» »కాకినాడలో ఈఫిల్ టవర్ !!

కాకినాడలో ఈఫిల్ టవర్ !!

ఆంధ్ర ప్రదేశ్ లోని గోదావరి నది ఒడ్డున, తూర్పుగోదావరి జిల్లాలో ఒక భాగంగా ఉన్నది ఈ యానాం పట్టణం. ఈ ప్రాంతం ఆం.ప్ర. రాష్ట్రంలో ఉన్నప్పటికీ పాలన మాత్రం కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చెరిదే!. ఈ ప్రాంతం 200 సంవత్సరాలపాటు ఫ్రెంచ్ పాలనలో ఉండి, 1954 వ సం. లో స్వతంత్ర భారతావనిలో విలీనం చేసారు. యానాం పట్టణం పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఒక జిల్లాగా ఉన్నది. ఈ జిల్లా 30 చ. కి. మీ. విస్తీర్ణంలో ఉండి, 32,000 జనాభాతో ఎక్కవ మంది తెలుగు మాట్లాడే ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకున్నది. దీనిని వలసరాజ్య పాలనలో తెలుగు ప్రజలు కల్యాణపురం అని పిలిచేవారు. ఇక ఇక్కడి ఉన్న పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం!!..

అప్పటి ఫ్రెంచ్ కమీషనర్ బుస్సీ

అప్పటి ఫ్రెంచ్ కమీషనర్ బుస్సీ

1723 వ సం. లో భారతదేశంలో యానాం మూడవ కాలనీగా ఫ్రెంచి పాలనలోకి ఉండేటిది. ఇక్కడి ప్రజలు ఈ ప్రదేశమును మొదట విజయనగర రాజుకు బొబ్బిలి యుద్ధంలో సహాయ పడినందుకుగాను అప్పటి ఫ్రెంచి జనరల్ అయిన బుస్సీకి కానుకగా ఇచ్చాడని చెబుతారు.

Photo Courtesy: Bot

చిల్డ్రన్ పార్కు, యానాం

చిల్డ్రన్ పార్కు, యానాం

యానాంలో కామరాజర్ పార్కు ఉన్నది. ఇది పిల్లల ఆటవిడుపు కేంద్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడకు పిల్లలు, పెద్దలు వచ్చి సేదతీరుతూ ఉంటారు.

Photo Courtesy: Bsskchaitanya

క్యాథలిక్ చర్చి,యానాం

క్యాథలిక్ చర్చి,యానాం

దీనిని 1846 వ సం. లో కాథలిక్ ఫ్రెంచ్ పాలకులు నిర్మించారు. దీని శంకుస్థాపనను ఫాదర్ మైఖేల్ లెక్నం చేశారు. ఈ చర్చి నిర్మాణం పూర్తి అయ్యేనాటికి ఆయన జీవించిలేరు మరియు చర్చిలో ఒక కాలువను ఆయన జ్ఞాపకార్థం ప్రారంభించబడింది.ఇక్కడ ఉన్న ఫర్నిచర్ మరియు ఇతర అలంకరణలు చాలా వరకు ఫ్రాన్సు నుండి దిగుమతి చేసుకున్నవే. చర్చి దగ్గరగా రెండు పర్వత దేవాలయాలు ఉన్నాయి; అందులో ఒకటి యానం ఫ్రెంచ్ పాలకులు నిర్మించారు, ఇంకొకటి ఇంగ్లీష్ ఇంజనీర్లు నిర్మించారు. ఇది ఆ కాలంనాటి ఫ్రెంచ్ నిర్మాణకళకు ఒక గొప్ప నిదర్శనంగా ఉన్నది.

Photo Courtesy: Bsskchaitanya

గ్రాండ్ మసీద్

గ్రాండ్ మసీద్

ఇది 1848 లో ఫ్రెంచ్ గవర్నమెంట్ ఇచ్చిన విరాళాలతో నిర్మించబడింది. ఈ దేవాలయం చాలా సంవత్సరాల తరువాత కూల్చివేసి, మరల పునర్నిర్మించారు. మొట్టమొదట 1956 సంవత్సరంలో ఈ మసీద్ పునర్నిర్మాణం జరిగింది. 1978 వ సం. లో దీనిని పూర్తిగా కూల్చివేసి, తిరిగి క్రొత్తగా పునర్నిర్మించారు.చివరి పునర్నిర్మాణం 1999-2000 లో జరిగింది ప్రస్తుతం మసీదులో ప్రార్థన సమయంలో 200 వ్యక్తులకు చుట్టూ స్థానం కల్పించే సామర్థ్యం ఉంది. రంజాన్ మరియు మిలాదున్ నబి పండుగలను ఈ మసీద్ లో గొప్పగా జరుపుకుంటారు.ఆంధ్ర ప్రదేశ్ లోని తాళ్ళరేవు, సుంకరపాలెం మరియు కోలంక గ్రామాలనుండి ప్రజలు ప్రార్థనలు జరపటానికి ఇక్కడికి వస్తారు. ఇది యానం యొక్క గొప్ప ఆకర్షణ.

