర చెబుతోంది. ఆయన నలందను సందర్శించినప్పుడు అక్కడ ఉన్న మామిడితోపులో బస చేసేవాడట. బుద్ధుడు మగధ గుండా తన చివరి యాత్రలో నలందను సందర్శించాడు.

ఖజురహో

ఖజురహో

ఖజురహో మధ్య ప్రదేశ్లోని బున్దేల్ఖండ్ ప్రాంతంలో ఉన్నది. ఖజురహో గొప్ప దేవాలయాలను కలిగి ఉన్నందున, ఈ గ్రామం పేరు ప్రపంచపటంలోకి ఎక్కింది. ఇక్కడ ఇసుకరాళ్ళతో మలచబడ్డ దేవాలయాలు, మరియు ప్రత్యేకమైన మరియు శృంగారభరితమైన శిల్పాలతో ఖజురహో పర్యాటకరంగం అభివృద్ధి చెందుతున్నది. ఖజురహోలోని దేవాలయాలను క్రి.శ. 950-1050లలో ఇండియా మధ్య భూభాగాన్ని పరిపాలించిన చందేల పాలకులు కట్టించారు. ఖజురహోలో ఉన్న 85 దేవాలయాలలో కేవలం 22 దేవాలయాలు మాత్రం కాలగమనంతో పాటు జీవించి ఉన్నాయి. మానవ భావోద్వేగాలను రాతిమీద మరియు అందమైన శిల్పాల రూపాలలో నమ్మలేనివిధంగా మలిచి, ప్రపంచ ఊహాత్మక శక్తిని ఆకర్షింపచేశారు. ఈ దేవాలయాలను 1986లో యునెస్కో సంస్థ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించారు.

మీనాక్షి టెంపుల్

మీనాక్షి టెంపుల్

మదురై, దక్షిణ భారతం, తమిళనాడులో రెండవ పెద్ద నగరం. ఈ ఆలయ నగరం వైగై నది ఒడ్డున ఉన్నది మరియు ఇక్కడ జనావాసాలు ఎక్కువగా ఉండే పురాతన నగరాలలో ఇది ఒకటి. ఈ నగరానికి మదురై అనే పేరు 'మధుర' అనే మాట నుండి వొచ్చింది. మధుర అంటే 'తీపి' అని అర్థం. ఈ నగరం మీద శివుడు దివ్యమైన తేనె వర్షం కురిపించాడని చెపుతారు. మీనాక్షి అమ్మన్ టెంపుల్ లేదా మీనాక్షి టెంపుల్ లో శివ భగవానుడు మరియు మీనాక్షి అనబడే మాత పార్వతి వుంటారు. ఈ టెంపుల్ మదురై లోనే కాదు, దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి. పురాణాల మేరకు మాత నివాస మైన మదురై ని శివుడు ఆమెను వివాహం చేసుకునేటందుకు సందర్శించాడు. దీనిని క్రి.శ.2500 సంవత్సరం లో నిర్మించారు. ఈ టెంపుల్ కాంప్లెక్స్ సుమారు 6 హెక్టార్ లలో విస్తరించి వుంది. దీనికి 12 గేటు లు వుంటాయి. ఈ టెంపుల్ దాని అద్భుత శిల్పశైలి కి ప్రసిద్ధి. టెంపుల్ ప్రవేశ గోపురాలు సుమారు 45 - 50 మీ. ల ఎత్తులో వుంటాయి. వాటి పై దేవుళ్ళు మరియు దేవతల మూర్తులు చెక్కి వుంటాయి. టెంపుల్ లో 985 స్తంభాలు, 14 గోపురాలు కలవు.

జైసల్మేర్ కోట

జైసల్మేర్ కోట

నగరం నడిబొడ్డున వుండే జైసల్మేర్ కోటను జైసల్మేర్ కు గర్వ కారణంగా భావిస్తారు. పసుపు రంగు ఇసుకరాయితో నిర్మించిన ఈ కోట సూర్యాస్తమయంలో బంగారంలా మెరిసిపోవడంతో దీన్ని 'సోనార్ ఖిల్లా' లేదా 'బంగారు కోట' అని కూడా అంటారు. త్రికురా కొండ మీద 1156లో భాటి రాజపుత్ర రాజు జైసల్ దీన్ని నిర్మించాడు. జైసల్మేర్ కోటలో చాల అందమైన భవంతులు, దేవాలయాలు, సైనికులు, వ్యాపారుల నివాస భవనాల సముదాయాలు వున్నాయి. ఈ కోట చుట్టూ 30అడుగుల ఎత్తైన గోడ వుంది. 99 బురుజులు వున్న పెద్ద కోట ఇది. ప్రస్తుతం నగరంలోని పావు భాగం జనాభా ఇక్కడే వుంటున్నారు. కోట సముదాయం లోని అసంఖ్యాకమైన బావులే వీళ్ళ నీటి అవసరాలకు ప్రధాన వనరు. ఈ కోటను చేరుకోవడానికి జైసల్మేర్ నుంచి ఆటో లేదా రిక్షా లో వెళ్ళవచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా సందర్శన వేళలు.

మొట్ట మొదటి సూర్యోదయ ప్రదేశం

మొట్ట మొదటి సూర్యోదయ ప్రదేశం

తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది భారత దేశంలోనే మొట్ట మొదటి సూర్యోదయ ప్రదేశం. క్రీ.శ. 1860-1861 సంవత్సరంలో మేరాక్ లామా లోడ్రే స్థాపించిన ఈ తవాంగ్ ఆశ్రమం ఏషియా లో రెండవ అతిపెద్ద, భారతదేశంలో అతిపెద్ద ఆశ్రమం. గల్దేన్ నామ్గ్యాల్ ల్హాత్సే అనికూడా పిలువబడే ఈ ఆశ్రమం కొండమీద సముద్రమట్టానికి 10,000 అడుగుల ఎత్తున ఉంది. 28 అడుగుల ఎత్తులో ఉన్న బంగారపు బుద్ధుని విగ్రహం, గంభీరమైన మూడు అంతస్తుల అసెంబ్లీ హాలు ఈ ఆశ్రమ ప్రధాన ఆకర్షణలు. ఈ ఆశ్రమంలో ప్రాచీన పుస్తకాలు, 17 వ శతాబ్దానికి చెందినవిగా భావించే చేతివ్రాతల ఆకర్షణీయమైన సేకరణలతో ఒక పెద్ద లైబ్రరీ కూడా ఉంది. ఈ ఆశ్రమ స్థాపకుడైన మేరాక్ లామా, దీనిని నిర్మించడానికి ఎంతో కష్టంతో స్థలాన్ని వెతుకుతున్నపుడు ఒక పౌరాణిక గుర్రం ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసిందని నమ్మకం. తవాంగ్, "త" అంటే అర్ధం గుర్రం, "వాంగ్" అంటే అర్ధం ఆశీస్సులు అనే రెండుపదాల సేకరణ. ఈ స్థలం దైవ సంబంధ గుర్రంచే అశీర్వదించబడటం వల్ల, తవాంగ్ అనేపదం వాడుకలోకి వచ్చింది.