Search
  • Follow NativePlanet
Share
» »బిన్సార్ శీతాకాల‌పు అందాల‌ను చూసొద్దాం!

బిన్సార్ శీతాకాల‌పు అందాల‌ను చూసొద్దాం!

బిన్సార్ శీతాకాల‌పు అందాల‌ను చూసొద్దాం!

శీతాకాలం వ‌చ్చిందంటే చాలు.. ఉత్తరాఖండ్‌ కుమావోన్ ప్రాంతంలోని సుందరమైన ప్రదేశాలలో బిన్సార్ పేరు మొద‌టిస్థానంలో ఉంటుంది. స‌ముద్ర‌మ‌ట్టానికి 2420 మీటర్ల ఎత్తులో ఉన్న బిన్సార్.. చౌఖంబ, నందా దేవి, నందా కోట్, పంచచూలి మరియు కేదార్‌నాథ్ వంటి ప్ర‌సిద్ధ‌ హిమాలయ శిఖరాల అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు ప్ర‌ధాన కేంద్రంగా పేరుగాంచింది. బిన్సార్ యొక్క ప్రధాన ఆకర్షణల‌లో బిన్సర్ జీరో పాయింట్ త‌ప్ప‌క గుర్తుంచుకోవాలి.

బిన్సార్ కుమావోన్ ఝండి కొండలపై అలంకరించబడిన ఒక చిన్న పట్టణం. ఇక్కడ వాతావరణం ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ అక్టోబర్- డిసెంబ‌ర్‌ నెలల మధ్య ఈ ప్రదేశం సందర్శించడానికి ఉత్తమ సమయం. నిత్యం జాలువారే మంచుతుంప‌రులు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తాయి. స్థానికంగా జ‌రిగే నందా దేవి ఉత్సవం అస్స‌లు మిస్ కాకూడ‌దు. బిన్సార్ యొక్క పవిత్రమైన పండుగలు ఇక్క‌డివారి గొప్ప సంస్కృతితో సన్నిహిత బంధాన్ని కొన‌సాగించేలా ఉంటాయి.

Binsarwildlifesanctuary

క్రీస్తు శ‌కం 11 నుండి 17వ శతాబ్దం వరకు కుమావోన్ ప్రాంతాన్ని పాలించిన చంద్ రాజవంశం యొక్క వేసవి రాజధాని బిన్సార్. ఈ ప్రదేశంలో చాంద్ రాజవంశానికి చెందిన రాజా కళ్యాణ్ చంద్‌చే 16వ శతాబ్దంలో నిర్మించబడిన బినేశ్వర్ మహాదేవ్ అనే పురాతన శివాలయాన్ని గొప్ప సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశంగా నేటికీ గుర్తింపు పొందింది. పూర్వ‌పు రోజుల్లో ప్రజలు బినేశ్వర్ మహాదేవ్ సంద‌ర్శ‌న‌కు తాము స్వ‌యంగా ఏర్పాటు చేసుకున్న మార్గాల ద్వారా ట్రెక్కింగ్ చేస్తూ దూర గ్రామాల‌నుంచి వ‌చ్చేవారు.

ప‌చ్చ‌ద‌నం క‌మ్మేసిన‌ కొండలు

కాంపాక్ట్ హిల్ టౌన్ చుట్టూ బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. ఇది అరుదైన జంతువులు, పక్షులు మరియు పూల జాతులకు ఆవాసంగా నిలుస్తోంది. ఈ ప్రదేశం మందపాటి ఆకులతో గుబురుగా ఉన్నందున, సాహసోపేతమైన హైకింగ్ , క్యాంపింగ్ మరియు వాకింగ్ చేసేందుకు నిస్సందేహంగా ఉత్తమమైన ప్రదేశంగా చెప్పొచ్చు. ప‌చ్చ‌ద‌నం క‌మ్మేసిన‌ కొండలు, అందమైన తోటలు, తుల్లిప‌డే ప్రవాహాల నుండి మంత్రముగ్ధులను చేసే పచ్చికభూముల వరకు బిన్సార్ వద్ద ప్రతిదీ ఆస్వాదించ‌వ‌చ్చు.

ఇక్కడ వైవిధ్యభరితమైన, ఉల్లాసభరితమైన పక్షులను తిల‌కించే అవ‌కాశం ఉంది. ప‌ర్యాట‌కులు బిన్సార్ నుండి 50 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన జగేశ్వర్ క్షేత్రాన్ని సందర్శించవచ్చు. ఇది కాకుండా, బిన్సార్ మ్యూజియం మరియు కాసర్ దేవి ఆలయం వంటి ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు బిన్సార్ పరిసరాల్లో ఉన్నాయి.

Binsarwildlifesanctuary

బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యం

బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యం 1988లో స్థాపించబడింది. 45.59 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో వృక్షజాలం మరియు జంతుజాలం సమృద్ధిగా ఉంటాయి. అభయారణ్యంలో అనేక అరుదైన జంతువుల‌ను చూడొచ్చు. అలాగే, సుమారు రెండువంద‌లకుపైగా జాతుల ప‌క్షుల కిల‌కిలారావాల‌ను ఆస్వాదించ‌వ‌చ్చు.

ఎక్కువ రకాల పక్షులు ఉన్నందున ఈ అభయారణ్యం బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ద్వారా ముఖ్యమైన బర్డ్ ఏరియాగా ప్రకటించబడింది. దట్టమైన బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యం మొరిగే జింకలు, హిమాలయ ఎలుగుబంటి, చిరుతపులి, నక్క, కస్తూరి జింకలు, లంగూర్, పోర్కుపైన్, ఫ్లయింగ్ స్క్విరెల్, చితాల్, జంగిల్ క్యాట్ మొదలైన వాటికి నిలయం. బిన్సార్ అభయారణ్యం ప్రవేశ టిక్కెట్లు ఒక్కొక్క‌రికీ రూ. 50 వ‌ర‌కూ ఉంటుంది.

Read more about: uttarakhand kumaon binsar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X