» »భారత దేశంలోని ఈ గ్రామంలో అమ్మాయి పుట్టిందంటే వావ్

భారత దేశంలోని ఈ గ్రామంలో అమ్మాయి పుట్టిందంటే వావ్

Written By: Venkatakarunasri

అందరూ తప్పక తెలుసుకోవలసిన ఆదర్శ గ్రామం ఇది.

అక్కడ వున్నది సామాన్య ప్రజలే అయినా వారు మహాత్ముల మాటలను చేతలలో చూపారు.

అందుకే భారతదేశానికే గాక,యావత్ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు.

ఆకాశంలో సగం, అవకాశంలో సగం అని అందరిలాగా కేవలం ఉపన్యాసాలతో ఇవ్వడం కాక, ఈ సూక్తులను ఆచరణలో పెట్టారు.

ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగేది దేవుడెరుగు.

ఆడపిల్లలకు జన్మనిచ్చేకే జంకుతున్న ఈ రోజుల్లో వారు తమ అద్భుతవిధానాలతో నిజమైన మహిళాసాధికారిత అంటే ఏమిటి?అనే విషయం యావత్ప్రపంచానికి భోదిస్తున్నారు.

ఎక్కడుంది?

ఎక్కడుంది?

ఇప్పుడు మనం చర్చిస్తున్న ఈ ఆదర్శ గ్రామం పేరు పిప్లాంత్రి. ఈ గ్రామం రాజస్థాన్ లోని రాజ్సమంద్ జిల్లాలో కలదు.ఇక్కడ గాంధీజీ,వీరేశలింగం వంటి మహాత్ములు లేరు.

అణువణువునా కనిపించే ఆదర్శాలు

అణువణువునా కనిపించే ఆదర్శాలు

కానీ వారి ఆదర్శాలు అణువణువునా కనిపిస్తుంటాయి.పిప్లాంత్రి గ్రామంలో ఆడపిల్లకు జన్మనివ్వటం అంటే ఒక భాగ్యంగా భావిస్తారు.

పండుగవాతావరణం

పండుగవాతావరణం

ఆడపిల్ల పుట్టిందంటే ఆ రోజు గ్రామంలో పండుగవాతావరణం నెలకొంటుంది.

PC:youtube

111 మొక్కలు

111 మొక్కలు

అందరూ సంతోషంగా అడవికి వెళ్లి ఆ అమ్మాయి పేరుమీద 111 మొక్కలు నాటుతారు.

PC:youtube

సంరక్షించే బాధ్యత

సంరక్షించే బాధ్యత

కేవలం మొక్కలు నాటి వదిలేయడమేకాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా వారే తీసుకుంటారు.

PC:youtube

 21000ల రూపాయలు

21000ల రూపాయలు

అంతే కాక అక్కడ పుట్టిన ప్రతి అమ్మాయికీ ఆర్థిక భద్రతను కలిగించటానికి గ్రామస్థుల వాటాగా 21000ల రూపాయలు.

PC:youtube

ఫిక్స్డ్ డిపాజిట్

ఫిక్స్డ్ డిపాజిట్

అమ్మాయి తండ్రి వాటాగా 10000ల రూపాయలు మొత్తంకలిపి అమ్మాయి పేరు మీద 20సంలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు.

PC:youtube

చదువు

చదువు

ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చేవరకు పెళ్లి చేయముఅని మరియు అమ్మాయి ఎంత వరకు చదివితే అంతవరకుఖచ్చితంగా చదివిస్తామని తల్లి తండ్రులతో ప్రమాణం చేయిస్తారు.అఫిడివిట్ కూడా రాయిస్తారు.

PC:youtube

2లక్షల 50వేల వృక్షాలు

2లక్షల 50వేల వృక్షాలు

ఈ విధానం గతకొద్ది సంలుగా కొనసాగుతున్నవి.ఈ విధంగా పిప్లాంత్రి గ్రామస్థులు ఇప్పటి వరకు 2లక్షల 50వేల వృక్షాలు పెంచారు.

PC:youtube

అలోవీరా మొక్కలు

అలోవీరా మొక్కలు

అంతేకాకుండా వాటి చుట్టుపక్కల దాదాపుగా 20,000 అలోవీరా మొక్కలు నాటి వాటి నుండి అలోవీరా జ్యూస్,జెల్ మరియు అలోవీరా పచ్చళ్ళను తయారుచేసి వాటిని మార్కెట్ చేయటంద్వారా స్వయం వృద్ధిని సాధిస్తున్నారు.

PC:youtube

 11మొక్కలు

11మొక్కలు

ఈ పర్యావరణ ప్రేమికులు గ్రామంలో ఎవరన్నా చనిపోతే వారి గుర్తుగా 11మొక్కలను కూడా పెంచుతారు.

PC:youtube

గ్రామ సర్పంచ్

గ్రామ సర్పంచ్

ఈ విధానాన్ని పిప్లాంత్రి గ్రామ సర్పంచ్ శ్యాంసుందర్ గారు మొదలుపెట్టారు.

PC:youtube

ఆదర్శవిధానం

ఆదర్శవిధానం

శ్యాంసుందర్ గారి గారాలకుమార్తె కిరణ్ అకస్మాత్తుగా మరణించినప్పటి నుండి గ్రామప్రజలందరినీ ఒప్పించి ఈ ఆదర్శవిధానానికి శ్రీకారం చుట్టారు.ఆయన.

PC:youtube

మహిళల రక్షణ

మహిళల రక్షణ

అంతేకాక ఈ ఆదర్శగ్రామస్థులు గృహహింస నుండి మహిళలను రక్షించటానికి,కుటుంబ ఆర్ధికవ్యవస్థను మెరుగు పరచటానికి ఆ గ్రామంలో మధ్యపానాన్ని కూడా నిషేదించారు.

PC:youtube

గ్రామప్రజల ఔన్నత్యం

గ్రామప్రజల ఔన్నత్యం

గత 6,7సంలుగా ఈ గ్రామంలో ఒక్క పోలీస్ కేసు కూడా నమోదుకాకపోవటం ఆ గ్రామప్రజల ఔన్నత్యానికి నిదర్శనం.దీంతో యావత్ప్రపంచదృష్టి పిప్లాంత్రి గ్రామంపై పడింది.

PC:youtube

లక్షల గ్రామాలు

లక్షల గ్రామాలు

అనేకమంది సామాజిక కార్యకర్తలు,ఔత్సాహికులు తమతమ గ్రామంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.మన దేశంలో కొన్ని లక్షల గ్రామాలున్నాయి.

PC:youtube

గాంధీజీ కాలలుకన్న గ్రామ స్వరాజ్యం

గాంధీజీ కాలలుకన్న గ్రామ స్వరాజ్యం

వీటిలో కొన్ని వేల గ్రామాలైనా సరే పిప్లాంత్రి గ్రామం యొక్క ఆదర్శ బాట పట్టాలంటే కొద్దిరోజులలోనే మహిళా సాధికారితను సాధించటంద్వారా దేశం అగ్రరాజ్యం అవ్వటంఖాయందేశానికి పట్టు కొమ్మలైన ప్రతి గ్రామంలో కూడా ఈ విధానాన్ని అమలుపరచటానికి చొరవతీసుకోవాలి.అప్పుడే గాంధీజీ కాలలుకన్న గ్రామ స్వరాజ్యం సాకారమౌతుంది.

PC:youtube