Search
  • Follow NativePlanet
Share
» »ఈ స్వతంత్ర దినోత్సవంతో ముడిపడిన ఈ పర్యాటక ప్రాంతాల్లో మీరు ఎన్ని చూశారు?

ఈ స్వతంత్ర దినోత్సవంతో ముడిపడిన ఈ పర్యాటక ప్రాంతాల్లో మీరు ఎన్ని చూశారు?

మరో పది రోజుల్లో మనం స్వతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోబోతున్నాం. ఎంతమంది తమ ప్రాణాలను పన్నంగా పెట్టి మన భారత దేశాన్ని ఆంగ్లేయుల పాలనల నుంచి విడిపించిన విషయం తెలిసిందే. ఇందుకు భారత దేశంలోని అనేక ప్రాంతాలు ప్రత్యక్ష సాక్షంగా ఉన్నాయి. అందులో కొన్ని పర్యాటక ప్రాంతాలుగా కూడా రూపుదిద్దుకొని భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశీయులను కూడా ఇక్కడకు రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత దేశం స్వతంత్ర సంగ్రామంతో ముడిపడిన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం మీ కోసం..

జలియన్ వాలాభాగ్

జలియన్ వాలాభాగ్

P.C: You Tube

జలియన్ వాలాభాగ్ అనేది ఉత్తర భారత దేశంలోని అమ`త్ సర్ పట్టణంలో ఒక ఉద్యానవనం. క్రీస్తు శకం 1919 ఏప్రిల్ 13న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారధ్యంలో ఈ తోటలో సమావేశమై నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లల పై కూడా కాల్పులు జరిపారు.

వెయ్యి మంది మరణం

వెయ్యి మంది మరణం

P.C: You Tube

పదినిమిషాల పాటు జరిగిన ఈ కాల్పుల్లో దాదాపు 1000 మందికి పైగా మరణించి ఉంటారని చెబుతారు. ఇది స్వర్ణ దేవాలయానికి సమీపంలోనే ఉంది. ఇక్కడ ప్రభుత్వం స్మారకాన్ని కూడా ఏర్పాటు చేసింది.

సబర్మతి ఆశ్రమం

సబర్మతి ఆశ్రమం

P.C: You Tube

సబర్మతి ఆశ్రమంను సత్యాగ్రహ ఆశ్రమం అని కూడా పిలుస్తారు. అహ్మదాబాద్ కు 5 కిలోమీటర్ల దూరంలో సబర్మతి నది ఒడ్డున ఈ ఆశ్రమం ఉంది. గాంధీ తన భార్య అయిన కస్తూర్భాతో పాటు ఇక్కడ

కీలక పాత్ర

కీలక పాత్ర

P.C: You Tube

స్వాతంత్ర్య పోరాటంలో ఈ ఆశ్రమం కీలక పాత్ర పోషించింది. ఉప్పుసత్యాగ్రమం, దండి యాత్ర మొదలయ్యింది ఇక్కడి నుంచే అందుకే భారత ప్రభుత్వం దీన్ని జాతీయ స్మారక స్థలంగా గుర్తించింది.

సెల్యులార్ జైల్

సెల్యులార్ జైల్

P.C: You Tube

అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ఈ జైలును కాలాపాని అని కూడా పిలుస్తారు. స్వతంత్ర సంగ్రామం సమయంలో బ్రిటీష్ వారు ఈ జైలులోనే అనేక మంది ప్రముఖులను బంధించారు.

ఉరికొయ్యల ఉగ్గుపాలు

ఉరికొయ్యల ఉగ్గుపాలు

P.C: You Tube

కొంతమంది ఇక్కడే తమ తుది శ్వాసను వదలగా మరికొంతమంది ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగారు. భారత ప్రభుత్వం ప్రస్తుతం ఈ జైలును జాతీయ స్మారకంగా ప్రకటించింది.

