Search
  • Follow NativePlanet
Share
» »తూత్తుకుడి - తమిళనాడు ముత్యాల నగరం !!

తూత్తుకుడి - తమిళనాడు ముత్యాల నగరం !!

సముద్ర ప్రేమికులకు తూత్తుకుడి అనువైన పర్యాటక ప్రదేశం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ ఇక్కడ ఉన్న నౌకాశ్రయం.

By Mohammad

తుటికారిన్ గా కూడా ప్రసిద్ది చెందిన తూత్తుకుడి అదే పేరు తో ఈ జిల్లా యొక్క మునిసిపల్ కార్పొరేషన్ గా వ్యవహరిస్తోంది. తమిళనాడు రాష్ట్రానికి ఆగ్నేయాన ఉన్న ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ది చెందిన నౌకాశ్రయ నగరం. ముత్యాలకు ప్రసిద్ది కావడం చేత ఈ నగరానికి ముత్యాల నగరం గా కూడా పేరుంది.

భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆలయ శిఖరాలు ఏవో మీకు తెలుసా ?భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆలయ శిఖరాలు ఏవో మీకు తెలుసా ?

ఫిషింగ్ అలాగే నౌకా నిర్మాణాలకి ఈ ప్రాంతం ప్రసిద్ది. తూత్తుకుడి యొక్క పశ్చిమాన అలాగే ఉత్తరాన తిరునెల్వేలి జిల్లా ఉంది. ఇది రామనాథపురం అలాగే విరుధునగర్ ల కి తూర్పున ఉంది. తమిళనాడు రాజధాని అయిన చెన్నై తూథుకుడి నగరం నుండి 600 కిలో మీటర్ల దూరంలో ఉంది. తూథుకుడి నుండి కేవలం 190 కిలో మీటర్ల దూరంలో త్రివేండ్రం ఉంది.

ఎట్టయపురం

ఎట్టయపురం

తూత్తుకుడి నుండి 54 కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ ప్రాంతం ఎన్నో పర్యాటక ప్రదేశాలకి స్థావరం. సీన్థలకరై అనే పుణ్యక్షేత్రం ఇక్కడ ప్రసిద్ది చెందినది. వెత్కలిఅమ్మన్ అనే దేవత కి ఈ ఆలయం అంకితమివ్వబడింది.

చిత్రకృప : Sundar

హార్బర్ బీచ్

హార్బర్ బీచ్

హార్బర్ గెస్ట్ హౌస్ కి సమీపం లో హార్బర్ బీచ్ ఉంది. సమీపం లో నే ఒక పార్క్ కూడా ఉంది. చల్లని గాలిలో పర్యాటకులు ఈ పార్క్ లో సేద దీరేందుకు మక్కువ చూపిస్తారు. ఈ పార్క్ ప్రసిద్దమైన పర్యాటక ఆకర్షణ.

చిత్రకృప : Simply CVR

హరే ఐలాండ్

హరే ఐలాండ్

తూత్తుకుడి నగరం లోని పాత బస్ స్టాప్ నుండి హరే ఐలాండ్ 9 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది ఓడ రేవుకి పక్కనే ఉంది. ఈ ఐలాండ్ లో రెండు లైట్ హౌస్ లు ఉన్నాయి. తీరం లో అనేకమైన గవ్వలు ఉన్నాయి.

చిత్రకృప : karthik_ff

కొర్కై

కొర్కై

తిరుచెందూర్ మరియు తూత్తుకుడి ల మధ్య ఉన్న గ్రామం కోర్కై. 250 ఎకరాల మేరకు విస్తరించబడిన కోర్కైకులం ట్యాంక్ ఈ గ్రామం లో ఉంది. కొల్ఖై గా ప్రసిద్ద గ్రీక్ భూగోళశాస్త్రవేత్త టోలెమీ చేత పిలవబడిన ఈ గ్రామం ముత్యాల వేటకి ప్రసిద్ది చెందింది.

చిత్రకృప : Sharada Prasad CS

కులశేఖరపట్టిణం ముతరమ్మన్ టెంపుల్

కులశేఖరపట్టిణం ముతరమ్మన్ టెంపుల్

తిరుచెందూర్ నుండి 14 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం కన్యాకుమారి రోడ్డులో కన్యాకుమారి నుండి 76 కిలో మీటర్ల దూరం లో ఉంది. 150 సంవత్సరాల క్రితానికి చెందిన ఈ ఆలయం లో పది రోజుల పాటు దసరా నాడు పండుగ జరుపుతారు.

చిత్రకృప : Varun Shiv Kapur

మనపడ్ బీచ్ మరియు చర్చ్

మనపడ్ బీచ్ మరియు చర్చ్

తిరుచెందూర్ నుండి 18 కిలో మీటర్ల దూరంలో అలాగే కన్యాకుమారి నుండి 70 కిలో మీటర్ల దూరంలో మనపాడ్ బీచ్ మరియు చర్చ్ ఉంది. సముద్ర తీరం పై ఉన్న ఈ చర్చ సెయింట్ ఫ్రాన్సిస్ క్షావియర్ తో అనుబంధం కలిగి ఉంది. ఈ చర్చ్ లో ఉన్న శిలువ జెరూసలేం నుండి తీసుకురాబడినది.

చిత్రకృప : Ramkumar

నవ తిరుపతి టెంపుల్

నవ తిరుపతి టెంపుల్

మహా విష్ణువుకి అంకితమివ్వబడిన తొమ్మిది ఆలయాలని నవ తిరుపతి ఆలయాలుగా పిలుస్తారు. ఇవి తమరైబరని నదికి ఇరువైపులా కనిపిస్తాయి. 108 దివ్య దేశంల ఆలయాలలో ఈ ఆలయాలు ప్రాధాన్యం సంతరించుకున్నవి.

