Search
  • Follow NativePlanet
Share
» »టోక్లాయ్ లో టీ తాగి, మజూలీ ద్వీపంలో నాటు పడవల్లో ప్రయాణం కోసం చలో...

టోక్లాయ్ లో టీ తాగి, మజూలీ ద్వీపంలో నాటు పడవల్లో ప్రయాణం కోసం చలో...

పౌరుల గుర్తింపు విషయమై అసోంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్నార్సీ) పై భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా అసోంలో భారత దేశానికి చెందిన వారిని మాత్రమే గుర్తించడానికి వీలుగా ప్రభుత్వం ఈ ఎన్సార్సీని రూపొందించింది. ఇక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని పొరుగు రాష్ట్రాల నుంచి ఉగ్రవాదులు రాకుండా ఉండటం కోసం ఈ ఏర్పాటన్నది ప్రభుత్వ వాదన. ఈ నేపథ్యంలో ఈ అసోంలో భౌగోళిక పరిస్థితులు అనేక పర్యాటక కేంద్రాలుగా రూపు దిద్దుకొన్నాయి. ఈ నేపథ్యంలో అసోంలో ఉన్న పర్యాటక కేంద్రాలకు సంబంధించిన కథనం.

ఖాజీరంగ నేషనల్ పార్క్

ఖాజీరంగ నేషనల్ పార్క్

P.C: You Tube

ప్రపంచంలో ఉన్న మొత్తం ఖడ్గమ`గాల సంఖ్యలో మూడింట రెండు వంతులు ఖాజీరంగ నేషనల్ పార్క్ లోనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఖాజీరంగ నేషనల్ పార్క్ యునెస్కో చేత సంరక్షించబడే ప్రదేశాల జాబితాలో చోటు సంపాదించుకొంది.

విభిన్న జీవ వైవిద్యం

విభిన్న జీవ వైవిద్యం

P.C: You Tube

విభిన్న జీవవైవిద్యమే అభయారణ్యాల విషయంలో ఖాజీరంగాను పర్యాటక రంగంలో మొదటిస్థానంలో నిలిపింది. ఖడ్గమ`గాలతో పాటు ఏనుగులు, అడవిదున్నలు, చైనీస్ పంగోలియన్ వంటి జంతువులను మనం చూడవచ్చు. ఇక్కడ ఎలిఫెంట్ సఫారీ అందుబాటులో ఉంది.

మనాస్ నేషనల్ పార్క్

మనాస్ నేషనల్ పార్క్

P.C: You Tube

యునెస్కో చేత గుర్తించబడి సంరక్షించబడుతున్న జాబితాల్లో మనాస్ నేషనల్ పార్క్ కు కూడా స్థానం దక్కింది. పులుల సంరక్షణ కేంద్రమైన ఈ నేషనల్ పార్క్ లో అత్యంత అరుదైన రెడ్ పాండాను కూడా వీక్షించవచ్చు. అదేవిధంగా ఏనుగులు స్వతంత్రంగా విహరించే ప్రదేశం కూడా.

పులుల సంఖ్య పరంగా

పులుల సంఖ్య పరంగా

P.C: You Tube

కనుచూపుమేర ఇక్కడ మనకు పచ్చదనం తప్పమరేది కనిపించదు. భారత దేశంలో పులుల సంఖ్య పరంగా రెండో పెద్ద జాతీయ పార్క్ మనాస్ నేషనల్ పార్క్. ఈ జాతీయ వనం అనేక ఔషద మొక్కలకు కూడా నిలయం. అందువల్లే ఇక్కడకు ఆయుర్వేద వైద్య నిపుణులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

మజులీ ద్వీపం

మజులీ ద్వీపం

P.C: You Tube

ప్రక`తి సంపదలకు నిలయమైన మజులీ ద్వీపం అసోం సొంతం. ప్రపంచంలో అతి విశాలమైన నదీ దీపం మజులీ ద్వీపం. మజులీ ద్వీపం దాదాపు 452 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. కొన్ని ద్వీపాల సమూహమే మజులీ ద్వీపం. వర్షాకాలంలో చిన్నచిన్న ద్వీపాలు నదిలో మునిగిపోగా కమలాబరి, అనియతి, గారాముర్ వంటి పెద్ద దీపాలు మాత్రం నీటిలో తేలుతూ ఉంటాయి.

నాటుపడవల్లో ప్రయాణం

నాటుపడవల్లో ప్రయాణం

P.C: You Tube

ఆ ద్వీపాల వద్దకు నాటు పడవుల్లో వెళ్లడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. ముఖ్యంగా బర్డ్స్ లవర్స్ కు ఈ మజులీ ద్వీపం స్వర్గధామం. మజులీ ద్వీప సందర్శనం చేయనిదే అసోం పర్యాటకం ముగిసిందని చెప్పడానికి వీలుకాదు.

టోక్లాయ్ టీ పరిశోధనా కేంద్రం

టోక్లాయ్ టీ పరిశోధనా కేంద్రం

P.C: You Tube

ప్రపంచంలో ఉన్న టీ పరిశోధన కేంద్రాల్లో టొక్లాయ్ టీ పరిశోధనా కేంద్రం ఒకటి. దీనిని 1911లో ఏర్పాటు చేశారు. ప్రపంచంలో టీకు సంబంధించిన అనేక పరిశోధనలకు మూలం ఈ ప్రాంతం. టీ తోటల పెంపకం దగ్గరి నుంచి మార్కెట్లో వాటి అమ్మకాలకు అనుసరించాల్సిన విధి విధాల వరకూ ఇక్కడ అనేక పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి.

టీ తయారీ కూడా

టీ తయారీ కూడా

P.C: You Tube

స్వచ్ఛమైన అసోం టీ రుచి చూడాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే. టీ లవర్స్ తరుచుగా టోక్లాయ్ టీ పరిశోధనా కేంద్రాన్ని సందర్శిస్తూ ఉంటారు. టీ తోటల పెంపకం నుంచి టీ తయారు చేయడం వరకూ మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్ కు కూడా అవకాశం ఉంది.

కకోచాంగ్ జలపాతం

కకోచాంగ్ జలపాతం

P.C: You Tube

అస్సోంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన జోర్హాట్ వద్ద టీ, రబ్బరు తోటల మధ్య ఉన్న జలపాతం పరవళ్లను చూడటానికి పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఏడాది మొత్తం ఈ జలపాతం హొయలను చూడటానికి అవకాశం ఉన్నా జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఈ జలపాతాన్ని వీక్షించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

ఖాజీరంగాకు దగ్గర

ఖాజీరంగాకు దగ్గర

P.C: You Tube

ఈ జలపాతం చుట్టూ ఉన్న పచ్చటి టీ తోటలను చూస్తూ సమయాన్ని ఇట్టే మరిచిపోవచ్చు. ఇక్కడి నుంచి ఖాజీరంగ పార్క్ కూడా చాలా తక్కువ. అందువల్లే ఖాజీ రంగ ను చూసిన ప్రతి పర్యాటకుడు ఈ కకోచాంగ్ జలపాతాన్ని చూడటానికి ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X