Search
  • Follow NativePlanet
Share
» »అలహాబాద్ లో గంగ,యమున,సరస్వతి సంగమం, శయనస్థితిలో హనుమాన్ ను చూడటానికి రెండు కళ్ళు చాలవు

అలహాబాద్ లో గంగ,యమున,సరస్వతి సంగమం, శయనస్థితిలో హనుమాన్ ను చూడటానికి రెండు కళ్ళు చాలవు

భారత దేశంలో అలహాబాద్ ఒక ప్రధాన యాత్రా స్థలంగానే కాదు, దేశంలోనే అభివృద్ధి చెందుతున్న యాత్రా కేంద్రంగా ఉంది. మరి ఇంత ప్రత్యేకత ఉన్న అలహాబాద్ ను సందర్శించకపోతే ఎట్లా..?అలహాబాద్ తో పాటు మరికొన్ని ఇతర ప్రద

అలహాబాద్ కు ఒరిజినల్ పేరు ప్రయాగ్. ఈ నగరం సాంస్కృతిక గుర్తింపుకు పునరుద్ధరించడం చాలా మంచి విషయం. ప్రయాగ్ రాజ్ అనే పేరు ఒక హిందు పుణ్యక్షేత్రం అన్నదాన్ని ప్రతిఫలిస్తుంది. ప్రయాగ హిందువుల పుణ్యక్షేత్రాలలో ప్రముఖమైనది. సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మొట్టమొదటి యాగాన్ని ప్రయాగలో చేశారని హిందువుల నమ్మకం. హిందువుల ప్రముఖ తీర్థయాత్రా స్థలంగా ఈ పేరును పునరుద్ధరించడం జరిగింది. హిందు మతంలో అలహాబాద్ కు చాలా ఉన్నత స్థానం ఉంది. ఎందుకంటే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఇక్కడ గంగ, యమున సంగమ ప్రాంతంలో కుంభమేళా జరుగుతుంది. ప్రపంచంలోని నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఈ కుంభమేళాలో పాల్గొంటారు.

గంగా, యమున, సరస్వతి అనే మూడు నదుల సంగమం ఈ నగరంలో ఉంది. అలహాబాద్ ను దేశంలోనే రెండవ అతి పురాతన నగరంగా పరిగణించబడుతుంది. ఈ నగరం యొక్క మూలాలు వేద కాలం నాటివిగా గుర్తించారు. 1583లో మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ చేత ఈ నగరం పేరును అలహాబాద్ లేదా లియాహా బాద్ గామార్చబడినది. అలహాబాద్ ను ఉర్దూ లో 'గార్డెన్ ఆఫ్ అల్లాహ్ 'అంటారు.

భారత దేశంలో అలహాబాద్ ఒక ప్రధాన యాత్రా స్థలంగానే కాదు, దేశంలోనే అభివృద్ధి చెందుతున్న యాత్రా కేంద్రంగా ఉంది. మరి ఇంత ప్రత్యేకత ఉన్న అలహాబాద్ ను సందర్శించకపోతే ఎట్లా?అలహాబాద్ లో తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలు గంగ, యమున, సరస్వతితో పాటు మరికొన్ని ఇతర ప్రదేశాలు కూడా ఉన్నాయి. అవి..

త్రివేణి సంగం:

త్రివేణి సంగం:

అలహాబాదు సందర్శించడానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి త్రివేణి సంగం, భారత దేశంలో ఇది గంగా, యమున మరియు సరస్వతి అను మూడు ప్రధాన నదుల సంగమం పాయింట్. ఈ మూడు నదులు ఒక్కో నదికి ఒక్కో గుర్తింపు ప్రత్యేకంగా ఉన్నాయి. మూడు నదులు నీరు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నీరు వేరు వేరు రంగుల స్పష్టంగా కనబడుతాయి. గంగ నుండి నీరు చాలా స్వచ్చంగా ఉంటాయి. యమునా నది నీరు కొద్దిగా ఆకుపచ్చని రంగులో కనబడుతాయి. సరస్వతి నదిలోని నీరు కాస్త అడుగున ఉంటాయి. ఈ మూడు నదులలో సరస్వతి నది అంతర్వాహిని. ఇది పైకి కనబడదు. ఈ త్రివేణి సంగమంలో స్నాన మాచరించడము చాలా పుణ్య దాయకమని నమ్మకం. ఈ ప్రదేశంలో ప్రతి 12 సంవత్సరాలకొకసారి జరిగే కుంభమేళ ప్రధాణ ఆకర్షణ.
PC: పార్థ సారథి సహన

