Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» విరాట్ నగర్

విరాట్ నగర్- చారిత్రక ప్రాధాన్యత

8

విరాట్ నగర్ ప్రదేశం రాజస్ధాన్ లోని పింక్ సిటీ జైపూర్ నుండి 53 కి.మీ.ల దూరంలో కలదు. ఈ పట్టణం ఇపుడిపుడే పర్యాటకులకు ఒక ఆకర్షణీయ ప్రదేశంగా మారుతోంది. ఈ ప్రదేశాన్ని చాలామంది బైరాత్ అని పిలుస్తారు. దీని సమీపంలో సరిస్కా, శిలిసేర్, అజబ్ ఘర్ - భంగ్రా మరియు ఆల్వార్ లవంటి ఇతర ఆకర్షణీయ ప్రదేశాలు కలవు. విరాట్ నగర్ పేరు మన గొప్ప ఇతిహాసమైన మహాభారత లో కూడా చెప్పబడింది. పురాణేతిహాసాల మేరకు ఈ ప్రదేశాన్ని రాజు విరాటుడు కనుగొన్నాడు. ఆక్కడ రాజ్యాన్ని ఏర్పరచాడు. పాండవులు తమ అరణ్య వాస సమయంలో ఇతని రాజ్యంలో కొంతకాలం తలదాచుకున్నారు.

విరాట్ నగర్ కు చరిత్ర ప్రాధాన్యత

చరిత్ర మేరకు ఈ ప్రదేశం మహా జనపద లేదా పురాత రాజ్యానికి రాజధానిగా ఉండేది. 5వ శతాబ్దంలో ఛేది రాజులు దీనిని పాలించారు. తర్వాతి కాలంలో అది మౌర్య రాజ్యంలో ఒక భాగమైంది. ఇక్కడ పర్యాటకులు అశోకుడి శిలా లేఖనాలు చూస్తారు. మౌర్య రాజు ఇక్కడ తన రాజ్య పాలనకు సంబంధించిన చట్టాలు, ప్రకటనలు వంటివి శిలా శాసనాలుగా చెక్కించాడు.

విరాట్ నగర్ ఆకర్షణలు

పర్యాటకులు విరాట్ నగర్ లో వివిధ కొండలలో కల సహజమైన గుహలను చూడవచ్చు. ఈ గుహలే కాక, భీమ్ కి డుంగారి లేదా పాండు హిల్ వంటి ప్రసిద్ధ ఆకర్షణలు కూడా చూడవచ్చు. ఈ గుహలో భీముడు నివాసం ఉన్నాడని చెపుతారు. దీని సమీపంలో చిన్న గదులు కల గుహలు అతని ఇతర సోదర పాండవులకు కూడా కలవు.

బీజక్ కి పహారి అనేది ఈ ప్రదేశంలో మరో పర్యాటక ఆకర్షణ. పర్యాటకులు ఇక్కడ పురాతన బౌద్ధ ఆరామాలు చూడవచ్చు. గణేశ గిరి దేవాలయం, మ్యూజియం, జైన నాసియా మరియు జైన దేవాలయాలు కూడా విరాట్ నగర ఆకర్షణలే.

విరాట్ నగర్ చేరుట ఎలా?

విరాట్ నగర్ కు వాయు, రైలు, మరియు రోడ్డు మార్గాలలో చేరవచ్చు. జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయం విరాట్ నగర్ కు సమీపం. జైపూర్ రైలు స్టేషన్ వరకు రైలు లో చేరవచ్చు. విమానాశ్రయం లేదా రైలు స్టేషన్ నుండి క్యాబ్ లలో విరాట్ నగర్ చేరవచ్చు. కోల్కటా, ముంబై, ఢిల్లీ మరియు చెన్నై ల నుండి విరాట్ నగర్ కు రైలు లేదా వాయు మార్గాలు తేలిక. జైపూర్ నుండి విరాట్ నగర్ కు లగ్జరీ బస్సులు లేదా క్యాబ్ లు కూడా కలవు. విరాట్ నగర్ వాతావరణం

వేసవి అయినా, శీతాకాలమైన వాతావరణం అధికంగానే ఉంటుంది. వేసవిలో అధిక వేడి, శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు కూడా పడిపోతాయి. విరాట్ నగర్ చూడగోరే పర్యాటకులు మార్చి నుండి అక్టోబర్ వరకు శీతాకాలంలో సౌకర్యంవంతమైన సమయంలో చేరుకోవచ్చు.

విరాట్ నగర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

విరాట్ నగర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం విరాట్ నగర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? విరాట్ నగర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం జైపూర్ కు దేశంలోని వివిధ పట్టణాలనుండి బస్ సర్వీసులు కలవు. న్యూఢిల్లీ, ఆగ్రాలనుండి నేరు బస్సులు జైపూర్ కు కలవు. జైపూర్ నుండి విరాట్ నగర్ కు క్యాబ్ లలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం విరాట్ నగర్ కు జైపూర్ రైలు స్టేషన్ సమీపం. ఈ ప్రదేశానికి సాధారణ రైళ్ళు మాత్రమే కాక, ప్యాలెస్ ఆన్ వీల్స్ వంటి లగ్జరీ రైళ్ళు కూడా కలవు. ఢిల్లీనుండి ఈ రైలు పై జైపూర్, ఆల్వార్, ఉదయపూర్ పట్టణాలు చేరుకొని అక్కడినుండి విరాట్ నగర్ క్యాబ్ లలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయం విరాట్ నగర్ కు సమీపం. సంగనేర్ నుండి ముంబై, ఢిల్లీ, ఔరంగాబాద్, ఉదయపూర్ మరియు జోధ్ పూర్ లకు నేరు విమాన ప్రయాణం చేయవచ్చు. అంతర్జాతీయ పర్యాటకులు న్యూఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సంగనేర్ చేరుకోవచ్చు. సంగనేర్ ఎయిర్ పోర్ట్ నుండి విరాట్ నగర్ కు క్యాబ్ లు దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue