Search
  • Follow NativePlanet
Share
» » వేశ్యాలోలుడి కోరిక తీర్చిన శివయ్య...ఈ క్షేత్ర సందర్శనతో మీ ఇంట

వేశ్యాలోలుడి కోరిక తీర్చిన శివయ్య...ఈ క్షేత్ర సందర్శనతో మీ ఇంట

ఇందుకేనేమో శివుడిని బోళా శంకరుడని అంటారు. వేశ్యాలోడుడై ఓ పూజారి కోరుకొన్నాడని శివలింగం పై ఏకంగా జటాజూటాన్నే మొలిపించాడు. ఆ జటాజూటాన్ని మనం ఇప్పటికీ ఈ క్షేత్రంలో చూడవచ్చు. అంతేకాకుండా ఓ మహర్షి కోరుకొన్నాడని ఒకే పానుపట్టం పై పార్వతీ సమేతుడుగా కొలువై ఉన్నాడు.

ప్రపంచంలో ఒకే పానుపట్టం పై శివుడు, పార్వతి కొలువై ఉండటం ఇక్కడ మాత్రమే చూడవచ్చు. అదే విధంగా ఒకే గర్భగుడిలో ఆ ఆది దంపతులతో పాటు వినాయకుడు, కుమారస్వామిని కూడా మనం దర్శించవచ్చు. ఇటువంటి దర్శనం మనకు మరెక్కడా దొరకదు.

ఈ క్షేత్ర సందర్శనంతో వివాహ సమస్యలన్నీ తొలిగిపోవడమే కాకుండా వివాహం కానివారికి త్వరగా కంకణభాగ్యం కలిసివస్తుందని నమ్ముతారు. ఈ ఆలయం పురాణ పరంగానే కాకుండా చారిత్రాత్మకంగా కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకొంది. ఇన్ని విశిష్టతలు ఉన్న ఆ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం

అమృతం కోసం

అమృతం కోసం

P.C: You Tube

హిందు పురాణాలను అనుసరించి అమృతం కోసం క్షీరసాగర మధనం జరుగుతుంది. ఆ సమయంలో సముద్రం నుంచి బయటికి వచ్చిన అమృతాన్ని మొదట రాక్షసులు చేజెక్కించుకొంటారు. ఈ అమృతం దేవతలకు దక్కకూడదన్న ఉద్దేశంతో ఒక పల్వలము అంటే గొయ్యిలో దాచిపెడుతారు.

పలివెలగా మారింది.

పలివెలగా మారింది.

P.C: You Tube

ఆ పల్వలమే కాలక్రమంలో పలివెలగా మార్పు చెందిందని కథనం. ప్రస్తుతం ఈ పలివెల తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో ఉంది. ఇక్కడ ఉన్న శివాలయం విశిష్టమైనది. ఐదు నదులు అంతర్వాహిణిగా ప్రవహించే చోట ఈ దేవాలయం వెలిసింది.

అగస్త్య మహాముని

అగస్త్య మహాముని

P.C: You Tube

ఇక ఇక్కడి శివాలయంలోని శివలింగాన్ని అగస్త మహాముని ప్రతిష్టించారని చెబుతారు. కొన్ని కారణాల వల్ల అగస్త మహాముని శివపార్వతుల కళ్యాణాన్ని చూడలేకపోతాడు. ఇందుకు ఆ ముని ఎంతగానో దు:ఖిస్తుంటాడు.

ప్రత్యక్షమవుతాడు

ప్రత్యక్షమవుతాడు

P.C: You Tube

ఆ కళ్యాణం జరిగే సమయంలో ఆయన ప్రస్తుత పలివెల ప్రాంతంలో ఉంటాడు. దీంతో పెళ్లితర్వాత పరమశివుడు పార్వతితోసహా పెళ్లి దుస్తులతోనే అగస్త్యమహామునికి ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమంటాడు.

ఒకే పీఠం పై

ఒకే పీఠం పై

P.C: You Tube

దీంతో అగస్తుడు ఈ పలివెల లో ఒకే పీఠం పై కొలువుండాలని కోరుతాడు. ఇలా ప్రపంచంలో మరెక్కడా ఉండకూడదని కూడా చెబుతారు. అంతేకాకుండా ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారికి వివాహ సంబంధ బాధలు ఉండకూడదంటాడు.

త్వరగా పెళ్లి అయ్యేలా

త్వరగా పెళ్లి అయ్యేలా

P.C: You Tube

పెళ్లికాని యువతీ, యువకులకు త్వరగా పెళ్లి అయ్యేలా అనుగ్రహించాలని కోరుకొంటాడు. ఇందుకు శివుడు కూడా సరేనంటాడు. అలా ఇక్కడ ఒకే పీఠం పై శివుడు లింగం రూపంలో, అమ్మవారు ఉమా దేవిగా వెలిశారని చెబుతారు.

మొదట అగస్త్యలింగేశ్వరుడు

మొదట అగస్త్యలింగేశ్వరుడు

P.C: You Tube

దీంతో మొదట ఈ క్షేత్రంలోని శివుడిని అగస్త్య లింగేశ్వరుడిగా పూజలు అందుకునేవాడు. అయితే ఈ క్షేత్రం అటు పై ఉమా కొప్పు లింగేశ్వరుడిగా భక్తులను అనుగ్రహించాడు. ఈ విధంగా పేరు మారడానికి స్త్రీ లోలుడైన ఓ పూజరి కావడం గమనార్హం.

