» »భారతదేశంలో నమ్మటానికి అసాధ్యమైన ప్రదేశాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

భారతదేశంలో నమ్మటానికి అసాధ్యమైన ప్రదేశాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

Written By: Venkatakarunasri

మన భారత దేశంలో అనేకమైన కుతూహలమైన స్థలాలు వున్నాయి. ఎవరికైనా సరే విశిష్టత గల స్థలాలకు వెళ్లాలని చాలా ఇష్టంగా వుంటుంది.ఒక్కసారి మనకి కూడా చూసి తీరాలని అనిపిస్తుంది కదా. ప్రస్తుత వ్యాసంలో కొన్ని విశేషాలు కలిగివున్న స్థలాలు ఎక్కడెక్కడ వున్నాయి?ఏమేమున్నాయి? అనే దాని గురించి తెలుసుకుందాం.

ఆ విశేషాలు ఏవేవి అంటే అవి దెయ్యాలు, భూతాలు కలిగిన ఎవ్వరికీ ఇప్పటికీ తెలియని అద్భుతమైన ప్రకృతిని గురించి.అట్లయితే ఏఏ స్థలాలలో ఏమేమి విశిష్టతలు కలిగివున్నవి అవి మిమ్మల్ని ఆకర్షిస్తుంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం.

భారతదేశంలో నమ్మటానికి అసాధ్యమైన ప్రదేశాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

సరపణ వృక్షం

సరపణ వృక్షం

సరపణం వృక్షం అనగా గొలుసు చెట్టు. ఈ గొలుసు చెట్టును చైన్ ట్రీ అని పిలుస్తారు. ఈ చెట్టు కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో వున్న లక్కిడి గేట్ వే అనే ప్రదేశంలో వున్నది. స్థానికుల కథనం ప్రకారం అక్కడ నివసించే ఒక స్థానికుడి ఆత్మ ఏ చెట్టులో గొలుసులచేత బంధించబడివుంది అని చెప్తారు.

PC:Vinodnellackal

సరపణ వృక్షం

సరపణ వృక్షం

ఈ ప్రదేశంలో బ్రిటీష్ వారు పరిపాలించే సమయంలో బ్రిటీష్ ఇంజనీర్ ఒకడు తన ఆఫీసు కోసం సులభమైన మార్గాన్ని కనుగొన్నాడు. దానికోసం స్థానిక నివాసి కరీంతన్ నివాసి సహాయం అందుకున్నాడు. అతను అన్ని స్థలాల గురించి బాగా తెలిసినవాడు. అందుచే అతను లాక్డడ్డీ పాస్ అను పరిశోధనను చేసేందుకు ప్రముఖంగా సహాయపడెను.

PC:Traveler7

సరపణ వృక్షం

సరపణ వృక్షం

బ్రిటీష్ ఇంజనీర్ కరీంతన్ ఈ మార్గాన్ని గుర్తించినందుకు ఆ గౌరవ ప్రధానం అతనికి చెందుటవలన ఆ బ్రిటీష్ ఇంజనీర్ దురుద్దేశముతో కరీంతన్ ను హతమార్చుతాడు.

PC:Abhishek

సరపణ వృక్షం

సరపణ వృక్షం

అయితే కరీంతన్ ఆత్మ మాత్రం ఆ ప్రదేశంలోనే తిరుగుతూవుంది. ఆ క్రొత్త దారిలో వెళ్ళేవారందరికీ పీడించటం ప్రారంభించాడు. ఈ మొత్తం కథ తెలిసిన ఒక పూజారి అతని ఆత్మను గొలుసులతో బంధించి చెట్టుకు కట్టివేసినాడు.

PC:Kleuske

సరపణ వృక్షం

సరపణ వృక్షం

ఇదే ఆ ప్రదేశంలో వున్న ఆ చైన్ కట్ ట్రీ లేదా సరపణ వృక్షం అని అక్కడున్న స్థానికులు ఈ కథను వివరిస్తారు.

PC:Prof tpms

కృష్ణుని బండ

కృష్ణుని బండ

దీనినే ఇంగ్లీష్ లో కృష్ణాస్ బట్టర్ బాల్ అని పిలుస్తారు.సుమారు 15 అడుగుల ఎత్తులో వున్న ఈ బండ గురుత్వాకర్షణకు సవాల్ చేస్తూ అనేక సంవత్సరముల నుండి అక్కడే నిలబడివుంది.

