• Follow NativePlanet
Share
» »ఎప్పటికీ ఛేదించలేని రహస్యాలు.......

ఎప్పటికీ ఛేదించలేని రహస్యాలు.......

ప్రపంచంలో చారిత్రకమైన రహస్యాలను కలిగిన ఎన్నెన్నో కట్టడాలు ఉన్నాయి. అత్యంత పురాతనమైన సంస్కృతి కలిగిన మన భారతదేశంలో అంతులేని రహస్యాలు వున్నాయి. ఇంతకూ మన దేశంలో పలు కట్టడాలు ఎలా నిర్మించారు? అనే ప్రశ్నకు రహస్యాలు అలాగే వుండిపోయింది. అలాంటి కట్టడాలు ముఖ్యంగా దేవాలయాల గురించి తెలుసుకుందాం.

ఈ దేవాలయాల నిర్మాణం గురించి ఇది కూడా నిగూఢమైన రహస్యాలు అలాగే ఉండిపోయింది. అలాంటి రహస్యాలను కలిగిన టాప్ 5 దేవాలయాల గురించి వ్యాసంలో తెలుసుకుందాం.

ఎప్పటికీ ఛేదించలేని రహస్యాలు.......

1. కోణార్క్ సూర్యదేవాలయం

1. కోణార్క్ సూర్యదేవాలయం

ఈ దేవాలయాన్ని క్రీ.శ.1236 నుంచి 1264 ల మధ్యకాలంలో గంగావంశానికి చెందిన లాంగులా నరసింహదేవుడు నిర్మించాడని అక్కడి ఆధారాల మూలంగా తెలుస్తుంది. ఈ దేవాలయంలో 7 గుర్రాలు అలాగే 24 చక్రాలు కలిగిన రథం మాదిరిగా నిర్మించారు.

PC:Bikashrd

 2. కోణార్క్ సూర్యదేవాలయం

2. కోణార్క్ సూర్యదేవాలయం

అయితే ఈ దేవాలయంలో కొంత భాగాన్ని 18 వ శతాబ్దంలో కొంతమంది దండయాత్రలలో ధ్వంసం చేశారని చరిత్రకారులు చెప్తారు. ఆ విచిత్రమైన స్థలంలో సుమారు 52 టన్నుల అయస్కాంతమున్నదని చెప్తారు.

PC:Kartike Bhatore

3.కోణార్క్ సూర్యదేవాలయం

3.కోణార్క్ సూర్యదేవాలయం

ఆ అయస్కాంత గర్భగుడిలో వున్న స్వామి విగ్రహం గాలిలో తేలినట్లు తయారు చేసారని చరిత్రకారులు చెప్తారు. అయితే ఆ అయస్కాంతాన్ని ఎందుకు నాశనం చేసారు? అనే విషయం ఎవరికీ తెలీదు. అయితే ఈ గుడిలో ఉన్న రథచక్రాలు విజ్ఞానాన్ని కలిగివున్నది. ఎందుకంటే సన్ డయల్ ఇప్పటికీ కాలపట్టికను తెలుపుతుంది. మా భారతీయనైపుణ్యాలు ఎంత మహిమాన్వితంగా ఉన్నాయనేది దీని నుంచి తెలుస్తుంది.

PC:Bikashrd

4. బృహదీశ్వర దేవాలయం

4. బృహదీశ్వర దేవాలయం

తమిళనాడు తంజావూరులో వున్న ఈ గుడిని నిర్మించి సుమారు 1000 సంల కన్నా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ దేవాలయాన్ని క్రీ.శ. 1015లో చోళ వంశానికి చెందిన రాజేంద్ర చోళుడు కట్టించాడని చరిత్రకారులు చెప్తారు.

PC:Vishnu R Haripad

5. బృహదీశ్వర దేవాలయం

5. బృహదీశ్వర దేవాలయం

ఈ దేవాలయాన్ని కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే వాస్తుశిల్పి ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించారని అక్కడ ఉన్న శాసనాలు తెలియజేస్తుంది. ఈ బృహదీశ్వర దేవాలయాన్ని గ్రానైట్ రాయితో నిర్మించారు. ఈ దేవాలయ నిర్మాణానికి సుమారు లక్ష 30 వేల గ్రానైట్ రాళ్ళని వుపయోగించారు.

PC:KARTY JazZ

6. బృహదీశ్వర దేవాలయం

6. బృహదీశ్వర దేవాలయం

ఈ గుడి గోపురం మీద వుండే అర్ధచంద్రాకారంలో వున్న కట్టడం ఒక్కటే 80 టన్నులు వుంటుందంట. దేవాలయం గోపురం ఎత్తు 216 అడుగులుంది. క్రేన్ లు, మిషన్ లు వంటి ఎటువంటి పరికరాలు లేకుండానే ఆ కాలంలో ఇటువంటి అతి బరువైన రాళ్ళను పైన ఎలా పెట్టారు? అనేది ఎప్పటికీ కూడా ఒక రహస్యంగానే వుంది.