అటు పై ఉమా కొప్పు లింగేశ్వరుడిగా మారాడు

అటు పై ఉమా కొప్పు లింగేశ్వరుడిగా మారాడు

P.C: You Tube

అగస్త్య లింగేశ్వరుడి దేవాలయంలో పూజరి పరమ శివభక్తుడు. నిత్యం శివ పూజ చేయనిదే ఏ పని మొదలు పెట్టేవాడు కాదు. అయితే ఆయన స్త్రీ లోలుడు. ఈ క్రమంలోనే ఒక వేశ్యతో సంబంధం ఉండేది. ఈ విషయమై ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుకు అనేక ఫిర్యాదులు అందాయి.

ఆ ప్రాంతపు రాజు

ఆ ప్రాంతపు రాజు

P.C: You Tube

ఈ విషయం పై నేరుగా విచారణ జరపడానికి ఆ రాజు ఒక రోజు పలివెలకు వచ్చాడు. ఈ విషయాన్ని ఆ ఆలయ పూజారి ఆ వేశ్య ఒడిలో ఉండ గా తెలుసుకొంటాడు. దీంతో రాజు దేవాలయానికి చేరుకునే లోపే సదరు పూజారి హడావుడిగా ఆ దేవాలయంలోకి వెళ్లి పూజలు నిర్వహిస్తున్నట్లు నటిస్తాడు.

ప్రసాదంలో వెంట్రుక

ప్రసాదంలో వెంట్రుక

P.C: You Tube

రాజు వచ్చిన తర్వాత హారతితోపాటు ప్రసాదం కూడా ఇస్తాడు. అయితే ఆ ప్రసాదంలో ఒక పొడవైన వెంట్రుక వస్తుంది. ఆ వెంట్రుక చూసిన తక్షణం రాజు కోపంతో పూజారిని నిందిస్తాడు. అయితే పూజారి తొనక కుండా ఇది పరమేశ్వరుడిదని చెబుతాడు.

కొప్పు ఉందని అబద్ధం చెబుతాడు

కొప్పు ఉందని అబద్ధం చెబుతాడు

P.C: You Tube

ఆశ్చర్యపోయిన రాజు వివరంగా చెప్పమని ఆదేశిస్తాడు. ఈ అగస్త్యలింగేశ్వరుడికి కొప్పు (జఠాజూటం) ఉందని ఈ వెంట్రుక ఆ కొప్పులోనిదేని చెబుతాడు. అయితే ఈ విషయాన్ని నమ్మని రాజు తాను నేరుగా ఆ కొప్పును చూస్తానని చెబుతారు.

తల తీయిస్తానని హెచ్చరిస్తాడు

తల తీయిస్తానని హెచ్చరిస్తాడు

P.C: You Tube

పూజారి మాత్రం ఈ రోజు శివలింగానికి ప్రత్యేక అలంకరణ చేశామని రేపు ఉదయం వస్తే కొప్పు చూపిస్తానని చెబుతాడు. ఇందుకు రాజు అంగీకరిస్తాడు. అయితే ఉదయానికి శివలింగానికి కొప్పు చూపించకపోతే నీ తల తీయిస్తానని పూజారిని హెచ్చరిస్తాడు.

జుత్తును మెలిపిస్తాడు

జుత్తును మెలిపిస్తాడు

P.C: You Tube

రాత్రి మొత్తం పూజారి శివుడిని పూజించి తనను రక్షించమని వేడుకొంటాడు. బోళా శంకరుడైన ఈశ్వరుడు తన భక్తుడిని రక్షించడానికి శివలింగం పై జుత్తును మొలిపిస్తాడు. ఇక రాజు ఉదయం వచ్చి శివలింగానికి కొప్పు ఉండటాన్ని చూస్తాడు.

రక్తం కారుతుంది

రక్తం కారుతుంది

P.C: You Tube

అయినా అనుమానం తీర్చుకోవడానికి అన్నట్లు ఆ జుత్తును పట్టకుకొని లాగుతాడు. దీంతో శివలింగానికి రక్తం ధారలుగా కారుతుంది. ఇక వెంటనే రాజుకు కన్నులు పోతాయి. దీంతో రాజు తన తప్పును క్షమించమని శివుడిని వేడుకొంటాడు.

మానవుడన్న తర్వాత ఏదో ఒక బలహీనత

మానవుడన్న తర్వాత ఏదో ఒక బలహీనత

P.C: You Tube

అప్పుడు ఒక అశరీరవాణి ‘రాజా పూజారి వేశ్యాలోలుడే కావచ్చు. అయితే శివ పూజలో ఎటువంటి లోపం రానియ్యడు. మనవుడన్న తర్వాత ఏదో ఒక బలహీనత ఉంటుది. అంతమాత్రాన అతను చెడ్డవాడు కాదు.' అని వినిపిస్తుంది.

జుటుగపాడు

జుటుగపాడు

P.C: You Tube

దీంతో రాజు తన తప్పును క్షమించమని వేడుకొనడమే కాకుండా ఆ ఆలయానికి ఇప్పటి రావుల పాలెంలోని జుటుగపాడు గ్రామాన్ని మాన్యంగా ఇస్తాడు. ఈ కొప్పు వంటి రూపాన్ని మనం ఇప్పటికీ శివలింగం పై చూడవచ్చు.

నాలుగెకరాల విస్తీర్ణంలో

నాలుగెకరాల విస్తీర్ణంలో

P.C: You Tube

పలివెల మధ్యలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవలయం ఉంటుంది. రెండు ఎత్తైన ప్రాకారాలతో ఉన్న ఈ దేవాలయంలోని శిల్పాలు చాలా అందంగా ఉంటాయి. ఈ దేవాలయం అభివ`ద్ధికి చాళుక్యులు, రెడ్డి రాజులు విశేషంగా క`షి చేశారు. ఇందుకు సంబంధించిన శాసనాలు ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X