Search
  • Follow NativePlanet
Share
» »హిందువులకు అత్యంత పవిత్రమైన పశుపతినాథఆలయం

హిందువులకు అత్యంత పవిత్రమైన పశుపతినాథఆలయం

By Venkatakarunasri

హిమాలయాలలో అత్యంత పవిత్రమైన హిందూ ఆలయాలలో ఒకటైన పశుపతినాథఆలయం వెలసివుంది. పశుపతినాధుడంటే మహాశివుని ప్రతిరూపమే.అత్యంత ప్రధానమైన ఈ ఆలయాన్ని ఏటా వేలాదిమంది హిందువులు హిందూమతాన్ని అనుసరించే వయోవృద్ధులు దర్శించుకుంటుంటారు. వీరంతా తమ జీవితపు చివరిరోజులని ఇక్కడ గడిపి ముక్తి సాధించాలన్న లక్ష్యంతో ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందుతుంటారు. ఇక్కడ మరణించిన వారికి అంత్యక్రియలు జరుగుతుంటాయి.వీరి అస్థికలను పవిత్రమైన నదిలో కలుపుతుంటారు వారి కుటుంబసభ్యులు.నదీ ప్రవాహంలో కలిసిన ఈ అస్థికలు తరువాత గంగానదిలో చేరుకుంటాయి.

అనేకమంది హిందువులు తమ జీవనయాత్ర ముగింపు కోసం ఇక్కడకు చేరుకుంటుంటారు.పశుపతినాధుని సన్నిధిలో మరణించినవారు తమ జీవితంలో చేసిన పాప కర్మలతో నిమిత్తం లేకుండా మరో జన్మ ఎత్తుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.మరణించేరోజులు ఇక్కడి ఆలయ జ్యోతిష్యులు ఖచ్చితంగా లెక్కించి చెబుతుండటం మరో విశేషం. జీవనయానం నుంచి విముక్తి కలిగించే ప్రదేశాలను సందర్శించాలనుకునే వారికి పశుపతినాధఆలయం తొలి గమ్యస్థానం అని చెప్పొచ్చు.ఇక్కడి వాతావరణంలోనే మృత్యువువుంటుంది. ఈ ఆలయంలోని ప్రతి మూల జరిగే ప్రతి కార్యక్రమంలోను మృత్యుచాయలు ఇక్కడకనిపిస్తుంటాయి.

మళ్ళీ మనిషిజన్మ ఎత్తాలంటే ఆ గుడి లో మరణించాల్సిందే ?

ప్రధాన ఆలయం

ప్రధాన ఆలయం

పశుపతినాధుని ప్రధాన ఆలయం బంగారుశిఖరంతో బంక్ తరహా పైకప్పుతో కూడిన భవనం.ఇది భాగమతీనది పశ్చిమతీరంలో వుంది.

PC:youtube

ప్రధాన ద్వారాలు

ప్రధాన ద్వారాలు

ఈ ఆలయం హిందు వాస్తు కళకు మాస్టర్ పీస్ అని చెప్పవచ్చును.ఈ ఆలయానికి 4 ప్రధాన ద్వారాలున్నాయి.

PC:youtube

బంగారు పూత

బంగారు పూత

ఇవన్నీ వెండిరేకులతో తాపడం చేసినవి కావడం మరో విశేషం.రెండంతస్థూల ఈ భవనం పై కప్పును రాగిలోహంతో తయారు చేసి పైన బంగారు పూత పూసారు.

PC:youtube

శోభాయమానం

శోభాయమానం

అత్యంత శోభాయమానంగా వెలుగొందే ఈ ఆలయంలో ఉన్నటువంటి చెక్క శిల్పాలు నిజమైన మూర్తుల్లా మనకు దర్శనమిస్తుంటాయి.

PC:youtube

సందర్శకులకు కనువిందు

సందర్శకులకు కనువిందు

వీటితోపాటు ఆలయంలో కనిపించే భారీనంది స్వర్ణప్రతిమ సందర్శకులకు కనువిందు చేస్తాయి.ప్రధానఆలయంలోకి కేవలం హిందూమతస్తులకి మాత్రమే ప్రవేశం వుంటుంది.

PC:youtube

భవనాల సందర్శన

భవనాల సందర్శన

మిగిలిన భవనాలను సందర్శించేందుకు విదేశీయులను కూడా అనుమతిస్తారు.భాగమతీనది తూర్పుతీరం నుండి చూస్తే ఈ ఆలయం అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తుంటుంది.

PC:youtube

అత్యంత పవిత్రప్రార్ధనా మందిరం

అత్యంత పవిత్రప్రార్ధనా మందిరం

నది పశ్చిమతీరంలో పశుపతినాధ ఆలయంతో పాటు పాంచ్ దేవళ్ అంటే 5ఆలయాల సముదాయం కూడా వుంది.గతంలో అత్యంత పవిత్రప్రార్ధనా మందిరంగా వున్న ఈ సముదాయం ఇప్పడు వృద్ధులుఅనాధలకు ఆశ్రయంగా మారింది.

