» »హిందువులకు అతి పవిత్రమైన పశుపతినాథఆలయం

హిందువులకు అతి పవిత్రమైన పశుపతినాథఆలయం

అనేకమంది హిందువులు తమ జీవనయాత్ర ముగింపు కోసం ఇక్కడకు చేరుకుంటుంటారు.పశుపతినాధుని సన్నిధిలో మరణించినవారు తమ జీవితంలో చేసిన పాప కర్మలతో నిమిత్తం లేకుండా మరో జన్మ ఎత్తుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.మరణించేరోజులు ఇక్కడి ఆలయ జ్యోతిష్యులు ఖచ్చితంగా లెక్కించి చెబుతుండటం మరో విశేషం. జీవనయానం నుంచి విముక్తి కలిగించే ప్రదేశాలను సందర్శించాలనుకునే వారికి పశుపతినాధఆలయం తొలి గమ్యస్థానం అని చెప్పొచ్చు.ఇక్కడి వాతావరణంలోనే మృత్యువువుంటుంది. ఈ ఆలయంలోని ప్రతి మూల జరిగే ప్రతి కార్యక్రమంలోను మృత్యుచాయలు ఇక్కడకనిపిస్తుంటాయి.

హిమాలయాలలో అత్యంత పవిత్రమైన హిందూ ఆలయాలలో ఒకటైన పశుపతినాథఆలయం వెలసివుంది. పశుపతినాధుడంటే మహాశివుని ప్రతిరూపమే.అత్యంత ప్రధానమైన ఈ ఆలయాన్ని ఏటా వేలాదిమంది హిందువులు హిందూమతాన్ని అనుసరించే వయోవృద్ధులు దర్శించుకుంటుంటారు. వీరంతా తమ జీవితపు చివరిరోజులని ఇక్కడ గడిపి ముక్తి సాధించాలన్న లక్ష్యంతో ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందుతుంటారు. ఇక్కడ మరణించిన వారికి అంత్యక్రియలు జరుగుతుంటాయి.వీరి అస్థికలను పవిత్రమైన నదిలో కలుపుతుంటారు వారి కుటుంబసభ్యులు.నదీ ప్రవాహంలో కలిసిన ఈ అస్థికలు తరువాత గంగానదిలో చేరుకుంటాయి.

హిందువులకు అతి పవిత్రమైన పశుపతినాథఆలయం

హిందువులకు అతి పవిత్రమైన పశుపతినాథఆలయం

ప్రధాన ఆలయం

పశుపతినాధుని ప్రధాన ఆలయం బంగారుశిఖరంతో బంక్ తరహా పైకప్పుతో కూడిన భవనం.ఇది భాగమతీనది పశ్చిమతీరంలో వుంది.

PC:youtube

హిందువులకు అతి పవిత్రమైన పశుపతినాథఆలయం

హిందువులకు అతి పవిత్రమైన పశుపతినాథఆలయం

బంగారు పూత

ఇవన్నీ వెండిరేకులతో తాపడం చేసినవి కావడం మరో విశేషం.రెండంతస్థూల ఈ భవనం పై కప్పును రాగిలోహంతో తయారు చేసి పైన బంగారు పూత పూసారు.

PC:youtube

హిందువులకు అతి పవిత్రమైన పశుపతినాథఆలయం

హిందువులకు అతి పవిత్రమైన పశుపతినాథఆలయం

శోభాయమానం

అత్యంత శోభాయమానంగా వెలుగొందే ఈ ఆలయంలో ఉన్నటువంటి చెక్క శిల్పాలు నిజమైన మూర్తుల్లా మనకు దర్శనమిస్తుంటాయి.

PC:youtube

హిందువులకు అతి పవిత్రమైన పశుపతినాథఆలయం

హిందువులకు అతి పవిత్రమైన పశుపతినాథఆలయం

సందర్శకులకు కనువిందు

వీటితోపాటు ఆలయంలో కనిపించే భారీనంది స్వర్ణప్రతిమ సందర్శకులకు కనువిందు చేస్తాయి.ప్రధానఆలయంలోకి కేవలం హిందూమతస్తులకి మాత్రమే ప్రవేశం వుంటుంది.

PC:youtube

హిందువులకు అతి పవిత్రమైన పశుపతినాథఆలయం

హిందువులకు అతి పవిత్రమైన పశుపతినాథఆలయం

భవనాల సందర్శన

మిగిలిన భవనాలను సందర్శించేందుకు విదేశీయులను కూడా అనుమతిస్తారు.భాగమతీనది తూర్పుతీరం నుండి చూస్తే ఈ ఆలయం అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తుంటుంది.

PC:youtube

హిందువులకు అతి పవిత్రమైన పశుపతినాథఆలయం

హిందువులకు అతి పవిత్రమైన పశుపతినాథఆలయం

అత్యంత పవిత్రప్రార్ధనా మందిరం

నది పశ్చిమతీరంలో పశుపతినాధ ఆలయంతో పాటు పాంచ్ దేవళ్ అంటే 5ఆలయాల సముదాయం కూడా వుంది.గతంలో అత్యంత పవిత్రప్రార్ధనా మందిరంగా వున్న ఈ సముదాయం ఇప్పడు వృద్ధులుఅనాధలకు ఆశ్రయంగా మారింది.

PC:youtube

హిందువులకు అతి పవిత్రమైన పశుపతినాథఆలయం

హిందువులకు అతి పవిత్రమైన పశుపతినాథఆలయం

శివుడికి సంబంధించిన ఆలయాలు

భాగమతీనదీ నదీతీరంలో అనేక ఆలయాలు వున్నాయి. ఇందులో అధికశాతం శివుడికి సంబంధించిన ఆలయాలు కావటం విశేషం.

PC:youtube