Search
  • Follow NativePlanet
Share
» »సూర్యాస్తమయ అందాలను పొదివి పట్టుకోడానికి... చలో కేరళ!

సూర్యాస్తమయ అందాలను పొదివి పట్టుకోడానికి... చలో కేరళ!

కేరళలో సూర్యాస్తమాయాలు అందంగా కనిపించే పర్యాటక కేంద్రాలకు సంబంధించిన కథనం.

By Gayatri Devupalli

సూర్యుని యొక్క రంగురంగుల కిరణాలలో తడిసిన దిగంతాల యొక్క సౌందర్యాన్ని మీరు చూడాలని కోరుకుంటే, అప్పుడు ఖచ్చితంగా దర్శించాల్సిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. గోధూళి వేళ, మెరిసే నీటి చెంత ఉండే వాతావరణం యొక్క అందాన్ని మాటల్లో వర్ణించలేము. భారతదేశంలోని ఇటువంటి అందాలను ఒడిసి పట్టుకున్న అతి కొద్ది ప్రదేశాలలో కేరళ ఒకటి.సముద్రతీరాలు మరియు సాయంసంధ్యల గురించి చర్చించుకుంటే, కేరళ ఖచ్చితంగా ఆ చర్చకు అర్హత పొందిన ప్రదేశం అవుతుంది. ప్రశాంతమైన సాయంత్రాలు మరియు అందమైన సూర్యాస్తమయ అనుభవాలను ఒకే చోట పొందిక చేసుకోవాలంటే, కేరళలోని ఈ ప్రదేశాలను తప్పక చూసి తీరాల్సిందే! కేరళలోని సూర్యాస్తమయ గమ్యాల గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి ఇక....

బెకల్ బీచ్

బెకల్ బీచ్

P.C: You Tube

మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి మరియు ప్రకృతి యొక్క అనూహ్యమైన అందానికి మిమ్మల్ని దాసోహం చేసుకోడానికి బెకల్ బీచ్ సరైన ప్రదేశం. పర్యాటకులు మరియు ప్రయాణికులతో ఎల్లప్పుడూ రద్దీగా ఉన్నప్పటికి కూడా, ఈ సముద్ర తీరంలో ప్రశాంతమైన వాతావరణంలో సూర్యాస్తమయ సమయాన్ని ఆనందించవచ్చు. గాఢమైన వర్ణాలను ముద్దాడే భానుకిరణాలలో తడిసి ముద్దవ్వవచ్చు. కనుక, ఈ వారాంతం బెకల్ సముద్ర తీరాలలో అద్భుతంగా గడిపి వద్దామా?

కొల్లం:

కొల్లం:

P.C: You Tube

గత కొన్ని సంవత్సరాలుగా, కొల్లం జాతీయ మరియు అంతర్జాతీయ పర్యాటకుల పెదవులపై వినిపించే సాధారణ పేరుగా మారింది. రద్దీ తక్కువగా ఉండటం మరియు ప్రశాంతమైన వాతావరణం కారణంగా ఇది ప్రకృతి ప్రేమికుల వేసవి మజిలీగా మారింది. సూర్యాస్తమయ సమయంలో, నిర్మలమైన ఆకాశాన్ని అలంకరించే అందమైన ఎరుపు మరియు పసుపు రంగు భానురేఖలు అరేబియా సముద్రపు నీలిరంగు నీటిలో ప్రతిబింబించేటప్పుడు, ఏర్పడే వర్ణచిత్ర అందాన్ని మనసులో నింపుకోవడానికి రెండుకళ్ళు చాలవు.

