Search
  • Follow NativePlanet
Share
» »దైవదర్శనానికి రుతస్రావం అడ్డు

దైవదర్శనానికి రుతస్రావం అడ్డు

శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం. ఇప్పుడు భారత దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన దేవాలయం. దాదాపు వందల ఏళ్లుగా వస్తున్న ఆచారాన్ని ఇక పై పాటించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకూ 10 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు రుతుస్రావానికి గురవుతారని అందువల్ల వారికి ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి వీలు కల్పించేవారు కాదు. అయితే భారత దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ విధానాన్ని తప్పుపట్టింది. ఇది మహిళలు, పురుషుల సమానత్వానికి అడ్డంకిగా మారిందని తెలిపింది. దీని ప్రకారం ఇక పై మహిళలు కూడా నేరుగా ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈమేరకు శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. కాగా, గతంలో శని శింగనాపూర్ దేవాలయంలోకి కూడా మహిళలను రానించేవారు కాదు. ఇదే సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం మహిళలు నేరుగా దేవాలయంలోకి వెళ్లి స్వామివారికి తైలాభిషేకాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శబరిమల లో ఉన్న అయ్యప్ప దేవాలయానికి సంబంధించిన కొన్ని రహస్య విశయాలు మీ కోసం...

ఈ శ్రీ కృష్ణుడి దేవాలయానికి వెలితే చావు ఖచ్చితం?

ఈ దసరా ఉత్సవాల్లో ఒక్కటైనా మీరు చూశారా?

ఈమె ఉన్నచోట ఆ యాగం చేస్తే శని దోష నివారణ అంతేనా యాగంలో ఎండుమిరపకాయలు...

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

శబరిమలను శబరిమలై అని కూడా అంటారు. మలై అంటే కొండ ప్రాంతం అని అర్థం. ఇక్కడ అయ్యప్ప కొండ పై వెలిశాడు కాబట్టి దీనిని శబరిమలై అంటారని చెబుతారు. ఈ పర్వత ప్రాంతం పశ్చిమ కనుల్లో ఉంది. అయ్యప్ప దేవాలయం సముద్ర మట్టానికి 3వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.

ఇక్కడ స్నానం చేయాలంటే 2028 వరకూ ఆగాల్సిందే

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

అయప్ప దేవాలయం ఉన్న కొండకు చుట్టూ 18 కొండలు ఉంటాయి. అయ్యప్ప గుడికి వెళ్లే యాత్రలు నవంబరు నెలలో ప్రారంభమయ్యి జనవరి నెలలో ముగస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

మండల పూజ, మకరవిళక్కు ఈ యాత్రలోని ప్రధాన ఘట్టాలు. జనవరి 14వ రోజున ఇక్కడ మకర జ్యోతి దర్శనమిస్తుంది. సాధారణంగా అయ్యప్ప దేవాలయాన్ని కేవలం మకర సంక్రాతికి మాత్రమే తెరుస్తారని భావిస్తారు.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

అయితే అయ్యప్ప ఆలయాన్ని ప్రతి మలయాళ నెలలో మొదటి ఐదు రోజుల పాటు తెరిచి ఉంచుతారు. శబరిమల యాత్ర ఒకప్పుడు చాలా కఠినంగా ఉండేది. అప్పట్లో శబరిమల వెళ్లిరావడానికి ఎరుమేలి మార్గం ఒక్కటే దారి.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

ఈ దారా ద్వారానే పూజారులు, సిబ్బంది ఆలయానికి వెళ్లివచ్చేవారు. పూజారులు కూడా ఎప్పుడు వెళ్లినా గుంపులుగా వెళ్లి వచ్చేవారు. సుమారు రెండు వందల ఏళ్ల క్రితం శబరిమలకు 70 మంది భక్తులు వెళ్లారని ఆలయ రికార్డులో రాసి ఉంది.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

అప్పుడు దేవాలయ ఆదాయం ఏడు రుపాయలని రికార్డులో ఉంది. క్రీస్తుశకం 1907లో శబరిమల గర్భగుడి పై కప్పు ఎండుగడ్డి, ఆకులతో కప్పబడి ఉండేది. అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా విగ్రహానికి పూజలు చేసేవారు.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

1909లో దేవాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. దీంతో క్రీస్తుశకం 1909-10లో దేవాలయాన్ని పున:నిర్మించారు. అప్పుడు శిలా విగ్రహానికి బదులు పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఈ విగ్రహానికే పూజలు జరుగుతున్నాయి.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలు ఉన్నాయి. కేరళలోని కుళతుపుళ లో ఇతనిని బాలుడి రూపంలో పూజిస్తారు. అదే విధ:గా అచ్చన్ కోవిల్ లో పుష్కల, పూర్ణ అనే దేవేరిలతో కలిసి అయ్యప్ప భక్తులకు దర్శనమిస్తాడు.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి ప్రతి ఏడాది దాదాపు ఐదు కోట్ల మంది ప్రజలు దర్శనం కోసం వెలుతుంటారని సమాచారం. ఇక ఆలయంలో ప్రసాదం అమ్మకం ద్వారానే దాదాపు రూ.35 కోట్ల రుపాలయ ఆదాయం వస్తోందని తెలుస్తోంది.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

