Search
  • Follow NativePlanet
Share
» »కల్పా వెలితే ఈ ప్రాంతాలను చూడకుండా వెనుదిరగకండి

కల్పా వెలితే ఈ ప్రాంతాలను చూడకుండా వెనుదిరగకండి

కల్పాలో చూడదగిని ప్రాంతాల జాబితా ఇదే.

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నార్ జిల్లాలో కల్పా ఉంది. సట్లేజ్ నది ఒడ్డున సట్లేజ్ వ్యాలీలో ఉన్న కల్పా హిమాచల్ ప్రదేశ్‌లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా పేరొందిన ప్రముఖ పర్యాటక కేంద్రం. ఈ ప్రాంతం అనేక ధార్మిక కట్టడాలకు కూడా చాలా ప్రాచూర్యం చెందినది. సట్లేజ్ నదీ ఒడ్డున ఉన్న కిన్నార్, కైలాష్ శ్రేణి పర్వత అందాలను ఈ కల్పా నుంచి మనం చూడొచ్చు. ఇటీవల ఈ ప్రాంతం పర్యాటకంగా చాలా ప్రాచూర్యం చెందింది. ఇక్కడ వసతి కూడా చాలా బాగుంటుంది. గెస్ట్‌హౌస్ నుంచి రిసార్టుల వరకూ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఆహార పదార్థాలు కూడా చాలా బాగుంటాయి. మీరు ఇక్కడికి వెలితే తప్పకుండా ఈ ప్రాంతాలను చూడండి

కోఠి

కోఠి

P.C: You Tube

కల్ప నుంచి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఈ కోఠి అనే గ్రామం ఉంటుంది. పూర్వకాలపు సంప్రదాయాలను ఆచార వ్యవహారాల గురించి తెలుసుకోవాలనుకొనేవారికి ఈ కోఠి చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడి నుంచే మౌంట్ కైలాష్ అందాలను మనం ఆస్వాధించవచ్చు. ముఖ్యంగా ప్రక`తితో మమేకం కావాలనుకొనేవారు తప్పక కోఠిని సందర్శిస్తారు.

కైలాష్

కైలాష్

P.C: You Tube

దీనిని కినేర్ కైలాష్ అని కూడా అంటారు. హిమాలయ పర్వత శ్రేణిలోని ఒక భాగమే కినేర్ కైలాష్. దీని ఎత్తు 6500 అడుగులు. చుట్టూ తెల్లటి మంచు, పర్వత శిఖరాలను ముద్దాడుతూ వెళ్లే మేఘాలు ఇక్కడ సర్వసాధారణం. అందుకే వీకెండ్ సమయంలో ఇక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు. సాహస క్రీడలు ముఖ్యంగా ట్రెకింగ్ అంటే ఇష్టపడేవారికి ఈ ప్రదేశం చాలా బాగా నచ్చుతుంది.

ట్రెక్కింగ్ స్పాట్

ట్రెక్కింగ్ స్పాట్

P.C: You Tube

ఇది కల్పా నుంచి 10 నిమిషాల నడక దూరంలో ఉంది. ఇక్కడి నుంచే వివిధ మార్గాల వైపు ట్రెక్కింగ్ వెళ్లడానికి వీలవుతుంది. అందుకే దీని పేరే ట్రెక్కింగ్ స్పాట్‌గా మారిపోయింది. ఈ ప్రాంతానికి చేరుకోవడం కూడా కొంత కష్టమైనపనే. నిటారుగా ఉన్న మెట్ల మార్గం వెంబడి నడవాల్సి ఉంటుంది.

బాట్సెరీ

బాట్సెరీ

P.C: You Tube

బాప్సెరీ నదీ ఒడ్డున బాట్సెరీ ఉంది. ఇది ఒక చిన్న గ్రామం. ఈ గ్రామాన్ని చేరుకోవాలంటే నడక తప్ప మరో మార్గం లేదు. అందుకే ట్రెక్కర్స్ తప్పకుండా ఇక్కడికి వెళ్లాలని భావిస్తుంటారు. చేతితో తయారుచేసిన అలంకార వస్తువులు ఇక్కడ చాలా ప్రాచూర్యం చెందినవి. ఇక్కడికి వెళ్లినవారు తప్పకుండా వీటిని ఖరీదు చేసి కాని వెనుదిరగరు.

సాప్నీ కోట

సాప్నీ కోట

P.C: You Tube

ఆకాలపు చరిత్ర తెలిసుకోవాలనుకొన్నవారికి సాప్నీ కోట స్వర్గధామం. సాప్నీ అనే చిన్న గ్రామంలో ఈ సాప్నీ కోట ఉంటుంది. రామ్‌పూర్‌ను పరిపాలించిన పద్మసింగ్ అనే రాజు ఈ కోటను నిర్మించినట్లు చెబుతారు. మొత్తం ఐదు అంతస్తులుగా ఈ సాప్నీ కోట ఉంటుంది. ఈ కోట నిర్మాణంలో చెక్కను కూడా వినియోగించడం గమనార్హం. ఆ చెక్క ఇప్పటికీ చెక్క చెదరకుండా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X