PC:: Amritamitraghosh

కృష్ణుని బండ

కృష్ణుని బండ

స్థల పురాణం ప్రకారం శ్రీ కృష్ణుడు తాను దొంగిలించిన వెన్నముద్దే ఈ బండ అని చెప్తారు. అందువల్ల దీనిని శ్రీ కృష్ణుని బండ అని పిలుస్తారు. ఈ ఆశ్చర్యకరమైన బండ వుండేది తమిళనాడులోని చెన్నైకి దగ్గరలోని మహాబలిపురంలో అనేక వేల సంవత్సరాలనుండి ఈ బండ ఇక్కడే నిలిచివుందని అనేకమంది చెప్తారు.

PC:Manbalaji

హరిశ్చంద్ర ఘడ్

హరిశ్చంద్ర ఘడ్

ఈ హరిశ్చంద్ర ఘడ్ మహారాష్ట్రలోని అహమ్మద్ జిల్లలో వున్న ఒక ఆశ్చర్యకరమైన ప్రదేశం. ఇది ఒక విధంగా కొండ , ఇది ప్రళయ సూచకం అని పిలుస్తారు. ఇది సుమారు 6వ శతాబ్దానికి చెందినది కొంత మంది చెప్తారు. ఇక్కడ మహిమాన్వితమైన శివలింగం వున్నది. ఎల్లప్పుడూ నీటిలో వుండే ఈ ప్రదేశంలో నీరు ఎక్కడినుంచి వస్తుంది అనే ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం దొరకలేదు.

వేసవికాలంలో కూడా ఇక్కడ నీరు చల్లగా వుంటుంది. అది ఎలా సాధ్యం? అయితే వర్షాకాలంలో మాత్రం ఏవిధమైన కారణంచేత ఇక్కడ ఒక్క బొట్టు నీరు కూడా వుండదంట.

PC:Bajirao

హరిశ్చంద్ర ఘడ్

హరిశ్చంద్ర ఘడ్

ఈ శివలింగానికి 4 స్థంభాలు కలవు. దీని అర్థం ఒక్కొక్క స్థంభానికి ఒక్కొక్క యుగాన్ని సూచిస్తుంది. విరిగిపోయిన మూడు స్థంభాలు ఇప్పటికే ముగిసి పోయింది. ఇప్పుడు వుండేది కలియుగం, ఆ కలియుగం అంతాన్ని ఈ శివలింగానికి ఆధారమైన స్థంభాన్ని సూచిస్తుంది అని చెప్పవచ్చును. ఆ స్థంభం నాశనమైతే ప్రళయం వస్తుందనేది ఖండితమంట.

PC:rohit gowaikar

కొంకన్ కడ

కొంకన్ కడ

హరిశ్చంద్రగడ్ లో ఉన్న కొంకన్ కడ, ఉష్ణమండల కొండను కలిగి ఉంది. ఇక్కడ తరచుగా మేఘాలు విస్పోనం చెందటం జరుగుతుంది. ఇది ఒక అందమైన ప్రదేశం. అందువల్ల అనేకమంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.

PC:Cj.samson

జతింగా

జతింగా

ఇది అస్సాం రాష్ట్రంలో వున్న ఒక ప్రదేశమే జతింగా అయినాకూడా ఇక్కడ అనేకమైన పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి. అందువలన ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందినది. ఇక్కడ పక్షులు సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటాయి. అది కూడా నిర్దిష్టసమయంలో మాత్రం.పక్షులు ఈ విధంగా ఆత్మహత్య చేసుకొనుటకు కారణం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ రహస్యంగానే వుంది.

PC: nchills.gov.in

భాన్ గర్ కోట

భాన్ గర్ కోట

రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లాలో భాన్ గర్ కోట ఒక పట్టణం. ఇది ఒక భయంకరమైన కోట. ఇక్కడ పర్యాటకులు సూర్యాస్తమయం వరకు ఎవ్వరూ వుండరు. ఇక్కడ ఒక అదృశ్య శక్తి ఉందని నమ్ముతారు.

PC:Shahnawaz Sid

భాన్ గర్ కోట

భాన్ గర్ కోట

ఈ కోట వెనుక అద్భుతమైన కథ ఉంది. అంటే రాణి రత్నావతి అత్యంత అందమైన మహిళ. ఆమె చూసిన తాంత్రికుడు ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
అందువల్ల యువకుడు మంత్రం ద్వారా జయించాలని కోరుకున్నాడు. ఈ విషయం రాజుకు తెలిసి అతనిని హత్య చేయిస్తాడు. కానీ అతను మరణించేటప్పుడు మాంత్రికుడు ఈ కోటకు శాపం ఇచ్చాడు. అందువలనే ఇక్కడ ఆత్మలు ఉన్నాయని చెప్పబడింది.