చిత్రకృప : Ssriram mt

నవ తిరుపతి ఆలయాల పేర్లు

నవ తిరుపతి ఆలయాల పేర్లు

శ్రీ వైకుంఠం, తిరువరగునమంగై, తిరుపులింకుడి, ఇరేట్టై తిరుపతి, తులైవిలి మంగళం, తిరుకుజ్హన్దై, థెన్ తిరుపెరై, తిరుకోలుర్ - విథమానిధి మరియు అల్వర్తిరునగరి - నమ్మజహ్వార్ లు ఈ నవ తిరుపతి ఆలయాల పేర్లు.

చిత్రకృప : Ssriram mt

మయూర తొట్టం

మయూర తొట్టం

తూత్తుకుడి నుండి 22 కిలో మీటర్ల దూరం లో ఉన్న మయూర తొట్టం ఒక పీకాక్ ఫార్మ్. ఈ ఫార్మ్ 55 ఎకారాల మేరకు విస్తరించింది. ఇది అనేకమైన నెమళ్ళకు నివాసం. నాట్యం చేసే నెమళ్ళు ఈ ప్రాంతం యొక్క అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఎన్నో కొబ్బరి అలాగే జామ చెట్లు ఇక్కడ కనిపిస్తాయి.

చిత్రకృప : Amit Patel

మనపాడ్ పామ్ లీఫ్ సొసైటీ

మనపాడ్ పామ్ లీఫ్ సొసైటీ

సాంప్రదాయ సాంప్రదాయ తాటాకుల హస్త కళాకృతులని ప్రోత్సహించేందుకు ఈ మనపాడ్ పామ్ లీఫ్ సొసైటీ ఏర్పడింది. విలక్షణమైన వివిధ రకాల తాటాకు ఉత్పత్తులు ప్రపంచం లో ని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు.

చిత్రకృప : Sooriya rsgks

పంచాలంకురిచి

పంచాలంకురిచి

ఇది చారిత్రక ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రదేశం. తూత్తుకుడి నుండి 34 కిలో మీటర్ల దూరంలో ఉంది. 17 వ శతాబ్దానికి చెందిన స్వాతంత్ర్య సమార యోధుడు వీరపాండియ కట్టబోమ్మన్ కి జన్మ స్థలం ఈ ప్రాంతం. 1947లో ఇతనికి అంకితమివ్వబడిన కట్టబోమ్మన్ మెమోరియల్ ఫోర్ట్ ప్రభుత్వం చేత నిర్మించబడింది.

చిత్రకృప : telugu native planet

నెహ్రు పార్క్

నెహ్రు పార్క్

నగరానికి ఉత్తరాన నెహ్రు పార్క్ ఉంది. బీచ్ రోడ్ లో ఉన్న ఈ పార్క్ ఇదివరకు 'కోట్స్ ఇండియా' వారిచే నిర్వహించబడినది. తూత్తుకుడి లో ఉన్న నెహ్రు పార్క్ రాజాజీ పార్క్ గా కూడా ప్రసిద్ది. ఈ పార్క్ లో ఉన్న పెద్ద నీటి నిల్వల వల్ల ఇది స్థానికులలో వాటర్ ట్యాంక్ గా ప్రసిద్ది.

చిత్రకృప : Aruna

చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ స్నో

చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ స్నో

ది చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ స్నో వివిధ పేర్లతో ప్రసిద్ది చెందింది. సెయింట్ పాల్స్ చర్చ్ ఇంకా పనియ మాతా చర్చ్ వీటిలో కొన్ని. మేరీ మాత కి ఈ చర్చ్ అంకితమివ్వబడింది. 1982 లో ఈ మందిరానికి బసిలికా హోదా కల్పించబడింది.

చిత్రకృప : Thamizhpparithi Maari

రాజపతి కైలాసనాథర్ ఆలయం

రాజపతి కైలాసనాథర్ ఆలయం

సుబ్రహ్మణ్య స్వామి కి అంకితమివ్వబడిన తిరుచెండుర్ ఆలయానికి ఈ నగరం ప్రసిద్ది చెందింది. రాక్ కట్ జైన్ టెంపుల్ అయిన కలుగుమలై, కొరకై ట్యాంక్ అలాగే వేట్ట్రివేలమ్మన్ ఆలయాలుఇక్కడ ప్రసిద్ది చెందిన మరికొన్ని పర్యాటక ఆకర్షణలు.

చిత్రకృప : Booradleyp1

తూత్తుకుడి ఇలా చేరండి

తూత్తుకుడి ఇలా చేరండి

వాయు మార్గం : తూత్తుకుడి 14 కి. మీ ల దూరంలో విమానాశ్రయం కలదు. ఇక్కడికి చెన్నై, తిరువేండ్రం, మదురై తదితర పట్టణాల నుండి విమానాలు వస్తుంటాయి.

రైలు మార్గం : తూత్తుకుడి లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి చెన్నై, కోయంబత్తూర్, మదురై నుండి రైళ్ళు వస్తుంటాయి.

రోడ్డు మార్గం : కన్యాకుమారి, చెన్నై, తిరునల్వేలి, కోయంబత్తూర్, మదురై తదితర ప్రాంతాల నుంచి తూత్తుకుడి కి తరచూ ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు వస్తుంటాయి.

చిత్రకృప : Trinidade

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X