Search
  • Follow NativePlanet
Share
» »వీరుల శౌర్య ప్రతాపాలకు పుట్టినిల్లు బొబ్బిలిలో కొలువైన వేణుగోపాల స్వామి

వీరుల శౌర్య ప్రతాపాలకు పుట్టినిల్లు బొబ్బిలిలో కొలువైన వేణుగోపాల స్వామి

బొబ్బిలిలో కొలువైన రుక్మిణీ, సత్యభామా సమేత వేణుగోపాల స్వామి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరానికి 60కిలోమీటర్ల దూరంలో బొబ్బిలి నగరం ఉంది. విజయనగం అనగానే తెలుగు వీరుల శౌర్య ప్రతాపాలకు పుట్టినిల్లుగా భావ

మన ఇండియాలో మరెక్కడా లేని అరుదైన దేవాలయాలు ఉత్తరాంధ్రలోని శ్రీకాకులం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలలో కొలువుదీరాయి. అరసవల్లిలోని ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడు, శ్రీకూర్మంలో వెలసి శ్రీకూర్మనాథుడు, సింహాచలంలో ద్వయరూపుడైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహుడు, విజయనగరంలో సిరిమానుపై ఊరేగే పైడితల్లమ్మ...ఇలా అనేక భక్త జనావళికి అభయప్రదాతలైన ఎందరో వేలుపుల నిలయాలు ఈ ప్రాంత ఆధ్యాత్మిక వైభవానికి చిహ్నాలు.

అలాంటి ఆలయాల్లో ప్రముఖంగా తెలుసుకోవల్సింది బొబ్బిల వేణుగోపాలస్వామి గురించి. మరి బొబ్బిలిలో కొలువుదీరిన వేణుగోపాల స్వామి ఆలయ చరిత్ర విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకోందాం...

 విజయనగరానికి 60కిలోమీటర్ల దూరంలో బొబ్బిలి నగరం

విజయనగరానికి 60కిలోమీటర్ల దూరంలో బొబ్బిలి నగరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరానికి 60కిలోమీటర్ల దూరంలో బొబ్బిలి నగరం ఉంది. విజయనగం అనగానే తెలుగు వీరుల శౌర్య ప్రతాపాలకు పుట్టినిల్లుగా భావిస్తారు. అటువంటి బొబ్బిలి నగరంలో వేణుగోపాల స్వామి వారు కొలువుదీరి ఉండటం విశేషం.

PC: commons.wikimedia.org

బొబ్బిలి రాజవంశీకుల కులదైవం శ్రీ వేణుగోపాలస్వామి

బొబ్బిలి రాజవంశీకుల కులదైవం శ్రీ వేణుగోపాలస్వామి

బొబ్బిలి రాజవంశీకుల కులదైవం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం బొబ్బిలి కోట సమీపంలో ఉంది. పురాతనమైన ఈ ఆలయంలో రుక్మిణీ, సత్యభామా సమేతుడిగా వేణుగోపాలుడు దర్శనమిస్తాడు. బొబ్బలి సంస్థానాధిపతులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ అద్భుతమైన ఆలయంలో కొలువుదీరిన స్వామి వారిని వారి కులదైవంగా భావించేవారు.

సుమారు 200 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన ఈ పురాతన దేవాలయం

సుమారు 200 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన ఈ పురాతన దేవాలయం

సుమారు 200 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన ఈ పురాతన దేవాలయం ఎంతో ప్రాచుర్యం పొందినది. బొబ్బిలి సంస్తానదీశులైన శ్రీరాజ, వెంకట శ్వేతా చలపతి రావు నిర్మించారు. దేవాలయ గోపురం, ప్రధాన ఆలయం కంటే ఎత్తులో ఉండే ఏకైక ఆలయం ఇది. ఈ గోపురాన్ని అతి ఘనమైన రాతితో నిర్మించబడినది. ఈ ఆలయ గోపురం సుమారు 9 మీటర్ల ఎత్తు ఉంటుంది.

PC: commons.wikimedia.org

ఈ ఆలయంలో ఐదు అంతస్తుల గాలిగోపురం ప్రత్యేక ఆకర్షణ

ఈ ఆలయంలో ఐదు అంతస్తుల గాలిగోపురం ప్రత్యేక ఆకర్షణ

ఈ వేణుగోవాలస్వామి వారు బొబ్బలి సంస్థానాధిపతులు కుల దైవం. ఈ ఆలయంలో ఐదు అంతస్తుల గాలిగోపురం ప్రత్యేక ఆకర్షణగా నిర్మించారు. తూర్పు ముఖంగా గర్భాలయం, అంతరాలయం, మండపం అను మూడు బాగాలుగా, రెండు ప్రాకారాలను కలిగి ఉంది. ఆలయ గాలిగోపురం తూర్పునకు అభిముఖంగా ఉండి, దాని క్రింద నుండి ఆలయ ప్రవేశం జరుగుతుంది. గర్భ గ్రుహంలో వేణుగోపాల స్వామి దర్శనమిస్తూ భక్తులను ఆనందపరవశులను చేయుచున్నాడు.