క్రీస్తుశకం 1984 వరకూ పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమైన రాతిమెట్లపై నుంచే ఎక్కేవారు. అప్పుడు మెట్ల పై కొబ్బరికాయలు కొట్టేవారు. అయితే భక్తుల తాకిడి పెరిగి కొబ్బరి కాయలు కొట్టడం ఎక్కువయ్యింది.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

దీంతో మెట్లు అరిగిపోయాయి. దీంతో క్రీస్తుశకం 1985లో పంచలోహ కవచాన్ని ఆ మెట్లకు కప్పడం జరిగింది. దీని వలన 18 మెట్లు ఎక్కడం సులభతరమయ్యింది. బెంగళూరుకు చెందిన భక్తుడు ఒకరు శబరిమల గర్భగుడి పైన చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకోని 2000 సంవత్సరంలో పూర్తి చేశాడు.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

దీంతో శబరిమల స్వర్ణ దేవాలయంగా మారింది. శబరిమలలో వంశపార్యపర్యంగా ప్రధాన పూజారి ఉంటారు. వీరిని తాంత్రి అని పిలుస్తారు. వీరిని ఇక్కడ పూజ కొరకు తూర్పు గోదావరి జిల్లాలోని ర్యాలీ గ్రామం నుంచి తీసుకువెళ్లారు. ర్యాలీలోనే హరిహరుల కలయిక జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

శబరిమలలో పూజలు జరిపించే స్వామిని ప్రతి ఏడాది లాటరీ ద్వారా ఎన్నుకొంటారు. దేవస్థానానికి వచ్చిన ధరకాస్తులను పరిశీలించి పదింటిని సెలెక్టు చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బలో ఉంచుతారు.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

ఆ డబ్బాను అయ్యప్ప విగ్రహం ముందు ఉంచి ఒక చిన్నపిల్లవాడి చేత లాటరీ తీయిస్తారు. ఎవరు పేరువస్తే వారు ఏడాదికి ప్రధాన పూజారిగా వ్యవహరిస్తారు. ఈ ఆచారా చలా ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

అయ్యప్ప దర్శనం కోసం ఇరుముడితో వచ్చేవారు మాత్రమే పదునెమిది మెట్లు ఎక్కడానికి అర్హులు. అయితే తాంత్రీ, పందళరాజు, తిరువాభరణాలు అంటే అయ్యప్పకు అలంకరించే ఆభరణాలను మోసేవారు ఇరుముడి లేకుండానే ఎక్కుతారు.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

స్వామివారి ఆభరకణాలను శబరిమలకు 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న పందళంలో భద్రపరుస్తారు. ఈ ఆభరణాలను తేవడానికి పందళంలో భాస్కరన్ పిళ్లై కుంటుంబం ఉంది. వీరు మొత్తం 11 మంది 65 రోజుల పాటు దీక్షలో ఉంది తిరువాభరణాలను శబరిమలకు మోసుకువస్తారు.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

వీరు జనవరి 12 మధ్యాహ్నం పందళ:లో బయలుదేరి మధ్యలో రెండు రాత్రుళ్లు విశ్రాంతి తీసుకొని 14వ తారీకు సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు. ఆభరణాల వెంట పందళరాజు వంశస్తుల్లో పెద్దవాడు కత్తిపట్టుకొని నీలిమల వరకూ వచ్చి అక్కడ విశ్రమిస్తాడు.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

తిరు ఆభరణాలను గర్భగుడిలోని స్వామివారికి అలంకరించి కర్పూర హారతి ఇవ్వగానే భక్తులకు మకరజ్యోతి దర్శనం అవుతుంది. తిరిగి జనవరి 20న పందళరాజు వెంటరాగా తిరువాభరణాలు కలిగిన పెట్టెలను తీసుకువెళ్లి పందళంలో భద్రపరుస్తారు.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

అయ్యప్పను దర్శించే శబరిమలై యాత్ర ఎరుమేలితో మొదలవుతుంది. ఎరుమేలిలో ముందుగా స్వామివారు వావరుస్వామిని దర్శించుకోవాలి. వావరు ఒక ముస్లీం కులస్తుడు. ఈ వావరు ఇక్కడ ఒక మసీదులోనే కొలువుంటారని చెబుతారు.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

వావరు స్వామి చుట్టూ భక్తులు రకరకాల వేషధారణలతో పేటై తులాల అనే నాట్యం చేస్తారు. మహిషితో యుద్ధం చేసే సమయంలో అయ్యప్ప చేసిన తాండవం పేరు పేటై తులాల. దీనిని గుర్తుచేసుకొంటు స్వాములు ఇక్కడ ఈ నాట్యం చేస్తారు.

శబరిమల అయ్యప్ప

శబరిమల అయ్యప్ప

P.C: You Tube

ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉన్నాడు. ఈయనను కన్నెమూల గణపతి అని అంటారు. సన్నిధానంలో పానవట్టం పైన అయ్యప్ప కూర్చొని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. స్వామి కుర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుంది. ఒంపు తిరిగిన ఎడమచేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని పెద్దలు చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more