» »మరణించిన వారిని బ్రతికించగలిగే మహా శక్తి ఉన్న సంజీవని పర్వతం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా ?

మరణించిన వారిని బ్రతికించగలిగే మహా శక్తి ఉన్న సంజీవని పర్వతం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా ?

Written By: Venkatakarunasri

LATEST: ఆ ఊరంతా చేతబడి చేసేవాళ్ళే - క్షుద్రమాంత్రికులు మటుకే ఉండే ఊరు !

ఇండియాలో రాబోతున్న టాప్ 6 మెగా టెంపుల్స్ ఏవేవో తెలుసా?

చనిపోయిన మనిషిని బ్రతికించటం కష్టమని మనందరికీ తెలుసు. అది అసాధ్యం కూడాను.కానీ రామాయణంలో రాముడికి రావణునికి జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు చనిపోయినప్పుడు సంజీవనితో తిరిగి బ్రతికించారు. ఈ విషయం గురించి దాదాపు రామాయణం తెలిసిన వారికి తెలిసే వుంటుంది. ఆ సంజీవని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.

శ్రీరాముని దేవాలయంలో సీతారాముల ఎదురుగా చేతులు మోడ్చిన హనుమంతుడు ప్రతిష్ఠింపబడడం సాధారణం. ఇలా రామాలయాలు అన్నీ హనుమంతుని ఆలయాలే అనవచ్చును. ఇంకా హనుమంతుని దేవాలయాలు చాలా ఉన్నాయి. వీటిలోనూ సీతారాముల పటమో, విగ్రహాలో, ఆలయాలో ఉండడం సాధారణం. పెద్ద ఆలయాలు మాత్రమే కాక చాలా వూళ్ళలోను, రోడ్లప్రక్కన, చెట్లక్రింద - ఇలా హనుమంతుని చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. భయాపహారిగా ఆంజనేయుడు పల్లెలలో హిందువులకు వెన్నంటి ఉండే దేవుడు.

ప్రాచీన కాలంలో ఒక వానర జాతి ఉండేది. ఆ వానర జాతి వారు మనుషుల్లాగానే నాగరికత కలిగి పట్టణాల్లో జీవించేవారు. పెళ్ళిళ్ళు చేసుకొని సంసారం కొనసాగించేవారు. వారిలో కొందరు వేదాలు, పురాణాలు చదువుకొన్న మహా పండితులు కూడా ఉండేవారు. మనషులకు మించిన శక్తి యుక్తులు వారి సొంతం. వారికి ప్రత్యేకత ఏమంటే వెనక ఒక తోక ఉండేది. సభ్యత సంస్కారం కలిగిన వానరులకు ఒక రాజు కూడా ఉండేవాడు. అంటే పేరుకు వానరులయినా మేధస్సులో మనుషులకు తీసిపోని జాతి అది.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. శ్రీరాముని బంటు

1. శ్రీరాముని బంటు

హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి.

PC:youtube

2. సంజీవని మూలిక

2. సంజీవని మూలిక

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ధాటికి మూర్చిల్లిన లక్షణుడిని బ్రతికించడానికి సంజీవని మూలిక అవసరమవుతుంది..ఈ మూలిక హిమాలయ పర్వతాలలో లభిస్తుందని హనుమంతుని ఆ పర్వతంలోని ఆ మూలికను తెమ్మని చెప్పి పంపుతారు...హిమాలయాలకు వెళ్లిన హనుమంతునికి అక్కడి ప్రతి మొక్కా సంజీవని లాగానే కనిపిస్తుంది...ఏమి చేయాలో అర్థం కాదు

PC:Minaxi choudhary

3. ఆంజనేయుడు

3. ఆంజనేయుడు

ఒక పక్కన చూస్తే లక్ష్మణ స్వామి సకాలంలో మూలికను అందించలేదంటే తమకు దక్కడు... ఒకవేళ వేరే మూలికను తీసుకువచ్చినా ప్రయోజనం లేదు...ఇలాంటి తర్క మీమాంసలో మన ఆంజనేయుడు మొత్తం సంజీవని పర్వతాన్ని పెకిలించుకుని తన వెంట తీసుకువెళ్తాడు..