Photo Courtesy: Bsskchaitanya

కొరింగ నది

కొరింగ నది

కొరింగ నది తూర్పుగోదావరి జిల్లా గుండా ప్రవహిస్తూ యానాం లోకి ప్రవేశిస్తుంది. ఈ నది యానాం లోని భూములకి సాగునీరు అందిస్తున్నది మరియు ఈ ప్రాంతం గుండా ప్రవహిస్తూ బంగాళఖాతంలో కలుస్తున్నది.

Photo Courtesy: Adityamadhav83

యానాం టవర్

యానాం టవర్

విశ్వవిఖ్యాత ఈఫిల్ టవర్ చూడాలనుకుంటున్నారా... అయితే యానాం పదండి. ఈఫిల్ టవర్ ప్యారిస్ లో కదా ఉంది! యానాం ఎందుకు అంటారా??. అచ్చుగుద్దినట్టు ఈఫిల్ టవర్ ను పోలిన కట్టడాన్ని యానాంలో నిర్మించారు. స్థానిక గిరియాంపేటలో నిర్మించిన ఈ కట్టడానికి ఒబిలిస్కు టవర్ (యానాం టవర్)గా నామకరణం చేశారు.12 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 45 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని రూపొందించారు. 100.6 మీటర్ల ఎత్తున్న ఈ టవర్ లో పలు ప్రత్యేకతలున్నాయి. కింది అంతస్థులో మీటింగ్ హాల్ ఉంది. 53.3 మీటర్ల ఎత్తువరకు లిఫ్టులో వెళ్లొచ్చు. 21.6 మీటర్ల ఎత్తులో రెస్టారెంట్, 26.5 మీటర్ల ఎత్తులో వీక్షణ మందిరం నిర్మించారు. 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను సైతం తట్టుకుని నిలబడేలా దీన్ని డిజైన్ చేశారు.

Photo Courtesy: Phanisaladi

ఎప్పుడు పర్యటించాలి?

ఎప్పుడు పర్యటించాలి?

యానం సంవత్సరంలో చాలా సమయంల్లో వేడి మరియు తేమతో కూడిన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. యానంలో తేమ స్థాయిలు ఎక్కువగా%% 68 మధ్య మరియు 80 ఉంటాయి. వేసవిలో యానంలో వాతావరణం భరించలేని వేడి ఉంటుంది, కావున ఈ సమయంలో ఈ ప్రదేశం సందర్శించటం మంచిది కాదు.

Photo Courtesy: Bsskchaitanya

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం

సమీపంలో ఉన్న రాజముండ్రి,కాకినాడ, విశాఖపట్టణం వంటి నగరాల నుండి యానంకు రోడ్డు మార్గం సులభంగా చేరుకోవొచ్చు. ఇక్కడ నుండి రోడ్ మార్గం ద్వారా 660 కిలోమీటర్ల దూరంలో చెన్నై ఉన్నది.

Photo Courtesy: Adityamadhav83

రైల్వే స్టేషన్

రైల్వే స్టేషన్

యానాంకు సొంత రైల్వే స్టేషన్ లేదు. దీనికి సమీపంలో కాకినాడ రైల్వే స్టేషన్ ఉన్నది. యానం నుండి 26 కిలోమీటర్ల అవతల కాకినాడ ఉన్నది. కాకినాడ నుండి రోడ్ మార్గం ద్వారా ప్రయాణించి ఒక గంటలో యానం చేరుకోవొచ్చు.

Photo Courtesy: Adityamadhav83

విమానాశ్రయం

విమానాశ్రయం

ఇక్కడకు దగ్గరలో రాజముండ్రి విమానాశ్రయం ఉంది. ఇక్కడ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమ్మాన సదుపాయం కలదు.ఇక్కడ నుంచి బస్సు సదుపాయం ఉంది.ఇక్కడ నుంచి యానాంకి దూరం 60 కి.మీ.

Photo Courtesy: విశ్వనాధ్.బి.కె.