అలహాబాద్ కోట :

అలహాబాద్ కోట :

అలహాబాద్ కోట చాలా పురాతనమైనది. ఈ కోటను అశోకుడు నిర్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి, అయితే ఈ కోటను పునరుద్దించినద మాత్రం మొఘల్ చక్రవర్తి అయిన అక్భర్. ఈ కోట త్రివేణి సంగమం వద్ద ఉంది. ఈ కోటను అక్బర్ నిర్మించిన అతి పెద్ద కోటగా భావిస్తారు. ఈ కోట సముదాయంలో మూడు అతి పెద్ద గ్యాలరీలు కాపలా ఉన్న హై వాచ్ టవర్లు ఉన్నాయి. ఈ కోటలోపల ముఖ్యమైన నిర్మాణాలలో మహిళల జానపదమైన జననా ప్యాలెస్, సరస్వతి కూప్, సరస్వతి నదికి మూలం మరియు 3వ శతాబ్దపు అశోక పిల్లర్. ఈ సముదాయం దక్షిణ సరిహద్దు వెలుపల నుండి చూడగలిగే అక్షయవట్ అని పిలువబడే అమర్త్య చెట్టుకు నిలయంగా ఉంది.

PC: శరద్ కుమార్

ఖుస్రో బాగ్ :

ఖుస్రో బాగ్ :

మొఘలుల శిల్ప శైలిలో నిర్మించిన మూడు సమాధులకి ఈ గుడి ఉంది. ఈ మూడు సమాధులు చక్రవర్తి జహంగీర్, ఖుసరు మిర్జా మరియు అతని మొదటి భార్య షా బేగం మరియు అతని కుమార్తెకు చెందినవి. ఖుస్రో బాగ్ తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఖుసరు మిర్జా పేరు పెట్టారు, చివరికి అతని మరణానికి దారితీసింది మరియు అతనితో పాటు తన ఇతర కుటుంబ సభ్యులను ఖననం చేయబడ్డాడు. ఈ నిర్మాణం రాతిశిల్పాలతో అందంగా చెక్కిబడిన ఈ మూడు సమాధులు మొఘల్ కళకు, వాస్తుశిల్పానికి ఉదాహరణలు. జహంగీరు ఈ సమాధులను దేశంలోని ఉత్తమ కళాకారుల ద్వారా నిర్మించాడని చెప్తారు.
PC: Oo91

ఆనంద భవనం

ఆనంద భవనం

అలహాబాద్ లో మరో చూడదగ్గ ప్రదేశం ఆనంద భవనం. ఇది 1930లో మోతీలాల్ నెహ్రూ కుటుంబానికి నివాసంగా నిర్మించారు. ఆనంద్ భవన్ నుండి ఈ భవనానికి స్వరాజ్ భవన్ అని పేరు పెట్టారు. ఈ భవనంను 1970లో ఇందిరా గాంధీ చేత భారతీయ ప్రభుత్వానికి అప్పగించారు. ప్రసుత్తం ఇందులో ఎవరూ నివసించకపోయినా, ఇది ఒక సందర్శన స్థలంగా ఒక మ్యూజియంగా నిర్వహించబడుతోంది. ఈ ప్రదేశంలో జవహర్ ప్లానిటోరియం ఉంది, ఇది 1979 లో నిర్మించబడింది, అలహాబాద్ లో తప్పనిసరిగా సందర్శించాల్సిన వాటిలో ఆనంద్ భవన్ ఒకటి.

