Search
  • Follow NativePlanet
Share
» »ఈ పండగ సీజన్ లో మీరిక్కడ ఉన్నారా ?

ఈ పండగ సీజన్ లో మీరిక్కడ ఉన్నారా ?

By Mohammad

ఎప్పుడూ అదే ప్లేస్ లో లేవటం, అదే ఇల్లు, అదే ఆఫీస్, అవే మొఖాలు ఎప్పుడూ ఉండేదేగా ! కాస్త ఈ రొటీన్ జీవనానికి టాటా చెప్పి ఎటైనా హాయిగా వెళ్ళిరావాలని మీకు అనిపించడం లేదూ ! మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే లగేజి సర్దుకొని వాలిపోండి ఇక్కడికి.

వస్తున్నది పండుగల సీజన్. కనుక, సెలవులలో పిల్లలతో కలిసి ఎటైనా వెళ్లి గడపటానికి మీ నేటివ్ ప్లానెట్ కొన్ని ప్రదేశాలను మీకు అందిస్తున్నది. ఇక్కడ ఉత్సవాలు, పండుగలు ఘనంగా జరుపుతారు. మీరూ వీలైతే ఆ పండుగలను, సంప్రదాయాలను చూడవచ్చు. ఈ పండుగలు మన ఊర్లలో చేసుకొనే మాదిరి ఉండవు భిన్నంగా ఉంటాయి. మనకు కొత్తగా అనిపిస్తుంది కనుక ఎంజాయ్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి : సావో జావో - వినోదం, ఉల్లాసం, ఉత్సాహం !

అహ్మదాబాద్

అహ్మదాబాద్

అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలో కలదు. నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఇక్కడి స్థానికులు సంప్రదాయ దుస్తులను ధరించి నృత్యం చేస్తారు. మీరు ఈ దండియా పార్టీలలో సరదాగా పాల్గొని చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించండి.

చిత్రకృప : oneindia telugu

మైసూర్

మైసూర్

మైసూర్ లో దసరా ఉత్సవాలు నింగిని తాకుతాయి. రంగురంగుల విద్ద్యుద్దీపాలతో అలంకరించిన దేవాలయాలు , అందంగా ముస్తాబైన ప్యాలెస్ పర్యాటకులను యిట్టె కట్టిపడేస్తాయి. దసరా వేడుకలను 400 ఏళ్ల నుండి క్రమంగా తప్పకుండా నిర్వహిస్తున్నారు మైసూర్ రాజ వంశాలు.

చిత్రకృప : Muhammad Mahdi Karim

కోల్కతా

కోల్కతా

కోల్కతా లో కాళీ మాతా చాలా ఫెమస్. దసరా నాడు జరిగే దుర్గా పూజను తిలకించడం విశిష్టంగా భావిస్తారు భక్తులు. పండుగ సమయంలో రంగులు చల్లుకుంటూ, పలకరించుకుంటూ, మిఠాయిలు తింటారు. ఆరోజున ఇక్కడ సంబరాలు అంబరాన్ని అంటుతాయి.

చిత్రకృప : Jonoikobangali

వారణాసి

వారణాసి

వారణాసి భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం. దసరా నాడు ఇక్కడ నిర్వహించే రామ్ లీల షో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ ప్రదర్శనను చూడటానికి స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు భారీగా తరలివస్తుంటారు. ప్రదర్శన సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 27 మధ్య నిర్వహిస్తారు.

చిత్రకృప : Nitin Badhwar

కులు

కులు

కులు దేశంలో ఖ్యాతిగాంచిన హిల్ స్టేషన్. ఇక్కడ ఏటా నిర్వహించే ఉత్సవాలలో దసరా ప్రముఖమైనది. అమ్మవారి ఊరేగింపు కులు లో ప్రారంభమై దల్పూర్ లో ముగుస్తుంది.

చిత్రకృప : ellen reitman

అమ్రిత్ సర్

అమ్రిత్ సర్

దసరా నవరాత్రి రోజులలో అమ్రిత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని తప్పక సందర్శించండి. అలాగే రావణ దహనకాండ జరిగే తీరు కూడా చూసి ఆనందించండి.

చిత్ర కృప : gags9999

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X