PC:WIKICOMMON

7. వీరభద్ర దేవాలయం

7. వీరభద్ర దేవాలయం

ఈ విశేషాన్ని చూడటానికి అనేక ప్రదేశాలనుంచి పర్యాటకులు వస్తారు. ఆ స్తంభం అంత బరువైనదన్నప్పటికీ గాలికి ఎలా అల్లాడుతుంది అనేది తెలీకుండా వుంది.
ఇది కూడా ఒక రహస్యంగా అలాగే వుండిపోయింది.

PC:Nagesh Kamath

8. వీరభద్ర దేవాలయం

8. వీరభద్ర దేవాలయం

1910లో ఒక బ్రిటీష్ ఇంజనీర్ విభిన్నమైన ఈ స్థంభాన్ని చూసి ఆశ్చర్యపోయినాడు. ఆ స్థంభాన్ని అలాగే నేలను తాకించటానికి ప్రయత్నించాడు. అంతటితో ఆ దేవాలయం కట్టడం చిత్ర చిత్రంగా దేవాలయం మొత్తం కదలటం ప్రారంభించి పగుళ్ళు రావటం మొదలుపెట్టడం గమనించి ఆ ప్రయత్నాన్ని విరమించెను. ఆ స్తంభాన్ని గురించి ఎన్ని పరిశోధనలు చేసినా కూడా ఆ నిర్మాణ రహస్యాన్ని కనిపెట్టడానికి వారికి సాధ్యంకాలేదు.

PC:Premnath Thirumalaisamy

9. అనంత పద్మనాభ దేవాలయం

9. అనంత పద్మనాభ దేవాలయం

కేరళలో తిరువనంతపురంలో వున్న ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఎలా నిర్మించారు? అనే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ప్రపంచంలోనే సంపదలో అత్యంత ఎక్కువగా ప్రసిద్ధిచెందిన ఈ దేవాలయాన్ని సుమారు 22 బిలియన్ డాలర్లు విలువ చేసే బంగారం మరియు వజ్రాభరణాలు వున్నాయి.

PC:Ashcoounter

10 .అనంత పద్మనాభ దేవాలయం

10 .అనంత పద్మనాభ దేవాలయం

ఈ సంపద మొత్తం కూడా అనంత పద్మనాభ దేవాలయంలోని నేల మాళిగలలో వున్న 5 గదులలో వున్నాయి. ఇంకా అక్కడ తెరవకుండా వుండేవి 3 గదులున్నాయి. అయితే అందులో ఒక గదిలో ప్రవేశ ద్వారానికి సర్పాలు శిల్పాలుగా అలంకరణచేయబడి వున్నాయి. అది నాగబంధం అని పురాణాలు చెపుతున్నాయి.

11. అనంత పద్మనాభ దేవాలయం

11. అనంత పద్మనాభ దేవాలయం

ఆ గదులను తెరవాలంటే కొన్ని మంత్రాలకు మాత్రమే సాధ్యమవుతుంది. ఒక వేళ బలవంతంగా ఆ గదుల తలుపులను తెరిస్తే పెద్ద ప్రమాదం,హాని సంభవిస్తుందని పురాణాలు తెలియచేస్తున్నాయి. ఇంతకూ ఆ గదులలో ఏమున్నాయి? ఆ గదులకు నాగబంధం ఎందుకు ఉంది? అనేది ఇప్పటికీ కూడా రహస్యంగానే వుంది.

12. కైలాస దేవాలయం

12. కైలాస దేవాలయం

మహారాష్ట్రలో ఎల్లోరా గుహలో వున్న కైలాస దేవాలయమిదే. ఈ దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారు? ఎవరు నిర్మించారు?అనే దానికి సరియైన ఆధారం లేదు. కొంత మంది చరిత్రకారుల లెక్క ప్రకారం క్రీ.శ 6 వ శతాబ్దంలో ఈ ప్రదేశాన్ని పరిపాలించిన రాష్ట్రకూటుల సామ్రాజ్యానికి చెందిన రాజులు నిర్మించివుండవచ్చు నని ఊహించారు.

13. కైలాస దేవాలయం

13. కైలాస దేవాలయం

విశేషమేమంటే ఈ దేవాలయమంతా ఒకే రాయిలో నిర్మించబడింది. ఒక గ్రానైట్ కొండ మీదనుండి చెక్కినదని చరిత్రకారులు లెక్కించారు. ఈ దేవాలయం చాలా పెద్దిడిదిగా వుంది. కైలాస దేవాలయం ప్రపంచంలోనే ఏక శిలా ఫలకం నుంచి నిర్మించిన కట్టడంగా ఖ్యాతి పొందింది.

14. కైలాస దేవాలయం

14. కైలాస దేవాలయం

ఈ దేవాలయాన్ని నిర్మించటానికి సుమారు 4 లక్షల టన్నుల రాళ్ళ నుండి నిర్మించబడినదని కొన్ని ఆధారాలు తెలుపుతాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇంత పెద్ద దేవాలయాన్ని ఎలా నిర్మించారు? అనేది ఇప్పటికీ రహస్యంగానే వుండి పోయింది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి