Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో తప్పక చూడదగిన 30 అద్భుత ప్రదేశాలు !

ఇండియాలో తప్పక చూడదగిన 30 అద్భుత ప్రదేశాలు !

సాధారణంగా బస్సుల్లో, రైళ్ళలో మరియు కార్లలో ప్రయాణాలు చేస్తుంటే మనం గమనించేది ఊర్లు, తోటలు, పొలాలు, వంతెనలు, మనుషులు, చుట్టూ ఉన్న ప్రకృతి .. ఇలా ఎన్నో.

By Staff

జీవితంలో మనం ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం .. వాటిలో కొన్ని తీపి జ్ఞాపకాలుగా గుర్తుండిపోతే, మరికొన్ని చేదు అనుభూతులుగా మిగిలిపోతుంటాయి. వాటి గోల ఇప్పుడు మనకెందుకు గానీ, మనం ఏం చెప్పుకోబోతున్నామో ఒక లుక్ వేద్దాం పదండి.

ప్రయాణాలు ఎప్పుడు చేస్తాం ? సాధారణంగా సెలవులు దొరికితే అంతేగా. లాంగ్ లీవ్ లు దొరికితే ఏదైనా దూర ప్రయాణాలకు ట్రిప్ వేస్తుంటాం (ఉదాహరణకి వేసవి సెలవులు, దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు అన్నమాట). సుదూర ప్రదేశాలకైతే విమానాలను, లోలోపలైతే బస్సులను, రైళ్ళను మరియు ఒక్కోసారి షిప్ లను ప్రయాణ సాధనాలుగా ఎంపిక చేసుకొని టూరిస్ట్ ప్రదేశాలకు చేరుకుంటాం.

ఇది కూడా చదవండి : సుందర దృశ్యాలను కనులారా చూసి ఆనందించండి

సాధారణంగా బస్సుల్లో, రైళ్ళలో మరియు కార్లలో ప్రయాణాలు చేస్తుంటే మనం గమనించేది ఊర్లు, తోటలు, పొలాలు, వంతెనలు, మనుషులు, చుట్టూ ఉన్న ప్రకృతి .. ఇలా ఎన్నో. నేటివ్ ప్లానెట్ ఇక్కడ కొన్ని ప్రయాణించే అందమైన అద్భుత ప్రదేశాలను అందిస్తున్నది. మీరెప్పుడైనా ఈ ప్రదేశాలవైపు వెళితే ఈ అద్భుత ప్రదేశాలలో విహరించండి .. మీ జ్ఞాపకాలను పదిలం చేసుకోండి !

సిక్కిం

సిక్కిం

సిక్కిం పర్యటన ఎప్పుడూ హుషారునే ఇస్తుంది. చక్కటి ప్రదేశాలు, అందమైన మంచు పర్వతాలు, పూలపాన్పులు, జలపాతాలు ఇలా ఎన్నో కలిగి ఉండి పర్యాటకులను ఉత్తేజపరుస్తుంది. ఇక్కడి రోడ్ ప్రయాణాలు ఎలా ఉంటాయో ఓసారి పక్కనున్న ఫోటో వైపు లుక్ వేయండి

ఇది కూడా చదవండి : సిక్కిం రాష్ట్ర సంక్షిప్త సందర్శన !

చిత్ర కృప : Waldemar Halka

మున్నార్

మున్నార్

మున్నార్ ఎంత గొప్పగా ఉంటుందో అక్కడికి వెళ్ళివచ్చిన వారికే తెలుస్తుంది. అక్కడి రోడ్ ప్రయాణాలు కాఫీ, టీ తోటల గుండా సాగాల్సిందే. జలపాతాలు, ట్రెక్కింగ్, సైట్ సీయింగ్ ప్రదేశాలు ఇక్కడ ఆసక్తిని కలిగించేవిగా ఉంటాయి

ఇది కూడా చదవండి : మున్నార్ ... ముచ్చటైన ప్రకృతి సందర్శన !

చిత్ర కృప : Ahsan Jinnah

డార్జీలింగ్

డార్జీలింగ్

డార్జీలింగ్ హిల్ స్టేషన్ మంచుచే కప్పబడ్డ హిమాలయ పర్వతాల శిఖరాలతో అలరారుతూ, చక్కటి టీ స్వర్గంగా వెలుగొందుతోంది. ఇక్కడికి వెళితే తప్పక చేయవలసింది టాయ్ ట్రైన్ లో ప్రయాణం. ఇది యాత్రికులను ప్రకృతి అందాల నడుమ అత్యద్భుతంగా ఉండే పర్వత శ్రేణుల గుండా తీసుకువెళ్ళే సుప్రసిద్ధ డార్జీలింగ్ హిమాలయన్ రైల్వే అనే చిన్న రైలు సర్వీసు. తప్పక ప్రయానించండి లేకపోతే ఇక్కడి అందాలను సగం చూడలేరు.

ఇది కూడా చదవండి : డార్జీలింగ్ - పొగలు కక్కే టీ మరియు టాయ్ ట్రైన్ !

చిత్ర కృప : Steven Campbell

పహల్గామ్

పహల్గామ్

కాశ్మీర్ రాష్ట్రంలోని 'పహల్గామ్' పురాతనమైనదే .. అయినప్పటికీ మొఘలుల కాలంలో వర్ధిల్లింది. అప్పట్లో వారికిది 'రెస్ట్' తీసుకొనే ప్రదేశంగా ఉండేది. అమర్నాథ్ యాత్రలు చేసేవారికి పహల్గామ్ గురించి కొద్దోగొప్పో ఐడియా ఉంటుంది. ఈ ప్రదేశంలో మొఘలుల జీవనవిధానాలు అద్దం పడుతుంటాయి.

ఇది కూడా చదవండి : మంత్ర ముగ్ధులను చేసే పహల్గామ్ పర్యటన !

చిత్ర కృప : Harsha Narasimhamurthy

అల్మోర

అల్మోర

అల్మోర హిమాలయా శ్రేణిలోని కుమవోస్ ప్రాంతంలో కలదు. ఇది సముద్రమట్టానికి 1651 మీ. ఎత్తున ఉండి, చుట్టూ అందమైన పచ్చని అడవులను కలిగి ఉంటుంది. అల్మోర లో 'జింకల పార్క్' ప్రసిద్ధి చెందినది. రోడ్డు మార్గాల సంగతి చెప్పనక్కర్లేదు .!

ఇది కూడా చదవండి : అల్మోర దృశ్యాలు - మరుపురాని అనుభూతులు !

చిత్ర కృప : Shimla Life

ఊటీ

ఊటీ

ఊటీ నే ఉదకమండలం అని కూడా అంటారు. ఇది తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. బొటానికల్ గార్డెన్, ఫ్లవర్ షో లు, సరస్సులు, దొడబెట్ట శిఖరం మరియు ఎన్నో పిక్నిక్ ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే సినిమా పాటలకు విదేశాలకు వెళ్తున్నారు గానీ అప్పట్లో సినిమా షూటింగ్ లు ఇక్కడే జరిగేవి. అందమైన తేయాకు తోటలు, సహజ సిద్ధమైన ప్రకృతి ఇక్కడి అందాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి : వేసవి తాపం - ఊటీ పరిష్కారం !

చిత్ర కృప : Abilash Appukuttan

షిల్లాంగ్

షిల్లాంగ్

తూర్పు స్కాట్లాండ్ గా చెప్పబడే షిల్లాంగ్ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. చిన్నప్పుడు ప్రకృతి అంటే ఎలా ఉంటుందో తెలిపేందుకు పుస్తకాల్లో కలర్ ఫోటో లను అచ్చువేసేవారు. దాన్ని చూసిన వారికి ఎపుడైనా ఇక్కడికి వెళ్ళాలి అనిపించేది. అలా అనిపించేవారికి షిల్లాంగ్ సూచించదగినది. అన్నట్టు మరిచిపోయాను ! ఇక్కడికి వెళితే చేతితో అల్లిన వస్తువులను కొనుగోలు చేయటం మరిచిపోవద్దు

ఇది కూడా చదవండి : షిల్లాంగ్ పర్యటనలో ఆనందాలు !

