Search
  • Follow NativePlanet
Share
» »షిల్లాంగ్ : 5 అద్భుత జలపాతాలు !

షిల్లాంగ్ : 5 అద్భుత జలపాతాలు !

By Mohammad

షిల్లాంగ్, ఈశాన్య భారతదేశంలోని ఒక ప్రముఖ పట్టణం. ఇది మేఘాలయ రాష్ట్ర రాజధాని. దట్టమైన అడవులు, ప్రకృతి సోయగాలు, రిజర్వ్ ఫారెస్ట్ లు ఎన్నో పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదు చేసే చిరపుంజీ కి దగ్గరలో (50 కి. మీ ల దూరంలో) ఎత్తైన పర్వతాలతో, అందమైన పుష్పాలతో, మబ్బులు కమ్ముకున్న మేఘాలతో నిండి ఉంటుంది.

ఇది కూడా చదవండి : మేఘాలయ ప్రయాణం - మబ్బుల్లో పర్యటన !

షిల్లాంగ్ లో ప్రత్యేక ఆకర్షణ విస్తారంగా ఉండే జలపాతాలు. ఇక్కడి జలపాతాలు పర్యాటకులను మంత్ర ముగ్ధులనుచేస్తాయి, మబ్బుల్లో విహరింపజేస్తాయి. ఇది ఈ ప్రాంత ప్రత్యేకత.

1. ఎలిఫెంట్ జలపాతాలు / ఏనుగు జలపాతాలు

ఏనుగు జలపాతం నగరం నుండి 8 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడికి కొన్ని అందమైన రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. జలపాతం మూడు పాయలుగా కిందకు ప్రవహిస్తూ ఉంటుంది. ఏనుగును పోలిన రాక్ ఉండటం వల్ల బ్రిటీష్ వారు దీనికి ఆ పేరు పెట్టారు. నల్లని పాలరాతి రాతి నుండి జాలువారే ఆ నీటి ధార తెల్లని పాల వలే కనిపిస్తుంది.

ఏనుగు జలపాతాలు

ఏనుగు జలపాతాలు

చిత్ర కృప : ASIM CHAUDHURI

ఈ జలపాతం చుట్టూ వైద్యానికి పనికివచ్చే వన మూలికలు, విలువైన చెట్లు ఉన్నాయి. జలపాతం దగ్గరలో కొన్ని వస్త్రాల దుకాణాలు, హస్తకళ ల దుకాణాలు ఉన్నాయి. స్థానిక సంప్రదాయ దుస్తులను ధరించి జలపాతం వద్ద ఫోటోలు తీసుకోవచ్చు. జలపాతం చుట్టూ నిటారుగా ఉన్న రాళ్ళపై అధిరోహణ చేసే ఆసక్తి ఉన్న వాళ్లకి ఈ ప్రదేశం గొప్పగా ఉన్నది.

2. బిషప్ జలపాతం

బిషప్ జలపాతం షిల్లాంగ్ లోని బార బజార్ కు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జలపాతం చుట్టూ ఆకుపచ్చని పచ్చదనం కప్పబడి చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షనీయంగా కనిపిస్తుంది. తెల్లని పాలవలే జాలువారే నీటి ధార మీకు నిజంగా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.

ఇది కూడా చదవండి : షిల్లాంగ్ టు చిరపుంజీ రోడ్ ట్రిప్ ప్రయాణం !

3. స్వీట్ జలపాతం

స్వీట్ జలపాతం, షిల్లాంగ్ ఏటవాలు ప్రాంతంలో విస్తరించిన అందమైన జలపాతాలలో ఒకటి. ఇది సముద్ర మట్టానికి 96 మీటర్ల ఎత్తులో ఉంటుంది. వర్షాకాలంలో ఈ జలపాతం యొక్క నీటి ధార ఫ్లో ఎక్కవగా ఉండటం తో పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడికి చేరుకోవటం సులభం. హ్యాపి వ్యాలీ కి చేరువలో ఈ జలపాతం కలదు.

స్వీట్ జలపాతం

స్వీట్ జలపాతం

చిత్ర కృప :Josephlalrinhlua786

జలపాతం అంచుల వద్ద తడి ఎక్కువగా ఉండటం కారణంగా జారి పడే అవకాశం ఎక్కవ. కనుక జాగ్రత్త గా, నెమ్మదిగా ఒకరి చేయి ఒకరు పట్టుకొని వెళ్ళండి. స్థానికులు తరచూ ప్రకృతి యొక్క ల్యాప్లు చేదించడం కొరకు తరచూ సందర్శిస్తుంటారు.

4. స్ప్రెడ్ ఈగల్ జలపాతం

స్ప్రెడ్ ఈగల్ జలపాతం షిల్లాంగ్ లోని పోలో హిల్స్ కు సమీపాన మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. డేగ రెక్కలు విచ్చుకొని కనపడటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. జలపాతం కొండల వద్ద మెల్లగా ప్రవహిస్తూ .. రాళ్ళను దాటుకుంటూ .. కిందకు ప్రవహిస్తున్నప్పుడు గంభీరంగా, వేగంతో కిందకు పడుతుంది. స్ప్రెడ్ ఈగల్ జలపాతానికి సతి జలపాతం అని మరొక పేరు.

ఇది కూడా చదవండి : షిల్లాంగ్ పర్యటన లో ఆనందాలు !

5. క్రినోలినే ఫాల్స్

క్రినోలినే ఫాల్స్ షిల్లాంగ్ నడి బొడ్డున కలదు. ఇది స్థానికంగా, షిల్లాంగ్ పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఇది లేడి హైదర్ పార్క్ కు సమీపాన కలదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X