» »కిఫిరే - ఈశాన్య భారతాన గల ఒక చిన్న పర్వత రాష్ట్రం

కిఫిరే - ఈశాన్య భారతాన గల ఒక చిన్న పర్వత రాష్ట్రం

Written By: Venkatakarunasri

నాగాలాండ్ .. ఈశాన్య భారతాన గల ఒక చిన్న పర్వత రాష్ట్రం. ఇక్కడి ప్రజలు స్వతహాగా నెమ్మది స్వభావులు. వీరిలో చాలామంది వ్యవసాయదారులు. ఈ భూమి ఎంతో అందమైన ప్రదేశాలను , ఆసక్తికర చారిత్రక అంశాలను, అరుదైన వృక్ష మరియు జంతు సంపదను అన్నిటికి మించి స్థానిక ప్రజల అద్భుత సంస్కృతి ని కలిగి వుంది. ఇక్కడ కొహిమా తర్వాత చెప్పుకోవలసిన ప్రదేశం కిఫిరె.

కిఫిరె సముద్ర మట్టానికి 3841 మీటర్ల ఎత్తులో ఉన్న నాగాలాండ్ శిఖరం సారమతి మౌంటైన్ ఎదురుగా ఉన్నది. ఆ పర్వతం చుట్టుపక్కల చక్కటి ప్రదేశాలు ఆహ్లాదకరముగా ఉంటాయి. శీతాకాలం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. కిఫిరె పట్టణమునకు 'సారమతి పర్వతం కాపలా' అని చెప్పుతూ ఉంటారు.

చూడవలసినవి

చూడవలసినవి

కిఫిరె పట్టణంలో సందర్శించటానికి ఫకిం వన్య ప్రాణుల అభయారణ్యం, సలోమి మరియు మిమి గుహలు ఉన్నాయి. సమీపంలోని కిసతోంగ్ గ్రామం, సిమి గ్రామం మరియు సంక్ఫురే గ్రామం లు చూడదగ్గవిగా ఉన్నాయి.

ఫకిం వన్య ప్రాణుల అభయారణ్యం

ఫకిం వన్య ప్రాణుల అభయారణ్యం

కిఫిరె జిల్లాలో గల ఫకిం వన్య ప్రాణుల అభయారణ్యం ప్రకృతి ప్రేమికులకు మరియు వన్య ప్రాణుల ఔత్సాహికులకు అనువైనది. దీనిని క్రీ.శ. 1983 వ సంవత్సరం లో 642 హెక్టార్లలో ఏర్పాటు చేసారు. నాగాలాండ్ అత్యంత ప్రజాదరణ పక్షి హర్నిబుల్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.

జంతు, వృక్ష మరియు పక్షి సంపద

జంతు, వృక్ష మరియు పక్షి సంపద

అభయారణ్యం లో చిరుత పులులు, పులులు, అడవి దున్నలు, మిథున్ వంటి అనేక జంతు జాతులు ఉన్నాయి. బర్డ్ వాచింగ్ పర్యాటకులకు ఉత్తేజాన్ని ఇస్తుంది. బోగిపోమ, బొమ్సుం, ఖాసీ ఫైన్, అమరి, శశి మరియు కచ్నర్ అనే వైవిధ్యభరిత చెట్లు గమనించవచ్చు.

కిసతోంగ్ గ్రామం

కిసతోంగ్ గ్రామం

కిఫిరె పట్టణము పొలిమేరలో ఉన్న కిసతోంగ్ గ్రామం తప్పనిసరిగా చూడాలి. ఇక్కడ 'సంగతం తెగ' అనాదిగా నివసిస్తున్నారు. ఈ గ్రామం దిగువన ఉన్న లోయలో మీరు మంత్రముగ్దులను చేసే వీక్షణను పొందవచ్చు. తల్లి ప్రకృతి తన ఒడిలో మిమ్మల్ని తీసుకున్నట్లయితే మీరు స్వర్గపు అనుభూతి కలుగుతుంది.

కిసతోంగ్ గ్రామం

కిసతోంగ్ గ్రామం

ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ మధ్య ఆసియా యొక్క కఠినమైన చల్లదనమును తప్పించుకోవడానికి శీతాకాలంలో వలస పక్షులు ఇక్కడకు వస్తాయి. సైబీరియా నుండి ఆఫ్రికా వెళ్ళే మార్గంలో, ఈ ప్రదేశంలో విరామం కోసం అంతరించిపోయే అముర్ గద్ద వంటి పక్షుల వివిధ జాతులు వస్తాయి. ఈ ప్రదేశము ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గంగా ఉంది.

లవర్స్ పారడైజ్

లవర్స్ పారడైజ్

'సుఖయప్ రాక్ క్లిఫ్' కిఫిరె లో ప్రసిద్ధి చెందిన ఒక లవర్స్ పారడైజ్. ఇక్కడ తరచూ లవర్స్ వస్తుంటారు. కిఫిరె సమీపంలోని సిమి గ్రామంలో సందర్శించే సమయంలో పర్యాటకులు వావాడే జలపాత కాస్కేడింగ్ నీటిని ఆనందించండి.

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

కిఫిరె కు సమీపాన 471 కి. మీ ల దూరంలో దిమాపూర్ దేశీయ విమానాశ్రయం కలదు.

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం ద్వారా అయితే 8 గంటల సమయం పడుతుంది. ఢిల్లీ, గౌహతి, కలకత్తా వంటి నగరాల నుండి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

రైలు మార్గం

కిఫిరె కు సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ దిమాపూర్. స్టేషన్ బయట స్టేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణం చేసి కిఫిరె చేరుకోవచ్చు.

బస్సు / రోడ్డు మార్గం

కిఫిరె గుండా జాతీయ రహదారి 155 వెళుతుంది. మేలూరి, కొహిమా, దిమాపూర్, మొకోచుంగ్ వంటి పట్టణాల నుండి ప్రవేట్ / ప్రభుత్వ బస్సులు లభిస్తాయి.