చిత్ర కృప : Saravanan Dhandapani

కాలింపాంగ్

కాలింపాంగ్

కాలింపాంగ్ కుటుంబ యాత్రలు చేసేవారికి బాగుంటుంది. వారు సెలవుల్లో ఇక్కడ బస చేసి అనేక అద్భుతమైన ప్రదేశాలను చూడవచ్చు. మనము ఇక్కడ పశ్చిమ బెంగాల్ సంప్రదాయ కళలు, ఆహారం, బౌద్ధ విహారం వంటి ప్రభావాలను ఎప్పటికీ మరిచిపోలేము.

చిత్ర కృప : Dmitry Fesechko

మహాబలేశ్వర్

మహాబలేశ్వర్

మహారాష్ట్ర - సతారా జిల్లాలో అందమైన ప్రదేశాలతో కూడిన మహాబలేశ్వర్ ఒక ప్రసిద్ధి చెందిన పర్వత ప్రాంతం. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలలో సూర్యోదయ ప్రదేశం విల్సన్ పాయింట్ అత్యంత ఎత్తుగల ప్రదేశం. ఎలిఫిన్ స్టోన్ పాయింట్, మర్జోరీ పాయింట్, ప్రతాప్ ఘడ్ కోట వంటివి కూడా మహాబలేశ్వర్ లో దర్శించటం అసలు మరువకండి. మహాబలేశ్వర్ వెళ్ళేవారు అక్కడి స్ట్రా బెర్రీలు తప్పక తిని తీరాల్సిందే.

చిత్ర కృప : Reju.kaipreth

వయనాడ్

వయనాడ్

ఒకసారి వయనాడ్ వెళ్ళిన వారు మరోమారు వయనాడ్ వెళ్లి తీరాల్సిందే. దాని అందాలు, ప్రశాంత వాతావరణం మంత్ర ముగ్ధులను చేస్తాయి. ఈ ప్రదేశంలో కల ఆకర్షణలైన బాణాసుర సాగర్ డాం, చేమ్బ్రా పీక్ , ఇతర ప్రదేశాలు చూడాలంటే, కల్పెట్టలో దిగాల్సిందే !

ఇది కూడా చదవండి : పర్యాటకుల మజిలీ .. 'వయనాడ్' !

చిత్ర కృప : Sandeep Gangadharan

మాసినగుడి

మాసినగుడి

బండిపూర్ అడవుల గుండా ఎపుడైనా జంగల్ సఫారి చేసారా ? లేక మన కళ్ళ ముందే వన్య జీవులు సమీపంనుండి సంచరించాలని కోరుతున్నారా ? అలాగైతే, బెంగుళూరు నుండి మాసినగుడికి ఒక ట్రిప్ వేయాల్సిందే!

ఇది కూడా చదవండి : మాసినగుడి ట్రిప్ విశేషాలు !

చిత్ర కృప : Vidjit Vijaysanker

గుల్మార్గ్

గుల్మార్గ్

కాశ్మీర్ లో కల 'గుల్మార్గ్' ప్రదేశం పర్యాటకులకు ఒక రిసార్ట్ వంటిది. సంవత్సరంలో ఎపుడైనా సరే చూడదగిన వాతావరణం ఈ ప్రదేశంలో కలదు. ఇక్కడ గొందోలాస్ అనబడే కేబుల్ కార్లు ప్రసిద్ధి. ప్రపంచంలో ని ఆకాశం ఎత్తులకు ఈ కేబుల్ కార్లు మిమ్ములను తీసుకు వెళతాయి. గుల్మార్గ్ అంటే ' పూల మార్గం ' అని అర్ధం చెప్పవచ్చు. ఒకసారి ప్రదేశం చూస్తె, మీకు దానిని వదలాలనిపించక మరికొన్ని రోజులు కూడా బస చేస్తారు.

