Search
  • Follow NativePlanet
Share
» »సౌత్ ఇండియా లో సమ్మర్ ట్రావెల్

సౌత్ ఇండియా లో సమ్మర్ ట్రావెల్

వేసవి కాలం వచ్చేస్సింది. ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్నాయి. కాని పిల్లల స్కూళ్ళ కు కాలేజ్ లకు సెలవులు వచ్చి కుటుబం అంతా కలసి ఎక్కడికైనా విశ్రాంతిగా వెళ్ళాలనిపిస్తుంది. మరి ఈ సమ్మర్ లో వేసవి వేడి అధికంగా వున్న సమయంలో ఎక్కడికి వెళ్ళాలి ? అందుకు గాను కొన్ని ప్రదేశాలు ఇస్తున్నాం. వీటి పర్యటనలో మీరు తప్పక ఆనందించగలరు. కర్నాటక లోని దేవ్ బాగ్ బీచ్ లేదా ఆంధ్ర ప్రదేశ్ లోని హార్స్లీ హిల్స్, లేదా తమిళ్ నాడు లోని ముదు మలై వైల్డ్ లైఫ్ సంక్చురి లేదా సింపుల్ గా సిటీ లైఫ్ కావాలనుకుంటే కోచి లాంటి చల్లని ప్రదేశాలకు వెళ్ళవచ్చు.

 సమ్మర్ ట్రావెల్

సమ్మర్ ట్రావెల్

కూర్గ్
ప్రకృతి మధ్యకు వెళ్ళారంటే, పూర్తి పచ్చదనం మధ్య ఉండాల్సిందే. ఇక వేరే మార్గం లేదు. ఒక్క సారి బయటకు వెళ్ళండి. కూర్గ్ లో అంతా పచ్చదనమే. ఇక్కడి ఆకర్షణలు రాజాస్ సీట్ కొండలు లో తిరగండి. లేదా మడికేరి లోని టీ తోటలలో విహరించండి. అక్కడి స్థానికులతో ముచ్చటీంచండి. స్థానికంగా లభించే ఆహారాలు తిని ఆనందించండి. మరిన్ని కూర్గ్ ఆకర్షణలకు ఇక్కడ చూడండి.

Pic Credit: Thangaraj Kumaravel

 సమ్మర్ ట్రావెల్

సమ్మర్ ట్రావెల్

ముడుమలై వైల్డ్ లైఫ్ సంక్చురి
రిలాక్స్ అవండి. తాజా గాలి అనుభవించండి. లేదా పక్షుల కిల కిలలు ఆలకించండి. రాత్రి వేళ వినపడే ఏనుగుల ఘీంకారాలు ఎంజాయ్ చేయండి. ఈ ప్రదేశం తమిళనాడు సిటీ కి దూరంగా వుండి ప్రశాంతంగా వుంటుంది. ముడుమలై వెళ్ళడం, బెంగుళూరు సిటీ నుండి తేలిక. వయా మైసూరు లేదా ఊటీ మార్గాలలో వెళ్ళవచ్చు. ముడుమలై గురించి మరింత సమాచారం ఇక్కడ చూడండి.

Pic Credit:

 సమ్మర్ ట్రావెల్

సమ్మర్ ట్రావెల్

హార్స్ లీ హిల్స్
హార్స్ లీ హిల్స్ కు ఆ పేరు అక్కడ పాలించిన ఒక బ్రిటిష్ కలెక్టర్ పేరు మీద పెట్టారు. ఈయన ఈ ప్రదేశాన్ని తన సమ్మర్ నివాసంగా ఆనందించాడు. హార్స్ లీ హిల్స్ బెంగుళూరు కు 165 కి. మీ. లు చెన్నై కి 274 కి. మీ. లు వుంటుంది. ఈ హిల్ స్టేషన్ లోని గుల్ మోహార్ ఫారెస్ట్ అందంగా వుంటుంది. ఇక్కడ విహరిస్తూ సమీపంలోని గంగోత్రి సరస్సు, మ్యూజియం, పర్యావరణ పార్క్ వంటివి చూడవచ్చు. ఇంకొంచెం సాహసం చేయాలనుకుంటే, ఇక్కడ రాక్ క్లైమ్బింగ్ వంటి క్రీడలు కూడా కలవు. ఇక్కడ కల చెంచు జాతి ప్రజలు, చవకైన ఆహారాలు, వెదురు తో చేసిన కొన్ని హేండి క్రాఫ్ట్ వస్తువులు తక్కువ ధరలలో కూడా అందిస్తారు.

Pic Credit: Andhra Tourism

 సమ్మర్ ట్రావెల్

సమ్మర్ ట్రావెల్

అరకు వాలీ
నేటికీ పూర్వపు అందాలు చెడని హిల్ స్టేషన్ అంటే అది అరకు వాలీ కాగలదు. నేటికీ ఇక్కడ ఏ మాత్రం వాణిజ్య అభివృద్ధి జరగలేదు. అరకు వాలీ ఓడిశా కు సమీపంగా వైజాగ్ కు 114 కి. మీ. ల దూరంలో వుంటుంది. చుట్టూ రక్తకొండ, చితమోగొంది, గాలి కొండ మరియు సుంకరి మెట్ట అనే పేర్లు కల కొండలు వుంటాయి. ఇక్కడ కల అనంతగిరి మరియు సుంకరి మెట్ట రిజర్వ్ ఫారెస్ట్ లు ఎన్నో రకాల మొక్కలు, జంతువులు కలిగి వున్నాయి. కాఫీ తోటలు కూడా కలవు. అరకు వాలీ గురించిన మరింత సమాచారం కొరకు ఇక్కడ చూడండి.

Pic Credit: raj

 సమ్మర్ ట్రావెల్

సమ్మర్ ట్రావెల్

హావ్ లాక్ ఐలాండ్
అండమాన్ దీవులలో కల హావ్ లాక్ ద్వీపం సమ్మర్ లో ఒక స్వర్గం వలే వుంటుంది. ఇక్కడ మీరు స్కూబా డైవింగ్ చేయవచ్చు. లేదా ఆసియా లో బెస్ట్ అయిన రాధానగర్ బీచ్ లో రిలాక్స్ అవచ్చు. చక్కని షాపింగ్ చేయవచ్చు. స్థానిక హేండి క్రాఫ్ట్ ఐటెం లు అందంగా వుంటాయి. హావ్ లాక్ ఐలాండ్ గురించి మరింత సమాచారం కొరకు ఇక్కడ చూడండి.

Pic Credit: beontheroad

 సమ్మర్ ట్రావెల్

సమ్మర్ ట్రావెల్

దేవ్ బాగ్ బీచ్
కర్నాటక లోని దేవా బాగ్ బీచ్ పూర్తి విశ్రాంతి కొరకు ఒక మంచి బీచ్. ఇది గోకర్ణ లేదా గోవా లకు సమీపంగా వుంటుంది. మీరు మరింత అన్వేషిన్చాలనుకుంటే, సమీపంలో కల సదాశివ్ గడ ఫోర్ట్ చూడండి. ఇది ఒక కొండపై సుమారు 200 అడుగుల ఎత్తులో అడవుల మధ్య కలదు. ఇక్కడే సమీపంలో ఒక దుర్గ టెంపుల్ కూడా చూడవచ్చు.

Pic Credit:solarisgirl

 సమ్మర్ ట్రావెల్

సమ్మర్ ట్రావెల్

కొచ్చిన్ కోట
కోచి ఒక ఓడ రేవు పట్టణం. ఇక్కడి వీధులు 19 వ శతాబ్దపు అందాలతో ఆకర్షణీయంగా వుంటాయి. ఇక్కడ కల హిల్ పాలస్ మ్యూజియం, తప్పక చూడాలి. సౌత్ ఇండియా లోని మ్యూజియం లు అన్నిటి కంటే ఇది ఆకర్షనీయం. మీ టూర్ లో ఇక్కడ కల సుగంధ ద్రవ్యాల మార్కెట్, జూస్ టవున్ వంటివి ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. పూర్తి ఐరోపా శిల్ప శైలి కలిగి వుంటుంది. ఇక్కడ కల కుబలంగి ఐలాండ్ తప్పక చూడండి. పర్యావరణ విలేజ్ లో ఒక బోటు విహారం చేయండి. స్థానికులతో కలసి ఆనందించండి. కేరళ పరోటా లు, బీఫ్ వేపుడు మంచి రుచికరంగా వుంటాయి. మీ షాపింగ్ లిస్టు లో ఫాన్సీ నగలు, స్పైస్ షాపులు కూడా చేర్చండి. కోచి లో ఎక్కడ వసతి తీసుకోవాలి ? ఇక్కడ చూడండి.

Pic Credit: Aleksandr Zykov

 సమ్మర్ ట్రావెల్

సమ్మర్ ట్రావెల్

కూనూర్
తమిళనాడు లోని కూనూర్ ప్రదేశం చల్లదనానికి పేరు. ఇక్కడ ట్రెక్కింగ్ చేయవచ్చ్చు లేదా బర్డ్ వాచింగ్ చేసి ఆనందించవచ్చు. డాల్ఫిన్స్ నోస్, లాంబ్స్ రాక్ వంటి సుందర దృశ్యాలు చూడవచ్చు. స్థానికంగా తయారు అయ్యే జాము లు, చాకొలేట్ లు తిని ఆనందించవచ్చు. ఇక్కడ చేతితో ఎమ్బ్రాయిడరి చేసిన వస్తువులు ప్రసిద్ధి.

Pic Credit: WIki Commons

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X