» »ప్రకృతి చెక్కిన శిల్పాలు

ప్రకృతి చెక్కిన శిల్పాలు

Written By: Venkatakarunasri

శిల్పులు చెక్కిన శిలలను చూసి ఓహో అంటాం. మరి ప్రకృతి కూడా మంచి శిల్పే తెలుసా! ఎలాగంటారా?

ఎన్నో జంతువులను చక్కగా చెక్కింది కాబట్టి అదేంటీ ప్రకృతి జంతువులను చెక్కడం ఏంటి? అననుకుంటున్నారా? ఇప్పుడు మనం ప్రకృతి చెక్కిన శిల్పాల గురించి తెలుసుకుందామా మరి!

Latest: కలియుగ అంతానికి కారణమయ్యే గుడి

భద్రాచలం గుడికి సంభందించిన 10 నమ్మలేని నిజాలు !

ప్రకృతి చెక్కిన శిల్పాలు - మీరు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన అందమైన ప్రదేశాలు !

ఇది కూడా చదవండి: ఈసారి షిర్డీ వెళితే ఈ ప్రదేశాలను తప్పక చూసిరండి !

శనిషింగనాపూర్ - తలుపులు లేని నగరం !

1. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్

1. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్

ఏనుగును కొండంత ఆకారం అంటుంటాం మరి నిజంగానే ఒక కొండ ఏనుగులా వుంది తెలుసా? మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వెళితే కనిపిస్తుంది.

జీవితంలో ఒకసారైనా దర్శించాలనుకొనే యాత్ర : అష్టవినాయక !

pc:youtube

2. ఎలిఫెంట్ హెడ్ పాయింట్

2. ఎలిఫెంట్ హెడ్ పాయింట్

ఓ కొండ అంచు అచ్చం ఏనుగు తలలా ఏర్పడింది. దీనిని ఎలిఫెంట్ హెడ్ పాయింట్ అని కూడా అంటారు.

సేవాగ్రాం - గుర్తొచ్చే గాంధీజీ జ్ఞాపకాలు !

pc:youtube

3. ఏనుగుపై అంబారీ

3. ఏనుగుపై అంబారీ

కృష్ణానదీ జన్మస్థానమైన ఈ ప్రాంతంలో ఈ ఏనుగు కొండ మంచి పర్యాటక ఆకర్షణగా మారింది. ఏనుగుపై అంబారీ వున్నట్టు ఏనుగు తల ఆకారంలో వున్న ఈ కొండపై పర్యాటకులు నిలుచొని చూడటానికి ఒక వ్యూ పాయింట్ కూడా ఏర్పాటుచేశారు.

సిద్ది వినాయకుడు ఆలయం గురించి మీకు తెలియని కొన్ని నిజాలు !

pc:youtube

4.వేసవిలో ఈ కొండ నల్లగా

4.వేసవిలో ఈ కొండ నల్లగా

వేసవిలో ఈ కొండ నల్లగా ఏనుగులాగానే కనిపిస్తుంది. కానీ వర్షాకాలం వచ్చేసరికి మొక్కలు పెరిగి ఇదే ఆకారం పచ్చగా మారిపోతుంది.

సాయిబాబా ఎక్కడ పుట్టారో తెలుసా ?

pc:youtube

5. మంగోలియాలోని గొర్కి తెరల్జ్ జాతీయపార్క్

5. మంగోలియాలోని గొర్కి తెరల్జ్ జాతీయపార్క్

తాబేలు నడుస్తున్నట్టువున్న ఈ రాయి మంగోలియాలోని గొర్కి తెరల్జ్ జాతీయపార్క్ లో వుంది. దీని పేరు టార్టిల్ రాక్. ఈ తాబేలు రాయి ప్రధాన పర్యాటక ఆకర్షణకేంద్రంగానిలుస్తోంది.

pc:Brücke-Osteuropa

6. ఆకర్షణలు

6. ఆకర్షణలు

రాక్ క్లైమ్బర్స్ ఎక్కడానికి ఉత్సాహం చూపుతారు. ఇదే కాక ఇక్కడ ఎన్నో ఆకర్షణలు వున్నాయి.

pc:Brücke-Osteuropa

7. కేమల్ రాక్

7. కేమల్ రాక్

అచ్చం ఒంటెలా వున్న ఈ రాయిని అంతా "కేమల్ రాక్" అంటారు. ఇది అమెరికాలోని "శాంతా ఫి కౌంటి" అనే ప్రాంతంలో వుంది. అయితే ఇదంతా ఒకే శిల నుంచి ఏర్పడింది కాదు.

ముంబైలో చినుకు పడితే...?

pc:Mike Tungate

8.100 అడుగులు

8.100 అడుగులు

బోలెడు రాళ్ళతో ఏర్పడిన ఓ చిన్నపాటి కొండ. దానిముందు ఒంటె తల లాంటి ఆకారం దూరం నుండి చూస్తే ఇది కూర్చొని వున్న ఒంటెలా కనిపిస్తుంది. ఈ ఒంటె తలే 100 అడుగులకు పైగా ఎత్తుంది.

pc:Cathy

9. రాళ్ళు కప్పల్లా వుండటం

9. రాళ్ళు కప్పల్లా వుండటం

మెక్సికోలోని కాపర్ కెనియన్ ప్రాంతంలో "వ్యాలీ ఆఫ్ ఫ్రాగ్స్" అనే ప్రాంతం వుంది. ఇక్కడ దాదాపు అన్ని రాళ్ళు కప్పల్లా వుండటం విశేషం అందుకే ఈ ప్రాంతానికి ఈ పేరొచ్చింది. అంతేకాదు ఇదే ప్రాంతంలో "వ్యాలీ ఆఫ్ మష్రూమ్స్" అనే ప్రాంతం కూడా వుంది.

pc:youtube

10. సార్జీనియా

10. సార్జీనియా

ఈ బండరాయి అచ్చం ఎలుగుబంటిలా వుంది కదూ. ఇటలీలోని సార్జీనియా ప్రాంతంలో 1200ల ఎత్తైన ఓ పర్వతంపై వుందిది. బియర్ రాక్ గా పేరుపొందిన దీన్ని ప్రతిరోజు ఎంతోమంది వచ్చి చూస్తుంటారు.

pc:youtube

11. భౌగోళిక చర్యలు

11. భౌగోళిక చర్యలు

సుమారు 50 అడుగుల ఎత్తైన దీనిపైకి జనాలు ఎక్కి సరదాగా గడుపుతుంటారు. ఈ ప్రాంతంలోని శిలలన్ని భౌగోళిక చర్యలవల్ల గుంతలు పడ్డాయి. ఈ ఎలుగురాయిని ఎక్కి చూస్తే చుట్టూ అందమైన సముద్రం కనువిందు చేస్తుంటుంది.

ముంబైలో ఈ ప్రదేశాలు చూశారా ?

pc:youtube