Search
  • Follow NativePlanet
Share
» »అఘోరాలు - రహస్య ఆలయాలు !

అఘోరాలు - రహస్య ఆలయాలు !

By Mohammad

బట్టలు వేసుకోకుండా, పుర్రెలో ఆహారాన్ని భుజిస్తూ, వింత ఆకారాలలో, ఏపుగా పెరిగిన గోళ్ళతో, వెంట్రుకలతో, దేహం నిండా బూడిద ను రాసుకొని కనిపించే వారిని సాధువులు లేదా అఘోరీలు అంటారు. వీళ్ళను చాలా పవర్ ఫుల్ అంట. అరుంధతి సినిమాలో అనుష్క కు పరపతిని చంపే ఆయుధాన్ని వీళ్ళే తయారుచేసిచ్చింది గుర్తొచ్చిందా ? అది సినిమాలెండీ!. కానీ వీళ్ళు నిజంగా చాలా శక్తి గలవారు.

హిమాలయాల్లో, గడ్డ కట్టే చలిలో ఆవాసాలను ఏర్పాటుచేసుకుని దేవుని ఉపాసనే ప్రాణంగా బ్రతికే అఘోరాలు ఒక్కొక్కరు 100 కు తగ్గకుండా బ్రతుకుతారు. వీరిలో కొందరు 150 ఏళ్ళు బ్రతికితే, మరికొందరు 250 ఏళ్ళు కూడా బ్రతికిన దాఖలాలు ఉన్నాయి. వినటానికి ఇది వింతగానే ఉన్నా ఇదే నిజం.

ఇది కూడా చదవండి : మహిళలు ప్రవేశించకూడని 10 ఆలయాలు !

అఘోరాలు శివ భక్తులు, కాళీ మాత ఉపాసకులు కూడా ! వీరు చావుకు ఏమాత్రం భయపడరు మరియు పునర్జన్య ఉందని భావిస్తారు. కొందరు అఘోరాలు చనిపోయిన శవాల వద్ద పడుకోవడం, తినటం, శవాలతో శారీరక కోరికలను తీర్చుకోవటం చేస్తారు. కాశీ లో ఎక్కువగా కనిపించే వీరు శివరాత్రి, కుంభమేళా, పుష్కరాలలలో పాల్గొంటారు.

విధ్యాంచల్ పార్వతీదేవి

విధ్యాంచల్ పార్వతీదేవి

ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాలో మాతా, దుర్గా అవతారంలో మహిషాసురుడిని చంపిన తర్వాత.. ఇక్కడ వెలసినట్లు చెబుతారు. ఈ ఆలయం చుట్టుపక్కల అనేక గుహలు ఉంటాయి. ఇందులో అఘోరీలు ధ్యానం చేస్తుంటారని చెబుతారు.

కాళీ మాత, గుప్తకాశీ

కాళీ మాత, గుప్తకాశీ

శక్తిపీఠాల్లో ఒకటిగా భావించే కాళీ మాత ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ జిల్లాలోని గుప్త కాశీ సమీపంలో కలదు. ఇది కేదార్నాథ్ కు సమీపాన కలదు. కాశీ విశ్వనాథ్ ను పోలిన పురాతన విశ్వనాథ ఆలయం చూడవచ్చు. దేశమంతా తిరిగే అఘోరీలు ఇక్కడ ఆశ్రయం పొందుతారని నమ్మకం.

చిత్రకృప : Mike Behnken

కపలీశ్వర్ లేదా కపాలీశ్వర్, మైలాపూర్

కపలీశ్వర్ లేదా కపాలీశ్వర్, మైలాపూర్

చెన్నై సమీపాన ఉన్న మైలాపూర్ వద్ద కపలీశ్వర్ ఆలయం కలదు. మొన్న వచ్చిన రజినీకాంత్ 'కబాలి' సినిమా పేరు ఈ ఆలయం పేరుమీదనే వచ్చిందట. అఘోరీలకు ఈ ఆలయం ప్రత్యేకం. దీనికి దగ్గరలోఒక ఆశ్రమం, సమాధులు ఉంటాయి. వీటిలోపల అఘోరీలు తమ మంత్రతంత్రాలు చేస్తూ ఉంటారట.

చిత్రకృప : PlaneMad

తారాపీఠ్, బిర్బమ్ జిల్లా

తారాపీఠ్, బిర్బమ్ జిల్లా

పశ్చిమ బెంగాల్ బిర్బమ్ జిల్లాలో తారాపిత్ శక్తి ఆవిర్భావం చేసిన తారా దేవతకు(సతీ దేవతకు) అంకితం చేయబడిన తాంత్రిక ఆలయం ఉన్నది. ఆలయం చుట్టూ అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో అఘోరీలు తమ తంత్రమంత్రాలు చేస్తూ ఉంటారు.

చిత్రకృప : Sergio Carbajo

కాళీ మందిరం, కలకత్తా

కాళీ మందిరం, కలకత్తా

కలకత్తా లో కాళీమాత గుర్తొచ్చిందా ! దక్షిణేశ్వర్ కి దగ్గరలో ఉంటుంది. కాళీమాత నాలుగో వేలు ఇక్కడ పడిపోయిందట. ఈ ఆలయం చుట్టుపక్కల అనేకమంది అఘోరీలు రాత్రుళ్ళు వచ్చి ధ్యానాలు,తంత్రాలు చేస్తుంటారు.

చిత్రకృప : Archit Ratan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X