ఆగాఖాన ప్యాలెస్

ఆగాఖాన ప్యాలెస్

P.C: You Tube

ఆగాఖాన్ ప్యాలెస్ ను సుల్తాన్ మహ్మద్ షా ఆగా ఘాన్ -3 పూనేలో నిర్మించారు. ఈ భవనం నిర్మాణం పూర్తైన సంవత్సరం క్రీస్తుశకం 1852. మొదట్లో దీనిని సమాజ సేవకు వినియోగించేవారు. అయితే స్వతంత్ర పోరాటంలో భాగంగా గాంధీ, నెహ్రూ వంటి నాయకులు తరుచుగా ఈ భవనంలోనే కలుసుకొనేవారు.

జైలుగా కూడా

జైలుగా కూడా

P.C: You Tube

కొన్ని రోజుల తర్వాత ఈ భవనాన్ని జైలుగా కూడా బ్రిటీష్ వాళ్లు వినియోగించారు. గాంధీ కూడా కొన్ని రోజుల పాటు ఈ భవనంలోనే బంధీగా గడిపాడు. ప్రస్తుతం ఈ భవనం గాంధీ వినియోగించిన వస్తువులను ప్రదర్శిస్తున్నారు.

నేతాజీ భవన్

నేతాజీ భవన్

P.C: You Tube

రవి అస్తమించని సామ్రాజ్యమైన బ్రిటీష్ ను గడ గడలాడించిన నేతాజి సుభాష్ చంద్రబోష్ తండ్రి ఈ భవనాన్ని కొలకత్తాలో నిర్మించారు. ఈ భవనంలో ప్రస్తుతం నేతాజి సుభాష్ చంద్రబోష్ వినియోగించిన అనేక వస్తువులను ప్రదర్శనకు ఉంచారు.

వేల మంది సందర్శిస్తూ ఉంటారు.

వేల మంది సందర్శిస్తూ ఉంటారు.

P.C: You Tube

ఇది ఒక ప్రదర్శన శాల కూడా. ప్రతి ఏడాది ఎంతో మంది ఈ భవనాన్ని సందర్శిస్తూ ఉంటారు. 2007న అప్పటి జపాన్ ప్రధాని షిన్ జో భారత్ పర్యటనలో భాగంగా ఈ భవనాన్ని సందర్శించారు.

గేట్ వే ఆఫ్ ఇండియా

గేట్ వే ఆఫ్ ఇండియా

P.C: You Tube

ముంబైలో ఉన్న గేట్ వే ఆఫ్ ఇండియాను భారతీయ, యురోపియన్ శైలిలో నిర్మించారు. అప్పట్లో దీని నిర్మాణానికి రూ.21 లక్షలు ఖర్చుచేశారు. క్రీస్తు శకం 1911 లో బ్రిటన్ రాజు కింగ్ జార్జ్-6 క్వీన్ మేరీలు భారత పర్యటనకు గుర్తుగా దీనిని నిర్మించారు.

ఇక్కడి నుంచే వెనుతిరిగారు

ఇక్కడి నుంచే వెనుతిరిగారు

P.C: You Tube

దీని నిర్మాణం 1924లో పూర్తయ్యింది. ఇక బ్రిటీష్ సైన్యం భారత్ నుంచి వెనుదిరిగినప్పుడు ఇక్కడి నుంచే ఇంగ్లాండ్ కు బయలుదేరి వెళ్లి పోయింది. ఇక్కడ ప్రతి రోజూ సాయంత్రం లేజర్ షో నిర్వహిస్తారు.

రెడ్ ఫోర్ట్

రెడ్ ఫోర్ట్

P.C: You Tube

దీనిని ఎర్రకోట అని అంటారు. భారత దేశం స్వతంత్రాన్ని ప్రకటించుకొన్నప్పుడు మొదటిసారిగా ఇక్కడే జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దీని అసలు పేరు ఖిలా ఎ మబారక్. యమునా నది తీరంలో ఈ ఎర్రకోట ఉంది.

షాజహాన్

షాజహాన్

P.C: You Tube

దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ కట్టించాడు. దీని నిర్మాణం క్రీస్తు శకం 1638లో మొదలు పెడితే క్రీస్తుశకం 1648లో పూర్తయ్యింది. ఇక్కడ జాతీయ పండుగలు, ఉత్సవాలు జరుపుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X