PC:Shahnawaz Sid

కులధార

కులధార

కులాధర్ గ్రామం రాజస్థాన్ లోని జైసల్మేర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో వున్నది . ఈ గ్రామం మరణ గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఉంది. ఒకే రాత్రిలో ఊరే ఖాళీ చేసారు. ఇక్కడ స్థానికులు విభిన్నమైన కథలను చెబుతారు.

PC:Tomas Belcik

రూప్ ఖండ్

రూప్ ఖండ్

ఉత్తరాఖండ్ రాష్ట్రములో ఒక విచిత్రమైన రూప్ ఖండ్ అనే సరోవరం వుంది.దీనికి ముఖ్యమైన కారణం ఏమంటే ఇక్కడ అనేక అసంఖ్యాక అస్థిపంజరాలు మరియు పుర్రెలు కనుగొనబడ్డాయి.

PC:Schwiki

 రూప్ ఖండ్

రూప్ ఖండ్

కేవలం 2 మీటర్లు లోతు గల ఈ మంచుసరస్సులో అక్కడవున్న అస్తిపంజరములు స్పష్టంగా కన్పిస్తాయి. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఆసక్తికరంగా సందర్శిస్తారు.

PC:Schwiki

 శనివార్ వాడా

శనివార్ వాడా

పూణేలోని బజిరో రోడ్ వద్ద ఉన్న అభినవ కళా మందిర్ లో ఉన్న ఈ కోట భారతదేశంలోని ప్రధాన హాంటెడ్ ప్రదేశాలలో ఒకటి. 14 ఏళ్ల రాజకుమారుడు క్రూరంగా హత్యగావింపబడటంచేత ఇక్కడ అతని ఆత్మ వుంది అని చెప్తారు. ఇది పూణే లో పర్యాటక ఆకర్షణ కూడా.

PC:Ramakrishna Reddy

డ్యూమాస్ బీచ్

డ్యూమాస్ బీచ్

ఇది అరేబియా సముద్రం లో ఉంది, గుజరాత్లోని సూరత్ నగరం నుండి 21 కిమీ దూరంలో ఉంది. ఇది ఒక భయంకరమైన ప్రదేశం. అర్ధరాత్రి సమయంలో ఒక ప్రత్యేక స్థలంలో ఆత్మలు సంచారం చేస్తాయని చెప్తారు. ఎంతోమంది ప్రజలు అదృశ్యం కాబడి మరలా తిరిగి రాలేదంట.

PC:Marwada

బిక్తాన్ కోట

బిక్తాన్ కోట

ఈ కోట జమ్మూ & కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో చిక్తాన్ అనే గ్రామంలో ఉంది. ఇదొక ఆత్మలు సంచరించే కోట లాగా కనిపిస్తుంది. అయితే ఇది ఇతిహాస వైభవానికి చెందిన స్మారకంగా వుంది.

PC:Polybert49

శెట్టి పల్లి చర్చ్

శెట్టి పల్లి చర్చ్

ఈ చర్చి హాసన్ కి సమీపంలో వుంది. ఇది ఒక అద్భుతమైన ప్రదేశంగా ప్రసిద్ధిచెందింది. 1860 లో ఫ్రెంచ్ వారి చేత ఈ చర్చ్ నిర్మించబడింది. ఇక్కడ హేమవతి నది పక్కన ఉన్న ఈ చర్చి నదిలో నీరు ఎక్కువైనప్పుడు అదృశ్యమవుతుంది మిగతాసమయాలలో కనపడుతుంది.

PC:Pal.guru

బోనక్కాడ్ బంగ్లా

బోనక్కాడ్ బంగ్లా

ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. ఇది తిరువనంతపురం నుండి బోనక్కాడ్ సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో ఈ బంగ్లాను బ్రిటిష్ వారు నిర్మించారు ఇప్పుడు ఇది పాడుబడి దయ్యాలకు నిలయంగా ఉంది. రాత్రి సమయాలలో ఎవరూ కూడా ఈ స్థలాన్ని సందర్శించరు.

PC:Paul Varuni