» »ఆశ్చర్యకరమైన ధ్వజస్తంభం యొక్క రహస్యం మీకు తెలుసా?

ఆశ్చర్యకరమైన ధ్వజస్తంభం యొక్క రహస్యం మీకు తెలుసా?

Written By: Venkatakarunasri

LATEST: వెనక్కి తిరిగి చుస్తే ఆ ఆలయ గోపురం మీ వెనకాలే వస్తుంది ఎక్కడో తెలుసా?

కన్నీరు పెడుతున్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం !

పురాణాలలో శిబిచక్రవర్తి గురించి చాలా కథలు విన్నాం. ఒక పావురాన్ని రక్షించటం కోసం తన తొడను కోసి ఇచ్చిన శిబిని గొప్ప దాతగా గుర్తిస్తారు అందరూ. శిబి తలచుకుంటే తన రక్తం చిందించకుండానే ఆ పావురాన్ని రక్షించేవాడేమో !

గానీ తానే త్యాగాన్ని చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు తన ధర్మాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు దేనికైనా వేరువకపోవడమే శిబి చరిత్ర నేర్పిన పాఠం. అలాంటి మరో పాత్ర మన మహాభారతంలో కూడా కనిపిస్తుంది. అదే మయూరధ్వజుడి కధ.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

క్షత్రియ ధర్మం

క్షత్రియ ధర్మం

మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం జరిగిన తరువాత క్షత్రియ ధర్మం ప్రకారం అశ్వమేథయాగం చేయాలని పాండవులు నిర్ణయించుకుంటారు.

pc: youtube

యాగాశ్వం

యాగాశ్వం

పాండవులు వదిలిన యాగాశ్వాన్ని ఆపే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోయారు. ధైర్యం చేసినా పాండవులతో యుద్ధం చేసి నిలువలేకపోయాడు.

pc: youtube

మణిపురి

మణిపురి

ఇంతలో యాగాశ్వం మణిపురి చేరుకుంది. ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు శ్రీకృష్ణునికి పరమభక్తుడైన మయూరధ్వజుడనే రాజు. అపర పరాక్రమవంతుడైన ఆ మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు.

pc: youtube

క్షత్రియధర్మం

క్షత్రియధర్మం

మణిపురానికి రక్షగా వున్న సమయంలో యాగాశ్వం ఆ రాజ్యానికి ప్రవేశించింది. తామ్రధ్వజునికి పాండవుల మీద వారి ధర్మప్రవర్తన మీద గౌరవం వున్నా క్షత్రియధర్మాన్ని అనుసరించి ఆ యాగాశ్వాన్ని బంధించి వేశాడట.

pc: youtube

అశ్వమేధయాగం

అశ్వమేధయాగం

అంతా సాఫీగా సాగిపోతున్న తమ అశ్వమేధయాగానికి అడ్డంకి వచ్చేసరికి పాండవులకు ఎక్కడలేని కోపం వచ్చిందట. మొత్తం సైన్యమంతా అశ్వాన్ని విడిపించుకునేందుకు సిద్ధపడ్డారు.

pc: youtube

ధర్మ రాజు

ధర్మ రాజు

కానీ ఆశ్చర్యం ఏమిటంటే వారందరూ కలిసి పోరు చేసినా తామ్రధ్వజుని ఓడించలేకపోయారు.దాంతో ధర్మ రాజు ఒక్కసారిగా పడిపోయాడు.

pc: youtube

 మయూరధ్వజుడు

మయూరధ్వజుడు

ఆ రాత్రి కృష్ణుని దగ్గర చేరుకొని ఉపాయం అడిగాడట. దానికి కృష్ణుడు తన భక్తుడైన మయూరధ్వజుడు రాజ్యాన్ని కోల్పోవడం అయ్యే పని కాదు.

pc: youtube

బ్రాహ్మణ వేషాలు

బ్రాహ్మణ వేషాలు

కాబట్టి అతను అడ్డు తొలగించేందుకు ఒక ఉపాయాన్ని సూచించాడు. దీని మేరకు మరుసటి రోజు ఉదయం వారిద్దరూ బ్రాహ్మణ వేషాలు ధరించి మయూరధ్వజుని అంతఃపురానికి చేరుకున్నారు.

pc: youtube

మయూరధ్వజుడు

మయూరధ్వజుడు

వారిద్దరినీ మయూరధ్వజుడు సంతోషంగా ఆహ్వానించాడు. రాజు వారితో మాట్లాడటమే ఆలస్యం.