ఇది కూడా చదవండి : గుల్మార్గ్ - భూలోకంలో దేవుడు గీసిన సుందర చిత్రం !

చిత్ర కృప : ANKESH KATOCH

కూనూర్

కూనూర్

దక్షిణ భారత దేశంలో చూడదగిన మరొక ఆకర్షణీయ ప్రదేశం కూనూర్. ఊటీ కి సోదరి ఈ హిల్ స్టేషన్. ఇక్కడ అనేక తేయాకు తోటలు, ట్రెక్కింగ్ మార్గాలు పర్యాటకులను ముగ్ధులను చేస్తాయి. వర్షాలు ప్రదేశ అందాలను రెట్టింపు చేస్తాయి. చక్కని రోడ్డు మార్గాలు మీ డ్రైవింగ్ ను అతి సులువు చేస్తాయి. అన్నిటిని మించి తక్కువ సంఖ్యలో వుండే పర్యాటకులు తో ప్రదేశం హాయిగా వుంటుంది.

ఇది కూడా చదవండి : కూనూర్ - ఎప్పటికీ నిద్రిస్తున్న లోయ !

చిత్ర కృప : Mahesh Telkar

శ్రీనగర్

శ్రీనగర్

శ్రీనగర్ ఒక భూతల స్వర్గం. వెనిస్ నగరం గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం అందమైన కాశ్మీర్ లోయలో కలదు. అందమైన సరస్సులు, పడవ ఇళ్ళలో ప్రయాణం, అసంఖ్యాకమైన మొఘల్ ఉద్యానవనాలు ఇక్కడి కొన్ని ఆకర్షణలు. ట్రెక్కింగ్, హైకింగ్ లాంటి సాహసోపేత క్రీడలు సైతం ఇక్కడ ఆడవచ్చు.

ఇది కూడా చదవండి : ఇండియా లోని 8 అద్భుత ప్రదేశాలు !

చిత్ర కృప : Rambonp love's all creatures of Universe.

నైనిటాల్

నైనిటాల్

'భారతదేశపు సరస్సుల జిల్లా' గా పిలువబడే నైనిటాల్ హిమాలయ శ్రేణులలో కలదు. ఇది కుమావొన్ హిల్స్ మధ్య భాగం లో ఉండి అందమైన సరస్సులు కలిగి వుంది. ఇక్కడ నైనాదేవి ఆలయం, గుహల తోట, నైని సరస్సు చూడదగ్గ ఆకర్షణలలో కొన్ని. పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలు ఆనందపరుస్తాయి.

ఇది కూడా చదవండి : నైనిటాల్ పట్టణం ఎలా ఏర్పడింది ?

చిత్ర కృప : sandeepachetan.com travel photography

మనాలి

మనాలి

మనాలి అందాలు ఎంతో కొంత ఆనందాన్ని ఇస్తుందనటంలో సందేశం లేదు. చల్లని పైన్ వృక్షాల నీడలో, చల్లని నదీ తీరగాలులలో మిమ్ములను మీరు మరచిపోండి. మనాలి లో వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగా వుంటుంది. క్రీడల ప్రియులు ఇక్కడ కల ఫిషింగ్, వైట్ వాటర్ రాఫ్టింగ్, పరగ్లైదింగ్, స్క్యింగ్, మౌన్తైనీరింగ్ మరియు హైకింగ్ లతో వారి కల నిజమైనట్లు భావిస్తారు.

ఇది కూడా చదవండి : పర్వతాలకు రాణి .. కులు మనాలి !

చిత్ర కృప : Rckr88

తవాంగ్

తవాంగ్

తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ లోని వాయువ్య భాగంలో ఉన్నది. ఈ ప్రదేశ ప్రత్యేకత, దేశంలోనే మొట్టమొదటిసారిగా సూర్యుడు ఉదయించడం. సూర్యకిరణాలు మొట్టమొదట ఈ శిఖరాన్నే తాకుతాయి ఆతర్వాతే మిగితా ప్రదేశాలను తాకుతాయి. తవాంగ్ లో 'త' అంటే గుర్రం అని, 'వాంగ్' అంటే ఎంపిక అని అర్థం. తవాంగ్ ప్రదేశ అందాలు పర్యాటకులను మేఘాలలో తేలుతున్నట్లు మంత్ర ముగ్ధులను చేసే అనుభూతులను కలగజేస్తాయి

ఇది కూడా చదవండి : సూర్యుడి మొదట కిరణాలు తాకిన శిఖరం !

