Search
  • Follow NativePlanet
Share
» »చలికాలంలో కేరళ అందాలు చూసొద్దాం?,

చలికాలంలో కేరళ అందాలు చూసొద్దాం?,

చలికాలంలో కేరళలో చూడదగిన పర్యాటక ప్రాంతాల వివరాలు.

మంచుకురిసే సూర్యోదయం సమయంలో, నింగినితాకే పచ్చటి పర్వతాలను చూస్తూ గడపడం ఎంతోమందికి ఇష్టం. ఇలాంటి ప్రకతి రమణీయత దష్యాలు మనకు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే గాట్స్ ఓన్ కంట్రీగా పేరుగాంచిన కేరళలో మాత్రం ఇలాంటి రమణీయతకు కొదువులేదు. అయితే ఇందుకు మీరు కొంచెం సాహసం చేయాల్సి ఉంటుంది. చలికి ముసుగు తన్ని పడుకోకుండా ప్రకతి రమణీయతను ఆస్వాధించడానికి కేరళా వెళ్లాల్సిందే. ముఖ్యంగా చలికాలంలో చూడదగిన ఎన్నో ప్రాంతాలు అక్కడ ఉన్నాయి. అందులో ముఖ్యమైన కొన్ని పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన వివరాలు...

మున్నార్

మున్నార్

P.C: You Tube

దక్షిణభారతదేశంలో అత్యంత అందమైన హిల్‌స్టేషన్స్‌లలో మున్నార్ ముందువరుసలో ఉంటుంది. ఈ హిల్‌స్టేషన్ లో అక్టోబర్ నుంచి మే నెల వరకూ పర్యటించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ ప్రాంతం మొత్తం ఎక్కడ చూసినా పచ్చగా ఉంటూ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా టీ తోటల్లో పర్యటన మరుపురాని ఆనందాలను మిగుల్చుతుంది.

కొచ్చి.

కొచ్చి.

P.C: You Tube

కేరళాలోని కరావళి ప్రాంతం కొచ్చి. కొచ్చిని సందర్శించడానికి చలికాలం సరైన సమయం అని చెబుతారు. ముఖ్యంగా వీకెండ్ రోజుల్లో ఇక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు. ఇక్కడ బ్రిటీష్, డచ్, పుర్చుగీస్ సంస్క`తి ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడి భవంతుల వాస్తుశైలి ముగ్దులను చేస్తుంది.

కోవళం

కోవళం

P.C: You Tube

కోవళం అనే పదం కంటే కోవళం బీచ్ ప్రపంచ వ్యప్తంగా అత్యంత ప్రాచూర్యం పొందింది. అందువల్లే విదేశీయుల్లో ఎక్కువ మందిసందర్శించే భారతదేశంలోని బీచ్‌లలో కోవళం బీచ్‌ ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి.

వయనాడ్

వయనాడ్

P.C: You Tube

వయనాడ్ కూడా ఒక ప్రముఖ హిల్‌స్టేషన్. ఇక్కడ పచ్చటి పర్వత శ్రేణులతో పాటు గలగల పారే జలపాతాలు కూడా మన దేహంతో పాటు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇక్కడికి దగ్గర్లో ఉన్న ఎడక్కల్ గుహలు, బెంబ్రా ట్రెక్కింగ్ స్పాట్, పూకట్ సరోవరం, బాణాసుర జలాశయం తదిరాలన్నీ కూడా మంచి పర్యాటక కేంద్రాలే. కనీసం రెండు రోజులు ఇక్కడ గడిపితేనే ఈ అందాలన్నింటిని మనం సొంతం చేసుకోవడానికి వీలవుతుంది.

వర్కళ

వర్కళ

P.C: You Tube

పర్వత పంక్తుల అందాలతో పాటు సగరతీరం గలగలను కూడా ఆస్వాధించాలనుకొనేవారికి వర్కళ అత్యుత్తమ పర్యక ప్రదేశం. ఇది చారిత్రాత్మకంగా కూడా ఎంతో ప్రధాన్యత సంతరించుకొన్నది. ఇక్కడి కోటలు అప్పటి భారతీయ చరిత్రకు నిలువుటద్దాలు. ఇక ఇక్కడి సాగర తీరంలో ఎన్నో జలక్రీడలు అందుబాటులో ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X