• Follow NativePlanet
Share
» »దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయాలు పెట్టనిగోడ వలే ఉన్నాయి. సంవత్సరంలో కొన్ని నెలలు ఇక్కడి ప్రాంతాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలను పెట్టుకోవు. మనమూ అక్కడికి వెళ్లము. మిగిలిన కొన్ని నెలలు అక్కడి వాతావరణం కుదుటపడ్డాక వెళుతుంటాము. ముఖ్యంగా వేసవి కాలం సీజన్లో హిమాలయ పర్వతాలు అందాలను విచ్చుకొని పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. మరి ఇది శీతాకాలం ... గడ్డకట్టే చలి ? ఇట్లాంటి టైం లో హిమాలయాలు వెళ్ళి ఏం చేస్తాం అనేగా, అక్కడ ఏమి చూస్తామనేగా మీ సందేశం ...!!

మీ సందేహాలను పటాపంచలు చేస్తూ హిమాలయాలలో ఒక ప్రదేశం దాగుంది. దానిపేరు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. నడక తెలీనివ్వని అందమైన ప్రయాణం ఇది. ప్రకృతే ఇక్కడ పూల స్వర్గానికి తోటమాలి. వ్యాలీ అఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి జిల్లాలో కలదు. ప్రసిద్ధ సిక్కుల ప్రార్ధనా స్థలమైన 'హేమకుండ్' కు ఈ లోయ అతి చేరువలో ఉన్నది. చార్ ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ వెళ్ళే మార్గంలో గోవిందమఠ్ నుంచి 16 కి.మీ ల దూరం ట్రెక్కింగ్ చేస్తూ వెళితే ఈ అద్భుత ప్రదేశానికి చేరుకోవచ్చు.

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యల ఆటస్థలం

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కు వెళ్ళే ప్రయాణం సుగంధభరితంగా ఉంటుంది. రంగురంగుల పూలను ధరించిన ఆ పూవుల లోకాన్ని 'దేవకన్యల ఆటస్థలం' గా అభివర్ణిస్తారు ప్రకృతిప్రేమికులు.

చిత్రకృప : Guptaele

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

సుమ వర్ణాలు

దేవ కన్యలు అక్కడ విహరిస్తారో లేదో ? కానీ, అక్కడికి వెళితే మాత్రం దాని అందాలకు గులాం అవ్వకతప్పదు. బద్రీనాథ్ వెళ్ళే యాత్రికులు ఇక్కడ కొంత సేపు సేదతీరి, దాని మృదు స్పర్శలో స్వర్గలోకపు అంచులదాకా వెళ్లివస్తారు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. రోజురోజుకీ మారే సుమ వర్ణాలు ప్రకృతి వైవిధ్యానికి తార్కాణాలు.

చిత్రకృప : Alosh Bennett

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

లోయ ప్రాంతం

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ భ్యూందర్‌ లోయ, హేమకుండ్‌ లోయ, పుష్పవతి లోయల సమాహారం. 87.5 చదరపు కిలోమీటర్ల లో వ్యాపించిన ఈ లోయ ప్రాంతం దట్టంగా పూలను నింపుకుని పూలవనంలా అగుపిస్తుంది.

చిత్రకృప : Mahendra Pal Singh

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

జాతీయ పార్క్‌

సుమారు 8 కిలోమీటర్ల పొడవు, 2 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ పూలలోయ 1982 లోనే దీన్ని జాతీయ పార్క్‌ ప్రకటించారు. నందాదేవి బయో స్పియర్ రిజర్వ్ కు అభిముఖంగా దానికి పూర్తి విభిన్నమైన వాతావారణంలో ఉంటుందీ ప్రాంతం.

చిత్రకృప : Guptaele

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

జీవ వైవిధ్య ప్రత్యేక బిందువు

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూల లోయల్ని కలిగిఉన్న ఈ ప్రాంతాన్ని 2004 లో యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించింది. జీవ వైవిధ్య ప్రత్యేక బిందువుగా పరిగణించే మిగిలిన ప్రాంతాల్లోని కనిపించని పూలు ఇక్కడ గమనించవచ్చు.

చిత్రకృప : Guptaele

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

రకరకాల పుష్ప జాతులు

ఇప్పటివరకు సుమారు 650 రకాల పుష్ప జాతుల్ని గుర్తించారు వృక్ష శాస్త్రవేత్తలు. వాటిలో బ్రహ్మ కమలాలు, బ్లూ పాపీలు, నాగుమల్లెలు, ఆర్కిడ్‌లు, డైసీలు, అనిమోన్‌ల వంటి ఎన్నో రకాల పూల వనాలు ఇక్కడ దర్శనమిస్తాయి. వీటితోపాటు 45 రకాల వన మూలికలు కూడా ఇక్కడ గుర్తించారు. చాలా జబ్బులకు స్థానికులు వీటిని ఉపయోగిస్తారు.

చిత్రకృప : Yoginipatil

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

జంతు సంపద

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్కింగ్ లో మీ అదృష్టం బాగుంటే మంచు చిరుతలను చూడవచ్చు. ఎర్ర నక్కలు, నీలి పొటేళ్లు, ఎలుగుబంట్లు వంటివి కనిపిస్తుంటాయి. కానీ నేడు ఇవన్నీ అంతరించి పోయే దశలో ఉన్నాయని చెప్పడం బాధ కలిగించే విషయం.