 కాలికట్ ( కోళికోడ్):

కాలికట్ ( కోళికోడ్):

P.C: You Tube

పర్యాటకానికి ఎంతో ప్రసిద్ధి చెందిన కాలికట్ లో, అందమైన నీటి కయ్యలు (బ్యాక్ వాటర్స్) మరియు తాటి చెట్లు నడుమ సూర్యాస్తమయ సౌందర్యాన్ని ఖచ్చితంగా, మనస్ఫూర్తిగా ఆస్వాదించవచ్చు. భగవంతుడి స్వంతదేశంగా చెప్పుకునే కేరళలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు ఒకటైన కాలికట్ లో, సముద్ర కెరటాల హోరు నడుమ, నీటిపై ఊదా రంగు కాంతులు ప్రసరింపజేస్తూ, పొద్దుగూకే సూర్యుని అందాలను ఎంతసేపు గాంచినా తనివితీరదు. నీటి తరంగాల సవ్వడి మధ్య గూటి పడవలో (హౌస్ బోట్) ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, అద్భుత అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

కాసర్గోడ్:

కాసర్గోడ్:

P.C: You Tube

పశ్చిమ కనుమలలో ఉన్నతమైన జీవవైవిధ్యానికి కాసర్గోడ్ ఇటీవల ప్రసిద్ది చెందింది. ఈ ప్రదేశం చారిత్రిక కట్టడాలు మరియు కాలుష్యానికి చిక్కని నిర్మలమైన సముద్ర తీరాలకు ప్రసిద్ధి చెందింది కనుక, కాసర్గోడ్ లో సముద్ర తీరం వద్ద గడిపేటప్పుడు, సూర్యాస్తమయాన్ని అద్భుతంగా వీక్షించే అవకాశం దొరకడం సర్వసాధారణం. అయితే, కాసర్గోడ్ లో మీరు వైవిధ్యమైన అనుభూతిని పొందవచ్చు.

కాసర్గోడ్ లో పర్యటన విధానం:

కాసర్గోడ్ లో పర్యటన విధానం:

P.C: You Tube

అద్భుతమైన అందంతో కూడుకున్న సూర్యాస్తమయంను వీక్షించడానికి, దాని తీరాన్ని మీరు సందర్శించవలసిన అవసరం లేదు. పట్టణంలోని ఏ మూల నుండైనా, నులివెచ్చని కిరణాలు నీటిలోకి ఒదిగిపోయేట్టు ఉండే సూర్యాస్తమయ అందాలను గాంచవచ్చు.

 కొచ్చిన్ మెరైన్ డ్రైవ్:

కొచ్చిన్ మెరైన్ డ్రైవ్:

P.C: You Tube

పొడవైన భవంతులను చూస్తూ, నాట్యమాడే అలలు పరచుకుని ఉన్న నీటి కయ్యల పక్కన సేదతీరుతూ, సంధ్యా సమయ సౌందర్యాన్ని ఆనందించడం కంటే అందమైన అనుభూతి ఇంకెక్కడ ఉంది? కొచ్చిలోని మెరైన్ డ్రైవ్, స్థానికుల సాయంత్ర వ్యాహాళికి సరైన గమ్యస్థానం. నగరంలో ఉంటూ కూడా, అక్కడి రణగొణధ్వనులకు దూరంగా, విరామం తీసుకునేందుకు ఇక్కడకు తరలి వచ్చిన ప్రజలతో, గుమికూడి ఉన్న ప్రదేశాన్ని మీరు గమనించవచ్చు.

రంగులతో మెరిసే నీటిలో

రంగులతో మెరిసే నీటిలో

P.C: You Tube

మీరు కొచ్చి నగరంలో కొన్ని సుందరమైన ప్రదేశాలను సందర్శించాలనుకుంటే, మెరైన్ డ్రైవ్ అందుకు తగిన ప్రదేశం. సూర్యకిరణాల యొక్క ప్రకాశవంతమైన రంగులతో మెరిసే నీటిలో, తమ ప్రతిబింబాలు చూసుకుని మైమరచే, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరింపబడిన పొడుగాటి భవనాల యొక్క దృశ్యం, కొచ్చిలోని మన మెరైన్ డ్రైవ్ పర్యటనను హృద్యంగా మలుస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X