Search
  • Follow NativePlanet
Share
» »కేరళలో ఈ ఆహారపదార్థాలను రుచి చూశారా?

కేరళలో ఈ ఆహారపదార్థాలను రుచి చూశారా?

కేరళలో సంప్రదాయా వంటకాల గురించి కథనం.

టూర్ అన్న తక్షణం మనకు గుర్తుకు వచ్చే ప్రదేశాల్లో మొదటి మూడు ప్రాంతాలు కేరళా రాష్ట్రానికి చెందినవి అయ్యి ఉంటాయి. ఇక ఆయా ప్రాంతాలకు పర్యాటకానికి వెళ్లినప్పుడు అక్కడ దొరికే ప్రత్యేకమైన తిండి తినాలని, స్థానిక ఆహార పదార్థాల రుచి చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఈ నేపథ్యంలో కేరళలో ప్రసిద్ధి చెందిన వంటకాల్లో కొన్ని ముఖ్యమైనవి మీ కోసం

ఇడియప్పమ్

ఇడియప్పమ్

P.C: You Tube

కేరళలో ఇడియప్పమ్ చాలా ప్రాచూర్యం చెందినది. దీనిని నూలప్పం అని కూడా పిలుస్తారు. బియ్యపు పిండి, ఉప్పు, నీటిని వినియోగించి ఈ ఆహారపదార్థాన్ని తయారుచేస్తారు. ఈ ఇడియప్పమ్ కోడిగుడ్డ వినియోగించి తయారుచేసిన కూరతో చాలా రుచిగా అనిపిస్తుంది.

పుట్టు

పుట్టు

P.C: You Tube

పుట్టు కేరళలో ప్రాచూర్యం పొందిన ప్రసిద్ధి వంటకం. కొబ్బరి, బియ్యపు పిండిని వినియోగించి ఈ పుట్టును తయారుచేస్తారు. పచ్చి అరటి, పళ్లీలు తదితర పదార్థాలతో తయారుచేసిన కర్రీతో పాటు పుట్టు తినడాన్ని చాలా మంది ఇష్టపడుతారు.

తలస్సేరి బిర్యానీ

తలస్సేరి బిర్యానీ

P.C: You Tube

కేరళలో వివిధ బిర్యానీలతో పోలిస్తే తలస్సేరి బిర్యానీ చాలా ఫేమస్. బిర్యానీకి వినియోగించే పదార్థాలనే ఈ తలస్సేరి బిర్యానీకి వినియోగిస్తారు. అయితే వండే విధానం, పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. అందువల్లే తలస్సేరి బిర్యాని రుచి వేరుగా ఉంటుంది. చికెన్ 65, చిల్లీ చికెన్ ఈ తలస్సేరి బిర్యానీకి సైడ్ డిష్‌గా బాగుంటుంది.

రొయ్యల కూర

రొయ్యల కూర

P.C: You Tube

కేరళ సంప్రదాయ వంటకాల్లో రొయ్యల కూర చాలా ఫేమస్. కొబ్బరిపాలను కలిపి ఈ రొయ్యల కూరను వండుతారు. సీ ఫుడ్ అంటే ఇష్టపడేవారికి ఈ రొయ్యల కూర చాలా బాగా నచ్చుతుంది. కేరళకు వెళ్లిన మాంసాహార ప్రియులు రొయ్యల కూరను తినకుండా వెనక్కురాలేరు. మరప్పురం లాంటి ప్రదేశాల్లో రొయ్యల కూర వండే సమయంలో బెల్లం కూడా వినియోగిస్తారు.

చేపల కూర

చేపల కూర

P.C: You Tube

కేరళ అంటే సముద్రతీర రాష్ట్రం. ఇక్కడ దొరికినన్ని చేపల రకాలు మరెక్కడా దొరకవు. అందువల్లే కేరళలో ఈ చేపలతో చేసే వంటకాలు చాలా ఫేమస్. ఇక్కడ చేపలతో పికిల్స్ కూడా తయారుచేస్తారు. మాంసాహార ప్రియులు ఇక్కడికి వెళితే చేపలతో చేసిన వంటకాలను తప్పకుండా రుచి చూసి వస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X