» »ప్రపంచంలో అతి పొడవైన రంగోలి పుణ్యక్షేత్రం ..

ప్రపంచంలో అతి పొడవైన రంగోలి పుణ్యక్షేత్రం ..

Written By: Venkatakarunasri

మన పూర్వీకులు మనకు మనం నివశించే ఇల్లు, పరిసరాలు పరిశుభ్రంగా, అందంగా అలంకరించి వుంచుకోవాలని మాత్రమే బోధించారు.ఆ అలంకరణ,అందం అందమైన ముగ్గులతో వస్తుంది.
ఈ ఆధునిక ప్రపంచంలో అనేక అద్భుతమైన చిత్రాల ఆవిష్కరణను చూడవచ్చును,ఎన్నెన్నో అద్భుతాలు మన కళ్ళ ముందు మెదులుతుంటాయి.

మన భారతదేశం సాంప్రదాయకమైన దేశం. మన భారతదేశం యొక్క సంస్కృతి, నాగరికతలకు ప్రతిబింబం.

ముగ్గులు పోయటమంటే ప్రతి ఒక్కరికీ ఎంతో సరదా. అందులోనూ మన దేశంలో ఎంతో విశిష్టత కలిగివుంది. ఈ ముగ్గు చూడండి ఎంత పొడవుగా వుందో!

కలకత్తాలోని రంగోలి టెంపుల్

కలకత్తాలోని రంగోలి టెంపుల్

చూడండి. ప్రపంచంలోనే అతి పొడవైన ముగ్గు.ఇది ప్రపంచ రికార్డును సంపాదించింది.

కలకత్తాలోని రంగోలి టెంపుల్

ప్రపంచంలో అతి పొడవైన రంగోలి పుణ్యక్షేత్రం ..

కలకత్తాలోని దుర్గ అమ్మవారి దేవస్థానం

కలకత్తాలోని దుర్గ అమ్మవారి దేవస్థానం

కలకత్తాలోని దుర్గ అమ్మవారి దేవస్థానంలో ప్రపంచంలోనే అతి పొడవైనది రంగోలి వేసి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు.

దసరా పండుగ

కలకత్తాలో ఈ దసరా పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఈ ముగ్గు ఎంత పొడవుందో తెలుసా ?

ఈ ముగ్గు ఎంత పొడవుందో తెలుసా ?

ఈ ముగ్గు 1.23 కిమీ పొడవు ఉంది. రోడ్డు పొడవునా వివిధ రకాల రంగులతో ఆశ్చర్యం కలిగించేలా ముగ్గును వేసారు.

ఇంత కష్టపడి ఎవరు వేసారు?

ఇంత కష్టపడి ఎవరు వేసారు?

325 మంది ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు కలిసి 18 గంటలలో వేసారు. ఈ పెయింటింగ్ చేయడానికి 280 లీటర్ల పెయింట్ ఖర్చు అయ్యింది.

రంగోలి

బెంగాలీ భాషను రంగోలిలో వుపయోగించారు.

ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు

ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు 18 గంటలలో అంటే సోమవారం రాత్రి మొదలుపెట్టి మంగళవారం ఉదయానికల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసారు.

పశ్చిమ బెంగాల్ ప్రజలు

పశ్చిమ బెంగాల్ ప్రజలు దసరా పండుగను పురస్కరించుకుని పండుగకు కొన్ని రోజుల ముందు ఈ విధంగా భక్తిని చాటుకున్నారు. ఇది ప్రపంచ రికార్డులో ఒక భాగం.

సృజనాత్మక ఆలోచనలు

సృజనాత్మక ఆలోచనలు

ఇది చూస్తుంటే మనకి కూడా సృజనాత్మక ఆలోచనలు వస్తున్నాయి కదూ. మీరు కోల్కతా వెళితే చూడటానికి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ గా వుంటుంది.

Please Wait while comments are loading...