PC: commons.wikimedia.org

పండగలు, ఉత్సవాల సందర్భాలలో

పండగలు, ఉత్సవాల సందర్భాలలో

పండగలు, ఉత్సవాల సందర్భాలలో, ఆలయంలో దేవతల విగ్రహాలు మిలియన్ డాలర్ల విలువైన బంగారు మరియు విలువైన రాళ్ళతో తయారుచేసిన ఆభరణాలతో అలంకరిస్తారు. వసంత మండపంలో ఒక నిశ్శబ్దమైన నీటి కొలను ఉంది. ప్రతి ఏటా వేణుగోపాల స్వామి వారిని ఈ కొలను వద్దకు తీసుకొచ్చొ, వసంత ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు.

ఆలయం ప్రవేశ ద్వారం బయట

ఆలయం ప్రవేశ ద్వారం బయట

ఆలయం ప్రవేశ ద్వారం బయట కళ్యాణమండపం ఒకటి ఉంది. మొదటి ప్రకారం నందు ధ్వజస్తంభం, గరుడాళ్వారు మండపం, రెండవ ప్రకారం నందు ముఖమండపం, ఆరాధన మండపం, అంతరాలయం, గర్భాలయం ఉన్నాయి.

PC: commons.wikimedia.org

గర్భాలయంలో రుక్మిణి-సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి

గర్భాలయంలో రుక్మిణి-సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి

గర్భాలయంలో రుక్మిణి-సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు కొలువై ఉన్నారు. అలాగే గర్భాలయం బయట శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక మందిరం ఉంది. గర్భాలయానికి వాయువ్వంలో ఆండాళ్, నైరుతి లో శ్రీరామ క్రత: స్థంభం న్నాయి. ప్రధాన ఆలయం చుట్టూ గల మండపంనందు శ్రీ ఆంజనేయస్వామి, ఆళ్వార్లు, శ్రీ సీతారాములు, శ్రీ రామానుజులవారు, శ్రీ రాధాకృష్ణులు మానవలా మహామునులు మొదలగు విగ్రహాలు ఉన్నాయి.

వేణుగోపాల స్వామి ఆలయం

వేణుగోపాల స్వామి ఆలయం

వేణుగోపాల స్వామి ఆలయం రాజ నివాసానికి సమీపంలో ఉంది. బొబ్బలిలో ప్రసిద్ది చెందిన దేవాలయం బొబ్బిలి.

PC: commons.wikimedia.org

ప్రతి సంవత్సరం స్వామి వసంతోత్సవాలు

ప్రతి సంవత్సరం స్వామి వసంతోత్సవాలు

ప్రతి సంవత్సరం స్వామి వసంతోత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. అలాగే మాఘశుద్ద ఏకాదశికి స్వామివారికి కల్యాణోత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఇంకా ధనుర్మాసం కృష్ణజయంతినాడు విశేష పూజలు, ప్రత్యేక వేడుకలు అతి వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలు తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

PC: commons.wikimedia.org

వేణుగోపాలస్వామి దేవాలయం ప్రాంగణంలో

వేణుగోపాలస్వామి దేవాలయం ప్రాంగణంలో

వేణుగోపాలస్వామి దేవాలయం, సంతోషిమాత దేవాలయం, లక్ష్మీగణపతి దేవాలయం, దేశమ్మతల్లి, షిరిడీ సాయిబాబా మందిరాలకు అధిక సంఖ్యలో భక్తులు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. వేణుగోపాలస్వామి దేవాలయంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు.

PC: commons.wikimedia.org

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

విజయనగరం జిల్లా కేంద్రానికి సుమారు అరవై కి.మీ. దూరంలో బొబ్బిలి ఉంది.

రోడ్ మార్గం: బొబ్బిలి బస్ స్టేషన్ నుండి వేణుగోపాల స్వామి ఆలయానికి చాలా సులభంగా చేరుకోవచ్చు. విశాఖపట్నం, శ్రీకాకులం, మరియు విజయనగరం బస్ స్టేషన్స్ నుండి నేరుగా బస్సు సౌకర్యాలు కలవు.

రైలు మార్గం:

బొబ్బిలిసి చాలా దగ్గర రైల్వే స్టేషన్ బొబ్బిలి జంక్షన్ విబిఎల్). ఇది బొబ్బిలికి వేణుగోపాల స్వామి వారి ఆలయానికి సుమారు 1.5కి.మీ దూరంలో ఉంది.

విమాన మార్గం:

బొబ్బిలికి సుమారు 121కి.మీ దూరంలో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉంది. అక్కడ నుండి నేరుగా బొబ్బలికి బస్సు సౌకర్యం ఉంది.

PC: commons.wikimedia.org

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X