చిత్రకృప : Gerwin Sturm

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

పక్షి సంపద

ఇక్కడ ఎన్నో రంగురంగుల పక్షులు వాటి కిలకిలరావాలతో సంగీతాన్ని అందిస్తాయి. మంచు పావురాలు, బంగారు రంగు గ్రద్దలు, మంచు కాకులు, భిన్న వర్ణాల పిచ్చుకలు వంటివి ఇక్కడ కనిపిస్తాయి. పూల మకరందాల్ని సేకరిస్తూ సీతాకోకచిలుకలు తీరికే లేకుండా అటుఇటు తిరుగుతుంటుంది.

చిత్రకృప : notjake

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

నిషేధం

ఇక్కడ 1983 నుండి నివాసాలను నిషేధించారు మరియు పశువుల మేతను కూడా నిషేధం.

చిత్రకృప : Guptaele

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

ట్రెక్కింగ్ లను మాత్రమే

ఇది పర్యాటక ప్రాంతమే కావచ్చు అయినా కూడా కేవలం ట్రెక్కింగ్ లను మాత్రమే అనుమతిస్తారు తప్ప వసతికి అవకాశమే ఉండదు. కనుక పర్యాటకులు/ యాత్రికులు జోషిమఠ్ లోగానీ (16కి.మీ), చమోలీ లోగానీ (48 కి.మీ) బస చేయవచ్చు.

చిత్రకృప : Yogendra Joshi

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

ఆహారం వెంట తీసుకెళ్లడం మంచిది

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ పరిసరాల్లో ఎటువంటి హోటల్స్, రెస్టారెంట్లు, కాఫీ డే లు వంటివి ఉండవు. కనుక పర్యాటకులు ట్రెక్కింగ్ కు వెళ్ళే ముందు సరిపడా ఆహారం తీసుకెళ్లవలసి ఉంటుంది.

చిత్రకృప : Naveensylvan

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

డోలీ

ట్రెక్కింగ్ కు మూడు రోజుల పర్మిట్ ఉంటుంది. రాత్రిపూట లోయలో సంచరించడం నిషేధం. వాహనాలకు ఎటువంటి అనుమతి ఉండదు. కేవలం ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే అక్కడికి చేరుకోవాలి. వృద్దులకు, చిన్న పిల్లలకు మనుష్యులు మోసుకెళ్ళే డోలీ లు అద్దెకు దొరుకుతాయి.

చిత్రకృప : wikipedia

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

ఎక్కడ నుండి ప్రారంభించాలి ?

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తప్పక చేయాల్సిన ట్రెక్కింగ్ లలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్ ఒకటి. జోషి మఠ్ (లేదా) గోవింద్ మఠ్ (లేదా) గంగురియా నుంచి ట్రెక్ ప్రారంభించవచ్చు.

చిత్రకృప : __sandip__

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

గంగూరియా

గంగూరియా విడిదికి, భోజనాలకు బాగుంటుంది. ఇక్కడ అనేక హోటళ్లు, లాడ్జీలు వసతిని కల్పిస్తాయి. గంగూరియా లో సిక్కుల గురుద్వార్ ప్రత్యేకత. దూరప్రాంతాల నుంచి నడుచుకుంటూ చాలా మంది సిక్కులు ఇక్కడికి వస్తుంటారు. ట్రెక్కింగ్ ఆహ్లదకరంగా ... మత్తెక్కించే సువాసనల మధ్య సాఫీగా సాగుతుంది. గంగూరియా నుండి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

చిత్రకృప : __sandip__

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

జోషిమఠ్

జోషిమఠ్ పట్టణం నుండి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ 20 కి. మీ ల దూరంలో ఉన్నది. ఇక్కడ ఆది శంకరాచార్య మఠం, కల్పవృక్ష, నరసింఘ్ ఆలయం చూడదగ్గవిగా ఉన్నాయి.

చిత్రకృప : __sandip__

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

గోవింద్ ఘాట్

గోవింద్‌ ఘాట్‌ నుంచి అయితే 16 కిలోమీటర్ల ట్రెక్‌. హరిద్వార్‌ నుంచి బద్రీనాథ్‌ వెళ్ళే దారిలో ఇది ఉంటుంది. ఢిల్లీ, హరిద్వార్‌, బద్రీనాథ్‌, డెహ్రాడూన్‌ నుంచి ఇక్కడకు రవాణా మార్గాలున్నాయి. ఢిల్లీ నుంచి 500 కి.మీ. ప్రయాణం.

చిత్రకృప : Alokprasad

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

దేవకన్యలు తరచూ ఇక్కడికి వచ్చేవారట !

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్

వాయు మార్గం

డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ వ్యాలీ కి సమీపాన 292 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అయితే ఎయిర్ పోర్ట్ నుండి గోవింద్ ఘాట్ వరకు మాత్రమే రోడ్డు మార్గం ఉన్నది. అక్కడి నుండి 16 కి. మీ ల వరకు ట్రెక్కింగ్ చేస్తే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

273 కిలోమీటర్ల దూరంలో రిషికేష్ రైల్వే స్టేషన్ కలదు. సుమారు 10 గంటలు ప్రయాణించి గోవింద్ ఘాట్ చేరుకోవచ్చు. అక్కడి నుండి 16 కి. మీ ట్రెక్కింగ్ చేసి పూల స్వర్గానికి వెళ్ళవచ్చు.

రోడ్డు మార్గం

జాతీయ రహదారి 58 గుండా గోవింద్ ఘాట్ చేరుకోవచ్చు. ఇక్కడికి ఢిల్లీ (500 కి.మీ), డెహ్రాడూన్, రిషికేష్, నైనిటాల్ నుండి ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

చిత్రకృప : Manis73


పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి