Search
  • Follow NativePlanet
Share
» »శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

చుట్టూ దట్టమైన అడవులతో ఉన్న ప్రఖ్యాతి గడించిన పుణ్యక్షేత్రం శబరిమల. సహజసిద్దమైన ప్రకృతి ఒడిలో ,పంబా నది ఒడ్డున , పశ్చిమ కనుమల పర్వత శ్రేణులలో ఉన్నది ఈ పుణ్యక్షేత్రం.

By Venkatakarunasri

చుట్టూ దట్టమైన అడవులతో ఉన్న ప్రఖ్యాతి గడించిన పుణ్యక్షేత్రం శబరిమల. సహజసిద్దమైన ప్రకృతి ఒడిలో ,పంబా నది ఒడ్డున , పశ్చిమ కనుమల పర్వత శ్రేణులలో ఉన్నది ఈ పుణ్యక్షేత్రం.లక్షలాది భక్త జనం మలయాళ క్యాలెండర్ ప్రకారం మండలకల కాలం అయిన నవంబర్ నుండి డిసెంబర్ వరకు ఈ క్షేత్రానికి తరలి రావటం జరుగుతుంది. భారతదేశ నలుమూలల నుండి భక్తులు తమ తమ మతాలకు అతీతంగా, మరియు ఆర్ధిక స్తితిగతులకు అతీతంగా ఈ క్షేత్రానికి ప్రతిసంవత్సరం వస్తారు. అయ్యప్ప ఈ పేరువినగానే చాలా మంది హిందువుల ఒళ్ళు పులకరిస్తుంది.దేవుడు అనే నమ్మకం మిథ్యకాదు.నిజం అనటానికి సజీవసాక్ష్యంగా నిలిచే మకరజ్యోతిగురించి తెలిసిన ప్రతిహిందువుకూ అయ్యప్పస్వామిదీక్షాఫలం,ఇంకా ఆయన భక్తి వాత్సల్యంగురించి వేరే చెప్పనవసరంలేదు. అలాంటి మహిమోన్వితుడైన హరిహరసుతుని పవిత్రనివాసస్థలమైన శబరిమలలో కొన్నివేల ఏళ్లుగా పూజలందుకుంటున్న ఒక మసీదు ప్రాంగణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

పండలరాజ్యం విస్తరించినప్పుడే భారతదేశంలో దండయాత్రలు మొదలయ్యాయి. మాలిక్ కఫూర్ అనే ఖిల్జీ ముఖ్య సేనాధిపతి అల్లావుద్దీన్ తరఫున దండెత్తిన ఖిల్జీ రాజ్యాలలో పండలరాజ్యం కూడా వుంది. ప్రకృతివనరులు, అసంఖ్యాకమైన ఖనిజనిల్వలు వున్న ప్రదేశంకనుక ఆ ఖిల్జీ మతమౌడ్యులు ఈ రాజ్యంమీద దండెత్తి చాలారకాలైన దుశ్చర్యలకు పాల్పడి సర్వనాశనం చేశారని చరిత్రమనకి చెపుతున్నవిశేషం.

PC:youtube

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

మనలో చాలామందికి ముందుగా వచ్చే ప్రశ్న సృష్టి వుద్భవించినప్పటినుండి వున్న హిందూసనాతన ధర్మంలో ముఖ్యదేవుడైన అయ్యప్పకు పరమతమైన ఇస్లాంకు సంబంధమేంటిఅని అసలైన కొసమెరుపు ఇక్కడే వుంది.

PC:youtube

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

చరిత్రప్రకారం 12వ శతాబ్దంలో పండలరాజ్యంరాజుకి అడవిలో మణికంఠుడుదొరికి పులిపాలకోసం అడవిలోకివెళ్లి పులులసమూహాన్ని తనవెంట తెచ్చి ప్రజలందరిచేత అయ్యప్పగా ఖ్యాతికెక్కినవిషయం మనకి తెలిసిందే.అలా తన బాణంపడిన చోటుని అలా శాశ్విత ధ్యానంకోసం ఏర్పాటుచేయబడిన మణిమంటపం శబరిమల పుణ్యక్షేత్రం ప్రపంచప్రఖ్యాతి గాంచిన విషయం తెలీనివారు చాలా అరుదుగా వుంటారు.

PC:youtube

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

అంతటి మహోన్నతదేవుడైన హరిహరసుతుడుకి ఒక ఇస్లాంమతస్థుడు ప్రాణ స్నేహితుడిగా మారిన వైనానికి సజీవసాక్ష్యం ఈ వావర్ మసీదు. టూకీగా చెప్పుకుంటే మణికంఠుడు తనయవ్వనంలో అరివీరభయంకరుడుగా, ప్రేమతో వాత్సల్యంతో తనని పెంచిపోషించిన రాజకుటుంబాన్ని, రాజప్రజలను అత్యంత ప్రేమానురాగాలతో సాకేవాడుగా కొన్ని రచనలు మనకి చెప్తాయి.

PC:youtube

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

ఒకానొకసమయంలో రాజ్యంలోని పిల్లలకు తను ఆహారాన్ని పెట్టి వారి ఆకలితీర్చిన దయామయుడిగా పేరొందిన ఈ హరిహరసుతుడు రాజ్యంలోని అందరిఇళ్ళల్లో పేదధనిక బేధం లేకుండా అద్వైతసిద్దాంతానికి దగ్గరగా మసలేవాడనితెలుస్తుంది.

PC:youtube

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

వారితోపాటు సహపంక్తిభోజనాలు, విందులు,వినోదాలతోపాటు ఆదివాసులు తనకు నేర్పిన ఆయుర్వేదం, వైద్యవిద్యతో పాటు గురుకులంలో నేర్చుకున్న చాలావిద్యలను ప్రజాశ్రేయస్సుకోసం వాడేవాడని,దీనికి ఆగ్రహించిన రాజకుటుంబం ఎలాగైనా మణికంఠున్నిమట్టుపెట్టాలని మహామంత్రితో పన్నిన పన్నాగం చివరిగా లోకోన్నతధీశాలిగా,అత్యున్నత పూజలందుకునే బ్రహ్మచర్యదేవుడిగా మణికంఠుడు ప్రసిద్ధి చెందాడు.

PC:youtube

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

పరిపాలించటంరాజధర్మమైతే, మానవులనుకాపాడుకోవటం దైవధర్మం అనే మాటకు చక్కటి వుదా మణికంఠుడిచరిత్ర. అతను యవ్వనంలో అరబ్ దేశాలనుంచి వచ్చిన ఒక సముద్రపుదొంగ బారినుండి ప్రజలను కాపాడిన మణికంఠుడిధైర్యసాహసాలనుచూసి అతడిదయాగుణాన్ని చూసి ప్రజలద్వారా, దేశాటనచేసే యాత్రికులద్వారా విని ఆశ్చర్యచకితుడైన ఆ వావిరియోధుడు ఇస్లాంమతం వీడి అయ్యప్పభక్తుడిగా మారిపోవాలని నిర్ణయించుకున్నాడట.

PC:youtube

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

కానీ తల్లిలాంటి మతాన్ని మార్చటం నేరం అని పరిగణించిన మణికంఠుడు మతంమారకుండావుండమని హితభోదచేసాడట. తన ప్రియభాక్తుడిగా వావర్ ను స్వీకరించి ఆయనకు గాను ఒక స్థలంలో ఇస్లాం సంప్రదాయంప్రకారం ఒక దర్గాను నిర్మించారనేది ఒక కధ బాగాప్రాచుర్యంలో వుంది.

PC:youtube

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

వావర్ స్వామిగా వావర్ ను రానురాను ఒక మునిగా మార్చేసారు. ఇస్లాం సిద్దాంతం మనిషి పూజను, విగ్రహారాధనను బోధించదు గనుక వావర్ మసీదు రానురాను వావర్ దర్గాగా ప్రాచుర్యంపొందింది. అలా సర్వజగత్తుకి ఆధారభూతుడైన దైవశ్రేష్టుడు పరాయిమతస్థుడైన వావర్ ను తన అక్కునచేర్చుకుని వుదారత్వాన్ని చాటుకున్నమణికంఠున్ని అయ్యప్పఅని కోట్లాదిమంది భక్తజనం తమ ఇలవేల్పుగా పూజించటం మొదలుపెట్టారని తెలుస్తోంది.

PC:youtube

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శైవసిద్ధాంతమైన సన్యాసదీక్ష, శూన్యసిద్ధాంత ఆరాధనలాంటి విషయాలను నేటికలియుగంలో కూడా ఆచరింపచేయగల శక్తున్న అతికొద్ది వ్రతాలలో అయ్యప్పదీక్షఒకటి.శని ప్రభావంతమ మీద పడకుండా చేసే ఏకైక దేవుడు అయ్యప్పస్వామి గనుక నల్లనివస్త్రాలను ధరించి మండలం రోజులు దీక్షచేసి బ్రహ్మ చర్యంపాటించి ఇరుముడులు కట్టి అత్యంత ప్రమాదకరమైన పెరియార్ పెద్దపులుల సంరక్షణాకేంద్రం పులులమధ్య సన్యసించే దీక్షను మనందరం అయ్యప్పదీక్షగా అభివర్ణిస్తాం అన్నమాట.

PC:youtube

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

ఇలా మన మతాన్ని పూజించి పరమతాన్ని గౌరవించే అద్వైతసిద్దాంతానికి భారతదేశంలో బీజంపడ్డ కధగా మణికంఠుడిచరిత్ర,అందుకు సజీవసాక్ష్యంగా నిలిచిన వావర్ మసీదు కదాసారాంశంగురించి మనం తెలుసుకోవచ్చు.

PC:youtube

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

జరిగిందంతా ఒట్టికథ అని కొట్టిపారేస్తే ఛాందసవాదుల వ్యర్ధప్రేలాపనలకు వారి అవివేకానికి ధీటైన జవాబుగా ఏటాకోట్లమంది దర్శించుకునే అయ్యప్ప దివ్యక్షేత్రమైన శబరిమల, ఇంకా వావర్ మసీదు, వావిర్ దర్గా ప్రత్యక్షసాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

PC:youtube

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

బ్రిటీష్ వారు సైతం ఈ మహామందిరానికి ఏమీచేయలేకపోయారంటే మనం అర్ధంచేసుకోవచ్చు. మణికంఠుడినీడున్న ఈ చోటు ఎంత పవిత్రమైఁదో అని,చాలామంది అప్పట్లో మకరవిలక్కు,మకరజ్యోతి ఒట్టిభూటకాలనికొట్టి పారేయగాకళ్ళు పోగొట్టుకున్న వారి కధల్ని భక్తులు చెప్పుకుంతూవుంటారు.

PC:youtube

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

చివరి నిజాన్ని చేదించేదిశగా భారతదేశపు అత్యున్నతన్యాయస్థానమైనసుప్రీంకోర్ట్ ఆదేశానుసారం మకరజ్యోతిదైవప్రేరేపితమని,మకరవిలక్కు అంటే అగ్నిరూపంలో వెలిగే మహాజ్యోతి మానవకల్పితమని ఋజువులతోనిరూపించటం మనలో చాలామందికి తెలిసినవిషయమే.

PC:youtube

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

ఇంతకి వావర్ అంటే విభజనకుగురైన చంద్రబింబంఅనర్ధం.సౌర్యవంతుడై మణికంఠుడి వీరత్వానికి దాసోహమై స్నేహహస్తాన్నందించిన వావర్ మసీదుపైభాగంలో ఖడ్గాన్నిపోలిన ఆకారాన్ని నిలపటం ఇంకో విశేషం.

PC:youtube

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

వ్యాపారసముదాయాలగా మారిన ఈ దివ్యక్షేత్రాన్నిచూసి ఒక నిర్ణయానికి రాకుండా సర్వమతసమానత్వం ఇంకా స్నేహభావంతో మెలగటం అనే కదాసిద్ధాంతాన్ని మనకు తెలియచెప్పే ఈ మణికంఠపురాణం.ఇంకా వావర్ మసీదు చరిత్రఏదో ఒక రోజు అందరికీ అర్థమై భారతదేశానికి మంచిపేరు తీస్కొస్తాయనేది సత్యం.

PC:youtube

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం

కేరళ లో ఉన్న అన్ని ప్రధాన నగరాల నుండి పంబ పట్టణానికి తరచూ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (KSRTC) ద్వారా కేరళ ప్రభుత్వ రవాణా శాఖ కొట్టాయం, చెంగన్నూర్ మరియు తిరువల్ల రైల్వే స్టేషన్ ల కి బస్సు సర్వీసులు నడుపుతుంది. ప్రైవేటు టాక్సీలు మరియు టూరిస్ట్ ప్యాకేజీ లు కూడా శబరిమల కి అందుబాటులో ఉన్నాయి.

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

రైలు మార్గం

పంబా పట్టణానికి 90 కి మీ ల దూరం లో ఉన్న చెంగన్నూర్ రైల్వే స్టేషన్, శబరిమల కి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. తిరువనంతపురానికి మరియు కొట్టాయం కి మార్గమధ్యంలో ఈ చెంగన్నూర్ ప్రాంతం ఉండడం వల్ల భారత దేశంలో ప్రముఖమైన రైల్వే స్టేషన్స్ అన్నిటికి అనుసంధానించబడి ఉన్నది. చెంగన్నూర్ నుండి పంబా పట్టణానికి టాక్సీ సేవలు అందుబాటులోఉన్నాయి.

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

శబరిమలలో ప్రాచుర్యం పొందిన వావర్ మసీదు రహస్యాలు..!

వాయు మార్గం

కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం మరియు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం శబరిమలకి సమీపంలో ఉన్నాయి. శబరిమల నుండి తిరువనంతపురం 130 కి మీ ల దూరంలో, కొచ్చి నేడంబస్సేరి అంతర్జాతీయ విమానాశ్రయం 190 కి మీ ల దూరంలో ఉన్నాయి. ఈ రెండు విమానాశ్రయాల నుండి పంబా పట్టణానికి టాక్సీ సేవలు లభ్యమవుతాయి. పంబా పట్టణం నుండి సులభంగా శబరిమలకు చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X