Search
  • Follow NativePlanet
Share
» »ఖాన్ మార్కెట్‌.. ఇది అత్యంత విలాస‌వంత‌మైన మార్కెట్‌!

ఖాన్ మార్కెట్‌.. ఇది అత్యంత విలాస‌వంత‌మైన మార్కెట్‌!

ఖాన్ మార్కెట్‌.. ఇది అత్యంత విలాస‌వంత‌మైన మార్కెట్‌!

ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మార్కెట్‌గా పేరుగాంచింది. అంతేకాదు, విలాసంత‌మైన మార్కెట్‌గా కూడా దీనిని చెబుతారు. ఢిల్లీలోని ఇతర మార్కెట్లతో పోలిస్తే ఈ మార్కెట్‌ చాలా ఖరీదైనది. అయితే కొత్తదనాన్ని అనుభవించాలనుకునే వారు ఈ మార్కెట్‌ను చాలా ఇష్టపడతారు.

సుదూర ప్రాంతాల‌లో షాపింగ్‌ విషయానికి వస్తే ఎవ్వ‌రికైనా ముందుగా గుర్తుకు వ‌చ్చేవి ఢిల్లీ మార్కెట్లు. అందులో ఒకటి ఇక్కడి ఖాన్ మార్కెట్. షాపింగ్ చేయడానికి ఢిల్లీలోని అత్యంత ల‌గ్జరీ మార్కెట్‌ల‌లో ఇది ఒకటి. ఈ మార్కెట్ 1951 సంవత్సరంలో స్థాపించబడింది.

భారతదేశంలోని పురాతన మరియు అత్యంత ఖరీదైన మార్కెట్‌గా ప్ర‌సిద్ధి చెందింది. ఇక్కడ బోటిక్‌లు, స్టేషనరీలు, గృహోపకరణాలు మరియు కేఫ్‌లు చాలా వరకు చూడవచ్చు. ఉత్తమ బ్రాండ్‌ల షోరూమ్‌ల నుండి, ఇక్కడ అనేక హై-ఫై రెస్టారెంట్లు వ‌ర‌కూ ఇక్క‌డ లేనిది అంటూ ఏదీ ఉండ‌దంటే అతిస‌యోక్తి కాదు.

దీనిని ఖాన్ మార్కెట్ అని ఎందుకు అంటారు?

దీనిని ఖాన్ మార్కెట్ అని ఎందుకు అంటారు?

మ‌రీ ముఖ్యంగా సిటీ నైట్ లైఫ్‌ను ఆస్వాదించడానికి ఇక్క‌డి ఫుడ్ మార్కెట్ ఉత్తమమైనదిగా చెప్పొచ్చు. ప్ర‌ముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కుష్‌మన్ & వేక్‌ఫీల్డ్ ఖాన్ మార్కెట్‌కి 21వ శతాబ్దపు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రిటైల్ హై స్ట్రీట్ హోదాను అందించింది. ఈ మార్కెట్‌కు ఆ పేరు వెనుక చాలా చ‌రిత్రే ఉంది. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ విభజన తర్వాత ఖాన్ మార్కెట్ స్థలాన్ని శరణార్థులకు ఇచ్చారు. ఈ మార్కెట్‌కు స్వాతంత్య్ర‌ సమరయోధుడు ఖాన్ అబ్దుల్ జబ్బార్ ఖాన్ పేరు పెట్టారు. శరణార్థులు తప్పించుకోవడానికి సహాయం చేసిన వ్యక్తి ఇతడే. అందుకే ఆయ‌న గౌర‌వార్థం ఈ పేరు పెట్టారు.

ఢిల్లీలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానం

ఢిల్లీలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానం

ఇక్క‌డ మామిడి పండ్ల నుంచి ఫ్యాష‌న్ దుస్తుల‌ వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఢిల్లీలోని ఇతర మార్కెట్లలో చాలా అరుదుగా ల‌భించే అనేక వ‌స్తువులు ఇక్క‌డ క‌ళ్ల ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి. అందుకే ఈ మార్కెట్ ఢిల్లీలోనే నెంబ‌ర్ ఒన్ స్థానాన్ని కైవ‌సం చేసుకుంది.

ల‌గ్జ‌రీ లైఫ్ స్ట‌యిల్ కోరుకునేవారు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. స‌రికొత్త మోడ‌ల్‌ పాదరక్షలంటే ఇష్టం ఉండి, వాటిపై ఎక్కువ ఖర్చు చేయగలిగితే, మీరు తప్పనిసరిగా ఖాన్ మార్కెట్‌ని సందర్శించాల్సిందే. క‌ళ్ల చెదిరే బ్రాండ్‌ల‌ చెప్పులు, బూట్లు ప్రత్యేకమైన సేకరణ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అలాగే, మీకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం ఉంటే, తప్పనిసరిగా ఖాన్ మార్కెట్‌లోని బుక్ స్టోర్‌లను సంద‌ర్శించాలి.

ఇక్కడ మీకు పాత మ‌రియు కొత్త అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి. ఇక్క‌డికి చాలా మంది సంద‌ర్శ‌కులు షాపింగ్ చేయడానికి రాకపోయినా, ఖచ్చితంగా ఇక్కడి పిండి వంటలు మరియు కాఫీలను రుచి చూడటానికి వెళుతుంటారు. మిరుమెట్లుగొలిపే రంగుల కాంతుల‌తో ఆహ్వానం ప‌లికే బేకరీలు, కేఫ్‌లు మరియు రెస్టారెంట్లకు కేరాఫ్ అడ్ర‌స్ ఖాన్ మార్కెట్‌.

ఖాన్ మార్కెట్‌కి ఎప్పుడు వెళ్లాలి

ఖాన్ మార్కెట్‌కి ఎప్పుడు వెళ్లాలి

ఖాన్ మార్కెట్ ఆదివారాలు మూసివేయబడి ఉంటుంది. మీరు షాపింగ్‌కి వెళ్లాలనుకుంటే, మరో రోజు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవాలి. ఈ మార్కెట్ ఉదయం 10 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది.

ఖాన్ మార్కెట్‌ని ఎలా చేరుకోవాలి

ఖాన్ మార్కెట్‌ని ఎలా చేరుకోవాలి

ఈ మార్కెట్‌ను సందర్శించాల‌నుకునేవారు బస్సు లేదా ఆటోకు బదులుగా మెట్రోను ఎంచుకోవ‌డం ఉత్త‌మం. ఇది చౌకగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. స్థానిక‌ కిసాన్ మార్కెట్ వరకు నేరుగా మెట్రో అందుబాటులో ఉంటుంది. న్యూఢిల్లీ నుండి మెట్రోలో వెళుతున్నట్లయితే, సెంట్రల్ సెక్రటేరియట్ తర్వాత మెట్రో మారాలి. సెంట్రల్ సెక్రటేరియట్ నుండి ఖాన్ మార్కెట్‌కు సుల‌భంగా చేరుకోవ‌చ్చు.

Read more about: khan market delhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X