PC:Balasaheb Pant

4. హనుమంతుని స్వామి భక్తి

4. హనుమంతుని స్వామి భక్తి

తిరిగి లంకకు మొత్తం పర్వతంతో సహా వచ్చిన హనుమంతుని చూసి అసుర గణం, వానర గణం...శ్రీరాములు ఆశ్చర్య పోతారు... హనుమంతుని స్వామి భక్తి అటువంటిది మరి. అందుకే ఆయన శ్రీరాముని ప్రియభక్తులయ్యారు...ఈ పర్వతం ఇంకా మన మధ్యే ఉంది...ప్రస్తుతం ఇంకా ఇది శ్రీలంకలో చెక్కు చెదరకుండా ఉంది...ఇక్కడ ఉన్న ఎన్నోవేల రకాల మూలికలను వాటి ఔషధ గుణాలను చూసి ఎంతో మంది విదేశీయులు ఇక్కడికి పరిశోధనకై వస్తారట.

PC: youtube

 5. హిమాలయాలు

5. హిమాలయాలు

చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు తమకు ఏ వ్యాధి వచ్చినా ఇక్కడి మూలికలే ఉపయోగించుకుంటారట...ఈ పర్వతం మీద ఉన్న మొక్కలు శ్రీలంకలో మిగిలిన ఏ ఇతర ప్రాంతాలలోనూ దొరకదు...ఈ మొక్కల ఆనుపానులు హిమాలయాలలో మాత్రమే కనపడతాయని తెలిసింది.

PC: youtube

6. సుందరకాండ పారాయణ

6. సుందరకాండ పారాయణ

హనుమంతుని కార్య దీక్ష, సాఫల్యతలు సుందరకాండలో పొందుపరచబడినాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయనీ విస్తారమైన విశ్వాసం చాలామందిలో ఉంది. సుందరకాండలో అనేక శ్లోకాలు ప్రార్థనా శ్లోకాలుగా వాడుతారు.

హిమాలయాల్లో అంతుచిక్కని రహస్యాలు !

PC: youtube

7. అపూర్వ సృష్టి

7. అపూర్వ సృష్టి

హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.

PC: MV Sharma

8. సీతమ్మ జాడ

8. సీతమ్మ జాడ

చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు.

PC: Soham Banerjee

9. అశోకవనంలో సీత

9. అశోకవనంలో సీత

ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగాలేడు. రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు.

PC: wikimedia.org

10. శ్రీరాముని బాణాగ్ని

10. శ్రీరాముని బాణాగ్ని

అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.
అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది.

PC:Nivedita

11. రాక్షసకాంతలు

11. రాక్షసకాంతలు

రెండు నెలలు మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.

PC: Girikonda Nani

12. శుభ శకునములు

12. శుభ శకునములు

వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.

హిమాలయాల్లో అంతుచిక్కని రహస్యాలు !

PC:Rkrish67

13. లంక నుండి తిరిగి వస్తున్న హనుమంతుడు

13. లంక నుండి తిరిగి వస్తున్న హనుమంతుడు

ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.

PC:Saie.Surendra

14. శుభలక్షణములు

14. శుభలక్షణములు

హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. రెండు నెలలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.

PC:Pranayraj1985

15. మకరతోరణం

15. మకరతోరణం

ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు.

సిలిగురి ఈశాన్య భారతావని ముఖద్వారం !

PC:Adityamadhav83

16. మహేంద్రగిరి

16. మహేంద్రగిరి

చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరి పై వ్రాలాడు.

PC:Bhaskaranaidu

17. చూచాను సీతను

17. చూచాను సీతను

"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.

ఇండియా లో వింత ప్రదేశాలు !

PC:Nvamsi76

Please Wait while comments are loading...