Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఖిమ్ సార్

ఖిమ్ సార్ - ఇసుక దిన్నెల గ్రామం !

3

ఖిమ్ సార్ ఒక చిన్న కుగ్రామం. ఇది రాజస్ధాన్ రాష్ట్రంలోని ధార్ ఎడారి చివరిభాగంలో కలదు. ఈ గ్రామం మధ్యభాగంలో ఒక నీటి సరస్సు కలదు. ఎడారిలో ఒయాసి్సు వలే ఇది ఆ ప్రాంతానికి ఎంతో అందాన్నిచ్చింది. ఒకప్పుడు ఖిమ్ సార్ గ్రామం స్వంతంత్ర రాజ్యంగా ఆ ప్రాంతంలోని ఠాకూర్ ల చే పాలించబడింది.

ఖిమ్ సార్ పరిసర ప్రదేశాలు

ఖిమ్ సార్ చరిత్ర సుమారుగా 16వ శతాబ్దంలో ఖిమ్ సార్ కోట కట్టిన కాలం నాటిది. గత చరిత్రలో జరిగిన అనేక యుద్ధాలను శిమ్ సార్ కోట చూసింది. కోట గోడలపై యుద్ధాలకు సంబంధించిన రుజువులను పర్యాటకులు చూడవచ్చు. ఈ కోట శత్రువుల దాడులనుండి ఖిమ్ సార్ రాజ్యం రక్షించబడటానికి నిర్మించినప్పటికి, 1940 సంవత్సరంలో జనానా గా పిలువబడే మహిళల నివాసం అక్కడ కట్టినప్పటినుండి అది వారి నివాస ప్రదేశంగానే పరిగణించేవారు. ప్రస్తుతం, కోటలో ఒక భాగాన్ని ఒక హెరిటేజ్ హోటల్ గా వాడుతున్నారు. మిగిలిన భాగం ఖిమ్ సార్ కు చెందిన రాజ కుటుంబీకులు నివాసంగా చేసుకున్నారు.

ఖిమ్ సార్ పర్యటనకు ప్రణాళిక చేసే పర్యాటకులు ఇక్కడే కల ఓసియన్ అనే ప్రాంతాన్ని కూడా చూడాలి. ఈ ప్రదేశం లో అనేక జైన మరియు హిందూ దేవాలయాలు కలవు. సమయం అనుకూలిస్తే, పర్యాటకులు హెరిటేజ్ హోటల్ శాండ్ డ్యూన్స్ విలేజ్ కు కూడా వెళ్ళి అక్కడి ఒంటె సఫారీలను ఎడారి యొక్క బంగారు ఇసుక తిన్నెలపై ఆనందించవచ్చు.

 ఇక్కడ జరిగే నాగౌర్ పండుగ వేడుకలకు ప్రతి సంవత్సరం జనవరి మరియు ఫిబ్రవరి ల మధ్య పర్యాటకులు అనేకమంది వస్తూంటారు. ఇది ఒక పశువుల సంత. ఈ సమయంలో జరిగే ఒంటె పరుగుపందేలు, ఎద్దుల పరుగు పందేలు, జానపద సంగీతాలు మరియు స్ధానిక డ్యాన్సు లు వంటివి ఈ సమయంలో జరుగుతాయి.

ఖిమ్ సార్ చేరటం ఎలా?

ఖిమ్ సార్ చేరాలంటే వాయు, రైలు, రోడ్డు మార్గాలు కలవు. ఈ ప్రదేశానికి సమీప విమానాశ్రయం జోధ్ పూర్ లో కలదు. జైపూర్, ముంబై, ఢిల్లీ, ఉదయపూర్ లనుండి ఈ విమానాశ్రయానికి ప్రతిరోజూ విమాన రాకపోకలు కలవు. ఖిమ్ సార్ కు చేరటం ఎలా?

ఈ ప్రాంతం సంవత్సరంలో చాలా భాగం అధికమైన వాతావరణాలే కలిగి ఉంటుంది. ఖిమ్ సార్ పర్యటనకు శీతాకాలం అనువైనది. అంటే నవంబర్ నెల నుండి మార్చి నెలవరకు అనుకూలము.

 

ఖిమ్ సార్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఖిమ్ సార్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఖిమ్ సార్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఖిమ్ సార్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం ఖిమ్ సార్ కు రోడ్డు మార్గం సౌకర్యంవంతం. ఇది జోధ్ పూర్ - నాగౌర్ - బికనీర్ హైవే పై కలదు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలనుండి ప్రభుత్వ మరియు ప్రయివేటు బస్సులు కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం - ఖిమ్ సార్ కు జోధ్ పూర్ రైలు స్టేషన్ సమీపం. 140 కి. మీ. ల దూరంలో కలదు. ఈ రైలు స్టేషన్ ఢిల్లీ, జైసల్మేర్, పూనే, ముంబై, బికనీర్ అహ్మదాబాద్ లకు తరచు రైళ్ళను కలిగి ఉంది. రైలు స్టేషన్ నుండి ఖిమ్ సార్ కు క్యాబ్ లు లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం ఖిమ్ సార్ కు సమీప విమానాశ్రయం జోధ్ పూర్ సిటీ లో కలదు. ఈ విమానాశ్రయం జైపూర్, ముంబై, ఢిల్లీ మరియు ఉదయపూర్ ల కు తరచు విమాన సర్వీసులు కలవు. జోధ్ పూర్ విమానాశ్రయం నుండి ఖిమ్ సార్ కు టాక్సీలు కలవు. విదేశీ పర్యాటకులు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఇక్కడకు టాక్సీలలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed