» »కూర్గ్ - కొత్త జంటల స్వర్గం !!

కూర్గ్ - కొత్త జంటల స్వర్గం !!

By: Venkata Karunasri

కూర్గ్ ను సందర్శించటానికి మార్చి నుండి మే నెలలు అనువైన సమయం. వారాంతంలో అనగా శనివారం, ఆదివారం సెలవు దినాలలో, ప్రభుత్వ సెలవు దినాలలో ఎలాగో శెలవు ఉంటుంది.

కూర్గ్ కర్ణాటకలోని ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. కూర్గ్ అధికారికంగా 'కొడగు' అని పిలుస్తారు. కర్ణాటకలోని మలనాడు తీరంలో పడమటికనుమలలో ఉంది. సముద్రమట్టానికి సుమారు 900 మీ. నుండి 1715 మీ. ల ఎత్తులో ఉంది. దీనికి "కర్ణాటక కాశ్మీర్" అని పేరు ఉంది.

కూర్గ్ - కొత్త జంటల స్వర్గం !!

                                                                 చిత్రకృప : Geetha Grandhe

పచ్చగా ఉండే కొండ ప్రాంతాలు, విస్తరించిన కాఫీ తోటలు, శిఖరాల నుండి జాలువారే జలపాతాలు వల్ల దీనికి ఆ పేరు వచ్చినది. కూర్గ్ లో కొడవ, తుళు, గౌడ, కుడియాలు, మొదలైన తెగల ప్రజలు నివసిస్తున్నారు. ఎక్కువమంది కొడవజాతి వారు వున్నారు. ఈ ప్రాంతం అంతర్జాతీయంగా కాఫీ పంటకు ప్రసిద్ధి చెందింది. తేనె, యాలకులు, మిరియాలు, నారింజకు ప్రసిద్ధిగాంచింది. కూర్గ్ కు దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ మైసూరు. అంతేకాకుండా మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా దగ్గరలోనే ఉంది.

అంతేకాకుండా కూర్గ్ లో పర్యాటకులను ఆకర్షించే విధంగాక్ అనేకప్రదేశాలు, దేవాలయాలు, జలపాతాలు, పార్కులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా అబ్బే,ఇర్పు, మల్లలి జలపాతం చూడదగినది.

కూర్గ్ ను సందర్శించటానికి అనువైన సమయం మరియు వాతావరణం

కూర్గ్ ను సందర్శించటానికి మార్చి నుండి మే నెలలు అనువైన సమయం. వారాంతంలో అనగా శనివారం, ఆదివారం సెలవు దినాలలో, ప్రభుత్వ సెలవు దినాలలో ఎలాగో శెలవు ఉంటుంది. అప్పడు కూర్గ్ చూసిరావచ్చు. ఒకవేళ లాంగ్ వీకెండ్ తీసుకున్నట్లయితే కూర్గ్ అందాలను మరింతగా మరింతగా ఎంజాయ్ చేయవచ్చు.

కూర్గ్ కు చేరుటకు మార్గములు:

మార్గం 1:

ఈ మార్గంలో మొత్తం దూరం 264 కి.మీ. బెంగుళూరు నుండి కునిగల్ - కునిగల్ నుండి చెన్నరాయపట్టణ - చెన్నరాయపట్టణ నుండి శ్రావణబెళగోళ - శ్రావణబెళగోళ నుండి హోలేనరసిపూర్ - హోలేనరసిపూర్ నుండి కుశాల్ నగర్ - కుశాల్ నగర్ నుండి బైలకుప్పే - బైలకుప్పే నుండి కొడగు (కూర్గ్) చేరుకోవచ్చు. కారులో ప్రయాణించినట్లయితే 5 గంటల 14 నిమిషాలు పడుతుంది.

కూర్గ్ - కొత్త జంటల స్వర్గం !!

                                                           చిత్రకృప : Ashwin Kumar

మార్గం 2:

ఈ మార్గంలో మొత్తం దూరం 243 కి.మీ. బెంగుళూరు నుండి రామనగర - రామనగర నుండి చన్నపట్టణ - చన్నపట్టణ నుండి మద్దూరు - మద్దూరు నుండి మాండ్య - మాండ్య నుండి హన్సూరు - హన్సూరు నుండి కొడగు (కూర్గ్) చేరుకోవచ్చు.

మార్గం 3:

బెంగుళూరు నుండి సోమనాథపుర - సోమనాథపుర నుండి మైసూరు - మైసూరు నుండి హున్సూరు - హున్సూరు నుండి కొడగు (కూర్గ్) చేరుకోవచ్చు.

మార్గం 1: బెంగుళూరు నుండి కునిగల్ మార్గమధ్యంలో అక్కడికి దగ్గరగా వున్న చూడదగిన స్థలాలు ఉన్నాయి. చెన్నరాయపట్టణ నుండి శ్రావణబెళగోళ కు దూరము 12.3 కి.మీ ఉంది. కారులో 16ని. లలో చేరుకోవచ్చు.

శ్రావణబెళగోళ: చెన్నరాయపట్టణమునకు దగ్గరలో వున్న నగరము. 57 అడుగులు 17 మీ ఎత్తు కలిగిన గోమటేశ్వరస్వామి విగ్రహమును చూడవచ్చును.

కూర్గ్ - కొత్త జంటల స్వర్గం !!

                                                                  చిత్రకృప : V.M.BHOOMIKA

అబ్బెఫాల్స్ : కొడగు నుండి అబ్బెఫాల్స్ కు కారులో 49 ని. లలో చేరుకోగలం. కర్నాటకలోని పశ్చిమకనుమలలో కొడగు జిల్లాలో ఉంది. ఇక్కడి జలపాతం ను 'జెస్సి ఫాల్స్' అని పిలిచేవారు. ఈ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం. ఈ జలపాతం చుట్టూ పచ్చని కాఫీ తోటలు నేలకొనివున్నాయి.

నాగరహోల్ జాతీయ పార్కు: కొడగు నుండి 1గంట 45ని. పడుతుంది. దీనిని 'రాజీవ్ గాంధి జాతీయ పార్కు' అని కూడా పిలుస్తారు. ఈ పార్కు దట్టమైన అటవీ ప్రాంతంతో కూడివుంది. ఇక్కడ కొండలు, లోయలు మరియు జలపాతాలు ఉన్నాయి.