చిత్ర కృప : Arup Malakar

పాచ్ మారి

పాచ్ మారి

పాచ్ మారి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ప్రధాన హిల్ స్టేషన్ (సముద్ర మట్టానికి 1110 మీటర్లు). దీనిని 'క్వీన్ ఆఫ్ సాత్పూర' అని పిలుస్తారు. పర్యాటకులకు ఈ ప్రదేశం దూప్ ఘర్, పురాతన గుహలు, స్మారకాలు, గలగల పారే జలపాతాలు, సహజ ప్రకృతి దృశ్యాలు (సూర్యోదయం, సూర్యాస్తమం), జంతుజాలాలు, రాకీ హిల్స్, దట్టమైన పచ్చటి అడవులు అన్నింటికీ మించి ప్రకృతి మాతగా అలరిస్తున్నది.

ఇది కూడా చదవండి : ఖజురహో దేవాలయాలు .. ప్రేమకు ప్రతీకలు !

చిత్ర కృప : Rajesh Shende

స్పితి

స్పితి

స్పితి, హిమాచల్ ప్రదేశ్ ఈశాన్య దిశగా హిమాలయ పర్వత శ్రేణులలో గల ఒక అందమైన మౌంటెన్ వాలీ. స్పితి అంటే 'మధ్యలో ఉన్న భూమి' అని అర్థం. బౌద్ధ ఆరామాలకి - సంస్కృతికి పెట్టింది పేరైన స్పితి దాని అద్భుతమైన అందాలకు ప్రసిద్ధి చెందినది. ట్రెక్కింగ్, యాక్ సఫారీ, మౌంటెన్ బైకింగ్, వైట్ వాటర్ రాప్టింగ్ వంటి సాహస క్రీడలను ఈ ప్రాంతం అందిస్తున్నది.

ఇది కూడా చదవండి : లాహౌల్ -స్పితి : ఎత్తైన మంచు లోయల్లో పర్యటన !

చిత్ర కృప : roman korzh

ముస్సోరీ

ముస్సోరీ

'క్వీన్ అఫ్ హిల్స్ ' గా ప్రసిద్ధి చెందిన ముస్సోరీ ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో కలదు. ఇది క్రికెటర్ సచిన్ కు ఫేవరేట్ హాలిడే స్పాట్. ఆయనకు ఏమాత్రం తీరిక దొరికిన ముస్సోరీ లో కుటుంబ సమేతంగా ప్రత్యక్షమైతాడు. ఇక్కడ చూడదగ్గవి చూడదగ్గవి పెద్ద లిస్టే ఉండదోయ్ ..! కేమ్ప్తి జలపాతాలు, మోసే జలపాతాలు, గన్ హిల్, వ్యూ పాయింట్ లు, షాపింగ్ ప్రదేశాలు వాటిలో కొన్ని

ఇది కూడా చదవండి : ముస్సోరీ - సచిన్ హాలిడే స్పాట్ !

చిత్ర కృప : Paul Hamilton

రాణిఖేత్

రాణిఖేత్

రాణిఖేత్ ను ఎక్కువగా 'క్వీన్ మేడో' అని పిలుస్తారు. అల్మోర లో ఉన్న ఈ హిల్ స్టేషన్ లో ఆలయాలు, రాజభవనాలు, ట్రెక్కింగ్, సందర్శన స్థలాలు మరియు నేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. సైనికులు చూపిన త్యాగాలకు గుర్తుగా ఏర్పాటు చేసిన 'కుమవోన్ రెజిమెంటల్ మెమోరియల్ మ్యూజియం తప్పక సందర్శించాలి.

చిత్ర కృప : Sumit Gupta

ఔలి

ఔలి

ఉత్తరాఖండ్ లోని ఔలి అందమైన పర్యాటక ప్రదేశం మరియు స్కైయింగ్ క్రీడలకు ప్రసిద్ధి చెందినది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏటవాలు ప్రాంతాలలో ఓక్, ఇతర వృక్షాలను మరియు వాలు యొక్క విశాలమైన రహదారుల గుండా యాపిల్, ఏపుగా పెరిగిన దేవదారు వృక్షాలను కలిగి ఉంటుంది. పర్యాటకులు ఇక్కడికి సమీపంలోని భవిష్య బద్రీ ని తప్పక సందర్శించాలి.

ఇది కూడా చదవండి : ఔలి - స్కైయింగ్ క్రీడల స్పెషల్ !

చిత్ర కృప : Biswajit_Dey

కూర్గ్

కూర్గ్

కూర్గ్ , కర్నాటక లో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది పడమటి కనుమలలోని మల్నాడ్ ప్రాతంలో కలదు. దీనిని 'స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియా' అని వ్యవహరిస్తారు. నిరంతరం పచ్చగా వుండే అడవులకు, దట్టమైన చెట్లు కల వాలీ లకు, పొగ మంచు తో తడిసిన కొండలకు, విస్తారమైన కాఫీ మరియు టీ తోటలకు ఈ ప్రదేశం ప్రసిద్ధి. ఎత్తైన శిఖరాలు, వేగంగా ప్రవహించే జలపాతాలు ఎన్నో చూడవచ్చు.

ఇది కూడా చదవండి : వారాంతపు విహారం - బెంగళూరు టు కూర్గ్ !

చిత్ర కృప : Ananth BS

సిమ్లా

సిమ్లా

సిమ్లా ... ఈ పేరు వినని వారుంటారా ఎవరైనా చెప్పండి ! ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధానిగా ఇది అందరికీ సుపరిచితమే. యాపిల్ పండ్లకు, వేసవి విడిదికి, హిల్ స్టేషన్ కు ఈ ఊరి పేరు ముందుండాల్సిందే. ఆకాశమే హద్దుగా మంచుల్లో ఆటలాడుతూ ఎంజాయ్ చేయవచ్చు. సాయంత్రం పూట, మీకు వీలుకలిగినప్పుడల్లా ఆలయాలను కూడా సందర్శించవచ్చు.

ఇది కూడా చదవండి : కొత్‌ఖై - యాపిల్ తోటల ఊరు !

చిత్ర కృప : DARSHAN SIMHA

ధర్మశాల

ధర్మశాల

ధర్మ శాల, హిమాచల్ ప్రదేశ్ లో ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది దలై లామా వుండే ప్రదేశం. మంచు కొండలు, చక్కటి సంస్కృతి, అందమైన, పురాతనమైన ఆరామాలతో ధర్మశాల ఒక మంచి పర్యాటక ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది . ఇక్కడి ప్రధాన ఆకర్షణ త్రియుండ్ హిల్ దీనిని 'ధర్మశాల ఆభరణం' అంటారు. ఇక్కడికి వచ్చే ప్రపంచవ్యాప్త పర్యాటకులు అనేక సాహసక్రీడలు కూడా ఆచరించవచ్చు.

ఇది కూడా చదవండి : ధర్మశాల లో ఏమేమి చూడాలి ?

చిత్ర కృప : Jasleen Kaur

లడఖ్

లడఖ్

లడఖ్ దేశంలోనే రెండవ అతి పెద్ద జిల్లా(వైశాల్యం పరంగా). ఇక్కడ పర్యాటకులు చూడటానికి అనేక ఆకర్షణలు కలవు. అద్భుత పర్వత శ్రేణులు మొదలుకొని సుందరమైన లోయలు, బౌద్ధ ఆరామాలు వరకు ఎన్నో స్థలాలను లడఖ్ లో చూడవచ్చు. లడఖ్ లో కల 'ఖర్దుంగ్ లా' రోడ్డు ప్రపంచంలోని అత్యధిక ఎత్తు లో కల వాహన సంచార రోడ్డు గా కీర్తి గడించి గిన్నిస్ బుక్ లో ఎక్కింది.

ఇది కూడా చదవండి : వివాదాస్పద భూభాగంలో అద్భుత ఆకర్షణలు !

చిత్ర కృప : Koshy Koshy

రిషికేశ్

రిషికేశ్

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ హిందువుల పవిత్ర భూమి మరియు ఆధ్యాత్మిక పట్టణం. పవిత్ర గంగా నది, ఆ నది ఒడ్డున ఉన్న ఆలయాలు మరియు పక్కనే ఉన్న హిమాలయాల ను సందర్శించటానికి పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. సాహస యాత్రలు, ట్రెక్కింగ్ వంటివి యాత్రికులకు సూచించదగినవి.

ఇది కూడా చదవండి : రిషికేశ్ - ఒక ప్రముఖ దేవ భూమి !

చిత్ర కృప : Rishabh Mathur

మతేరన్

మతేరన్

ముంబై నుండి మతేరన్ కు వెళ్లే మార్గం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. మతేరన్ లో పర్యాటకులను ఆకట్టుకొనే అనేక ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ఈ హిల్ స్టేషన్ లో ఎటువంటి వాహనాలను అనుమతించరు అంబులెన్స్ తప్ప. గుర్రపు స్వారీ లేదా చేతి తో లాగే రిక్షాలు మరియు జలపాతం వంటివి ఇక్కడి మైమరిపించే అనుభూతులు.

ఇది కూడా చదవండి : ముంబై నుండి అద్భుత రోడ్ ట్రిప్ ప్రయాణాలు !

చిత్ర కృప : Elroy Serrao

కొడైకెనాల్

కొడైకెనాల్

దక్షిణ భారతదేశంలో ఊటీ తర్వాత అంతటి పేరుప్రఖ్యాతల్ని సంపాదించుకున్న ప్రదేశం 'కొడైకెనాల్'. దీనిని అమెరికన్లు మొదటిసారిగా కనుగొన్నారు. ఈ ప్రాంతంలో ఉండే దట్టమైన అడవులు, ప్రకృతి సౌందర్యంతో కూడిన చెట్లు, సరస్సులు, వ్యూ పాయింట్ లు, రాతి ప్రదేశాలు, పూల గార్డెన్ లు, పార్కులు ... మరీ ముఖ్యంగా జలపాతాలు తప్పక సందర్శించాలి. దీనితో పాటు ఈ ప్రాంతం అనేక సహస క్రీడ కార్యకలాపాలను అందిస్తున్నది.

ఇది కూడా చదవండి : బెంగళూరు నుండి కొడైకెనాల్ రోడ్డు మార్గంలో .. !

చిత్ర కృప : simianwolverine

మారేడుమిల్లి

మారేడుమిల్లి

సహజ సిద్ధమైన అటవీ అందాలకు, ప్రకృతి రమణీయతలకు పుట్టినిల్లు మారేడుమిల్లి ప్రదేశం. తూర్పు కనుమల అటవీ అందాలను ఇక్కడ తనివితీరా ఆస్వాదించవచ్చు. మారేడుమిల్లి లో వ్యూ పాయింట్లు అద్భుతంగా ఉంటాయి. డీప్ ఫారెస్ట్ లోనికి వెళ్లే కొలది దారిపోడవునా అడవి జంతువులు, అరుదుగా పులులు మరియు పక్షులు కనిపిస్తాయి. ఇక్కడికి సమీపంలో 12 కి. మీ. దూరంలో రంపచోడవరం గ్రామం ఉన్నది. జలపాతాలు, ప్రకృతి అందాలకు ఇది కూడా మారేడుమిల్లిని ఏమాత్రం తీసిపోదు.

ఇది కూడా చదవండి : మారేడుమిల్లి - రంపచోడవరం : దేవుడు సృష్టించిన సొంత భూమి !

చిత్ర కృప :KRISHNA SRIVATSA NIMMARAJU

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X