Search
  • Follow NativePlanet
Share
» »నమ్మితే నమ్మండి... ఇక్కడుంది చీమలకు కూడా దేవాలయం!!!

నమ్మితే నమ్మండి... ఇక్కడుంది చీమలకు కూడా దేవాలయం!!!

సామాన్యంగా మనం తెల్లవారితే చాలు దేవాలయం గురించి వింటుంటాం, చూస్తుంటాం.ఒక్కొక్క దేవాలయానికి దానికదే మహత్యాన్ని, మహిమను కలిగివుంటుంది.హిందూ ధర్మంలో ప్రతిఒక్క జీవికీ దేవుడిని దర్శించుకోవటం ఒక పరిపాటి.

By Venkatakarunasri

సామాన్యంగా మనం తెల్లవారితే చాలు దేవాలయం గురించి వింటుంటాం, చూస్తుంటాం.ఒక్కొక్క దేవాలయానికి దానికదే మహత్యాన్ని, మహిమను కలిగివుంటుంది.హిందూ ధర్మంలో ప్రతిఒక్క జీవికీ దేవుడిని దర్శించుకోవటం ఒక పరిపాటి.అదేవిధంగా ప్రాణులు, పక్షులు, వస్తువులు అనే ప్రతిఒక్కదానికీ చేతులుజోడించే ఆధ్యాత్మికమైన సంస్కారం మన భారతదేశంలోని ప్రజలకు వుంది.

మీరు కర్ణాటకలో వున్న కుక్కల దేవాలయం కూడా వినివుంటారు అయితే కేరళలో చీమలకు ప్రత్యేకమైన దేవాలయం నిర్మించారన్న విషయం గురించి మీకు తెలుసా? ఏమిటీ చీమలకుకూడా దేవాలయమా? అని ఆశ్చర్యపడకండి.. అవును ఈ దేవాలయానికి అనేకమంది భక్తులు వస్తూ వుంటారు.ఆశ్చర్యమేమంటే ఈ దేవాలయంలోని చీమలకు స్థల పురాణం వుంది.

ప్రస్తుత వ్యాసంలో చీమల మహిమల గురించి అదేవిధంగా స్థలపురాణం గురించి తెలుసుకుందాం.

 ఎక్కడుంది?

ఎక్కడుంది?

ఈ విచిత్రమైన దేవాలయం ఉండేది కేరళ రాష్ట్రం యొక్క కన్నూరు జిల్లాలో కొట్టాం అనే స్థలంలో. ఇది భారతదేశంలోనే ఏకైక చీమల దేవాలయం అంటే తప్పుకాదు.

దేవాలయం

దేవాలయం

ఆశ్చర్యమేమంటే ఈ దేవాలయానికి గోపురం లేదు. సాధారణంగా దేవాలయం అంటేనే వెంటనే మన కళ్ళ ముందు కనపడేది అద్భుతమైన దేవతాశిల్పాలు కలిగిన గోపురాలు. అయితే ఈ దేవాలయంలో ఈ విధంగా చూసినా గోపురం కానీ గోడలు కానీ లేవు. అయినా కూడా ఇదొక దేవాలయంగా వుంది.

ఉరుంబచన్ కొట్టాం

ఉరుంబచన్ కొట్టాం

ఈ దేవాలయాన్ని "ఉరుంబచన్ కొట్టాం" అని పిలుస్తారు. మలయాళంలో ఉరుబ అంటే చీమ మరియు అచన్ అంటే పితా లేదా తండ్రి అని అర్థం. అందువల్ల ఈ దేవాలయం చీమలతండ్రికి సమర్పించిన దేవాలయం.

భక్తులు

భక్తులు

ఈ ఆలయం చీమలచే బాధపడుతున్న వారు మరియు చీమలచే కుట్టించుకున్న వారు సందర్శిస్తారు. వీరు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా ఎవరైతే భాదలలో, సమస్యలలో ఉంటారో అటువంటి వారు కూడా సందర్శించుకుంటారు.

నమ్మకం

నమ్మకం

ఇక్కడ వున్న చీమల పితను దర్శించుకుని వేడుకునివెళ్ళిన వారి ఇంటిలో చీమల వల్ల ఇబ్బందులు శాశ్వతంగా పోతుంది అని చెప్తారు కొందరు భక్తులు.

నైవేద్యం

నైవేద్యం

ఈ దేవాలయానికి వచ్చే భక్తులు కొబ్బరికాయను కొట్టి అందులోని నీటిని చీమలకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆలయం గోపురం లేని వృత్తాకారంలో వున్న ఒక నిర్మాణం.

ఆర్చ్

ఆర్చ్

ఇక్కడ చీమల కోసం ఏ విధమైన గోపురం లేదు. ఆలయానికి కొంత దూరంలో ఆర్చ్ మీద దేవాలయం అని వ్రాయబడి వుంటుంది. అప్పుడే మీకు ఓ.ఇక్కడ దేవాలయం వుంది అని తెలుస్తుంది.

స్థల పురాణం

స్థల పురాణం

ఈ దేవాలయం యొక్క స్థలపురాణం అందరి దేవతలకన్నా విభిన్నంగా వుంటుంది. అదేమంటే ఈ దేవాలయమున్న స్థలంలో వడ్రంగి ఒకడు ఉండేవాడు.అతడే గణేశ దేగుల. ఒక చెక్క మీద గణపతి అనే పేరును చెక్కి అక్కడ పెట్టినాడంట.

మరుసటి దినం

మరుసటి దినం

మరుదినం అక్కడ చెక్కిన గణేశుడు అక్కడ లేదంట.దానిబదులు అక్కడొక పెద్ద చీమల పుట్ట నిర్మాణమైఁదంట.ఆ ప్రదేశం నుంచి ఒకఅడుగు దూరంలో గణేశుని ఫలకంపడివున్నదంట.

దేవాలయ నిర్మాణం

దేవాలయ నిర్మాణం

ఇదొక దైవ సంకేతం అని తెలుసుకున్న గ్రామప్రజలు చీమలకు ఒక వృత్తాకారంలో దేవాలయాన్ని నిర్మించారంట.ఇప్పటికీ ఆ ఫలకం పడిన స్థలంలో ఉదయమంగళం గణేశ దేవాలయం అని పిలుస్తారు.

నమ్మకం

నమ్మకం

ఇదొక మూఢనమ్మకమో లేక వారియొక్క భక్తో తెలీదు.వారి వారి నమ్మకానికి వదిలి వేసి ఈ వ్యాసం ముగిస్తాం...

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

కేరళలో కన్నూరు-తలస్సేరి రోడ్డు మార్గమధ్యంలో కన్నూరు నుంచి సుమారు 8కి.మీ దూరంలో కోట్టం అనే ప్రదేశం వుంది.అక్కడ ఈ ఉరుంబచన్ దేవాలయం వుంది.ఇక్కడకి సమీపంలో మహిమాన్వితదేవతామూర్తి అయిన గణేశుని దేవాలయం వుంది.ప్రతి రోజూరాత్రి ఈ దేవాలయం ఆర్చ్ మీద దీపాలను వెలిగిస్తారు.కార్తీకమాసంలో విశేషమైన ఉత్సవం కూడా జరుగుతుందంట.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X