Search
  • Follow NativePlanet
Share
» »ఒక్కసారైనా పర్యటించాలనిపించే గోపాల్పూర్‌ బీచ్‌...

ఒక్కసారైనా పర్యటించాలనిపించే గోపాల్పూర్‌ బీచ్‌...

ఒక్కసారైనా పర్యటించాలనిపించే గోపాల్పూర్‌ బీచ్‌...

ఒడిషా భారతదేశ భూభాగంలో ఒక రాష్ట్రం. బంగాళాఖాతం దీనికి చేరువలో ఉన్న సముద్రం. సంస్కృతికి, వారసత్వానికి సంబంధించిన ప్రదేశాలు భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాయా ... అంటే ఆది ఒడిషా మాత్రమే. ఈ రాష్ట్రం చాలా నిర్మానుష్యంగా, ప్రశాంతంగా ఉంటుంది.

ఒడిషాలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒడిషా రాజధాని భువనేశ్వర్ ఒకటి. ఇక్కడ సుమారు 1000 ఆలయాలకుపైనే ఉన్నాయి. కనుకనే దీనిని మందిరాల నగరం అని పిలుస్తారు. దేశంలో కెల్లా ప్రఖ్యాతి చెందిన రెండు ఆలయాలు సైతం ఈ ఒడిషాలోనే ఉన్నాయి. వాటిలో ఒకటి పూరీ జగన్నాథ్ ఆలయం, మరొకటి కోణార్క్ లోని సూర్య దేవాలయం. వీటితో పాటుగా గుహలు, అభయారణ్యాలు, వారసత్వ ప్రదేశాలు ఆధ్యాత్మిక ప్రదేశాలు మరియు సాహస ప్రదేశాలు, బీచ్ లు కలిగి ఉన్నాయి.

ఒరిస్సా రాష్ట్రంలోని మూడు ప్రసిద్ధ పర్యాటక బీచ్ ప్రదేశాలలో 'గోపాల్పూర్‌'

ఒరిస్సా రాష్ట్రంలోని మూడు ప్రసిద్ధ పర్యాటక బీచ్ ప్రదేశాలలో 'గోపాల్పూర్‌'

ఒరిస్సా రాష్ట్రంలోని మూడు ప్రసిద్ధ పర్యాటక బీచ్ ప్రదేశాలలో 'గోపాల్పూర్‌' ఒకటి. ఇది ఒరిస్సాలోని దక్షిణ సరిహద్దులైన్లపై వున్న ఒక కోస్తా పట్టణం. ఇది బంగాళఖాతానికి చాలా సమీపంలో వుండడంవల్ల ఎంతో ప్రసిద్ధి చెందింది. కాలంతో పని లేకుండా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని ఎల్లప్పుడూ సందర్శిస్తూ ఉంటారు. గోపాల్పూర్‌ ప్రాంతం సాధారణంగా సంవత్సరం పొడవునా సందర్శించడానికి చాలా ఆహ్లాదకరంగానే వుంటుంది. అయితే చాలామంది అక్టోబర్‌ నుంచి ఏప్రిల్‌ మధ్యలోనే పర్యటించేందుకు మక్కువ చూపిస్తారు.

Photo Courtesy : commons.wikimedia.org

పూర్వం గోపాల్పూర్‌ ను మత్స్యకారుల గ్రామంగా పిలిచేవారు

పూర్వం గోపాల్పూర్‌ ను మత్స్యకారుల గ్రామంగా పిలిచేవారు

ఈ ప్రదేశం బంగాళాఖాతానికి సమీపంలో ఉంది. ఇది ఒడిషా కు దక్షిణ సరిహద్దు లో ఉన్న కోస్తా పట్టణం. ఒరిషా రాష్ట్రంలోని మూడు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి గోపాల్పూర్‌. పూర్వం గోపాల్పూర్‌ ను మత్స్యకారుల గ్రామంగా పిలిచేవారు. ఇది మంచి వ్యాపార కేంద్రం. షాపింగ్‌ ప్రియులు ఈ పట్టణానికి ఎక్కువగా వస్తారు. గోపాల్పూర్‌ సముద్రపు గవ్వలతో తయారు చేసిన బ్రేస్‌లెట్‌లు, నెక్లెస్‌లు, పట్టుచీరల వంటి హస్తకళల కు ప్రసిద్ధి చెందింది.

Photo Courtesy : commons.wikimedia.org

జీవితంలో ఒక్కసారైనా పర్యటించాలని

జీవితంలో ఒక్కసారైనా పర్యటించాలని

గోపాల్పూర్‌ ప్రాంతంలో షాపింగ్‌ చేయడానికి చాలా షాపింగ్‌ మాల్స్‌ వుంటాయి. పిల్లలకు కావల్సిన ఆటబొమ్మల నుంచి ఆడవాళ్లకు అవసరమైన పట్టుచీరలు, ఆభరణాలవరకు అనేక రకాలు తక్కువ ధరలకే దొరుకుతాయి. కాబట్టి ఇటువంటి ప్రాంతాన్ని జీవితంలో ఒక్కసారైనా పర్యటించాలని అందరూ ఆసక్తిగా వుంటారు.

Photo Courtesy : commons.wikimedia.org

ఈ బీచ్ లో గుర్రం సవారీ, క్రుయిసింగ్, బాడీ మసాజ్

ఈ బీచ్ లో గుర్రం సవారీ, క్రుయిసింగ్, బాడీ మసాజ్

సెలవుల్లో కుటుంబం, స్నేహితులతో సందర్శించడానికి ఖచ్చితమైన ప్రదేశం గోపాల్పూర్ బీచ్. ఈ బీచ్ ద్వారా ప్రకృతికి చేరువవ్వచ్చు. ఈ సముద్రంలో స్నానం చేసి బాగా ఆనందించవచ్చు. భారతదేశంలో కొన్ని బీచ్ లు ఉన్నాయి వాటిలో ఈ బీచ్ వినోదాన్ని అందిస్తుంది, ఇది సందర్శకులకు ఒక గొప్ప అనుభవం. ఈ బీచ్ లో గుర్రం సవారీ, క్రుయిసింగ్, బాడీ మసాజ్ ఇంకా ఎన్నో వివిధ రకాల వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి.

Photo Courtesy : commons.wikimedia.org

సాయంత్రం పూట ఇక్కడ సూర్యాస్తమ సమయంలో

సాయంత్రం పూట ఇక్కడ సూర్యాస్తమ సమయంలో

సాయంత్రం పూట ఇక్కడ సూర్యాస్తమ సమయంలో ఇక్కడి దృశ్యాలు పర్యాటకులకు గొప్ప అనుభవాన్ని ఇస్తాయి. తరంగాల కలయిక లయను అనుసరిస్తాయి. బీచ్ నుండి తరంగాలను గమనించడం, కొబ్బరినీళ్ళు తాగుతూ ఆనందించడం వంటివి పర్యాటకులకు పూర్తి సంతృప్తిని ఇస్తాయి.

Photo Courtesy : commons.wikimedia.org

లైట్హౌస్

లైట్హౌస్

ఇక్కడ ఒక పురాతన లైట్హౌస్ కూడా ఉంది, ఈరోజుకీ అది వెలుగుతూ లోతైన సముద్రంలోకి వెళ్ళిన నౌకలకు దారిచూపిస్తుంది.

Photo Courtesy : commons.wikimedia.org

రేవుపట్టణం

రేవుపట్టణం

ఒకప్పుడు ఈ ప్రాంతం సముద్రతీరంలో వుంది గనుక మత్స్యకారుల ప్రదేశంగా పిలువబడేది. అయితే బ్రిటీష్‌ వారు అప్పట్లో ఈ ప్రాంతాన్ని ఆక్రమించి, వర్తకవ్యాపార కేంద్రంగా మార్చేసుకున్నారు. అప్పటినుంచి ఇది రేవుపట్టణంగా పిలవబడుతోంది.

Photo Courtesy : commons.wikimedia.org

మాతారా తరిణి హిల్‌ మందిరం

మాతారా తరిణి హిల్‌ మందిరం

ఈ ప్రదేశంలో ఆకర్షణీయమైన ఇతర ప్రాంతాలు కూడా చాలా వున్నాయి. మా తారా తరిణి హిల్ మందిరం దేశం మొత్తంలో మా తారా పురాతన ఆలయాలలో ఒకటిగా భావించబడింది. ఇది గోపాల్పూర్ కోస్తా పట్టణం నుండి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోని రిశికుల్య నది ఒడ్డుపై కుమారి హిల్స్ పై ఉంది. ఇక్కా ఇక్కడ , బాలాకుమారి ఆలయం, శ్రీశ్రీశ్రీ సిద్ధివినాయక పీఠంతోపాటు ఎంతో ఆధ్యాత్మికమైన, ధార్మిక ప్రదేశాలు ఇక్కడ చూడటానికి ఆకర్షణీయంగా వుంటాయి.

Photo Courtesy : commons.wikimedia.org

సోనెపూర్‌ బీచ్‌

సోనెపూర్‌ బీచ్‌

సోనెపూర్‌ బీచ్‌, అర్యపల్లి బీచ్‌, గోపాల్పూర్‌ బీచ్‌ వంటి ప్రాంతాలను సందర్శించడానికి వేలాదిమంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అందువల్ల దీనిని ఓ స్వర్గవిహార ప్రదేశం అంటారు.

Photo Courtesy : commons.wikimedia.org

ఆర్యపల్లి బీచ్

ఆర్యపల్లి బీచ్

ఒరిస్సా లో అత్యంత ప్రసిద్ది చెందిన బీచ్ ఆర్యపల్లి బీచ్. గోపాల్పూర్ బీచ్ సందర్శించే వారు ఆర్యపల్లి బీచ్ ని కూడా సందర్శించాలి, సూర్యాస్తమ సమయంలో వచ్చే భారీఅలల అందమైన దృశ్యాలకు ప్రసిద్ది చెందింది.

Photo Courtesy : commons.wikimedia.org

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X