Search
  • Follow NativePlanet
Share
» »విజ‌య‌వాడ బీసెంట్ రోడ్‌.. ఇచ్చ‌ట‌ అన్నీ దొరుకును..!

విజ‌య‌వాడ బీసెంట్ రోడ్‌.. ఇచ్చ‌ట‌ అన్నీ దొరుకును..!

విజ‌య‌వాడ బీసెంట్ రోడ్‌.. ఇచ్చ‌ట‌ అన్నీ దొరుకును..!

అత్యంత చౌకగా వస్తువులు దొరికే మార్కెట్‌గా విజయవాడ బీసెంట్ రోడ్డుకు పేరుంది. మొత్తం హాకర్లతో నిండిపోయే వ్యాపార ప్రాంతమిది. ఐదు రూపాయ‌ల నుంచి ఐదు వేల రూపాయిల వ‌ర‌కూ ఇక్క‌డ దొర‌కందంటూ ఏదీ ఉండ‌దు.

నగరంలో అత్యంత రద్దీగా ఉండే వ్యాపార‌ కేంద్రాలతో నిత్యం సందడిగా ఉండే బీసెంట్ రోడ్ విజయవాడలో షాపింగ్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా చెప్పొచ్చు. బెజ‌వాడ నగరానికి కొత్తగా ఎవరొచ్చినా.. మొదటిగా వాలిపోయేది బీసెంట్ రోడ్డులోనే. ఈ సంక్రాతి వేళ బీసెంట్ రోడ్‌లో అడుగుపెడ‌దాం రండి!

విజయవాడ న‌డిబొడ్డున‌ ఉన్న బీసెంట్‌ రోడ్ అత్యంత రద్దీగా ఉండే రోడ్లలో ఒకటి. ఇక్కడ మీకు కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయి. వస్త్రాలు, చలికోటులు, గాజులు, చెవిదిద్దులు, వాచీలు, చెప్పులు, చున్నీలు, నైటీలు... ఇలా అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా బట్టల దుకాణాల‌తో పాటు, అనేక సినిమా థియేటర్లు కూడా ప‌ల‌క‌రిస్తాయి.

అంతేకాదు, స్ట్రీట్ ఫుడ్ ఇష్ట‌ప‌డేవారికి బీసెంట్ రోడ్ స్వ‌ర్గంలా క‌నిపిస్తుంది. డిఫ‌రెంట్ రిసిపీల‌ను ప‌రిచ‌యం చేస్తూ.. రుచిక‌ర‌మైన ఫుడ్‌ను అందించే చాలా రెస్టారెంట్లు ఈ రోడ్‌లో క‌నిపిస్తాయి. బందరు, ఏలూరు రహదారులకు మధ్యలో ఉండే ఓ కిలోమీటర్ దూరం ఉన్న ఈ గల్లీలో అతి రద్దీ అయిన బజారు ఇది. ఆ చివర ఒక దుకాణం దగ్గర ఆరంభించి.. ఈ చివరకు రావాలంటే.. కనీసం మూడు నాలుగు గంటల స‌మయం ప‌డుతుందంటే బీసెంట్ రోడ్ ఎంత ర‌ద్దీగా ఉంటుందో అర్థ‌మైపోతుంది.

Besant Road

సామాన్యుల మ‌ల్టీ షాపింగ్ మాల్‌

మ‌రీ ముఖ్యంగా సంక్రాంతి సీజ‌న్ వ‌చ్చిందంటే పండ‌గ వాతావ‌ర‌ణం ఇక్క‌డే క‌నిపిస్తుంది. ప్రతి దుకాణం వద్ద పదుల సంఖ్యలో కొనుగోలుదారులు చుట్టుముట్టి బేరాలాడుతూ కనిపిస్తారు. ఎక్క‌డ చూసినా బేరాల్లేవ్... అన్ని ఫిక్స్‌డ్‌ ధరలే అని బోర్డులు క‌నిపిస్తాయి.

కానీ, బేరమాడితే తగ్గించి ఇచ్చేవాళ్లే ఇక్కడ అధికంగా ఉంటారు. అందుకే, సామాన్యుల‌కు ఇదో మ‌ల్టీ షాపింగ్ మాల్‌గా క‌నిపిస్తుంది. కాకపోతే, ఇక్క‌డ ధ‌ర విష‌యంలో స్వేచ్ఛ‌గా బేర‌మాడే అవ‌కాశం దొరుకుతుంది. మ‌హిళ‌ల అలంకార వ‌స్తువులు, రోల్డ్‌గోల్డ్ ఐట‌మ్స్ స‌రికొత్త మోడ‌ల్స్ త‌క్కువ‌ ధ‌ర‌ల‌కే ఇక్క‌డ ల‌భిస్తాయి.

Besant Road

అస్స‌లు టైమే తెలియ‌దు..

బట్టలు మరియు ఇతర ఫ్యాషన్ ఉపకరణాలను విక్రయించే దుకాణాలకు ప్రసిద్ధి చెందింది బీసెంట్ రోడ్‌.
ఇక్కడ మీరు మీ కుటుంబ స‌భ్యులు లేదా స్నేహితులతో రోజంతా షాపింగ్ చేస్తూ గడపవచ్చు. ఒక్క‌సారి ఈ రోడ్‌లో అడుగుపెడితే అస్స‌లు టైమే తెలియ‌కుండా పోతుంది. బీసెంట్ రోడ్డు చుట్టుప‌క్క‌ల ప్రాంతం మోటారు విడిభాగాలకు, వాహనాల స్టిక్కరింగ్‌కు కేంద్రంగా ఉంది.

మరో వైపు ఇక్క‌డి ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులు విక్రయిస్తుంటారు. ఇక్క‌డ అన్ని ర‌కాల మొబైల్ ఫోన్లు మంచి మంచి ఆఫ‌ర్ల‌తో విక్ర‌యిస్తారు. అందుకే, బీసెంట్ రోడ్ స‌హా ఇక్క‌డి చుట్టుపక్క‌ల ప్రాంతాలు మధ్య తరగతి ప్రజల కొనుగోలు కేంద్రాలుగా మారాయి.

బస్సు ద్వారా :- విజయవాడ పాత RTC బస్టాండ్ 1.0 కిలోమీట‌ర్ల దూరంలో బీసెంట్ రోడ్ ఉంది.

రైలు మార్గం:- విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ బీసెంట్ రోడ్ నుండి 1.4 కిలోమీట‌ర్లు.

విమానం ద్వారా :- విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం బీసెంట్ రోడ్డు నుంచి దూరం 19.2 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.

Read more about: besant road vijayawada
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X