PC:youtube

శివుడికి సంబంధించిన ఆలయాలు

శివుడికి సంబంధించిన ఆలయాలు

భాగమతీనదీ నదీతీరంలో అనేక ఆలయాలు వున్నాయి. ఇందులో అధికశాతం శివుడికి సంబంధించిన ఆలయాలు కావటం విశేషం.

PC:youtube

త్రికాస్తీభావన సముదాయాలు

త్రికాస్తీభావన సముదాయాలు

ఈ భవనాలలో అధికశాతం చిన్న రాతి కట్టడాలే.ఈ భవనాలు వెలుపలి నుండి ఖాళీగా కనిపిస్తున్నప్పటికి వాస్తవానికి ఇవి త్రికాస్తీభావన సముదాయాలు శివుని ప్రతిరూపమైన లింగాకారంకోసమే ఈ భవనాలు నిర్మితమయ్యాయి.

PC:youtube

వేదికలు

వేదికలు

ఈ సముదాయంలో ప్రతి చోట శివలింగం దర్శనమిస్తూ వుంటుంది.భాగమతి నది కుడివైపు అంత్యక్రియలకోసం అనేక వేదికలు నిర్మితమయ్యాయి.వాస్తవానికి అంత్యక్రియలు ఇక్కడ అనుదిన కార్యక్రమంగా కొనసాగుతూనే వుంటుంది.

PC:youtube

అంత్యక్రియల క్రతువు

అంత్యక్రియల క్రతువు

సాధారణంగా ఇక్కడకు వచ్చే పర్యాటకులకు కనీసం ఒక్క సారైనా బహిరంగ అంత్యక్రియల క్రతువును చూసే అవకాశం లభిస్తుంది.

PC:youtube

విదేశీయులకు విస్మయం

విదేశీయులకు విస్మయం

అయితే ఇక్కడ జరిగే మతపరమైన కార్యక్రమాలలో అధిక శాతం అసాదారనమైనవి మాత్రమే కాక,విదేశీయులకు విస్మయం కలిగిస్తుంటాయి.

PC:youtube

స్థానికమహిళలు

స్థానికమహిళలు

పశుపతినాథ ఆలయపరిసరాలలో దగ్ధమయ్యే మృత దేహాలనుండి వెలువడే విభిన్నమైన వాసనలే అని చెప్పొచ్చు. ఇక్కడ విస్మయం కలిగించే మరో అంశం స్థానికమహిళలు నదీ ప్రవాహం దిగువున దుస్తులు వుతుకుతుండటం మరొకటి.

PC:youtube

నదీజలాలు

నదీజలాలు

నదీజలాలు శివభక్తుల అస్థినిమర్జనాలతో జంతువుల కొవ్వుతో నిండిపోతుంటాయి.సబ్బుతో,కొవ్వుతో మురికినంతటినీ అత్యంత సులభంగా వదిలిస్తుంటారు.

PC:youtube

ఇక్కడ సంచరించే కోతులు

ఇక్కడ సంచరించే కోతులు

ఇక్కడి మహిళలు. శివుడు ఈ ఆలయపరిసర ప్రాంతాలలో అన్ని జీవులకు,జంతువులకు పోషకుడిగా భక్తులు విశ్వసిస్తుంటారు.ఇక్కడ సంచరించే కోతులు పర్యాటకుల ముందుకు వచ్చి ఆహారాన్ని అందిస్తుంటాయి.

PC:youtube

పశుపతినాధ టెంపుల్

పశుపతినాధ టెంపుల్

ఏ మాత్రం ఏమరుపాటుగా వున్నా చేతులలోని వస్తువులను టక్కున లాక్కుని పారిపోతుంటాయి.కొన్ని సందర్భాలలో ప్రమాదకరంగూడాను.పశుపతినాధ టెంపుల్ లో సాధువుల సంచారం అత్యంత సర్వసాధారం అని చెప్పవచ్చును.

PC:youtube

పచ్చబొట్లు

పచ్చబొట్లు

సాధువులు నిరంతర ధ్యానంతో పునరావృత్తిరహితమైన మోక్షప్రాప్తిని అనుసరిస్తూవుంటారు.వీరు తమ శరీరాలపై పచ్చబొట్లతో కనిపిస్తుండటం మరో విశేషం.

PC:youtube

పర్యాటకులు

పర్యాటకులు

సాధువులలో అధికశాతం మంది పర్యాటకులతో స్నేహంగా వుంటూ ఫోటోలకు ఫోజులు కూడా ఇస్తుంటారు.అయితే ఇదంతా వుచితంగా మాత్రం కాదండోయ్.

PC:youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more