PC: గురుప్రీత్ సింగ్ రాంచీ

ఆల్ సెయింట్స్ కేథడ్రల్

ఆల్ సెయింట్స్ కేథడ్రల్

ఆల్ సెయింట్స్ కేథడ్రల్ చర్చ్ ని బ్రిటీషు వారు నిర్మించారు. 1887లో నిర్మించిన ప్రసిద్ద చర్చి. ఈ చర్చి మొత్తం నిర్మాణం నాలుగు సంవత్సరాల తరువాత పూర్తయింది. ఈ నిర్మాణం 13 వ శతాబ్దంలో సున్నితమైన గోతిక్ శైలిలో బ్రిటిష్ వారిచే రూపొందించబడినది. ఈ చర్చ్ భవనం ఎత్తు 31 మీటర్ల ఎత్తు ఉంది. ఈ భారీ నిర్మాణం సుమారు 1250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ చర్చ్ లో దాదాపు 400 మందికి వసతి కలదు. ఇది భారతదేశంలోని కాలనీల పాలనలో అత్యంత అందమైన భవనాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కేథడ్రల్ క్వీన్ విక్టోరియా మరియు లాంతరు టవర్ కు అంకితమిచ్చిన స్మారక చిహ్నాన్ని కలిగి ఉంది.
PC: ptwo

చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ :

చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ :

చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ , ఒక హిస్టారికల్ పార్క్. చాలా అందమైనటువంటి ప్రదేశం. అలహాబాద్ యాత్ర వెళ్ళనప్పుడు ఈ ప్రదేశాన్ని ఎట్టిపరిస్థితిలో మిస్ చేయకండి. అలహాబాదులో ఉన్న ఆల్ఫర్డ్ పార్కులో 1931లో తిరుగుబాటుదారుడైన చంద్రశేఖర్ ఆజాద్ తనను బ్రిటిష్ పోలీస్ చుట్టుముట్టిన సమయంలో తనను తాను కాల్చుకుని మరణించాడు. ఈ పార్క్ చాలా పెద్దది.

PC : Maini vaibhav

అలహాబాద్ మ్యూజియం:

అలహాబాద్ మ్యూజియం:

1931లో అలహాబాద్ మ్యూజియంను నిర్మించారు. ఈ మ్యూజియం సూఖీ కళకి ప్రత్యేక వస్తువల పరంపరలో ఒకటిగా ఖ్యాతిగాంచినది. అలహాబాద్ నగరంలో మరో ప్రధాణ ఆకర్షణ అయిన చంద్రశేఖర్ ఆజాద్ పార్కుకి దగ్గరలో ఉంది. ఈ మ్యూజియంలో 18వ శతాబ్దపు పురావస్తు అన్వేషణలకు అంకితమయిన ప్రత్యేక గ్యాలరీలు. ఈ మ్యూజియంలో చరిత్రకు సంబంధించిన సహజ ప్రదర్శనలు, ఆర్ట్ గ్యాలరీ, టెర్రకోట కళాఖండాలు కలిగి ఉన్నాయి. జవహర్ లాల్ నెహ్రుకి సంబంధించిన కొన్ని పాత్రలను, వ్యక్తిగత వస్తువులను ,భారత స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన వస్తువులను కూడా ఈ మ్యూజియంలో ప్రదర్శనార్థం ఉంచారు.కుషాన, గుప్తుల కాలంనాటి బంగారు నాణాలు, పురాతన భారత నాణాలను సేకరించడం మరో అద్భుత ఘట్టం.

హనుమాన్ మందిర్:

హనుమాన్ మందిర్:

అలహాబాద్ హనుమాన్ మందిర్ కి చాలా ప్రత్యేకత ఉంది, ఈ మందిరంలోని హనుమంతుడు నేలమీద పడుకొన్న పొజిషన్ లో ఉంటాడు. సాధారణంగా ఎక్కడైనా సరే హనుమంతుడు నిల్చున్న పొజీషన్ లోనే కనబడుతాడు. కానీ ఈ మందిరంలో ఇలా హనుమంతుడు దర్శనమివ్వడం ఒక్కింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ హనుమాన్ మందిరం సంగమం మరియు ఫోర్ట్ ప్రయాగ(అలహాబాద్ )కు చాలా దగ్గరగా ఉంది. ఈ మూడు ప్రదేశాలను ఒకేసారి సందర్శించవచ్చు. ఈ టెంపుల్లో హారతి ఇచ్చే సమయంలో దర్శించండి చాలా అద్భుతంగా ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X