pc: youtube

షరతు

షరతు

రాజా ! మేము మీ అతిధి సత్కారాల కోసం రాలేదు. మేము ఒక అడవిగుండా మీ రాజ్యం వైపు వస్తుండగా ఒక సింహం ఇతని కుమారుడ్ని పట్టుకుంది.పైగా అది కుమారుడ్ని విడిచిపెట్టాలంటే ఒక షరతును పెట్టింది అన్నాడు.

pc: youtube

మయూరధ్వజుడు

మయూరధ్వజుడు

విప్రవేషంలో వున్న కృష్ణుడు. దానికి మయూరధ్వజుడు ఆ షరతు ఏమిటో చెప్పండి తక్షణమే తీరుద్దాం.

pc: youtube

షరతు

షరతు

అప్పుడు కృష్ణుడు రాజా! మీ శరీరంలో సగభాగాన్ని అందిస్తే ఆ పిల్లవాడిని విడిచిపెడతానన్నదే ఆ షరతు. మయూరధ్వజుడు దానికి భయపడకుండా అయ్యో అదెంత భాగ్యం మరో జీవితాన్ని కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతుంది అంటే తక్షణమే ఆ షరతును తీరుద్దాం అన్నాడు.

pc: youtube

మయూరధ్వజుడు

మయూరధ్వజుడు

సేవకులు మయూరధ్వజుని ఆదేశం మేరకు అతని శరీరంలో సగభాగాన్ని చేధిస్తుండగా మయూరధ్వజుని ఎడమకంటి నుండి నీరు కారుతుండటం ధర్మరాజు గమనించి వెంటనే రాజా ఈ దానం మీకు ఇవ్వటం ఇష్టం లేనట్టుగా వున్నది.

pc: youtube

మయూరధ్వజుడు

మయూరధ్వజుడు

ఇలా బాధపడుతూ ఇచ్చిన దానం చెల్లదు అంటాడు. దానికి మయూరధ్వజుడు విప్రోత్తమా ! దానం చేయడం ఇష్టం లేక వచ్చిన కన్నీరు కాదిది.

pc: youtube

నాటకం

నాటకం

నా కుడిభాగం ఎవరోఒకరికి ఉపయోగపడుతుంది కానీ ఎడమభాగం ఏ ఉపయోగమూ లేకుండానే నాశనం ఐపోతోంది కదా అన్నదే నా ఆలోచన అన్నాడట. మయూరధ్వజుని జవాబుకి ధర్మరాజు నివ్వెరపోయాడు.అతని ధర్మ నిరతిని పరీక్షించేందుకే కృష్ణుడు ఈ నాటకం ఆడాడని గ్రహించాడు.

pc: youtube

నిరుపమానం

నిరుపమానం

అప్పుడు కృష్ణుడు మయూరధ్వజునికి తన నిజస్వరూపం చూపించి మయూరధ్వజా! నీ వ్యక్తిత్వం నిరుపమానం. నీ కేం కావాలో కోరుకో అంటూ చిరునవ్వులు చిందించాడు.

pc: youtube

మయూరధ్వజుడు

మయూరధ్వజుడు

దానికి కృష్ణా! ఈ శరీరం నశించిపోయినా కూడా నా ఆత్మ చిరకాలం నీ సాన్నిధ్యంలో వుండేలా అనుగ్రహించు తండ్రీ అని వేడుకున్నాడు మయూరధ్వజుడు.

pc: youtube

భక్తులు

భక్తులు

ఇక నుంచీ దైవం వుండే ప్రతిదేవాలయం ముందు నీ ప్రతిరూపం వుంటుంది. భక్తులు ముందుగా దానికి మొక్కినతరువాతనే నన్ను దర్శించుకుంటారు.

pc: youtube

కృష్ణపరమాత్ముడు

కృష్ణపరమాత్ముడు

నీ ముందు దీపాన్ని వుంచి తమ జీవితాన్ని సార్ధకం చేసుకుంటారు అంటూ సెలవిచ్చాడు కృష్ణపరమాత్ముడు.

pc: youtube

 ధ్వజస్తంభం

ధ్వజస్తంభం

ఇప్పటికీ ప్రతి దేవాలయం ముందు వుండే ధ్వజస్తంభమే ఆ మయూరధ్వజునికి ప్రతిరూపం. దేవతలకు సైతం దారి చూపుతూ ఉత్సవాలకు సైతం ఆరంభాన్ని అందిస్తూ దైవానికి నిలువెత్తు కీర్తిపతాకంగా నిలిచే ఆ ధ్వజస్తంభం మయూరధ్వజుని వ్యక్తిత్వానికి ప్రతి రూపం.

pc: youtube

Please Wait while comments are loading...