Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ ధైర్యముంటే దెయ్యాలతో సెల్ఫీ కూడా దిగొచ్చు

ఇక్కడ ధైర్యముంటే దెయ్యాలతో సెల్ఫీ కూడా దిగొచ్చు

గోవా అంటే కేవలం బీచ్లు, పోర్చుగీసు హౌస్లు, చర్చులు మాత్రమే కాదు.అంతకుమించి ఇంకానే వున్నాయి. అలాగే గోవాలో కేవలం పర్యాటకులు మాత్రమే తిరుగుతూవున్నారని అనుకోవద్దు. దెయ్యాలుకూడా తిరుగుతూ వుంటాయట.

By Venkatakarunasri

గోవా అంటే కేవలం బీచ్లు, పోర్చుగీసు హౌస్లు, చర్చులు మాత్రమే కాదు.అంతకుమించి ఇంకానే వున్నాయి. అలాగే గోవాలో కేవలం పర్యాటకులు మాత్రమే తిరుగుతూవున్నారని అనుకోవద్దు. దెయ్యాలుకూడా తిరుగుతూ వుంటాయట. అప్పుడప్పుడూ కనిపిస్తూ, అందరినీ పలకరిస్తూ, భయపెడుతూ సరదాగా గడిపేస్తాయని చెబుతున్నారు.చెప్పాలంటే హర్రర్ సినిమాకంటే ఇంట్రస్టింగ్గా దెయ్యాలకథలను ఇక్కడ వినొచ్చు.వీలైతే ఎక్ష్పేరియన్స్ చెయ్యొచ్చు. దెయ్యాలతో సెల్ఫీ కూడా దిగొచ్చు.

బోరింగ్ బ్రిడ్జ్

బోరింగ్ బ్రిడ్జ్

ఈ ప్రాంతంలో దెయ్యాలను చూసామని కధలుకధలుగా చెప్తూ వుంటారు. ఓ మహిళా ఈ బ్రిడ్జ్ నుండి నదిలోకి దూకుతున్నట్లుగా చూసామని కొందరు ఆ ప్రాంతం మీదుగా వెళుతుంటే ఎవరో మహిళ తమ కారులోని వెనకాల సీట్లో కూర్చున్నట్లు కనిపించిందని మరికొందరు చెప్పడం విశేషం.దీంతో రాత్రివేళల్లో ఈ బ్రిడ్జ్ ను దాటడమంటే సాహసంచేసినట్లేనని అంటున్నారు.

PC:youtube

కింగ్స్ చర్చ్

కింగ్స్ చర్చ్

రాజ్య కాంక్షతో రగిలిపోతున్న ఓ రాజు ఈ ప్రాంతంలో ఇద్దరు రాజులను హత్యచేసాడు. ప్రజలు అతనిని చుట్టుముట్టడంతో విషంతీసుకుని చనిపోయాడు. అప్పట్నుంచి ఇక్కడ ముగ్గురు రాజుల ఆత్మలు వున్నట్లు ప్రచారంలో వుంది. ఇక్కడ వింతైన శబ్దాలు విన్నామని పర్యాటకులు చెప్తూవుంటారు. మిట్టమధ్యాహ్నం కూడా ఇక్కడ వచ్చేందుకు ప్రజలు భయపడుతుంటారు. మడిచుట్టూ పక్కనుండి దెయ్యాన్ని చూసానని ఆ తర్వాత రోజూ ఆయన నిద్రలో ఆమె పేరు గట్టిగా కలవరించటంతో ఆ దెయ్యానికి ఆమె పేరు పెట్టారని చెప్తూవుంటారు. ఈ ఘటన జరిగి సుమారు 50ఏళ్లవుతుంది.ఇప్పటికి ఆమె ఆ మర్రిచెట్టుపై వుంటుందని ప్రచారంలో వుంది.

PC:youtube

SH 17

SH 17

ఈ ముంబై హైవే కూడా దెయ్యాలకు ఫేమస్. సూర్యాస్తమయం తర్వాత ఎవరైనా ఆ ప్రాంతంలో మాంసాహారంతోకాని ప్రయాణిస్తే దెయ్యాలు వారిని వెంటాడుతాయని ప్రచారంలో వుంది.ఆ సమయంలో వారి వాహనాలు ఒక్కసారిగా అదుపుతప్పుతాయంటూ కొందరు తమ అనుభవాలను చెబుతుంటారు. బ్రేతాకోల్, దవాలీబూరి మార్గంలో ఈ ప్రాంతం వుంది.హర్రర్ సినిమాల్లో చూపించినట్లు రాత్రివేళల్లో ఈ మార్గంలో వెళ్ళే వారికి రోడ్డుమధ్యలో ఒక మహిళ నడుస్తూ కనపడుతుందట.దీంతో ఇక్కడ చాలా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

PC:youtube

ఇగోర్ చంబాంద్

ఇగోర్ చంబాంద్

ఇక్కడ పట్ట పగలుకూడా దెయ్యాలు చూడొచ్చని చాలా మంది చెబుతున్నారు. మార్గోప్రాంతంలోని ఈ ప్రదేశంలో పగలే భయానకంగా ఉంటుందంటే రాత్రివేళలో పరిస్థితి ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చును.మధ్యాహ్నం 2నుంచి3గం లల్లోపు ఆ ప్రాంతంలో పర్యటించటం భయానికమని హెచ్చరిస్తున్నారు.

PC:youtube

సెమిలరీ ఆర్క్

సెమిలరీ ఆర్క్

ఇక్కడ ఒక మాజీ సైనికుడి ఆత్మ సంచరిస్తుందని స్థానికులు చెపుతూవుంటారు. పోర్చుగీసు కాలంలో చనిపోయిన ఆ సైనికుడికి ఆ ప్రాంతమంటే చాలా ఇష్టమట.ఒక్కోసారి ఆ సైనికుడు యూనిఫాంలో కనిపిస్తాడట. ఆర్ కె లోపలికివెళ్ళే వారికి అడ్డగిస్తాడట.

PC:youtube

రోడ్రిగస్ హోం

రోడ్రిగస్ హోం

వెర్నాలో వున్న ఈ ఇంట్లో రోడ్రిగస్ అనే వ్యక్తి కుటుంబీకులు చనిపోయినా ఇంకా ఆ ఇంట్లోనే నివాసముంటున్నాడని కధలు చెబుతుంటారు.ఈ ఇంట్లోని తలుపులు, కిటికీలు వాటికవే కొట్టుకుంటాయట. ఈ ఇంటివద్ద ఫోటోలు తీసుకోటానికి చాలామంది పర్యాటకులు వస్తూవుంటారు.

PC:youtube

జానకీ బాంద్

జానకీ బాంద్

ఈ వంతెన కూడా గోవాలో అత్యధికంగా రోడ్డుప్రమాదాలు జరిగే ప్రాంతం. ఈ ప్రాంతంలో కూడా దెయ్యాలకు నెలవు అనే ప్రచారం వుంది. ఇక్కడ ఒకప్పుడు ఎన్నో ప్రమాదాలు జరిగేవట.
ఒక స్కూల్ బస్సు ఇక్కడ బోల్తాపడటంతో అందులోని చిన్నారులంతా చనిపోయారు.అప్పటినుంచి సాయంత్రంవేళల్లో ఆ మార్గంనుంచి వెళ్లేవారికి చిన్నారుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X